Walking benefits in telugu వ్యాయామం
నయాపైసా ఖర్చు లేకుండా మన ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచే అద్భుతమైన వ్యాయామం మన పాలిట తారక మాత్రం లాంటి నడక గురించి పూర్తి వివరాలు. ఊరికే ఇంట్లో కూర్చునే బదులు ఏ ఉదయమో, సాయంత్రమో రోజు కాసేపు ఆలా బయట తిరిగి రావడాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటే చాలు, ఈ నడక ఫలితం ఊరికే పోదు తక్కువలో తక్కువగా మిమ్మల్ని కనీసం 25 జబ్బుల నుంచి కాపాడుతుంది. అంతేకాదు ఇప్పటికే ఉన్నషుగర్, బీపీ, గుండె జబ్బులు, కాన్సర్లు, మోకాళ్ళ నొప్పులు తీవ్రత కూడా బాగా తగ్గుతుంది. అనేక అధ్యయనాలు, డాక్టర్లు చెబుతున్న అంశం ఇది. మన ఆరోగ్యం పాలిట దివ్య ఔషధం లాంటి నడకను ఒక వ్యాయామంగా ఎలా సాధన చెయ్యాలో వాకింగ్ తో మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో, వాకింగ్ లో ఎలాంటి మెళకువలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నడక నేడు ఈ మాటే ఒక తారక మంత్రం, రోజు నడిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. మొత్తంగా ఉభయ తారకం. ఈ రోజుల్లో ఏ డాక్టర్ని కలిసినా మొట్టమొదట చెప్పే మాట రోజు కనీసం ఒక 45 నిముషాలు అయినా నడవమని కుదిరితే అంతకన్నా ఎక్కువసేపు కూడా నడవచ్చు. దాని వల్ల లాభమే కానీ వచ్చిన నష్టం లేదు. ఎందుకంటే అధిక బరువు, మధుమేహం, హై బీపీ, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఆందోళన, మానసిక వత్తిళ్లు, డిప్రెషన్ ఇలాంటి ఆరోగ్య విపత్తులన్నిటికి అడ్డుకట్ట వేయాలంటే అందరికి అందుబాటులో ఉన్న భేషైన మార్గం నడక. అందుకే డాక్టర్లు మరి మరి చెబుతుంటారు నిత్యం నడవమని.
వాకింగ్ వల్ల ఇప్పుడు మనం పేస్ చేస్తున్న డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, విటమిన్ D డెఫిషియెన్సీ, కీళ్ళవాతము, మెడికల్ ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా వాకింగ్ ద్వారా ప్రేవెంట్ చేయొచ్చు. వాకింగ్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ అఫ్ మెడిసిన్. అంటే ఒట్టి మందులతోనే సరిపడదు. వాకింగ్, ఫిజియోథెరఫీ, ఇలాంటివన్నీ యాడ్ చేసి దీంతోపాటు న్యూట్రిషియన్ కూడా కలిపితే అది కంప్లీట్ అఫ్ హెల్త్ కేర్ సిస్టం. వాకింగ్ చేసే టైం లో జనరల్ గా ఫస్ట్ హార్ట్ రేట్ అనేది పెరిగిద్ది, తర్వాత బ్లడ్ ప్రెజర్ అనేది పెరిగిద్ది, కానీ ఇవన్నీ ఏంటంటే మెడిసిన్ లాంగ్వేజ్ లో ఫిజియోలాజికల్ లిమిట్స్ అంటారు. అంటే ఎంత వరకు హానికరం లేని స్టేజి వరకు అవి పెరుగుతాయి, పెరగాలి కూడా. అది కరెక్ట్ బాడీ పన్సనింగ్, అది పెరిగిన్నప్పుడు బ్లడ్ సరఫరా ఏవైతే ఈ డిఫెరెంట్ ఆర్గాన్స్ కి జరుగుద్దో వేస్ట్ మెటీరియల్, ఎనర్జీ సప్లయ్ ఈ బాలన్స్ ను మైంటైన్ చేస్తుంది. బాడిలో రెండు విధాలా మెడికల్ టర్మ్ అంటారు. ఒకటి కేటాబాలిజం, రెండు ఎంబాలిజం అంటారు. కేటాబాలిజం అంటే యుటిలైజేషన్ అఫ్ ఎనర్జీ. ఎనబాలిజం అంటే స్టోరింగ్ అఫ్ ఎనర్జీ. ఈ రెండు ఈ వాకింగ్ ఎక్సర్సైజ్ ద్వారా ఆక్సిజన్, ఎనర్జి సప్లై ఇవన్నీ జరిగిన తర్వాత దాని పర్సనాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అందుకోసం వాకింగ్ చాలా ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంటుంది.
