-->
yrDJooVjUUVjPPmgydgdYJNMEAXQXw13gYAIRnOQ
Bookmark

Heart attack symptoms గుండెపోటు లక్షణాలు, గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 Heart attack symptoms గుండెపోటు

అత్యంతమంది ప్రస్తుత కాలంలో ప్రపంచంలో గుండెపోటుతో మరణిస్తున్నారు. అసలు గుండెపోటు ఎందుకు వస్తుంది, గుండెపోటు లక్షణాలు, దానికి గల కారణాలు తెలుసుకుందాం.

heart attack symptoms, heart attack treatment, how to prevent heart attack, pre heart attack symptoms female, pre heart attack symptoms male, blood test for heart attack, heart attack test at home, heart attack first aid, what are the 4 silent signs of a heart attack, health tips telugu
how to prevent heart attack

ప్రపంచంలో గుండె జబ్బుతో చాలా మంది ఒక విధంగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం అందరికి తెలుసు షుగర్ ఉన్న వాళ్ళల్లో, బీపీ ఉన్నవాళ్ళల్లో, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళల్లో, తర్వాత స్మోక్ చేసే వాళ్ళల్లో, తర్వాత ఊబకాయం ఉన్నవాళ్లలో వస్తుందనేది అందరికి తెలిసిన విషయమే, చాలా మందికి అర్ధం కానీ విషయం మరియు కొత్త విషయం ఏమిటంటే స్ట్రెస్ ఉన్నవాళ్ళల్లో విపరీతంగా గుండెపోటు వస్తుంది. ఈ రోజు ప్రపంచంలోనూ, భారతదేశంలోను లేదా దక్షిణ ఆసియాలోను విపరీతంగా యవకులకు గుండెపోటు వస్తుంది. దీనికి ప్రధాన కారణం స్ట్రెస్ లెవెల్స్ ఉండటం, విపరీతంగా కాలంతోపాటు పరిగెత్తడం, కాలంతోపాటు పరిగెత్తే పరుగులో త్వరగా అలసిపోవడం ఈ స్ట్రెస్ ని తీసుకున్నందు వల్లనే ఈ గుండె జబ్బులు విపరీతమైన స్థాయిలో పెరిగాయి. దీనికి కొన్ని స్టేటస్టిక్స్ ని కూడా జోడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ W.H.O ఆల్రెడీ కొన్ని వర్కింగ్ సిగ్నల్స్ ని ఇచ్చింది. భారతదేశం 2022 లోపల ప్రపంచంలోనే గుండె జబ్బుల్లో మొదటి స్థానాన్ని ఆక్రమించడం జరుగుతుంది. ఇది మంచి వార్త కాదు కానీ ఇది నిజం.

గత పది యేండ్లలో అంతకముందుకి పది యేండ్లకి గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో విపరీతంగా గుండె జబ్బులు పెరిగాయి. దీనికి ప్రధానమైన కారణం కన్వన్షనల్ రిస్క్ ఫాక్టర్ తో పాటు ముఖ్యంగా మోడ్రన్ రిస్క్ ఫాక్టర్స్ అని చెప్పవచ్చు.

Heart Attack ఏ వయస్సు వారికీ ఎక్కువగా వస్తుంది?

గుండెపోటు ఒకానొక కాలంలో ఆలోచన ఏమిటంటే పెద్ద వయస్సు మీరిన వారికీ రావాలి, 70,80 లేదా వయస్సు పై బడిన వాళ్ళకి గుండెపోటు వస్తుంది అనేది పాత మాట, ఈ రోజు నిజమైన మాట ఏమిటంటే గుండె జబ్బు ఏ వయసులోనైనా రావచ్చు. దురదృష్టవశాత్తు భారతదేశంలో యువతను తీసుకెళ్లిపోతుంది ఈ గుండె జబ్బు. ఇది నిజంగా చాలా శోచనీయమైన విషయం. ఇలా యువతను తీసుకెళ్తే ఏ దేశ భవిషత్తు అయినా యువత మీదనే ఆధారపడి ఉంటుంది. అలాంటి యువతని ఈ రోజు టార్గెట్ చేసి గుండె జబ్బులు వస్తున్నాయి. కాబట్టి పెద్దవాళ్ళకి వస్తుంది, చిన్నవాళ్ళకి వస్తుంది. 20-40 ఏళ్ళ వాళ్లకు కూడా చాలా ఎక్కువ శాతంగా వస్తుంది. 

