Type Here to Get Search Results !

Translate

ADVERTISEMENT

కిడ్నీలు ఆరోగ్యవంతంగా పనిచేయాలంటే ఏం చేయాలి? కిడ్నీ వ్యాధి లక్షణాలు, కిడ్నీని ఎలా కాపాడుకోవాలి? మనకు కిడ్నీ సమస్య ఉందని ఎలా తెలుసుకోవాలి?

How to protect and improve kidney health-Health Tips Telugu

How-to-improve-kidney-health-Health-Tips-Telugu
కిడ్నీ ఆరోగ్యం

కిడ్నీలు ఆరోగ్యవంతంగా పని చేయాలంటే మనం ఎలాంటి అలవాట్లను మార్చుకుంటే మంచిదో  తెలుసుకోబోతున్నాం. మనకున్న రెండు కిడ్నీలు 1 గంట వ్యవధిలో 5 లీటర్ల రక్తాన్ని 2 సార్లు శుద్ధి చేస్తూ ఉంటుంది. కిడ్నీలు కాస్త చెడిపోకుండా మంచిగా ఫిల్టర్ చేయాలి అంటే ఫస్ట్ మనం మార్చుకోవాల్సిన మంచి అలవాటు ప్రతి రోజు బాగా మంచి నీళ్లు త్రాగడం. 

నీళ్లు ప్రతి రోజు ఆడవారు 4 లీటర్లు, మగవారు అయితే 4 నుంచి 5 లీటర్ల వరకు త్రాగితే మంచిది. నీళ్లు ఎక్కువగా త్రాగినప్పుడు మన శరీర అవసరాలకు వాడుకోగా ఎక్కువ అయిన నీళ్లను కిడ్నీలు మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. నీళ్ళని పంపించేటప్పుడు ఆ నీళ్లలోనే రక్తాన్ని వడకట్టిన కిడ్నీలు ఆ రక్తం లో పనికిరాని కాలుష్య పదార్దాలను, ఎక్కువైనా లవణాలను, కెమికల్స్ ని వీటన్నిటిని మూత్రంలో నుంచి బయటకి పంపిస్తాయి. మూత్రం బాగా వస్తేనే కిడ్నీలు ఎప్పుడు ఫిల్టర్ చేసిన వ్యర్దాలు అప్పుడు మూత్రం ద్వారా బయటకు వస్తాయి. మీరు మూత్రమే పోయరనుకోండి నీళ్లు త్రాగితే నాకు మూత్రం వస్తుంది, నాకు మూత్రానికి వెళ్లే కాలీ కూడా లేదని నీళ్లు త్రాగకుండా కుర్చున్నారనుకోండి ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు మీకు యూరిన్ రాకుండా ఆగొచ్చు,  కానీ కిడ్నీలు 1 గంటకు 2 సార్లు ఫిల్టర్ చేస్తాయి. మరి ఆ ఫిల్టర్ చేసిన వేస్ట్ మెటీరియల్స్ ని యూరిన్ పాస్ చేయకపోతే మరళ వెనక్కి వదిలేస్తాయి. అందుచేత కిడ్నీలు చేసిన పనిని పదే పదే మరళ చేయాల్సి వస్తుంది. అందుకనే ఎప్పుడు యూరిన్ మనకు తెల్లగా, ధారగా కాస్త ఎక్కువ మొత్తంలో వచ్చేటట్లు ఉంటె మీ కిడ్నీలు ఎప్పటికప్పుడు రక్తాన్ని శుద్ధి చేసి మూత్రం ద్వారా బయటకు డెలివరీ చేస్తూ ఉంటాయి. 