1)శరీరం లో క్రొవ్వు తగ్గుతుంది
క్రొవ్వు ఇది ఒక అనారోగ్యపు భూతం నేడు ఇది పిల్లలు, పెద్దలు ఎవ్వరిని వదలట్లేదు ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోవడం, శారీరక శ్రమకు దూరం అయిపోవడంతో శరీరంలో క్రొవ్వు నిల్వలు కొండల్లా పేరుకుపోతున్నాయి. ఫలితం అధిక బరువు ఇది ముదిరితే స్థూలకాయం. నిజానికి శరీర బరువు పెరిగితే దాని భారం పడేది మొట్టమొదట మోకాలి కీళ్లు, ఎముకల మీదనే అందుకే బరువు ఎక్కువగా ఉన్నవారిలో కీళ్లనొప్పులు, మోకాళ్లనొప్పులు, ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నిత్యం ఒకగంటపాటు నడిస్తే మోకాళ్ళ నొప్పులకు, కీళ్ళనొప్పులకు అడ్డు కట్ట వేయవచ్చు.
Walking benefits, వ్యాయామం |
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే బ్లడ్ ప్రెజర్, డయాబెటిస్ కి కాపిటల్ ఇండియా, అందువలన వీటన్నిటిని ఈజీగా నివారించే పద్ధతి వాకింగ్. ఈ మధ్యకాలంలో విటమిన్ D లోపం ఎక్కువైపోతోంది. విటమిన్ D బోన్ లో ఉన్న కాల్షియం కి సంబంధించింది. ఇవన్నీ మెరుగుపడటానికి వాకింగ్ చాలా బాగా పని చేస్తుంది. అట్లాగే కొన్ని ఇన్ఫెక్షన్స్ అంటే వైరల్ జ్వరాలు చాలా కామన్ గా వస్తాయి శీతాకాలంలో. కాబట్టి ఆ టైం లో వాకింగ్ గనుక చేసి ఉంటె ఇమ్యూనిటీ అనేది మన బాడీ లో ఉన్న ఢిపెన్స్ సిస్టం బాగా ఇంప్రూవ్ అయి పర్సనాలిటీ బెటర్ ఉంటదని నిర్దారణ అయింది. అట్లాగే ఇప్పుడున్న ఫాస్ట్ వరల్డ్ లో స్ట్రెస్ అనేది కూడా చాలా ముఖ్యంగా పెరుగుతుంది. స్ట్రెస్ మూలాన డయాబెటిస్ వస్తుంది. స్ట్రెస్ మూలాన బ్లడ్ ప్రెజర్ వస్తుంది. ఆ స్ట్రెస్ కూడా రిలీఫ్ అవుతుంది వాకింగ్ ద్వారా.
2)వామప్, వాకింగ్, కూల్డౌన్
నడక అంటే కేవలం అడుగులు వేసుకుంటూ నడవడమే కాదు, నడిచేముందు, నడుస్తున్నప్పుడు, నడకను ముగించే ముందు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. నడకలో మూల సూత్రాలు అయిన వామప్, వాకింగ్, కూల్డౌన్ గురించి తెలుసుకుందాం.
వామప్, వాకింగ్, కూల్డౌన్ ఇది నడకకు సంబందించిన శాస్త్రీయ సూత్రం. మొదట కాసేపు శరీరాన్ని వ్యాయామానికి సిద్ధం చేసి వామప్ చేయడం, ఆ తర్వాత సింపుల్ వాక్ లేదా బ్రిస్క్ వాక్ లేదా వాక్ చేయడం, చివరగా 5 నిముషాలు శరీరాన్ని తిరిగి కూల్డౌన్ ద్వారా సహజ స్థితికి తీసుకురావడం. ఇది పూర్తి స్థాయి నడక అంటారు. ఈ సూత్రాన్ని తెలుసుకొని నడకను ఒక వ్యాయామంగా ప్రారంభించేందుకు మనకు కావాల్సింది కేవలం ఒక జత బూట్లు, అనువుగా ఉండే ఒక జత బట్టలు.