స్ట్రెస్ వల్లనే ఎక్కువ వస్తుంది. ఒక విధంగా కొన్ని ప్రొపెషన్స్ ఉన్నాయి, కొన్ని I.T ఇండస్ట్రీ అవనివండి, లేకపోతె బ్యాంకింగ్ ఎంప్లాయిస్ కానివండి కొంతమంది కాలంతోపాటు పరిగెత్తుతూ ఉంటారు, వాళ్లకు స్ట్రెస్ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు వెంటనే కుబేరులు కావాలనే ఒక చిన్న దురదృష్టకరమైన ఆశ, కుబేరుడు కావచ్చు కానీ వెంటనే కావాలనే ఆశతో పరిగెత్తి పరిగెత్తి తొందరగా అలసిపోయి గుండె జబ్బుతో ఇబ్బంది పడుతున్నారు. ఇది దురదృష్టం. దీన్ని సులువుగా మనం మార్చుకోవచ్చు.

గుండెపోటు లక్షణాలు (Heart Attack Symptoms)

heart attack symptoms, heart attack treatment, how to prevent heart attack, health tips telugu
heart attack symptoms

అందరికి తెలిసిన  లక్షణం ఛాతిలో నొప్పి రావడం, కానీ నిజం ఏమిటంటే ఛాతి నొప్పి వచ్చిన ప్రతిదీ గుండె నొప్పి కాదు. గుండె నొప్పి ఛాతిలోనే వస్తది అందుకని చాలా మంది కన్ప్యూజ్ అయిపోతారు. ఛాతిలో నొప్పి రాగానే ఇది గుండెనొప్పి అవుతుందేమో అన్న కంగారులో చాలా మంది బాధపడుతూ ఉంటారు. నిజానికి చాలా కారణాలు ఉంటాయి. సుమారు 1000కి పైగా కారణాలు ఉన్నాయి. దీనిలో ప్రధానమైన కారణం గుండెపోటు. అందుకని ప్రతి ఒక్కరు కంగారు పడతారు. ఛాతి నొప్పి వచ్చినవాళ్లు తప్పని సరిగా గుండె జబ్బు ఉన్నదా లేదా నిర్దారణ చేసుకోవచ్చు కానీ, గుండె జబ్బు అని కంక్లూడ్ అవ్వడం కరెక్ట్ కాదు. ఇది మొదటి లక్షణం.

రెండవ లక్షణం ఉన్నపలంగా విపరీతంగా చెమటలు రావడం, ఉన్నపలంగా ఆయాసం వచ్చేయడం, అకారణంగా కొద్దీ దూరం నడవంగానే అలసిపోతూ ఉండటం. వీటన్నిటి కన్నా ముఖ్యమైనది రిస్క్ ఫాక్టర్ కలిగి ఉండడం. వీటిని కర్నరీ రిస్క్ ఫాక్టర్ అంటారు. అంటే షుగర్ ఉండటం, బీపీ ఉండటం, ఊబకాయం ఉండటం, ఎక్సర్సైజ్ అలవాటు లేకపోవడం, స్మోక్ చేయడం, అధిక కొలెస్ట్రాల్ ఉండటం, స్ట్రెస్ కి గురి కావడం. ఈ లక్షణాలు ఉన్నవాళ్లు ఈజీగా ఇలాంటి పరిస్థితులు గనుక వస్తున్నట్లైతే తప్పనిసరిగా గుండెకి సంబందించిన వ్యాధి ఉన్నదేమో అని చెక్ చేయించుకోవడం బెటర్. 