అందుకనే మూత్ర విసర్జన జరగడమనేది ఎలాంటిదంటే Ex : మీరు సింక్ లో నీళ్లు పోసి గిన్నెలు, పాత్రలు కడుక్కుంటూ ఉంటారు పడ్డనీరు పడ్డట్టు వేస్ట్ అంతకుడా ఎప్పటికప్పుడు పైపుల ద్వారా కిందకి వెళ్ళిపోతే సింక్ ప్రీ గా ఉంటుంది. అవి గనుక బయటకు పోకుండా నిలువ ఉంటె మీరు సింక్ లో మళ్ళి కడుక్కోవడానికి అనుకూలంగా ఉండదు. సింక్ జాం అయిపోయిద్ది. వేస్ట్ అనేది ఎప్పటికప్పుడు వెళ్ళిపోతే మంచిది. యూరిన్ అనేది వ్యర్దాలను మోసుకెళ్లేది తప్ప ఉపయోగపడే వాటిని మోసుకెళ్లేది కాదు. కాబట్టి మూత్రం పోస్తేనే మీ లోపల ఉన్న చెడు అంత పోతుంది, మరి దాన్ని ఆపుకుంటే చెడు అంతా లోపల పేరుకుపోతుంది. 

రెండు కిడ్నీలు పనిచేస్తున్నప్పుడు దాని విలువ ఎప్పటికి తెలియదు, కిడ్నీలు చెడిపోయినప్పుడు డయాలసిస్ లు, హాస్పిటల్ లో 3-4 రోజులు వెళ్తూ, వేలకు వేలు బిల్లు కడుతూ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ అన్నపుడు ఇక అప్పుడు తెలుస్తుంది. ఇన్నాళ్లు ఎంత అశ్రద్ధ చేసామో అని. కిడ్నీలు ఫిల్టర్ చేయకపోతే బ్లడ్ అంత పొల్యూట్ అయిపోతుంది. కిడ్నీలు ఒకసారి పూర్తిగా చెడిపోతే మల్లి రిపేర్ అవ్వవు. మిగతా బాగాలన్నిటికి చాలా వరకు రిపేర్ చేసుకునే గుణం ఉంటుంది. కానీ కిడ్నీలు కావు, ఉన్న కిడ్నీలను పనిచేయించుకోవడమే తప్ప చెడిపోయిన కిడ్నీని మరల తిరిగి తీసుకొచ్చే ఛాన్స్ మనకు లేదు. 

పాటించవలసిన నియమాలు:

1) మొదటి నియమం

కిడ్నీలు ఆరోగ్యవంతంగా పనిచేయాలంటే ఏం చేయాలి? కిడ్నీ వ్యాధి లక్షణాలు, కిడ్నీని ఎలా కాపాడుకోవాలి? మనకు కిడ్నీ సమస్య ఉందని ఎలా తెలుసుకోవాలి? healthtipstelugu.com
నీళ్లు బాగా త్రాగాలి 

కిడ్నీలు లోపల ఉండే పిల్టర్స్ బాగా పనిచేయాలి అంటే మంచి నీళ్లు బాగా త్రాగాలి.యూరిన్ బాగా పాస్ చేయాలి. రోజుకు 2 నుంచి 3 లీటర్ల యూరిన్ మాక్సిమం విసర్జిస్తూ ఉండాలి. చలికాలం అయినా, వేసవికాలం అయినా.

2) రెండవ నియమం 

కిడ్నీలు ఆరోగ్యవంతంగా పనిచేయాలంటే ఏం చేయాలి? కిడ్నీ వ్యాధి లక్షణాలు, కిడ్నీని ఎలా కాపాడుకోవాలి? మనకు కిడ్నీ సమస్య ఉందని ఎలా తెలుసుకోవాలి? healthtipstelugu.com
ఉప్పు తక్కువ తీసుకోవాలి 