3)వాకింగ్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వాకింగ్ అంటే కొంతమంది మనసులో ఎలా ఉంటుందంటే సరదాగా ఒక పార్క్ లో నడిచినట్లు నడిచే విదంగా ఉంటదని, కొంతమంది అయ్యో ఇది 5 నిముషాలు, 10నిముషాల్లో చేసేద్దాం అయిపోద్ది, వాకింగ్ డాక్టర్ గారు చెప్పారు అందుకోసం చేద్దాం అని అనుకుంటారు. ఆలా కాదండి ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. ఫస్ట్ వాకింగ్ గురించి ఒక ఐడియా ఉండాలి. అంటే మనం ఒక ప్లాన్ చేసుకోవాలి. అంటే మనం ఏ ఏరియాలో నడవాలి ఆ ఏరియా ఎలా ఉండాలంటే సూటబుల్ గా ఎక్కువ ట్రాఫిక్ ఉండకుండా, ప్లాట్ గా ఉండాలి. వీలైతే గ్రాస్ కవరేజ్ ఉంటె మంచిది. అలాగే మీరు నడిచే ఏరియా స్ట్రైట్ గా ఉండాలి. ఆ క్రమంలో ఉన్న ఏరియాని మీరు ఎంచుకోగలిగితే మంచిది. మరియు వాకింగ్ చేసే ముందు ఒక సెట్ గోల్ పెట్టుకోవాలి. ఈ రోజు నేను 30 నిముషాలు నడుస్తాను. ఈ 30 నిమిషాల్లో ఇంత డిస్టెన్స్ కవర్ చేస్తాను. అనేది పెట్టుకొని వాకింగ్ చేసే ముందు ఫస్ట్ మీరు కొన్ని స్ట్రెచ్ ఎక్సర్సైజ్, ఈజీగా స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అంటే కాళ్ళు చేతులు కొంచెం కదిలించడం, కొద్దిగా నడుం వంచడం ఇవన్నీ చేసిన తర్వాత వాకింగ్ చేస్తే మంచిది.
ఆ వాకింగ్ కూడా ఫస్ట్ ఒక 100 మీటర్లు, 200 మీటర్లు, మీరు పెట్టుకున్న టార్గెట్ లో ఒక 10%, 20% స్లోగా వాక్ చేస్తూ తర్వాత స్పీడ్ పెంచుకుంటూ ఎక్కువ అలసట లేకుండా, కష్టం లేకుండా చేయగలిగిందే కంఫర్టబుల్ వాకింగ్. ఆలా అని లేజర్ వాకింగ్ కూడా చేయకూడదు. రోజు కనీసం మీరు ఒక 10 నిమిషాల్లో 1 కిలోమీటరు నడిచే ప్లేసులో ఉండాలి. అది మీకు ఉన్న ఓపిక, మీకున్న అదర్ ప్రాబ్లమ్స్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ వాకింగ్ చేసేటప్పుడు ప్రాపర్ ఫుట్ వేర్, ప్రాపర్ క్లాతింగ్ కూడా వేసుకోవాలి. ప్రాపర్ క్లాతింగ్ అంటే కొంచెం ఫ్రీగా గాలి సర్కులేట్ అయ్యే విదంగా ఉండాలి. ఎండాకాలం లో కంపల్సరీగా కొంచెం వాటర్ త్రాగి మీరు వాకింగ్ స్టార్ట్ చేయడం మంచిది. అట్లాగే చలికాలం లో అడిక్విట్ కవర్ ఉంటె చలికి మీరు ఎపెక్ట్ కాకుండా కవర్ చేసుకొని వాకింగ్ చేస్తే మంచిది.
4)గుండెపోటు మన దరికి చేరదు
గుండెపోటు మనిషి ఆయువుపట్టునే దెబ్బతీసే ఉపద్రవం, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా, అనూహ్యంగా, కేవలం గంటల వ్యవధిలో ప్రాణాపాయం ముంచుకొస్తుంది. నిజానికి వ్యాయామాన్ని నిర్లక్యం చేసి స్థూలకాయత్వం, మధుమేహం, హై బీపీ లాంటి జబ్బుల్ని చేజేతులా కొనితెచ్చుకొని మరి చాలా మంది గుండెపోటుకు దగ్గరవుతుంటారు. నిత్యం ఒక గంటపాటు నడకను ఒక వ్యాయామంగా చేయగలిగితే గుండె జబ్బులు, ముఖ్యంగా గుండెపోటు మన దరి చేరదని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు.
