-->

Translate

If you want to help with donations

అధిక బరువు పెరగడానికి ముఖ్య కారణాలు ఇవే, ఖచ్చితంగా బరువు తగ్గాలనుకునేవారికి అతి సులభంగా 7 రోజులలో 6 కేజీ లు డైట్ ప్లాన్.

అధిక బరువు పెరగడానికి ముఖ్య కారణాలు

ఈ రోజుల్లో బరువు పెరగడం ఒక పెద్ద సమస్యగా మారింది. ఇలా అనుకోకుండా పెరిగే అధిక బరువు వలన ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చి చాలా మంది బాధ పడుతున్నారు. ఈ స్థూలకాయత్వాన్ని తగ్గించుకునేందుకు అందరు చాల రకాలుగా శ్రమిస్తూ ఉంటారు. మరి అసలు ఇలా మనం బరువు పెరగడానికి ముఖ్య కారణాలేంటో తెలుసుకుందాం. 

బరువు
బరువు 

1. అవసరానికి మించిన ఆహారం తీసుకోవడం

ఆహారం విషయానికి వస్తే వెనకటి రోజుల్లో అయితే రోజుకు మూడుసార్లు తినేవారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రోజుకు మూడుసార్లు అనేది ఆ రోజుల్లో నియమంగా ఉండేది. కానీ ఈ రోజుల్లో పని ఉన్న లేకపోయినా రాత్రిపూట 11 లేదా 12గంటల వరకు ఉండటం అనేది సర్వసాధారణంగా అలవాటు అయిపోయింది. ఉదయం నుండి రాత్రి 12 గంటల వరకు మెలకువగా ఉండేసరికి ఈ  ఆహార నియమాన్ని రెండుసార్లు పొడిగించి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రికి, ఇంకా పడుకునే ముందు అద్దరేత్రికి ఇలా దాదాపుగా రోజుకి 3 నుంచి 5 సార్లు తినడం జరుగుతుంది. ఇలా తినే ఆహారంలో కూడా ఏవి రుచిగా ఉంటాయో, ఏవి బాగా ఇష్టమో వాటినే ప్రధానంగా తినడం అనేది జరుగుతుంది. 


ఆహారం
ఆహారం 

ప్రతి మనిషి తనకు ఇష్టమైన వాటిని తినడంలో తప్పులేదు కానీ మనం చేసే పని ఎంత? ఆ పనికి తగ్గట్టు తింటున్నామా అనేది ఆలోచించాలి, సాధారణంగా చాల మంది బరువుని పెంచే ఆహార పదార్దాలు తీసుకుంటూ ఉంటారు, వాటిలో ఎక్కువగా రైస్ తినడం, బరువుని పెంచే ఇడ్లిలు, ఉప్మాలు, పూరీలు, ఎక్కువగా తీసుకోవడం, సాయంత్ర సమయంలో స్నాక్స్ పేరుతో నూనెలో వేయించినవె స్నాక్స్ గా తీసుకోవడం, రాత్రిపూట ఫ్రైడ్ రైస్, నాన్వెజ్ ఐటమ్స్, వెజిటేరియన్ లో డీప్ ఫ్రైస్, బొజనంతో పాటు స్వీట్స్, హాట్స్, తీసుకోవడం. ఇవన్నీఎక్కువ శక్తిని ఇచ్చే ఆహార పదార్దాలు, హై క్యాలరీ డైట్ అంటారు. ఇలా రోజు అవసరాన్ని మించి ఆహారాన్ని తింటున్నాము, అందువల్ల ఖర్చు అయ్యే కాలరీస్ కంటే మిగిలిపోయే క్యాలరీస్ ఎక్కువగా ఉండటం వలన క్రొవ్వుగా శరీరం లో పేరుకుపోతుంది. అందువలన బరువు పెరగడం జరుగుతుంది. 

2. వ్యాయామం చేయకపోవడం 

సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితితుల వలన చాల మంది శారీరక శ్రమకు దూరంగానే ఉంటున్నారు. మనందరికీ డబ్బు సంపాదన కోసం ఏదోఒక రకంగా శ్రమిస్తూనే ఉంటారు. కానీ మనం ఈ రోజుల్లో శారీరకంగా చేసే శ్రమ తక్కువ, మానసికంగా చేసే శ్రమలు ఎక్కువగా ఉంటున్నాయి. అందువల్ల మనం తీసుకున్న ఆహారంతో వచ్చే క్యాలరీస్ సరిగ్గా ఖర్చు అవడం లేదు, తక్కువగా ఖర్చు అవుతున్నాయి. అందువలన మిగిలిపోయిన క్యాలరీస్ మన శరీరంలో క్రొవ్వుగా మారుతుంది. అందువలన పనికి తగినట్లుగా ఆహారాన్ని తీసుకోవాలి, మరియు ముఖ్యంగా ఉదయం, సాయంత్రం కొంత సమయాన్ని కేటాయించుకొని వ్యాయామాన్ని చేయడం వలన బరువు పెరిగే అవకాశం ఉండదు.