కిడ్నీల ఆరోగ్యాన్ని ప్రధానంగా పాడు చేసేది ఉప్పు, ఎందుకంటే మన శరీరంలో ఎక్కువైనా ఉప్పునంత కిడ్నీలే విసర్జించాలి. ఈ ఉప్పంతా వెళ్లి కిడ్నీ కణజాలాన్ని, కిడ్నీ పిల్టర్స్ ని డామేజ్ చేసేస్తూ ఉంటాయి. అందుకని బీపీ ఎక్కువైపోతు ఉంటుంది. ఉప్పు వల్ల బీపీ పెరిగేకొద్దీ కిడ్నీలు డామేజ్ అయిపోతూ ఉంటాయి. డయాలసిస్ ఎక్కువైపోతు ఉంటె కిడ్నీలు డామేజ్ అయిపోతూ ఉంటాయి. అందుకని అటు బీపీ కి ఇటు షుగర్ కి కూడా ఉప్పు చాలా చెడు చేస్తుంది. కిడ్నీలు డామేజ్ అయిన తర్వాత డాక్టర్స్ అందరు కూడా మజ్జికలో ఉప్పు మానేయండి, కూరల్లో కూడా ఉప్పు తగ్గిస్తే మంచిదని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువైన ఆ ఉప్పు అంత కూడా కిడ్నీలు విషర్జించడానికి చాలా అవస్థ పడుతూ ఉంటాయి. మన బాడీ లో మనం తిన్న ఆహారం ద్వారా వెళ్లిన ఉప్పు అంతటిని కిడ్నీలు విషర్జించడానికి 40-50% ఎనర్జీని ప్రతి రోజు వేస్ట్ చేయాల్సి వస్తుంది. అదే మీరు ఉప్పు తినడం తగ్గిస్తే, అసలు మానేస్తే కిడ్నీలు ఎంత ఫ్రీగా ఆరోగ్యంగా ఉంటాయి. 

తాబేలు 400 సంవత్సరాలు బ్రతుకుతుంది, 400 ఏళ్ళు దాని కిడ్నీలు ఫిల్టర్ చేస్తూనే ఉంటాయి. అలాగే ఏనుగు 100 ఏళ్ళు, ఏనుగుకు కిడ్నీలు ఫెయిల్ అవట్లేదు, తాబేలుకు కిడ్నీలు ఫెయిల్ అవట్లేదు, మనుషులకే ఎక్కువగా కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. 

ఎక్కువగా విపరీతంగా కిడ్నీసమస్యలు పెరగడానికి కారణం టేస్ట్గా ఉందని ఉప్పుని జామకాయల్లో ఉప్పు, మామిడికాయల్లో ఉప్పు, మొక్కజొన్న కండేకి ఉప్పు, కనపడ్డ ప్రతిదానికి ఉప్పు, ఉప్పేసిన కూరలు, ఉప్పేసిన పులుసులు, నిలువ పచ్చళ్ళు, ఉప్పులో మునిగి తేలుతున్నాం. మన బాడీకి కావాల్సిన ఉప్పు 400మిల్లి గ్రాముల సోడియం. నార్మల్ గా అయితే 280, 300మిల్లి గ్రాములు సరిపోతుంది. అలాంటిది మనం ఇప్పుడు ఎంత ఉప్పు తింటున్నామంటే దగ్గర దగ్గర 4000మిల్లీగ్రాముల నుంచి 5000మిల్లి గ్రాముల వరకు సోడియం తీసుకుంటున్నాం. 300మిల్లీగ్రామ్స్, 400మిల్లీగ్రామ్స్ ఎక్కడ 4-5 వేయిల మిల్లీగ్రామ్స్ ఎక్కడ అంత విపరీతంగా సోడియం బయటనుంచి తింటున్నాం. అందుచేత ఎక్కువైనా ఉప్పు ని బయటకు పంపడానికి కిడ్నీలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అందుకనే ముందే ఉప్పు విషయంలో అటెన్షన్ పెట్టండి. బీపీ లు షుగర్ లు రాకుండా ఉంటాయి. కిడ్నీలు అసలు డామేజ్ కాకుండా ఉంటాయి. 

మన కిడ్నీలు రోజుకి 4గ్రాముల ఉప్పుని మాత్రమే విషర్జించగలుగుతాయి. అంతకుమించి విసర్జించలేవు. అదంతా పేరుకుపోయి లోపల రకరకాల సమస్యలు ప్రారంభమవుతాయి. అందుకని ఉప్పు విషయంలో అటెన్సన్ పెట్టండి. ఇది చాలా చాలా మంచి విషయం. 