5)సింపుల్ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, రేస్ వాకింగ్
సింపుల్ వాకింగ్, బ్రిస్ట్ వాకింగ్, రేస్ వాకింగ్ వివిధ రకాల పేర్లు ఉన్నాయి. వాస్తవానికి చెప్పాలంటే మనం ఇనీషియల్ గా సింపుల్ వాకింగ్ లో స్టార్ట్ చేసుకుంటూ తర్వాత దాన్ని కొద్దిగా బ్రిస్ట్ చేసుకొని తర్వాత దాన్ని రేసింగ్ లాగా చేసుకోవడం కరెక్ట్ పద్ధతి, అది కూడా మీ బాడీ ని అనుగుణంగా మార్చుకుంటుంది కూడా. సింపుల్ వాకింగ్ అంటే మనం రోజు చేసే నడక దాని వల్ల పెద్దగా బాడీ లో చేంజెస్ రాకపోయినా కానీ అది ఒక వామప్, మనకి నెక్స్ట్ స్టెప్ కి పనికి వచ్చే మజిల్ స్ట్రెచ్ చేసి దాన్ని రెడీనెస్ పెంచడం, తర్వాత నెక్స్ట్ ఎపెక్ట్ చేసేటప్పుడు ఈ మజిల్ రెడీ అయిపోయి ఉంటది. మనకు ఇవ్వడానికి ఆ ఎనర్జీ, ఆ సపోర్ట్. అలాగే బ్రిస్క్ వాక్ అంటే 1 కిలోమీటర్ ని 10 నిమిషాల్లో కవర్ చేయడం బ్రిస్క్ వాక్ అంటారు. ఇది కాకుండా దీన్ని మించి చేసేదే రేసింగ్ వాక్. రేసింగ్ వాక్ అంటే ఆల్మోస్ట్ పరిగెత్తడం ఇంగ్లీష్ లో జాగింగ్ అంటారు. స్పీడ్ పరంగా చూసుకుంటే ఇది చాలా సబ్జెక్టివ్ అరౌండ్ 2 కిలోమీటర్లు మీరు గాని చేయగలిగితే దాన్ని క్యాజువల్ వాక్ లేదా స్లో వాక్ అంటారు. అరౌండ్ 4-5 కిలోమీటర్లు చేయగలిగితే దాన్ని బ్రిస్క్ వాక్ అంటారు. అరౌండ్ 9-10 కిలోమీటర్లు చేయగలిగితే అది రేస్ వాక్ అంటారు.
6)షుగర్ తో బాధ పడేవారికి
షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు షుగర్ ని అదుపులో ఉంచుకోవడానికి షుగర్ మూలంగా పాదాలు దెబ్బతినకుండా ఉండడానికి వాకింగ్ ని మించిన పరిస్కారం మరొకటి లేదు. మధుమేహం పాలిట అద్భుతమైనది వ్యాయామం. ఆహారం, వ్యాయామం విషయాల్లో ఏమరుపాటు అనేది నేడు యువకుల నుండి వృద్ధుల దాక అందరిలోనూ డయాబెటిస్ ను తెచ్చిపెడుతుంది. అయితే ఒకసారి మధుమేహం ఉందని తెలిస్తే చాలా మంది తినే ఆహారం విషయంలో జాగ్రత్తపడతారే తప్పిచ్చి వ్యాయామం విషయంలో ఏమంత శ్రద్ద తీసుకోరు. నిజానికి వ్యాయామం మరి ముఖ్యంగా నడక అనేది మధుమేహుల్లో శరీర కండరాలు రక్తం లో షుగర్ ని గ్రహించడానికి అద్భుతంగా తోడ్పడుతుంది. తద్వారా మధుమేహం తెచ్చిపెట్టే దుష్ప్రబావాలకు అడ్డుకట్ట పడుతుంది.