గుండె జబ్బులు(Heart Attack) రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

ఇది మహమ్మారి జబ్బు కాబట్టి రాకుండా ఉంటె బాగుండు అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ దురదృష్టం ఏమిటి అని అంటే తెలిసో తెలియకో చాలా మంది స్ట్రెస్ కి గురి అవుతూ ఉంటారు. తెలిసో తెలియకో మనం  చేయని పాపానికి కొన్ని రిస్క్ ఫాక్టర్స్ మనల్ని ఆవహిస్థాయి. ఉదాహరణకి పేరెంట్స్ కి షుగర్ ఉంటుంది, మనకి కూడా షుగర్ రావచ్చు. పారెంట్స్ కి గుండె జబ్బు ఉంటుంది, లేదా పేరెంట్స్ 40-50 సంవత్సరాల్లో చనిపోయి ఉంటారు, తప్పని పరిస్థితుల్లో మనకు జీన్స్ ను షేర్ చేసుకున్నాము కాబట్టి మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి కొన్ని రిస్క్ ఫాక్టర్స్ ని అవైడ్ చేయలేము మనచేతుల్లో ఏమి లేదు. కానీ మన చేతుల్లో ఉన్నది మాత్రం ఏమిటంటే ఎక్సర్ సైజు రెగ్యులర్ గా చేయడం, స్ట్రెస్ ను తగ్గించుకోవడం, రిలాక్షేషన్ ఎక్సర్ సైజ్ చేయడం లేదా యోగా చేయడం, అన్నిటికన్నా మైఖ్యమైనది స్మోకింగ్ కి దూరంగా ఉండటం వీటిని మాడిఫైయబుల్ రిస్క్ ఫాక్టర్స్ అంటాము, అంటే మనం మాడిపై చేయొచ్చు, మన చేతుల్లో ఉంది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు వీటన్నిటిని ప్రక్కన పెట్టేస్తున్నారు. ప్రక్కన పెట్టేసి పరుగో పరుగో అంటూ నిత్యం హడావిడి పడుతూ ఉంటారు. ఈ పరుగే మనల్ని ఇబ్బంది పెడుతుంది. వీటన్నిటిని మనం అవైడ్ చేయగలిగితే దీన్ని రిస్క్ మాడిఫికేషన్స్, రిస్క్ మేనేజ్మెంట్ అని అంటారు.

heart attack treatment, heart attack symptoms, health tips telugu
heart attack treatment

షుగర్ ఉంటె తప్పదు షుగర్ ని కంట్రోల్ లో పెట్టుకోవాలి. బీపీ ఉంటె బీపీ ని కంట్రోల్ లో పెట్టుకోవాలి. కొలెస్ట్రాల్ ఉంటె కొలెస్ట్రాల్ ని కంట్రోల్ లో పెట్టాలి. స్మోకింగ్ చేయకూడదు, ఐడియల్ బాడీ వెయిట్ ని మెంటైన్ చేయాలి. రోజు ఎక్సర్ సైజ్ చేయాలి. రోజు భోజనం చేసినట్టుగా రోజు ఎక్సర్ సైజ్ చేయాలి. ఇది ఒక డిసిప్లేన్ గా పాటిస్తే తప్పనిసరిగా హార్ట్ డిసీజెస్ ని తగ్గించవచ్చు.

ఫాత్యాస్థ దేశాలు ఇలాంటి సమస్యను ఎప్పుడో అనుభవించారు. విపరీతంగా ఉంది. వాళ్ళు ఈ రోజు గుండె జబ్బుల్ని పూర్తిగా అదుపులోకి తీసుకురాగలిగారు. ఉదాహరణకు అమెరికాలో చుస్తే గుండె జబ్బులు తగ్గిపోతున్నాయి. భారతదేశంలో గుండె జబ్బులు విపరీతంగా పెరుగుతున్నాయి. కారణం ఏమిటంటే వాళ్ళు ఆల్రెడీ మనకన్నా ఒక స్టెప్ ముందులో ఉన్నారు. ప్రివెన్షన్ యాస్పెక్ట్ ని కాన్సంట్రేట్ చేసారు. స్కూల్స్ లో స్ప్రెడ్ చేస్తున్నారు మెసేజెస్. ఇలా ఉంది ఇలా చేయాలి, స్మోకింగ్ కి దూరం గా ఉండాలి, స్ట్రెస్ తీసుకోకూడదు, ఇలాంటివన్నీ ముందుకొస్తున్నాయి అక్కడ. మన దగ్గర పరిస్థితులు వేరు, దీనికి ఒక కారణం కాదు అనేక కారణాలు ఉన్నాయి. 