3) మూడవ నియమం

 
కిడ్నీలు ఆరోగ్యవంతంగా పనిచేయాలంటే ఏం చేయాలి? కిడ్నీ వ్యాధి లక్షణాలు, కిడ్నీని ఎలా కాపాడుకోవాలి? మనకు కిడ్నీ సమస్య ఉందని ఎలా తెలుసుకోవాలి? healthtipstelugu.com
ఉప్పు లేని ఆహారం 

కిడ్నీలు ఆరోగ్యకరంగా ఎక్కువకాలం పని చేయాలంటే మంచి ఆహార నియమం పాటించాలి. ఉడికిన ఆహారాల్లో ఉప్పు లేకుండా మనం తినలేము ఒకవేళ తినాలి అన్న తగ్గించి తీసుకోవాలి. మరి నాలుగుసార్లు ఉడికినవే తింటే నాలుగు సార్లు ఉప్పు లేని ఇబ్బంది ఎందుకు మనకు ఉప్పు లేకుండా వండుకోవాలి, మల్లి ఉప్పు తగ్గించుకొని నాలుగుసార్లు తినేసరికి ఎక్కువ వెళ్ళిపోతుంది. అసలు ఉప్పు లోపలి వెళ్లకుండా ఉండాలంటే ఉడికిన ఆహారాన్ని మధ్యాహ్నం ఒకసారి మాత్రమే పరిమితం చేసుకోండి. సాయంకాలం పూట ఆహారాలు, ఉదయం పూట తీసుకునే ఆహారాలు వండకుండా తినండి అసలు కిడ్నీలు డామేజ్ అవ్వవు. 

ఉదయం వెజిటబుల్ జ్యూస్ లు లాంటివి, మొలకలెత్తిన విత్తనాలు, పండ్లు లాంటివి అల్పాహారం గా తీసుకోండి. కావాలంటే ఆదివారం నాడు టిఫిన్స్ చేయండి. మండే నుంచి సాటర్డే  వరకు అయినా ఆరోగ్యకరమైన అల్పాహారాలు తీసుకోండి. ఇవి సాల్ట్ లేకుండా లోపలికి వెళ్లిపోతాయి, మీకు ఇది మంచిది. సాయంత్రం 5కి ఏదైనా జ్యూస్ త్రాగి 6గంటల కల్ల ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోండి. ఉదయం, సాయంత్రం నాచురల్ ఫుడ్ తీసుకోవడం ద్వారా లోపలికి వెళ్లే సాల్ట్ చాలా వరకు దాదాపు 70% తగ్గిపోతుంది. అప్పుడు మీ కిడ్నీలు 70% ఇంప్రూ అయినట్లే, కిడ్నీలకు శ్రమ లేకుండా చేసినట్లే అవుతుంది. అందుకే ఈ ప్రిన్సిపుల్ పాలో అవ్వండి. 

సాధ్యమైనంత వరకు నిలువ పచ్చళ్ళు తినడం తగ్గించండి. వీటి వల్లనే కిడ్నీలు డామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఇది అందరిలో బాగా ఉన్న బాడ్ హ్యాబిట్. ఎవరికైనా ఆవకాయ తినకుండా ఉండాలనిపించదు, వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని, వెన్నపూస వేస్తె ఇక తినకుండా ఎలా ఉండగలం మరి ఆలా అని కిడ్నీలు పోతే ఇక తినడానికి సాధ్యమే ఉండదు కదా. బ్రతికినంతకాలం తినొచ్చు కానీ కొంచెం రెస్ట్రిక్టు చేయండి. ఒక 20 రోజులకు లేదా 10 రోజులకు ఒక్కసారి వేసుకోండి. రోజు దాని జోలికి వెళ్ళకండి. 

కిడ్నీ వ్యాధి లక్షణాలు, సమస్య ఉందని ఎలా తెలుసుకోవడం?