మనం వాకింగ్ చేసేముందు ముఖ్యంగా సమ్మర్ లో కంపల్సరీగా కొంత వాటర్ త్రాగాలి. కొంత వాటర్ ఎందుకంటే ఫుల్ స్టమక్ ఎప్పుడు కూడా కంఫర్ట్ ఇవ్వదు. ఎందుకంటే ఫుల్ స్టమక్ ఉన్నప్పుడు బాడీ నేచర్ ఏమిటంటే బ్లడ్ సర్కులేషన్ ను స్టమక్ సైడుకు డైవర్ట్ చేస్తుంది. అప్పుడు మీకు ఎనర్జీ లెవెల్స్ తగ్గడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైతే సర్కులేషన్ తగ్గిద్దో మీరు చేసే కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. అట్లాగే కడుపు నిండుగా ఉన్నప్పుడు కొంత ఆయాశ పడతారు. ఆలా చూసుకుంటే రీజనల్ ఎమౌంట్ అఫ్ వాటర్ అరౌండ్ 300ml వాటర్ త్రాగితే మీకు అది కంఫర్టబుల్ గా ఉంటుంది. అది కూడా సీజన్ ను బట్టి డిసైడ్ చేయాలి. ఇంకొకటి వాకింగ్ అనేది ఒక ప్రక్రియ. అది మాక్సిమం మనం చేస్తే 30 minutes, 60 minutes. ఈ మధ్యలో మల్లి టాయిలెట్ వచ్చిందనో, దేనికో దానికో బ్రేక్ తీసుకుంటే మీరు చేసే ఆ కొద్దిపాటి ఎఫర్ట్ కూడా తగ్గిపోతుంది. వాస్తవానికి చూస్తే ఫుడ్ ఐటమ్స్ కరెక్ట్ కాదు , కానీ లిక్విడ్ ఐటమ్స్ మంచివి, అవి కూడా హెల్త్య్ లిక్విడ్ ఐటమ్స్ మంచివి. అంటే పాలు, వాటర్, నిమ్మరసం, నిమ్మరసం కలిపిన హాని, నేచురల్ గా వచ్చినవే త్రాగండి. అది కూడా మనకు కంఫర్ట్ ఉండే విదంగానే తీసుకోవాలి. తర్వాత బట్టల గురించి అంటే సీజన్ ని బట్టి మనకు వేరియాబిలిటీ వస్తుంది. సమ్మర్ సీజన్ వేడి ఉంటుంది కాబట్టి లైట్ కాటన్ క్లాత్, ఫ్రీగా గాలి సర్కులేట్ అయ్యే విదంగా చూసుకోవాలి. వీలైతే ఒక కాప్ హెడ్ ని ప్రొటెక్ట్ చేసుకునే విదంగా చూసుకోవాలి. అలాగే షూస్ దగ్గరకు వస్తే ఇవి చాలా ముఖ్యమైంది పెద్దవాళ్లకు కొద్దిగా కుషనింగ్ ఉన్న షూ కంఫర్ట్ ఉండాలి, కొద్దిగా కుషనింగ్ ఉండాలి. మీరు వాకింగ్ ఏరియా ఎంచుకునేటప్పుడు గ్రాస్ ఉన్న ఏరియాను ఎంచుకోవాలన్నది దానికోసమే, ఇలా మీరు గనుక ఎంచుకోగలిగితే మీకు ఈజీగా మీ సెట్ టార్గెట్ కి రీచ్ అవగలుగుతారు.
నడక అంటే నో పెయిన్, నో గెయిన్ ఇంకెందుకు నడవడం అనుకుంటారు చాలా మంది. నిజానికి నడక వల్ల శరీరం లో అన్ని ప్రధాన అవయవాలు కదలిక లోకి వస్తాయి. పైగా నడిచే సమయంలో మనం ఎక్కువగా ప్రాణ వాయువుని తీసుకుంటాము, తద్వారా అనేక జబ్బులకు కారణమయ్యే క్రొవ్వు ఖర్చు అవుతుంది. ఇంకా శరీరంలో ఎండార్పిన్స్ విడుదలయ్యి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అందుకే నడకను ఆరోగ్యదాయని గా చెప్పవచ్చు. ఈ నడక ఈ సింపుల్ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, రేస్ వాకింగ్ అని మూడు దశలుగా ఉంటుంది.
