Type Here to Get Search Results !

Translate

ADVERTISEMENT

Beauty tips telugu | Beauty tips at home in Telugu

Beauty tips telugu | Skin Care and Beauty Tips To Stay At Home For A Beautiful Face

Beauty-tips-తెలుగు-health-tips-telugu

ఇప్పుడున్న ప్రపంచంలో మనకు సరిగ్గా సమయం ఉండటం లేదు, మనగురించి మనం కేర్ తీసుకోవాలంటే మనకున్న ఆంబిషన్స్, మనకున్న కెరీర్, మనకున్న బాధ్యతలు ఇవన్నిటితోనే సరిపోతుంది. మన గురించి మనకు కేర్ తీసుకునే టైం ఉండట్లేదు. బ్యూటీ పార్లర్ కి వెళ్లేంత టైం ఉండట్లేదు. అందంగా కనిపించాలని ప్రతిఒక్కరికి ఉంటుంది, అందం అనేది మనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కాబట్టి మనం ఇంట్లోనే ఉండి బ్రేడల్ స్కిన్ కేర్ టిప్స్ మరియు బెస్ట్ పేస్ పాక్స్ గురించి తెలుసుకుందాము. 

ముందుగా మనము స్కిన్ ఆరోగ్యకరంగా మెరుస్తూ ఉండాలంటే మన స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవ్వాలి. స్కిన్ కేర్ లో మనం చేయాల్సినవి Cleansing, Toning, moisturizing, Sunscreen.

Cleansing : ముందుగా మనము స్కిన్ ని క్లేమ్స్ చేయాలి, దీనివల్ల స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. మనకు ఒక స్మూత్ మరియు సాఫ్ట్ గా ఉండే స్కిన్ అనేది లభిస్తుంది. 

ఇంటివద్దనే క్లీన్సర్ ఎలా తయారుచేసుకోవాలి?

పెసరపప్పు ని మెత్తగా గ్రైండ్ చేసుకొని దానిలో కొంచెం వాటర్ కలుపుకొని వారానికి ఐదు సార్లు ముఖానికి అప్లై చేసి నెమ్మదిగా రబ్ చేయడం వలన స్కిన్ మీద ఉన్న డెడ్సెల్స్ అనేవి తొలగిపోతాయి, దానివల్ల చర్మానికి స్మూత్ నెస్ అనేది లభిస్తుంది. 

Rose-water-health-tips-telugu
రోజ్ వాటర్ (Rose water)

Toning : రోజ్ వాటర్ ని తీసుకొని దాన్ని ముఖం పైన స్ప్రే చేయాలి, తర్వాత ఒక గ్లాస్ లో వాటర్ ని తీసుకొని దాంట్లో ఒక గ్రీన్ టీ బాగ్ వేసి 30 నిముషాలు ఉంచాలి. తర్వాత తీసి ఆ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకొని దాన్ని ముఖం పైన స్ప్రే చేసుకోవాలి, ఇది ఒక మంచి టోనర్ లాగా పనిచేస్తుంది.

Cleansing, Toning అయిపోయిన తర్వాత ఒక మంచి ఆర్గానిక్ Moisturizer మరియు ఒక మంచి Sunscreen అప్లై చేసుకోవాలి. ఇలా రోజు చేస్తుండడం వలన స్కిన్ మంచి ఆరోగ్యాంగా మరియు అందంగా తయారవుతుంది. 

పేస్ మాస్క్ అనేది అప్లై చేస్తూ ఉండటం వలన మన స్కిన్ అనేది సహజంగా నిగారింపు అవుతుంది. స్కిన్ టైప్ ఏదైనా పర్వాలేదు వారానికి ఒక్కసారి ఐన ఫేసుమాస్క్ అప్లై చేసుకోవడం వలన మంచి గ్లో లభిస్తుంది. 

ఇంటి వద్దనే చేసుకొనే బెస్ట్ ఫేసుమాస్క్ లు 

Face-pack-health-tips-telugu
పేస్ మాస్క్ (Face pack)

పేస్ ప్యాక్-1. 

ఒక టీ స్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ సెనగపిండి, ఒక టీ స్పూన్ బియ్యప్పిండి, హప్ టీ స్పూన్ పసుపు, హప్ టీ స్పూన్ నిమ్మకాయ రసం, తర్వాత హప్ టీ స్పూన్ తేనె తీసుకొని ఇవన్నింటిని బాగా కలిపి ముఖానికి, మెడకి, చెవులకి అప్లై చేసి 15-20 నిమిషాలు ఉంచాలి, మొత్తం ఆరిన తర్వాత కొంచెం వాటర్ తో తడిచేసి మెల్లగా చేతితో రుద్దాలి, ఇది ముఖాన్ని టైట్ చేస్తుంది, ముడతలను సరిచేస్తుంది. పెరుగు చక్కటి గ్లో ని ఇస్తుంది, తేనె లో మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి చాల బాగా పనిచేస్తుంది. నలుపుని నిమ్మ తగ్గిస్తుంది. ఈ ప్యాక్ ని వారానికి రెండు సార్లు ట్రై చేయండి ఒక నెల తర్వాత మంచి రిజల్ట్ కనిపిస్తుంది. 

పేస్ ప్యాక్-2

పచ్చిపాలు అంటే కాగబెట్టని పాలు రెండు లేదా మూడు టీ స్పూన్స్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నిమ్మరసం వేయండి, తర్వాత హప్ స్పూన్ తేనె వేయాలి, వీటిని బాగా కలిపి ముఖానికి అప్లై చేయాలి. 15 నుంచి 20 నిముషాలు వరకు ఉంచి ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి, ఈ పేస్ ప్యాక్ ని వారానికి రెండు సార్లు వేసుకొని చూడండి, తర్వాత మీ ముఖంలో మంచి కాంతివంతమైన  నిగారింపు వస్తుంది.

పేస్ ప్యాక్-3

ఫ్రూట్ ఫేసియల్ :ముందుగా రెండు టీ స్పూన్ ల టమాటో రసం తీసుకోవాలి, దాంట్లోకి  ఒక టీ స్పూన్ నిమ్మకాయ రసం కలుపుకొని ముఖానికి, మెడకి అప్లై చేసి మెల్లగా మసాజ్ చేసి కడిగెయ్యాలి, తర్వాత ఫ్రూట్ పేస్ ప్యాక్ వేసుకోవాలి. 

banana-papaya-orange-health-tips-telugu
అరటి, పపాయ, ఆరంజ్

ఫ్రూట్ ఫేసియల్ : అరటిపండు లేదా పపాయ, ఆరంజ్ ఇవి మూడు చాల బాగుంటాయి, ఈ మూడింటిలో ఒక ఫ్రూట్ పల్ప్ ని తీసుకొని దానికి హప్ టీ స్పూన్ తేనె కలపాలి, విటమిన్E క్యాప్సూల్ తీసుకొని కట్ చేసి దాంట్లోని ఆయిల్ ని తీసుకొని వీటన్నింటిని బాగా కలిపి ముఖానికి అప్లై చేసి 30 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లు తో కడిగేయండి, మీకు చక్కటి నిగారింపు తెలుస్తుంది. మీరు పార్లర్ కి కూడా వెళ్లాల్సిన అవసరం ఉండదు. 

Juice-Beauty-tips-telugu-health-tips-telugu
(Juice) జ్యూస్ 

కొన్ని మార్పులు డైట్ లో  :

ఈ పేస్ పాక్స్ ఒక్కటే కాకుండా మీరు పాటించవల్సింది మంచి డైట్, ఆరోగ్యకరమైన మంచి ఆహరం తీసుకోవాలి, మరియు వాటర్ బాగా త్రాగాలి, అది ముఖానికి, బాడీ కి మంచి గ్లో ని ఇస్తుంది. 
ఒక జ్యూస్ ( సూపర్ స్కిన్ జ్యూస్ ) :- ఒక కారట్, హప్ బీట్రూట్, ఒక టమాటో, ఒక ఉసిరికాయ, మూడు పాలకూర ఆకులు, కొంచెం కొత్తిమీర మరియు నాలుగు కరివేపాకు ఆకులు ఇవన్నీ గ్లాసు వాటర్ తో బాగా గ్రైండ్ చేయాలి, ఇది రోజు బ్రేక్ పాస్ట్  తర్వాత తీసుకోవాలి. ఈ జ్యూస్ లో రిచ్ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, ఈ జ్యూస్ తీసుకోడం వలన మన బాడీ లో ఉన్న అదనపు క్రొవ్వు, టాక్సిన్స్ బయటకి వెళ్లడం జరుగుతుంది, దానివల్ల చర్మం అందంగా, ఆరోగ్యాంగా ఉంటుంది. 

Natural-food-health-tips-telugu
సహజసిద్ధ ఆహరం (Natural food)

లైఫ్ స్టైల్ లో మార్పులు :

మొదటగా ఆహరం, సహజసిద్దంగా లభించే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి, మైదా, షుగర్ ఇలాంటివన్నీ తీసుకోవడం తగ్గించాలి. ఎందుకంటే ఇందులో గ్లైసీనిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది, వీటివల్ల హార్మోనల్ ఇంబాలన్స్ అవుతుంది. కూల్ డ్రిక్స్ కూడా తక్కువగా తీసుకోవాలి, వాటర్ ఎక్కువగా త్రాగాలి. మనకు నిద్ర అనేది చాలా ముఖ్యం, నిద్ర అనేది మనకు దాదాపుగా 8 గంటలు ఉండాలి, ఎందుకంటే నిద్రలోనే మన బాడీలో గ్రోత్ హార్మోన్ అనేది విడుదల అవడం జరుగుతుంది, దీనివల్ల మన స్కిన్ అనేది హెల్త్య్ గా ఉంటుంది. 
Exercise-health-tips-telugu-bealty-tips-telugu
వ్యాయామం (Exercise)

అంతేకాకుండా మెంటల్లీ, ఫిజికల్లీ( మానసికంగా, శారీరకంగా ) మంచి ఆరోగ్యాన్ని మెయింటేన్ చేయాలి. మానసికంగా ఫిట్ గా లేకపోయినా, శారీరకంగా ఫిట్ గా లేకపోయినా ఆటోమెటిక్ గా దాని ప్రభావం మన ముఖంలో కనిపిస్తుంది. కాబట్టి మానసికంగా, శారీరకంగా మంచి ఆరోగ్యాంగా ఉండటానికి ప్రయత్నించాలి. మరియు ముక్యంగా ఎప్పుడు నవ్వుతూ స్మైలీ పేస్ తో హ్యాపీ గా ఉండాలి, ఎప్పుడైతే బాగా నవ్వుతూ స్మైలీ పేస్ తో ఉండటం వలన మన ముఖంలో మంచి గ్లో రిప్లెక్ట్ అవుతుంది. అందం అనేది మనలోని ఆత్మవిశ్వసాన్ని పెంచుతుంది. చక్కగా ఉండండి, హ్యాపీగా ఉండండి, మన Health Tips Telugu ని  ఫాలో అవుతూ ఉండండి మీ కోసం మంచి మంచి బ్యూటీ టిప్స్ ని తెలియజేస్తూ ఉంటాము. ఏమైనా సందేహాలు లేదా సలహాలు తెలియజేయాలి అని అనుకుంటే ఈ పోస్ట్ క్రింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. 

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

ADVERTISEMENT