కిడ్నీలు ఆరోగ్యవంతంగా పనిచేయాలంటే ఏం చేయాలి? కిడ్నీ వ్యాధి లక్షణాలు, కిడ్నీని ఎలా కాపాడుకోవాలి? మనకు కిడ్నీ సమస్య ఉందని ఎలా తెలుసుకోవాలి? healthtipstelugu.com
కిడ్నీ సమస్య 

కిడ్నీ సమస్య ఉందని ఎలా తెలుస్తుందో తెలుసుకోవడం చాలా కష్టం ఎందువల్ల అంటే చాలా మందికి దాని సమస్య ఉందని విషయమే తెలియదు. కిడ్నీ ప్రొబ్లెమ్స్ ఉన్న వాళ్లలో కనీసం 90% మందికి ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించవు. ఏదన్న జబ్బు బాగా ముదిరిన తర్వాత చాలా శారీరకంగా మార్పు చెందిన తర్వాత శరీరంలో బోలెడన్ని చెడ్డ మార్పులు వచ్చిన తర్వాత నెమ్మదిగా వాళ్లలో వికారం కలగడము, నీరసంగా ఉండటము, ఆకలి తగ్గిపోవడం, వాంతులు అవుతున్నట్లుగా ఉండటం, వాంతులు అయిపోవడము. జ్వరం వచ్చినట్లుగా అనిపించడం, కానీ టెంపరేచర్ చూస్తే పెద్దగా జ్వరంలా అనిపించదు. అలా అని చర్మం కూడా చాలా చల్లగా అనిపిస్తూఉంటుంది. నీరసంగా ఉంటుంది, నిస్సత్తువగా ఉంటుంది. నెమ్మదిగా కాళ్ళ వాపులు, మొహం వాపులు వస్తాయి. ఆకలి తగ్గిపోవడం అవుతుంది. తర్వాత చుట్టూ ఉన్నవాటిమీద ఇష్టం కలగడం పోతుంది. నిద్ర పూర్తిగా దెబ్బ తింటుంది. డే టైం అంతా కూడా పడుకొని ఉంటారు, నైట్ టైం మేల్కొని ఉంటారు. 

తర్వాత నెమ్మదిగా ఆకలి తగ్గడం తో పాటుగా వాళ్లకు శరీరం లో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఎదురుగ ఉన్న వ్యక్తి వాటిని గుర్తించడం మొదలుపెడతారు. శరీరం పైన చర్మం పైన ఏదో మార్పు వచ్చినట్లుగా, ముఖ్యంగా ఒక రకంగా పాలిపోయిన తనం కనబడుతుంది. అంటే కొంచెం పసుపు పచ్చని రంగు శరీరానికి, చర్మానికి ముఖ్యంగా మొహం మీద ఉన్నటువంటి చర్మానికి ఆపాదించబడుతుంది. తర్వాత నెమ్మదిగా కాస్త లేచి నడుస్తూ ఉంటె కూడా ఆయాసం వస్తూ ఉంటుంది. అది కాస్త పెరుగుతూ పెరుగుతూ కొన్ని రోజుల తర్వాత కూర్చున్న కూడా ఆయాసం వస్తూ ఉంటుంది. ఇవన్ని కూడా చాలా వరకు జబ్బు బాగా ముదిరిపోయిన తర్వాత వచ్చే వ్యాధి లక్షణాలు. ముఖ్యంగా ప్రాథమిక దశల్లో ప్రధానంగా ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉండవు కాబట్టి స్క్రీనింగ్ అంటూ ఒకటి చేయించుకోవాల్సి ఉంటుంది. ఒక మనిషికి కిడ్నీ జబ్బు ఉందా? లేదా? అని చెప్పడం మనకు ప్రాధమికంగా కొన్ని సందర్భాల్లో కష్టం అవుతుంది. కిడ్నీ జబ్బు కనబడితే రక్తం లో శరీరం లో ఒకే వ్యాధి లక్షణాలు ఉండవు కాబట్టి మనం ఎవరితో చెక్ చేపించుకోవాలి, ఎవరికీ తెలియాలి. కిడ్నీ జబ్బు ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అని తెలుసుకోవడం అన్నది చాలా కష్టం. 