ప్రతి ఒక్కరికి ఒక క్రమం కావాలి అంటే ఆరోగ్యమైన వ్యక్తి, అనారోగ్యమైన వ్యక్తి ఎవరైనా అందరికి కూడా ఒక పద్దతిలో చేస్తేనే అది బెటర్. వాళ్లకు బీపీ ఉందా? షుగర్ ఉందా అనేది క్రైటీరియా కాదు. వాళ్లకు నడిచే కెపాసిటీ ఎంత ఉంది అనేది ఫస్ట్ క్రైటీరియా. ఆ నడిచే కెపాసిటీ ఇండివిజ్వల్గా ఆ వ్యక్తికీ తెలుస్తుంది. న కెపాసిటీ ఇంత ఉంటది, ఆ కెపాసిటీ ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. అది ఎలా ప్లానింగ్ చేసుకోవాలంటే చాలా స్లో వాక్ చేసి నాకు ఈజీగా ఉంది, ఈ డిస్టెన్స్ ఈ సమయంలో కవర్ చేయగలుగుతాను, దీన్ని టైం అయినా చేసుకోవాలి లేదా నెంబర్ అఫ్ రౌండ్స్ మీరు ఎంత డిస్టెన్స్ కాల్కులేట్ చేసుకున్నారో అది కాల్కులేట్ చేసుకొని ఈ టైం లో నేను కంప్లీట్ చేసుకున్నాను ఈ రోజు. ఒక వారం తర్వాత దీన్ని ఇంకా త్వరగా కంప్లీట్ చేయగల్గుతానా? అలా దీన్ని గ్రేటెడ్ ఎక్సిర్ సైజ్ అంటారు. ఫస్ట్ ఒక సెట్ టార్గెట్ పెట్టుకొని అది రీచ్ అయిన తర్వాత దాన్ని మార్చుకొంటూ వెళ్ళాలి. తక్కువ టైం లో మీరు ఎంత ఎక్కువ నడవగలుగుతారో దాని వల్లే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయని స్టడీస్ పరంగా ప్రూవ్ చేసి ఉన్నారు.
ఇప్పుడున్న వాస్తవాల్లో చూస్తే మార్నింగ్ టైం లో ఫ్రీగా ఉంటారు. ఈవినింగ్ టైం లో ఫ్రీగా ఉంటున్నారు. మార్నింగ్ టైం లో అందరికి బ్రెయిన్ ప్రెస్ గా ఉంటుంది. వాకింగ్ చేయడానికి కమిట్మెంట్ ఉంటది. విటమిన్ D డెఫిషియన్సీ ఉన్నవారికి ఆల్మోస్ట్ 70-80% పాపులేషన్ కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా సూర్యరశ్మి కి ఎక్సపోజర్ ఉంటది. తర్వాత ఈవినింగ్ టైం లో వాకింగ్ చేస్తే ఏమవుతుందంటే జనరల్ గా తినేసి ఉంటాము కాబట్టి కడుపులో ఫుల్ నెస్ ఉంటుంది. దానివల్ల మీరు చేయాల్సినంత చేయలేకపోతారు. ఆల్మోస్ట్ ఇప్పుడున్న వర్కింగ్ పాటర్న్ లో చూస్తే సాయంత్రం లోపు అందరు అలసిపోయి ఉంటారు. టైం దొరకదు, పొల్యూషన్ లెవెల్స్ పెరుగుతుంటాయి. ఈ విదంగా చూసుకుంటే మార్నింగ్ టైం వాకింగ్ అనేది బెటర్ అని చెప్పవచ్చు. ఎన్ని విధాలుగా గాని చూసుకున్న వాకింగ్ ని రీప్లేస్ చేసే ఎక్సర్సైస్ అయితే లేదు. వాకింగ్ ఒక్కటి సరిగ్గా సమంగా చేసుకుంటే కామన్ డిసీజ్ లు ఏవైతే ఉన్నాయో బీపీ, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, ఒబియసిటీ అనేది చాలా ముఖ్యమైన పెయింట్ వీటన్నిటిని రెగ్యులేట్ చేయొచ్చు. కొద్దిగా పెద్దవాళ్లలో సాధారణంగా ఎముకలు వీక్ అవుతుంటాయి. కాల్షియం తగ్గిపోతుంది అంటారు, ఇలాంటిది కూడా ప్రివెంట్ చేయడానికి వాకింగ్ ద్వారా అవకాశం ఉంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న వాకింగ్ నెగ్లెట్ చేయడానికి లేదు.
నిజానికి నడక అనేది ఇవాళ పుట్టుకొచ్చిన వ్యాయామమేమి కాదు, ఈ నడక అనాదిగా మనిషి జీవన విధానంలో అంతర్భాగం అయిపోయిన వ్యాయామంగా ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయి అనేక జబ్బులు చుట్టుముడుతున్న నేపథ్యంలో మల్లి మూలాల్లోకి వెళ్లి నడకను మన జీవనశైలిలో ఒక అంతర్భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.