హైదరాబాదు భారతదేశంలోనే షుగర్ కాపిటల్ గా ఉంది, ఇది దురదృష్టం ఎందుకు అంటే సౌత్ఇండియాలో రైస్ ఎక్కువగా తీసుకుంటారు. అది ఒక కారణం అయితే రెండో కారణం స్ట్రెస్ లెవెల్స్. అంటే ఒక 5-6 ఇండియన్ మెట్రో సిటీస్ ని గమనిస్తే హైద్రాబాదు గ్రోత్ చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. మిగిలిన సిటీస్ తో పోలిస్తే ఈ ఫాస్ట్ గా పెరిగే అర్బనైజషన్ వలన ప్రాబ్లమ్స్ కూడా పెరిగిపోతున్నాయి. సిటీ కి అందరు వచ్చేస్తున్నారు, సిటీ లో అందరం ఉండాలనుకుంటున్నాం. కానీ పరిస్థితులు  అందరికి అనుకూలించవు, దానివలన స్ట్రెస్ కు గురి అవుతూ ఉంటారు. ఈ రాపిడ్ అర్బనైజషన్ రాపిడ్ డవలప్మెంట్స్ లోను వచ్చిన చిక్కులు ఇవన్నీ. దాంతో పాటుగా కొన్ని మనకు బేసిగ్గానే రైస్ ఎక్కువ తీసుకోవడం, ఎక్సరసైజ్ సరిగ్గా చేయకపోవడం, స్వీట్స్ ఎక్కువ తీసుకోవడం లేదా జంక్ ఫుడ్ ఎక్కువ తినకూడదు, ఈ రోజున గమనిస్తే 5 ఏండ్ల వెనక్కి ఇప్పటికి చుస్తే ఎక్కడికెళ్తే అక్కడ మెక్డొనాల్స్, పిజ్జా హాట్స్, కె ఎఫ్ సి, బేకరీలు, పాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటున్నాయి. ఈ టైప్ అఫ్ ఫుడ్స్ ని మార్చుకోవడం మంచిది. 

రాత్రి పగలు అనే తేడా లేకుడా పని చేయడం, వేరే కంట్రీకి మాచ్ అయ్యేటట్లు మన టైమింగ్స్ ని మెయింటైన్ చేసుకొని మన నిద్రని ప్రక్కన పెట్టుకోవడం, కుటుంబ సమస్యలు అనేకం ధీనికి అనేక కారణాలు. ఇలా అనేకమైన వత్తిళ్లకు గురి అయ్యి ఈ రోజు మన మానవాళికి పెద్ద ముప్పుగా తయారైంది. 

స్ట్రోక్స్ ఎలా వస్తాయి?

స్ట్రోక్స్ వచ్చే కొద్దీ గుండె వీక్ అయిపోద్ది. అందుకోసమే అందరు చెప్తారు 3 స్ట్రోక్స్ వస్తే చాలా కష్టం ఇక బ్రతకరు అని, ఇది కొంతవరకు నిజమే. రీజన్ ఏంటంటే అసలు బేసిగ్గా ఏమి జరుగుతుందంటే అసలు ఈ ఎటాక్ కి ప్రధానమైనటువంటి కారణం రిస్క్ ఫాక్టర్స్ ఎమన్నా ఉంటె ఎం జరుగుతుందంటే గుండెకి రక్త నాళాలు రక్తాన్ని తీసుకొస్తూ ఉంటాయి. ఆ రక్త నాళాల్లో అడ్డంకు ఏర్పడితే అది కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వలన అవనివండి, రక్తం గడ్డ కట్టడం వలన అవనివండి, ఏదైనా కానివండి అలా పేరుకున్నందు వలన రక్త సరఫరా ఆగిపోయి గుండెకి సమస్య మొదలవుతుంది. దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే పైరుకు నీళ్లు ఆపేస్తే ఎలా విలవిలలాడుతుందో, అదే పరిస్థితి రక్తం గుండెకి అందకపోతే ఆక్సిజన్ అందదు, అప్పుడు గుండె విలవిలలాడుతుంది. ఇలాంటి ఒక స్ట్రోక్ వచ్చింది అంటే ఒక ఎపిసోడ్ లో హార్ట్ కి ఇబ్బంది వచ్చినట్లే. ఇబ్బంది రావంగానే గుండెలో కొంత డామేజ్ జరిగిపోద్ది. సరే కొంత డామేజే కదా ఫస్ట్ ఇన్ఫెక్టే కదా అని కొంత రికవరీ అయిపోతుంది. ఒకరోజుకో, రెండు రోజులకో, నాలుగు రోజులకో, వారానికో లేదా ఇంకొక సంవత్సరం తర్వాత మరలా ఇంకొక స్ట్రోక్ వచ్చిందనుకో గుండెలో మళ్ళి ఇంకొంత ఏరియా దెబ్బతింటుంది. 2nd స్ట్రోక్ కి కూడా రికవరీ అయ్యి 3rd స్ట్రోక్ లో కోలుకోని విధంగా దెబ్బ తినవచ్చు.