అయితే కొంతమంది మాత్రం తప్పనిసరిగా ఉందొ లేదో తెలుసుకోవడం అన్నది వాళ్ళకి విద్యుతధర్మం లా ఉంటుంది. ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్లు, బీపీ ఉన్నటి వంటి వాళ్ళు, స్థూలకాయంతో బాధపడేటువంటి వాళ్ళు, స్మోకింగ్ బాగా చేసేటి వంటి వాళ్ళు, కుటుంబంలో రక్త సంబంధీకుల్లో ఎవరికైనా కిడ్నీ జబ్బు ఉన్నా కూడా చాలా దీర్ఘకాలికంగా ఉండి కిడ్నీలు ఫెయిల్ అయిపోవడం, ట్రాన్స్ ప్లాంటేషన్ చేసుకోవడం లాంటిది ఏమైనా జరిగినా, అదేవిదంగా దీర్ఘకాలిక వ్యాదులైనటువంటి చర్మ సంబంధించినటువంటి వ్యాధులు కానీ, ముఖ్యంగా సోరియాసిస్ అలాంటి జబ్బులు కానీ, కీళ్ల నొప్పులు, ముఖ్యంగా కీళ్ల వాతం ఇటువంటి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కానీ, దీర్ఘకాలికంగా ఇంకా ఏదైనా కారణం చేత మందులు చాలా ఏళ్లుగా వాడాల్సిన అవసరం ఉన్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు అందరు కూడా తప్పని సరిగా కిడ్నీకి సంబందించిన పరీక్షలు చేయించుకోవాలి. 

కిడ్నీలు ఆరోగ్యవంతంగా పనిచేయాలంటే ఏం చేయాలి? కిడ్నీ వ్యాధి లక్షణాలు, కిడ్నీని ఎలా కాపాడుకోవాలి? మనకు కిడ్నీ సమస్య ఉందని ఎలా తెలుసుకోవాలి? healthtipstelugu.com
కిడ్నీ

అలాగే కిడ్నీ జబ్బుకు సంబంధించి ఏదో ఒక రూపాన ఎప్పుడైనా డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా కిడ్నీలో మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వచ్చినటువంటివాళ్ళు, ఒకానొక కాలంలో లేదా చిన్నప్పుడు మూత్రంకు సంబందించిన వ్యాధితో బాధపడేటువంటి వాళ్ళు, ముఖ్యంగా పుట్టిన తర్వాత చిన్న పిల్లలకి మూత్రంలో ఇన్ఫెక్షన్ రాకూడదు. ఎప్పుడైనా చిన్న వయస్సులో మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వచ్చాయి లేదా ఒక వయస్సు వచ్చేదాకా పిల్లలకి మూత్రం పైన కంట్రోల్ ఏర్పడలేదు అదేపనిగా నిద్రలో మూత్రం పోసేస్తున్నారు. అలాగే యుక్త వయస్సు వచ్చాక కిడ్నీలో రాళ్ళూ వచ్చాయి. రాళ్ల సంబందించిన అప్రెషన్ చేయించుకున్నారు. ఇటువంటి వారు అంత కూడా తప్పనిసరిగా కిడ్నీకి సంబందించిన పరీక్షలు చేయించుకోవాలి. 

కిడ్నీకి సంబందించిన పరీక్షలు చేయించుకోవడం వలన మాత్రమే చాలా మందికి కిడ్నీ జబ్బు ఉందన్న విషయం తెలుస్తుంది. నిజానికి కేవలం వ్యాధి లక్షణాల వాల్ల మాత్రం కిడ్నీ జబ్బు ఉందొ లేదో పసిగడదామనుకుంటే అక్కడ మనం పొరపాటు చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకపోవడమే కిడ్నీ జబ్బు యొక్క ప్రధాన లక్షణం. కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి వాళ్ళు కిడ్నీ పరీక్ష చేయించుకొని కిడ్నీ జబ్బు ఉందా లేదా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

ADVERTISEMENT