వ్యాయామం
వ్యాయామం 

పనికి తగ్గ ఆహారం, రోజు వ్యాయామం చేయకపోవడం ఇవి రెండు తప్పులు మనం మార్చుకోకుండా బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా లాభం ఉండదు. ఈ రెండింటిని గనుక మనం మార్పు చేసుకోగలిగితే అధిక బరువు సమస్య నుంచి తేలిగ్గా బయటపడవచ్చు. 

3. జీర్ణవ్యవస్థ 

జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వలన కొందరు అధికంగా బరువు పెరుగుతూ ఉంటారు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వలన మలబద్దకం సమస్య ఏర్పడుతుంది, దీని వల్ల శరీరంలో టాక్సిన్లు పేరుకుపోతాయి, ఇవి క్రొవ్వు నిల్వలను పెంచుతాయి. కనుక ఫైబర్ పుష్కలంగా లభించే ఆహారం తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఫలితంగా క్రొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్త పడవచ్చు. 

4. పోషకాలు 

రోజు శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్, ఫైబర్, నూట్రియన్లు ఉన్న ఆహారాన్నీ కచ్చితంగా తినాలి. దీంతో పోషకాలు శరీరానికి సరిగ్గా అందుతాయి. లేకపోతే శరీరంలో మెటబాలిజం ప్రక్రియ క్షిణిస్తుంది, ఫలితంగా క్రొవ్వు నిల్వలు పేరుకుపోయి బరువు పెరుగుతారు. 

5. నీరు చేరడం 

శరీరం నుంచి నీరు ఎప్పటికప్పుడు బయటకి వెళ్లకుండా అలాగే చేరుతూ ఉంటె అధికంగా బరువు పెరుగుతారు. ఇందుకు కారణాలు : క్రొవ్వు పదార్దాలు, ఉప్పు ఎక్కువగా తినడం, మద్యం సేవించడం లాంటి వాటి వల్ల నీరు బాగా చేరుతుంది. దీంతో అధికంగా బరువు పెరగడం జరుగుతుంది.

6. నిద్ర 

అధిక బరువు పెరగడానికి గల ప్రధాన కారణాల్లో నిద్ర కూడా ఒకటి, రోజు ప్రతి ఒక్కరు నిర్దిష్టమైన సమయం వరకు నిద్రించడం చాల ముఖ్యం, లేకుంటే శరీరం లో ఆకలిని నియంత్రించే హార్మోన్లు సరిగ్గా పనిచేయడం మానేస్తాయి, ఫలితంగా అవి ఆహారాన్ని ఎక్కువ తినేలా చేస్తాయి. దీంతో బరువు పెరుగుతారు. 

7. ఒత్తిడి 

ఒత్తిడి కూడా అధిక బరువు పెరిగేందుకు కారణం అవుతుంది. ఒత్తిడి బాగా ఉన్నప్పుడు శరీరంలో అడ్రినలీన్ పెరుగుతుంది, కార్టిసోల్ హార్మోన్స్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. ఇవి స్ట్రెస్ హార్మోన్స్ కనుక బాగా ఆకలిని కలిగించి ఆహారాన్ని ఎక్కువగా తీసుకునేలా ప్రభావితం చేస్తాయి. అందువలన అధికంగా ఆహారాన్ని తీసుకొని బరువు పెరుగుతారు. కాబట్టి ఎప్పటికప్పుడు కలిగే స్ట్రెస్ నుంచి దూరంగా ఉండడం వలన అధిక బరువు సమస్యలనుండి బయటపడే అవకాశం ఉంటుంది.

అతిసులభంగా బరువు తగ్గాలనుకునేవారికి 7 రోజుల డైట్ ప్లాన్:

బరువు తగ్గడం
బరువు తగ్గడం 

గడిచిన కొన్ని నెలలుగా మీరు అనుకోకుండా బరువుపెరిగి ఉంటారు. కాబట్టి ఈ టిప్స్ ని పాటించడం ద్యారా ఒక వారం లో 6 కేజీల బరువు తగ్గడం సులభం చేయొచ్చు. కానీ ఈ చిట్కాలను అనుసరించడానికి మీకు ముఖ్యంగా చాలా  ఓపిక ఉండాలి. అలాగే మీరు తినేవాటిలో మీకు ఇష్టమైనవి కొన్నింటిని త్యాగం చేయాల్సి ఉంటుంది. మీలో బరువు తగ్గాలనే దృఢ నిశ్చయం, అనుసరించే శక్తి ఉన్నపుడు కచ్చితంగా ఒక వారంలో 6 కేజీ ల బరువు తగ్గడానికి తప్పకుండ చేరుకుంటారు. 

1. మొదటిరోజు 

డైట్ లో ఇది చాల ముఖ్యమైన అంశం, ఇది కొంచెం ఆరోగ్యకరంగా మరియు లైట్ గా మొదలవుతుంది. అదేంటంటే మొదటిరోజు పండ్లు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలని కచ్చితంగా అనుకునేవారు రోజులో సహజంగా తీసుకునే ఏ ఆహారాలు తీసుకోకుండా కేవలం పండ్లు మాత్రమే తీసుకోవాలి. అరటిపళ్ళు తప్ప రోజులో అన్ని రకాల పండ్లను తీసుకుంటూ తగినన్ని నీళ్లు త్రాగాలి. 