ఎందుకంటే ఇన్ని రోజులు అవకాశాలు వచ్చాయి. మనం మేలుకోలేదు, సరైన జాగ్రత్తలు తీసుకోలేదు. అందుకని డామేజ్ స్టెప్స్ లో ఎక్కువై పోతున్నందు వల్ల హార్ట్ రికవరీ కాలేని స్థాయికి స్ట్రోక్స్ పెరిగే కొలది రిస్క్ ఉంటుంది. అందువల్ల చాలా మంది 3 స్ట్రోక్స్ వస్తే కష్టం బ్రతకరు అని చెప్తూ ఉంటారు. రెండు మూడు స్ట్రోక్స్ వస్తేనే కాదు కొంతమందిలో మొదటి స్ట్రోక్ లో కూడా బ్రతక్కుండా పోవచ్చు ఆ ప్రమాదం కూడా  ఉంది. అందుకనే గుండె జబ్బు మహమ్మారి జబ్బు, ఇది ఎప్పుడొస్తుందో, ఎవరికొస్తుందో, ఎలా వతుందో, ఎం జరుగుతుందో ఊహించలేము. 

అందుకోసమనే ఈ రోజు ప్రతి హాస్పిటల్ లో గమనిస్తే మాస్టర్ చెకప్స్ అనడం, ముందే  వచ్చి చూపించుకోండి అనడం, జెనెటిక్ అనాలసిస్ కూడా చేయడం కూడా మొదలుపెడుతున్నారు. మీకేమైనా గుండె జబ్బు రావొచ్చా, లేకపోతె ఇంకేమైనా జబ్బులు రావొచ్చా అని జెనెటిక్ ఇంజనీరింగ్ నుంచి అన్ని ఎనాలసిస్ లు కూడా తీసుకు వస్తున్నారు. మాస్టర్ హెల్త్ చెకప్స్ విరివిగా చేస్తున్నారు. ఇది కొంత విమర్శలకు కూడా తావిస్తుంది. కానీ దీనిలో అర్ధం లేకపోలేదు. 

Heart Attack రాకుండా ఆహార నియమాలు

heart attack symptoms, heart attack treatment, how to prevent heart attack, pre heart attack symptoms female, pre heart attack symptoms male, blood test for heart attack, heart attack test at home, heart attack first aid, what are the 4 silent signs of a heart attack, health tips telugu
junk food

బేసిగ్గా ఆయిల్ ఫుడ్ తగ్గించాలి, జంక్ ఫుడ్ తగ్గించాలి. రెండవది ముఖ్యమైనది స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించుకోవడానికి పూర్తి స్థాయిలో ధ్యానం మీద ద్యాస పెట్టాలి, యోగా చేయాలి. ఇది చేసుకుంటే ఇక షుగర్, బీపీల విషయానికి వస్తే తప్పనిసరిగా కంట్రోల్ చేసుకోవాలి. కొలెస్ట్రాల్ ఉంటె కంట్రోల్ చేయాలి. ప్యామిలీ ఇస్యూస్ ఉంటె ఏమి చేయలేము. కానీ ఫాదర్ లేక మదర్ 40years లో చనిపోయారనుకుంటే మనం కేర్ ఫుల్ గా 25years నుంచే మనం స్క్రీనింగ్ మొదలెట్టాలి. మనకేమన్నా రిస్క్ ఉందా, మనం ఎం చేసుకోవాలి. Yearly Stress Test చేయించుకోవడం, త్రేడ్ మిల్ టెస్ట్ చేయించుకోవడం, లేదా మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవడం, మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. మన  లైఫ్ స్టైల్ ఎలా ఉంది. మనం యోగా చేస్తున్నామా, ఎక్సర్సైజ్ చేస్తున్నామా, కరెక్ట్ గా బాడీ వెయిట్ ని మెయింటైన్ చేస్తున్నామా, సరైన విటమిన్స్ ఉన్న ఆహారం తీసుకుంటున్నామా, కొలెస్ట్రాల్ ఉండేవి తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నామా, ఈ మధ్యన ఈ కొలెస్ట్రాల్ హాని చేయదు బాగా తినండి అని వాట్సాప్ గ్రూపుల్లో బాగా వస్తుంది చాలా దురదృష్టం, ఇది సొసైటీకి చెడు చేస్తుంది. ఈ రోజుకి కూడా రక్తంలో అధికంగా కొలెస్ట్రాల్ ఉండటం తప్పనిసరిగా హార్ట్ ఎటాక్ కి దారి తీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిందే, ఆయిల్ రిస్ట్రిక్ట్ చేయవలసిందే, రోజు వ్యాయామం చేయవలసిందే, స్మోకింగ్ కి దూరంగా ఉండవలసిందే ఇలా చేసుకుంటే చాలా వరకు మినిమైజ్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. 

ఆహారం ఎలా తీసుకోవాలి?

అన్ని రకాల ఆహారాలు తీసుకోవచ్చు కానీ ఆయిల్ ని విపరీతంగా వాడకూడదు. డీప్ ఫ్రై చేయడం, ఎవరికైనా ఆయిల్ ఫుడ్ రుచిగానే ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు ఆయిల్ ఫుడ్ ని బాగా తీసుకుంటున్నారు. కానీ వాస్తవంగా చూస్తే ఆ ఆయిల్ ఫుడ్ మంచిదేమీ కాదు. డీప్ ఫ్రై చేస్తారు బాగా రుచిగా అనిపిస్తుంది. అందుకోసమే నేను ఒక సూత్రం చెప్తాను తియ్యగా ఉన్నది తినకుండా, రుచిగా ఉన్నది మితంగా తింటే ఆరోగ్యం బాగుంటుంది. రుచిగా ఉన్న దాన్ని బాగా తినాలనిపిస్తుంది, అది సహజ లక్షణం. ఈ కోరికలకు కొంచెం దూరంగా జరగాలి. రుచిగా ఉంది మితంగా తిందాం. స్వీట్స్ ఉన్నాయి, తియ్యగా ఉంది చాలా తక్కువ తిందాం లేదా తినకుండా ఉందాం. దీనివల్ల ఆరోగ్యం  డెఫనెట్ గా మంచిగా అవుతుంది. 

గుండె జబ్బు రకరకాల కారణాలతో మేనిపెస్టో అవుతుంది. ఒకాయన అప్పటిదాకా బాగానే ఉంటాడు సడెన్ గా గుండెపోటు వస్తుంది. ఎంతో మందిని చూసాం కొంత మంది మినిస్టర్స్ మాట్లాడుతూ, మాట్లాడుతూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీనికి ఎవ్వరు అథితులు కారు, అందరికి రిస్క్ ఉంటుంది. దీన్ని చాలా జాగ్రత్తగా మనం రిస్క్ ఫాక్టర్స్ ని మానేజ్ చేయాలి. అంత మాత్రాన నాకు షుగర్ లేదు, బీపీ లేదు, స్మోకింగ్ లేదు, మా నాన్నగారు బాగానే ఉన్నారు, మా అమ్మగారు బానే ఉన్నారు, మా ఇంట్లో ఫ్యామిలిలో ఎవ్వరికి లేదు, నాకు గుండె జబ్బు రాదు కదా అనే గ్యారంటీ ఎవ్వరు ఇవ్వరు, ఇవ్వలేరు కూడా ఎందుకు ఇలా చెప్పడం జరుగుతుందంటే చాలా మంది మాకేమి లేదు మేమెందుకు మాస్టర్ చెకప్ చేయించుకోవాలి అని అంటారు. ఏమి లేకపోయినా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ మెజర్ చేయడానికి వీల్లేదు, ఇలా ఎవ్వరికైనా రావచ్చు. వచ్చిన మొదటి స్ట్రోక్ కు ప్రాణాన్ని కూడా తీసేయొచ్చు. గుండె జబ్బు హార్ట్ స్ట్రోక్ మానిపెస్ట్ అవ్వడానికి ఒకానొక లక్షణం ఏమిటంటే సడెన్ డెత్. ముఖ్యంగా గుండె జబ్బు అనేది చాలా వింతగా మహమ్మారిగా వచ్చేస్తుంది. చనిపోతుంటారు. ఇది పెద్దవాళ్ళు చనిపోతే నిద్రలో చనిపోతే సుఖంగా చనిపోయారు మంచివాడు అని అంటారు. కానీ అదే కుర్రాళ్ళు చనిపోతే ఆ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. చనిపోవడం అనేది ఎవ్వరికి ఇష్టం లేని చర్య కాబట్టి దీనికి మనం చేయవలసిన కృషి ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనం ఎంతవరకు కరెక్ట్ చేసుకోగలం, మనం ఎంతవరకు ప్రివెంట్ చేసుకోగలం ఆ నియమాలు పాటిస్తున్నామా అనేది చేసుకుంటే మిగిలినది నాకు తెలిసి మన చేతుల్లో లేని విషయాలు కాబట్టి మనం ఏమి చేయలేము.

ఎటువంటి వంటనూనె ఆరోగ్యానికి మంచిది

heart attack symptoms, heart attack treatment, how to prevent heart attack, pre heart attack symptoms female, pre heart attack symptoms male, blood test for heart attack, heart attack test at home, heart attack first aid, what are the 4 silent signs of a heart attack, health tips telugu
cooking oil

సర్వ సాధారణంగా ప్రజల సమస్య ఏ ఆయిల్ బెటర్, ఏ బ్రాండ్ బెటర్ ఇందులో ప్రధానమైనది అందరు అనుకునేది ఆయిల్ తక్కువ ధరలో ఉండాలి, ఆరోగ్య కరంగా ఉండాలి. ఎందుకంటే మరింత మంది వాడుకోవచ్చు. మోనో ఆన్ శాచ్చురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని, పాలి ఆన్ శాచ్చురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఈ ఫ్యాటీ యాసిడ్స్ రకాలు పాలి ఆన్ శాచ్చురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి మంచిది. మోనో ఆన్ శాచ్చురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వద్దా అంటే అది కూడా కొంత ఉండాలి. కాబట్టి ఈ రేషియోని మెయింటైన్ చేయడానికి జనరల్ గా రిఫైన్డ్ సన్ ఫ్లవర్ ఆయిల్ బెటర్. దాంట్లో కొంతమంది కొన్ని బ్రాండ్స్ విటమిన్ ఈ నే ఇస్తారు. విటమిన్ ఏ ని ఇస్తారు. వాస్తవంగా చెప్పాలంటే తక్కువమోతాదులో వాడితే ఏ ఆయిల్ అయినా బెటరే. సన్ ఫ్లవర్ ఆయిల్ కోసం ప్రాకులాడాల్సిన అవసరం లేదు ఎంతో రూరల్ ఏరియా ఉంది. ఈ రోజుకి కూడా 70-75% మంది ప్రజలు రూరల్ ఇండియాలోనే జీవిస్తున్నారు. వాళ్లలో చాలా మందికి సన్ ఫ్లవర్ ఆయిల్ అంటే తెలియకపోవచ్చు. సన్ ఫ్లవర్ ఆయిల్ దొరక్కపోవచ్చు. ఇవన్నీ ఇస్సు స్ ఉన్నాయి. వీటిలో బెస్ట్ ఏంటంటే ఏ ఆయిల్ నైనా తక్కువ మోతాదులో వాడితే గుండె జబ్బులు మీదకు రావు.

పచ్చి కొబ్బరి వాడటం మంచిది కాదు, కానీ కేరళ లాంటి  స్టేట్ లో కొబ్బరి నూనెను కుకింగ్ కి వాడతారు. అక్కడ ఫేరడాక్స్ ఏమిటంటే మిగిలిన స్టేట్స్ తో పోల్చితే కేరళ లో హార్ట్ ఎటాక్స్ తక్కువ. దాన్ని బట్టి కోకోనట్ ఆయిల్ వాడితే ఆరోగ్యం బాగుంటుందా అంటే కాదు, అక్కడ లైఫ్ స్టైల్ డిఫెరెంట్స్ ఉంటాయి. అక్కడ హ్యాబిటేషన్ డిఫెరెంట్స్ ఉంటాయి. వాళ్ళ లివింగ్ స్టైల్ డిఫెరెంట్స్ ఉంటాయి. వాళ్ళ జీవన విధానమే చాలా వరకు డిఫరెంట్ గా ఉంటుంది. ఈ జీవన విధానమనేది ఒక్కొక్క ప్రాంతం లో ఒక్కోలా ఉంటుంది, కాబట్టి ముఖ్యంగా అవి ప్లే చేస్తాయి.

ఆహారపు అలవాట్లలో కేరళ లిట్రేసీలో చాలా ముందు ఉంది. ఆహారం తినడం కూడా మితంగానే తింటారు. ఒబియసిటీ(ఊబకాయం) మనంత ఉండదు అక్కడ. ఈ ఒబియసిటీ కి  కారణం రాపిడ్ అర్బనైజేషన్, రాపిడ్ డవలప్మెంట్ లో వచ్చే వింత పరిణామాలే.  మన దేశం లో చుస్తే ఊబకాయం విపరీతంగా పెరిగిపోతుంది. మొన్నటిదాకా బాగానే ఉన్నాను ఈ 15 రోజుల్లో విపరీతంగా బరువు పెరిగాను అని అంటే గనుక దీనికి కారణం ఆహారపు అలవాట్లలో పూర్తిగా మార్పు వచ్చేసింది. ఏది తియ్యగా ఉంటె అది తింటాము, ఏది రుచిగా ఉంటె అది తినేస్తాము, జంక్ ఫుడ్ తీసుకుంటున్నాము. చిన్న పిల్లలు 15 యేండ్ల వయస్సు ఉన్నవారు 25-30 యేండ్ల వయస్సు ఉన్నంత బరువు తీసుకొచ్చుకుంటారు. కారణం ఆహారం తినడంలో చాలా చాలా తేడాలు రావడం. ఎకనామికల్గా బెటర్ కావడం వలన మనం ఈ రోజు అఫర్ట్ చేయగల్గుతున్నాము. అఫర్ట్ చేయగల్గుతున్నామని ఏది పడితే అది తినేయకూడదు. అఫర్ట్ చూసుకునేదాన్ని బ్యాలెన్స్ డైట్ తీసుకొచ్చుకోవాలి. ఆయిల్ విషయానికొస్తే ఏదైనా మంచిదే కానీ మనకున్న ఎవిడెన్స్ లో చూస్తే డెఫినెట్ గా ఆలీవ్ ఆయిల్ ఈజ్ బెటర్. పామాయిల్ ఈజ్ బెటర్, రైస్ బ్రవున్ ఆయిల్ ఈజ్ బెటర్, కాంబినేషన్ అఫ్ గ్రౌండ్ నట్ ఆయిల్ విత్ సన్ ఫ్లవర్ ఆయిల్ ఈజ్ బెటర్ ఒక లీటర్ సన్ ఫ్లవర్ ఆయిల్ లో ఒక పావ్ లీటర్ గ్రౌండ్ నట్ ఆయిల్ ని మిక్స్ చేసుకొని వాడుకుంటే ఇట్ ఈజ్ డెఫినెట్లి బెటర్. లేదా రిఫైనెడ్ సన్ ఫ్లవర్ ఆయిల్ ఈజ్ బెటర్ ఈ విధంగా ఆయిల్ అనేది రిస్ట్రిక్టు చేసి వాడుకుంటే చాలా వరకు హెల్థ్ గా ఉండొచ్చు.

1 comment

1 comment

  • P S Kathait
    P S Kathait
    August 30, 2021 at 8:31 PM
    Whatever article you write, write it in English language.
    If you want good traffic or you want people to like to read articles written by you, then you should use Hindi language, Only then you will get good traffic, do not use your language because you want traffic of the whole world, so use English Hindi language.

    Reply