Type Here to Get Search Results !

Translate

ADVERTISEMENT

Top 5 winter Healthy and Tasty Hot Beverages ఈ టాప్ 5 హెల్త్య్ డ్రింక్స్ తాయారు చేసుకోండి, శీతాకాలంలో ఈ డ్రింక్స్ యొక్క ఉపయోగాలు.

Top 5 Healthy and Tasty Hot Drinks to Use in Winter | Health Tips Telugu చలికాలంలో ఉపయోగించాల్సిన టాప్ 5 హెల్తీ అండ్ టేస్టీ హాట్ డ్రింక్స్

Top 5 winter Healthy and Tasty Hot Beverages

Top 5 Healthy and tasty hot drinks చలికాలం వచ్చేసింది. వేడి వేడిగా టేస్ట్ డ్రింక్స్ తాగుతుంటే ఉండే మజానే వేరు కదా. మీకు టాప్ 5 డ్రింక్స్ ని తెలియజేస్తాను. అవి మీకు చలిలో ఎండాకాలంలో లాంటి ఎఫెక్ట్ ని అందిస్తాయి. వీటిల్లో కొన్ని నాకు చాలా ఇష్టం. వింటర్స్ లో నేను వీటిని రెగ్యులర్ గా త్రాగుతాను. ఇవి తయారుచేసుకోవడం చాలా ఈజీ. అంతేకాకుండా టేస్టీ మరియు హెల్త్య్ కూడా ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం, ఈజీ డైజేషన్ కోసం లేదా గ్లోయింగ్ స్కిన్ కోసం ఈ డ్రింక్స్ చాలా కరెక్ట్. వీటి యొక్క అతేంటిక్ రెసిపీస్, వీటిని త్రాగడానికి సరైన సమయం ఇంకా వీటి బెనిఫిట్స్ గురించి తెలియజేస్తాను. 

Top 5 Healthy and tasty hot drinks ని మీకు ఎప్పుడైనా అలసటగా ఉండి ఏదైనా వేడిగా త్రాగాలని అనిపించినప్పుడు ట్రై చేయండి. 

5. బేషన్ శీర 

బేషన్ శీర అంటే నాకు చిన్నప్పటినుండి చాలా ఇష్టం. ఇది ఎంత టేస్టీ మరియు హెల్త్య్ అంటే దీన్ని త్రాగుతుంటే మీకు మజాగా ఉంటుంది.

Top 5 Healthy and Tasty Hot Drinks to Use in Winter | Health Tips Telugu
బేషన్ శీర

తయారీ విధానం :

దీన్ని తాయారుచేయడానికి ఒక ఫాన్ ని లో హీట్ లో పెట్టి అందులో అర టీ స్పూన్ నెయ్యి వేయండి. తర్వాత అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ లో సెనగపిండి వేసి 2 నుండి 3 నిమిషాల పాటు కలుపుతూనే ఉండండి. తర్వాత ఇందులో 4 నుండి 5 బాదాం వేసి 3 నుండి 4 నిమిషాల పాటు మల్లి కలుపుతూ ఉండండి. ఇలా సెనగపిండి బాగా ప్రై అయి కలర్ చేంజ్ అయి మంచి స్మెల్ వచ్చే వరకు వేపుతూనే ఉండండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాస్ వేడి పాలు మరియు ఒక టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ వేయండి. చిటికెడు మిరియాల పౌడర్ వేసి 2 నిముషాలు బాయిల్ చేయండి. అంతే మీ బేషన్ శీర రెడి. నేను రిఫైన్డ్ షుగర్ ని కాకుండా బెల్లం పౌడర్ ని సజెస్ట్ చేశాను. ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఎలాంటి డ్రింక్ ని అయినా సరే ఇంకా హెల్త్య్ గా చేస్తాయి. 

బేషన్ శీర  వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చలి వేయకుండా ఉంచి ఇన్స్టెంట్ ఎనర్జీ ఎనర్జీ ని అందిస్తుంది.  ఒకవేళ ఆఫీస్ కి లేట్ అవుతుంటే బేషన్ శీర త్రాగి వెళ్లిపోండి, మీకు లంచ్ టైం వరకు ఆకలి వేయదు. ఈ డ్రింక్ లో నెయ్యి మరియు పాల యొక్క కాంబినేషన్ శనగపిండితో చేరడం వల్ల టేస్టీ ఇంకా హెల్త్య్. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. 

4. ఆయుర్వేదిక్ వింటర్ టీ 

వెయిట్ లాస్ అవ్వాలా, ఎప్పటి వరకు అదే గ్రీన్ టీ ని త్రాగుతూ ఉంటారు. ఈ చలికాలంలో ఆయుర్వేదిక్ వింటర్ టీ ని ట్రై చేయండి. 

Top 5 Healthy and Tasty Hot Drinks to Use in Winter | Health Tips Telugu
ఆయుర్వేదిక్ వింటర్ టీ

తయారీ విధానం :

దీన్ని తాయారుచేయడానికి ఒక పాన్ లో అర లీటర్ నీటిని తీసుకోండి. ఇప్పుడు ఇందులో అల్లం, చిన్న ఇలాచీ, దాల్చిన చెక్క మరియు పుదీనా ఆకులను వేయండి. పాన్ పైన మూత వేసి 10 నిమిషాల పాటు బాయిల్ అవనివండి. దీని వలన అన్ని ఇంగ్రిడిఎంట్స్ లోని సారం మొత్తం వాటర్ లోకి దిగుతుంది. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనివ్వండి. తర్వాత దాన్ని వడకట్టి కొంచెం నిమ్మరసం, కొంచెం తేనె యాడ్ చేసి బాగా కలపండి. అంతే మీ ఆయుర్వేదిక్ టీ రెడీ. 

ఇందులో టీ పౌడర్ ని యాడ్ చేయలేదు అయినా సరే ఇది సేమ్ టీ లాగె పనిచేస్తుంది. ఇంకా దానికన్నా చాలా హెల్త్య్. అంతేకాదు దీని టేస్ట్ ఎక్ట్రార్డినరీ. ఇది అలాంటి ఇలాంటి టీ కాదు. ఇందులో ఉపయోగించిన ప్రతి ఇంగ్రిడియెంట్స్ కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఎక్సస్ వెయిట్, ఎసిడిటీ, బ్లోటింగ్ లేదా బ్లడ్ షుగర్ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఈ డ్రింక్ మీ డైట్ లో తప్పకుండ ఉండాలి. వింటర్స్ కి అయితే ఇది ఫర్ఫెక్ట్. 

3. పీనట్ హాట్ చాకొలేట్

చాకొలేట్ ఇష్టమా ఎవరికీ ఇష్టముండదు. కానీ అదే చాకొలేట్ పీస్ హెల్త్య్ డ్రింక్ గా మారి ముందుకు వస్తే ఎంత బాగుంటుంది.

Top 5 Healthy and Tasty Hot Drinks to Use in Winter | Health Tips Telugu
పీనట్ హాట్ చాకొలేట్

తయారీ విధానం :

ఒక పాన్ లో ఒక గ్లాస్ పాలు వేయండి. తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అన్స్వీటెన్ కోకో పౌడర్ ని యాడ్ చేయండి. ఇప్పుడు ఒక పెద్ద టేబుల్ స్పూన్ నాచ్చురల్ పీనట్ బటర్ ఇంకా చిన్న దాల్చిన చెక్క కూడా యాడ్ చేయండి. లో ఫ్లేమ్ లోనే ఉంచి కలుపుతూనే ఉండండి. పాలు బాయిల్ అయ్యాక గ్యాస్ ఆఫ్ చేయండి. దీంట్లో తీపి కోసం డ్రై డేట్స్ (ఖర్జురం) పౌడర్ని యాడ్ చేయండి. మీకు నచ్చితే బెల్లం పౌడర్ లేదా బెల్లం లేదా మిశ్రీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్ని ఇంగ్రిడియెంట్స్ ని ఒకసారి బాగా కలపండి. అంతే మీ పీనట్ హాట్ చాకొలేట్ రెడీ. 

ఇది ఎంత టేస్టీ అంటే ఇది ఒక్క గ్లాస్ త్రాగితే కడుపు నిండిపోతుంది. మీరు హెల్త్ వెయిట్ ఫుట్ ఆన్ అవ్వాలనుకుంటున్నారా, లేదా మజిల్ బిల్డింగ్ చేస్తున్నారా పీనట్ హాట్ చాకొలేట్ మీరు తప్పకుండా ట్రై చేయండి. హెల్త్య్ ఫ్యాట్స్ మరియు ఫ్రోటిన్ తో నిండి ఉండటం వల్ల ఇది బ్రెయిన్ మరియు హార్ట్ కి చాలా మంచిది. ఒకవేళ మీకు పీనట్ బటర్ తో ఎలర్జీ ఉంటె ఆల్మండ్ బటర్ ని ఉపయోగించుకోండి. కానీ ఒక్కసారి దీన్ని తప్పకుండా ట్రై చేయండి. 

2. వెజ్ డిలై 

ఎప్పుడైనా, ఏదైనా త్రాగాలనిపిస్తున్నప్పుడు వెజ్ డిలై త్రాగండి.

Top 5 Healthy and Tasty Hot Drinks to Use in Winter | Health Tips Telugu
వెజ్ డిలై

తయారీ విధానం :

ఒక పాన్ లో అర లీటర్ నీటిని వేయండి. ఇందులో రెండు లవంగాలు, చిన్నగా తరిగిన కారట్, బీన్స్, కొంచెం పచ్చి బఠాణి యాడ్ చేయండి. మీకు కావాలంటే మీకు నచ్చిన వేరె వెజిటబుల్స్ ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం బ్లాక్ సాల్ట్ మరియు కొంచెం మిరియాలపొడిని యాడ్ చేయండి. తర్వాత దీని పైన మూత చేసి 5 నుండి 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన బాయిల్ చేయండి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గ్లాస్ లోకి తీసుకొని ఒక నిమ్మకాయ రసం యాడ్ చేసి బాగా కలపండి. చాలా ఈజీ మరియు చాలా హెల్త్య్ ఇంకా టేస్టీ. 

వెజిటబుల్స్ ని తినడానికి ఇది కరెక్ట్ పద్ధతి. నా ప్రకారం దీన్ని త్రాగడానికి సరైన సమయం ఏంటంటే లంచ్ లేదా డిన్నర్ కి అరగంట ముందు లేదా ఈవినింగ్ స్నాక్స్ టైం లో కూడా తీసుకోవచ్చు. చాలా లైట్ గా ఉండి టేస్టీగా ఉంటుంది. ఇది మీ బాడీని హైడ్రేటెడ్ గా ఉంచడమే కాక వెజ్, లవంగాలు, మిరియాలు కలిగిన వాటర్ మీకు లోపలి నుండి వేడిని అందిస్తుంది. ఇంకా కడుపు కూడా నిండుతుంది. 


1. అశ్వగంధ మిల్క్ సప్లిమెంట్

మీరు బాడీ పెంచుకోవడానికి చీప్ అండ్ బెస్ట్ డ్రింక్ కావాలనుకుంటే ఇది చాలా ఈజీ.

Top 5 Healthy and Tasty Hot Drinks to Use in Winter | Health Tips Telugu
అశ్వగంధ మిల్క్ సప్లిమెంట్

తయారీ విధానం :

ఒక పాన్ లో ఒక గ్లాస్ పాలు వేయండి. ఇందులో ఒక చిన్న స్పూన్ అశ్వగంధ పౌడర్ ని మిక్స్ చేయండి. ఒక చిన్న ఇలాచీ, ఒక చిన్న టీ స్పూన్ పసుపు. కొద్దిగా మిరియాల పౌడర్ మరియు ఒక చెంచా నెయ్యిని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. పాలను చిన్న మంటపై బాయిల్ చేయండి. ఒక చిన్న రోట్లో 2 బాదాం, 2 జీడిపప్పు, 2 వాల్నట్స్ వేసి బాగా దంచి పేస్ట్ లాగా తయారుచేసుకోండి. ఇలాంటి రోటి వలన మంచి టెస్ట్ వస్తుంది. ఒకవేళ ఇది లేకపోతే మిక్సీ పట్టుకోండి. ఈ లోపు పాలు కూడా బాయిల్ అయిపోతాయి. అప్పుడు ఈ మిక్స్ ని పాలల్లో యాడ్ చేసి ఇంకొక 5 నిమిషాల పాటు బాయిల్ చేయండి. దీన్ని ఒక గ్లాస్ లోకి తీసుకోండి. దీన్ని ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. తీపి కోసం ఒక టీ స్పూన్ బెల్లం లేదా బెల్లం పౌడర్ ని యాడ్ చేయండి. దీన్ని రాత్రి పడుకోబోయే ఒక గంట ముందు త్రాగండి, చాలా లాభాలు ఉంటాయి. 

అశ్వగంధ మీ టెస్టోస్టిరాన్ లెవెల్స్ ని పెంచడమే కాదు, మీ  మైండ్ ని కూడా రిలాక్స్ చేస్తుంది. దాంతో మంచి నిద్ర పడుతుంది. ఈ డ్రింక్ స్కిన్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది. బాడీ పెంచాలి కానీ సప్లిమెంట్ లేదా.! అయితే ఈ నాచ్చురల్ సప్లిమెంట్ ట్రై చేయండి. వర్కౌట్స్ తర్వాత కూడా త్రాగవచ్చు.

ఇవే నా Top 5 Healthy and tasty hot drinks మీకు చలికాలంలో కూడా ఎండాకాలం లాంటి మాజాని మీకు అందిస్తాయి. దుప్పటి కప్పుకొని వీటిని త్రాగుతూ ఎంజాయ్ చేయండి. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

ADVERTISEMENT