2. రెండవ రోజు 

రెండవ రోజు కఠినంగా వెజిటబుల్ డైట్ ని అనుసరించాల్సి ఉంటుంది, ఎందుకంటే వెజిటబుల్స్ ని ఉపయోగించి హెల్త్ సలాడ్స్ ని తయారుచేసుకోవాలి. కలర్ఫుల్ సలాడ్స్ ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా త్వరగా 1-2 రోజుల్లో క్రమంగా బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. సీజనల్ గా లభించే అన్ని రకాల వెజిటబుల్స్ ని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వలన తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. వీటితో పాటు 8 నుంచి 12 గ్లాసుల నీటిని రోజు తీసుకోవాలి. 

3. మూడవరోజు 

ఫ్రూట్స్ మరియు వెజిటబుల్ సలాడ్స్
ఫ్రూట్స్ మరియు వెజిటబుల్ సలాడ్స్ 

ఈ రోజు కలర్ ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున రెగ్యులర్ డైట్ లో ఫ్రూప్ట్స్ మరియు వెజిటల్స్ రెండింటిని మిక్స్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు 7 రోజుల్లో 6 కేజీలు తగ్గాలంటే కచ్చితంగా ఈ డైట్ ని అనుసరించాల్సిందే, ఒక బౌల్ ఫ్రూప్ట్స్ ని, ఒక బౌల్ వెజిటబుల్స్ సలాడ్స్ తో మీ భోజనాన్ని ముగించాలి. మరియు డిన్నర్ కి మీకు నచ్చిన పండ్లు, కూరగాయలు తినొచ్చు. మూడవరోజున అరటిపళ్ళు, బంగాళదుంపలను మీ డైట్ లో చేర్చుకోండి. 

4.నాలుగవ రోజు

నాలుగవ రోజున పాలు, అరటిపళ్ళు మాత్రమే తీసుకోవాలి. అలాగే మిల్క్ షేక్స్, అరటిపళ్ళు, పాలు కాంబినేషన్ మాత్రమే చేర్చుకోవాల్సి ఉంటుంది. పాలు బాగా మరిగించి మీగడ తీసిన పాలను మాత్రమే త్రాగాలి. 

5. ఐదవ రోజు 

అన్నం
అన్నం 

ఐదవ రోజున మీ డైట్ లో అన్నం చేర్చుకోవాలి. అన్నం తో పాటు 7 లేదా 8 ఉడికించిన లేదా అలాగే పచ్చిగా బాగా పండినటువంటి టమాటోలను కూడా మీ డైట్ లో చేర్చుకోండి. ఇంకా రోజంతా మధ్యలో గ్యాప్ ఇస్తూ టమాటో లోను తీసుకుంటూ రాత్రికి డిన్నర్ చేయకుండా మానెయ్యాలి. తర్వాత ఈ రోజు నుంచి 12 to 15 గ్లాసుల నీటిని త్రాగడం మొదలుపెట్టాలి. 

6. ఆరవ రోజు 

ఆరవ రోజులోకి వచ్చినట్లైతే మధ్యాహ్నం భోజనం కు ఒక కప్పు అన్నం తీసుకుని రోజంతా పండ్లను తీసుకోవాలి. బరువు తగ్గడానికి ఇది చాల ముఖ్యమైన రోజు కచ్చితంగా బరువు తగ్గాలని అనుకునేవారు వెజిటల్స్ తో చేసే అన్నం మాత్రమే తీసుకోండి. 

7, ఏడవ రోజు 

ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్
ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్ 

ఏడవరోజు ఇది మన డైట్ ప్లాన్ లో ఆఖరి రోజు, ఈ రోజున ఒక కప్పు అన్నం తో పాటు మీకు నచ్చిన అన్ని రకాల వెజిటబుల్స్ ని మీరు తీసుకోవచ్చు. మరియు ఫ్రూట్ జ్యూస్ లు, నీళ్లు తగినన్ని త్రాగడం వలన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ మొత్తం తొలగిపోతాయి. కాబట్టి ఒక పూట అన్నంతో రోజంతా పండ్ల రసాలను తీసుకోవాల్సి ఉంటుంది. 

ఇలా ఏడురోజులు ఏడు రకాలైన డైట్స్ తీసుకొని చేసినట్లయితే తప్పకుండా ఏడురోజుల్లో 6 కేజీలు బరువు తగ్గి ఫలితం కనిపిస్తుంది. బరువు తగ్గాలి అని అనుకునే ప్రతిఒక్కరు కూడా ఈ డైట్ ప్లాన్ ని సానుసరించడం వలన కచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు.

మరింత సమాచారం తెలుసుకోవడం కోసం Health Tips Telugu ని ఫాలో అవుతూ ఉండండి. మీ కోసం మంచి మంచి టిప్స్ ని తెలియజేస్తూ ఉంటాము. ఏమైనా సలహాలు, సందేహాలు తెలియజేయాలని అనుకుంటే ఈ పోస్ట్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి.