Type Here to Get Search Results !

Translate

ADVERTISEMENT

How to overcome shyness(సిగ్గుని ఎలా అధిగమించాలి) | communication skills లోని ఈ techniques తో పూర్తిగా మారిపోతారు.

How to overcome shyness సిగ్గుని ఎలా అధిగమించాలి

How to overcome shyness ఎవరు లేనప్పుడు బాగానే ఉండే మనం ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పడుతూవుంటాం. మొహమాటం పడటం, సిగ్గు అనేది మనలో ఉన్న ఒక సమస్య. ఎక్కడికైనా పంక్షన్ కి వెళ్ళినప్పుడు ఎవరితోనూ ఏమి మాట్లాడం. అసలు ముందు మనం ఎందుకు మాట్లాడాల్లే అని అనుకుంటాం. తర్వాత ఇంటికి వెళ్ళాక మనం కొంచెం మాట్లాడాల్సింది, అందరు బాగానే మాట్లాడుతున్నారు, నేనెందుకు ఇలా చేశాను అని ఫీల్ అవుతాం. అందుకే మీలో ఎవరైనా ఇలా ఆలోచించేవాళ్ళు, సిగ్గు ఎక్కువ పడేవాళ్ళు ఉంటె బయపడకండి మీరు ఒంటరి కాదు. చాలా మంది ఈ లిస్ట్ లో ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నాను. 

How to overcome shyness సిగ్గుని ఎలా అధిగమించాలి
 Shyness

ఈ సిగ్గుని, మొహమాటాన్ని బ్రేక్ చేయడానికి, నలుగురిలో ఫ్రీగా మనం మాట్లాడ్డానికి ముందు మనం ఎం చేయాలి. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ సిగ్గు, మొహమాటాన్ని ఇప్పుడు బ్రేక్ చేసేద్దాం. ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. 

బేసిగ్గా అసలు సిగ్గు పోవాలి, మనము యాక్టివ్ గా ఉండాలి అంటే మనం చేయాల్సిన ముందు పని ఏంటి అంటే విల్లింగ్ నెస్ టు చేంజ్ మనం ఎక్కువమందితో మాట్లాడాలి, నేను కొంచెం అవుట్ స్పోకెన్ అవ్వాలి అనే ఐడియా మిలో ఉంటె ముందు మీకు మీరు వేసుకోవాల్సిన ప్రశ్న హౌ విల్లింగ్ యువర్ టు ఓవవర్ కమ్ సైనెస్. అయితే మీరందరు తప్పకుండా ఈ సిగ్గుని ఎదుర్కోవాలి అని ఆలోచనతో ఉన్నారు. 

డోంట్ థింక్ అబౌట్ యువర్ వీక్నెస్, ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంత్స్.  

మీరు ఇప్పుడు ఒక ఫంక్షన్ కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నో ప్లాన్స్ వేశారు. కానీ మనకి వెళ్లక తప్పడం లేదు. ఇప్పుడు ఎం చేస్తారు.? మనవల్ల కాదు ఎవడ్నో ఒకడ్ని వేసుకెళ్లి వాడితో కబుర్లు చెప్తూ కూర్చుందామనే ఐడియా ని పక్కన పెట్టేయండి. ముందుగా మనం అలాంటి సోషలైజ్ అయ్యే ప్లేస్ లలో కొంతమందిని చూస్తూ ఉంటాం. వారి గురించి ఒకసారి ఆలోచించండి. మరి ఎక్కువగా నవ్వుతు ఆవసారనికన్నా వీళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటివారు టెంపరరీగా జనాల్ని ఎంగేజ్ చేయొచ్చు కానీ తర్వాత జనాలు అతని దగ్గరకు వెళ్ళడానికి భయపడతారు. అమ్మో వీడు మళ్ళి వస్తున్నాడని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతారు. దాని వెనకాల ఉన్న రీజన్ ఫేక్నెస్. జనాలు ఊరికెనే ఈ ఫేక్నెస్ ని పసిగట్టేస్తారు. అందుకనే ముందు మీరు ఇలాంటి ఫేక్నెస్ ని పక్కన పెట్టేయండి. నవ్వు రాకపోయినా పెద్దగా నవ్వడం, అనవసరమైనదానికి కూడా ఎక్కువగా సర్ప్రైజ్ అవ్వడం. ఎలాంటి ఓవర్ ఎక్స్ ప్రెషన్స్ పెట్టకూడదు. మనం లేనివేమీ తెచ్చుకోనక్కరలేదు. అందుకే ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంత్స్. 

               ఓకే ఫేక్ గా ఉండకూడదు నెక్స్ట్ ఏమిటి.!

ఈ మధ్యకాలంలో నేను ఒక ఈవెంట్ కి వెళ్లాల్సిన పని పడింది. ఆ ఈవెంట్ కి నేను వెళ్లకతప్పదు. మానకూడదు అని కూడా బలంగా అనుకున్నాను. కానీ ఈ ఈవెంట్ లో నేను ఎం చేయాలి అనేదాని గురించి బాగా ఆలోచిస్తే నాకు ఒక 3 ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే చాలు అనిపించింది. అదేంటంటే

1. మంచి ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఇవ్వాలి.?

2. నేను అసలు ఎవరితో మాట్లాడాలి.?

3. అసలు వాళ్ళతో నేనేమి మాట్లాడాలి.?

                మనకి ఈ మూడు ప్రశ్నలకి సమాధానం తెలిస్తే చాలు, ఎలాంటి ఈవెంట్ లో అయినా మనమే హైలెట్ అవుతాము, మాగ్నెటిక్ పర్సన్ గా మారతాము.

1. మంచి ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఇవ్వాలి. 

మనం ఎన్నో ఫంక్షన్స్ లో లేదా ఈవెంట్స్ లో కొంతమంది స్పీచ్ లు వింటూ ఉంటాం. వాళ్ళు మాట్లాడ్డం మొదలు పెట్టాక జస్ట్ వాళ్ళను ఆలా చూస్తూ ఉండిపోతాం. అంత మాగ్నెటిక్ గా కొంతమంది మాట్లాడతారు. అది వాళ్లకు చిన్నప్పటినుంచి ఉన్న టాలెంట్ ఏమీ కాదు, అది వాళ్ళు ప్రాక్టీస్ తోనే నేర్చుకున్నారు. మరి మనం వాళ్ళలాగా విన్నర్ లాగా ఎలా పోశ్చర్ ఇవ్వాలి, ఎలాగా ఆ విన్నర్ యాట్యుట్యూడ్ ని తెచ్చుకోవాలి, ఎలాగా మనం అది మాట్లాడాలి. 

ట్రిబుల్ థ్రెట్ అంటే హాండ్స్, పోశ్చర్ మరియు ఐకాంటాక్ట్ ఈ మూడింటిని మనం సరిగ్గా మెయిన్ టైన్ చేస్తే మనం ది బెస్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇవ్వొచ్చు. 

  • ముందుగా హాండ్స్ 

చేతులు ఎప్పుడు ఎక్కువగా ఓపెన్ గా ఉండాలి. వాటిని దాచేయకూడదు. అంటే మీ జేబులో చేతులు పెట్టుకోవడం, చేతులు పట్టుకోవడం ఇలాంటివి చేయకూడదు. అందుకే గుర్తుంచుకోండి చేతులు ఓపెన్ గా మీరు మాట్లాడుతున్న వ్యక్తికి కనిపించేలా ఉండాలి. 

  • రెండవది పోశ్చర్ 

మన పోశ్చర్ లో ఇతరులకి కాన్ఫిడెన్స్ కనపడాలి, అంతేకాని భయం, బెరుకు, బాధ ఇలాంటివి వేరేవి కనపడకూడదు. జనాలు కూడా ఎవరైతే ఎక్కువగా కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ తో ఉంటారో వాళ్లనే ఎక్కువగా ఇష్టపడతారు.  దీనికి గాను మనం ఒక పోశ్చర్ ని నేర్చుకోవచ్చు. దాన్ని మనం ప్రాక్టీస్ చేయవచ్చు. ఎలా అంటే మీ సోల్డర్స్ ని అంటే మీ భుజాల్ని కొంచెం వెనక్కి వంచి కిందకి వదిలేయండి. మీ చిన్ మరియు చెస్ట్ ని స్ట్రైట్ గా కొంచెం ముందుకు వంచండి. మీ చేతులని మీ బాడీకి టచ్ ఇవ్వనివ్వకుండా కొంచెం దగ్గరగా ఉంచండి. దీన్ని ది లాంచ్ స్టాండ్ అని అంటారు. ఈ స్టాండ్స్ ని కొంచెం ప్రాక్టీస్ చేయండి. అద్దం ముందు నించొని ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ కి మీరు కేరాఫ్ అడ్రస్ అయిపోతారు. 

  • మూడవది ఐకాంటాక్ట్ 

ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ ట్రస్ట్ ని మనం గైన్ చేసుకోవాలి. ఇది అతి ముఖ్యమైనది. ఈ ట్రస్ట్ గైన్ చేసుకోవడానికి మనకి బాగా ఉపయోగపడేది ఐకాంటాక్ట్. అందులోను ముఖ్యంగా మనం ఆపోజిట్ జండర్ వాళ్ళతో మాట్లాడుతున్నపుడు ఈ ఐకాంటాక్ట్ చాలా చాలా ముఖ్యం. చాలా మంది బాడీ లాంగ్వేజ్ ఎక్స్ ఫర్ట్స్ ఎం చెప్తారంటే మీరు ఎవరితోనైనా కొంచెం కనెక్ట్ అవ్వాలి అనుకుంటే మీరు వాళ్ళతో మాట్లాడే సమయంలో 60-70% ఐకాంటాక్ట్ మెయిన్ టైన్ చేయాలి. అప్పుడు వాళ్ళు తప్పకుండా మీతో కనెక్ట్ అవుతారు. అలాగే సైన్స్ కూడా ఎం చెప్తుంది అంటే ఇలా 60-70% మనం ఐకాంటాక్ట్ లో ఉంటె ఎదుటివారిలో ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. ఇది ట్రస్ట్ మరియు బాండింగ్ పెరగడానికి ఉపయోగపడే హార్మోన్. అందువలన మన చేతులు ఓపెన్ గా ఉండాలి, మన పోశ్చర్ లో కాన్ఫిడెంన్స్ ఉండాలి. అలాగే మనం మాట్లాడే సమయంలో 60-70% టైం, ఐకాంటాక్ట్ మెయిన్ టైన్ చేయాలి. 

             ఈ టిప్ తో దాదాపుగా మనకు ఎలా ఉండాలి అనే ఐడియా పూర్తిగా వచ్చేసింది. మరి నెక్స్ట్ ఏంటి.? 

మనము మాట్లాడాలి ఇది చాలా ఇంపార్టెంట్. దానికన్నా ముందు మనం ఎవరితో మాట్లాడాలి.? 

2. నేను అసలు ఎవరితో మాట్లాడాలి.?

నేను వెళ్లిన ఒక ఈవెంట్ లో ఎం చేసానంటే కొంచెం జనాలకి దూరం గా ఉన్నాను. అప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు. సరే ఇలా కాదని మధ్యలోకి వెళ్లి నిలబడ్డాను. అయిన పెద్ద తేడా లేదు. ఈ సారి ఎవరో గ్రూప్ మాట్లాడుతుంటే నేను మధ్యలో వెళ్లి ఎస్ ఎస్ హి ఇస్ రైట్ అన్నాను. ఆ గ్రూప్ కిందనుంచి పైకి ఒక లుక్ వేశారు. అందువలన ఇలాంటి ఒక ఇబ్బందికరమైన సిట్యువేషన్ ని హ్యాండిల్ చేయాలంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఎవరితో పడితే వారితో మనం మాట్లాడాల్సిన అవసరం ఏమి లేదు.  ఎవరొచ్చినా మాట్లాడేస్తా అని ముందే డిసైడ్ అయిపోకండి. అందుకే ఎవరితో మాట్లాడాలి అనేది కంప్లీట్ గా మీ డెసిషన్. ఎందుకంటే మనం అందరికి నచ్చేయాలనే ఆలోచన ఉండకూడదు ఎందుకంటే అది జరగదు కూడా. కాబట్టి ఎవరైతే మీ మాటలు వినడానికి, అలాగే మీరు ఎవరి మాటలు అయితే వినడానికి కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారో అలాంటి వాళ్ళను మీరు సెలెక్ట్ చేసుకొని వాళ్ళతోనే మాట్లాడండి. 

                      ఉదాహరణకి: వెణీష అనే ఒక యూట్యూబర్ ఆవిడ వీడియోలు చూసే ఒకతను మీ టాపిక్ కంటెంట్ బాగానే ఉంది, కానీ మీరు వేసుకునే డ్రెస్ ప్రొఫెషనల్ గా లేదు. ఎదో క్యాజువల్ గా ఉన్నారు అని అతను కామెంట్ చేసాడు. అప్పుడు వెణీష ఆ వీడియోని  మల్లి రీషూట్ చేయాలి అని అనుకుంది. కానీ కొన్నిరోజులు చూద్దాం అని అలా వదిలేసింది. ఆ కొన్ని రోజుల్లోనే ఆ వీడియో కి, ఆవిడ ఛానల్ కి బాగా ట్రాఫిక్ పెరిగింది. అప్పుడు ఆవిడకి అర్ధం అయింది ఏంటంటే తన క్యాజువల్ డ్రెస్ ఎక్కువమందికి నచ్చింది. ఎవరో ఒకరు మాత్రమే ఆ కామెంట్ చేసారు. కాబట్టి ఎక్కువమందికి నచ్చేవిదంగా అంటే ఆవిడకి నచ్చేవిదంగా ఉంటేనే బెటర్ అని అనుకుంది. అంతే చాలా పాపులర్ అయింది. కాబట్టి మనం కూడా ఎవర్నో ప్లీజ్ చేయాలి ఇలాంటివి పక్కనపెట్టేయండి. మీరు ఎవరితోనైతే మాట్లాడదామని అనుకుంటున్నారో వాళ్ళతోనే మాట్లాడండి. ఇందాక చెప్పిన మ్యాటర్ గుర్తుంది కదా మీ హాండ్స్, పోశ్చర్ మరియు ఐకాంటాక్ట్ ఈ మూడు సరిగ్గా ఉంటె చాలు మీరు ఇక ఆలోచించాల్సిన పనేమీ లేదు. 

అలాగే ఇక్కడ మీరు ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు. ఈ పాయింట్ ని కొంచెం జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. కొంతమంది మాట్లాడ్డానికి ఇష్టపడరు. వాళ్ళ బిహేవియర్ వాళ్ళు ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ ని బట్టి మనం చెప్పేయొచ్చు. కాబట్టి దాదాపుగా వాళ్ళను అవైడ్ చేసేయొచ్చు. కొంతమంది మాట్లాడ్డానికి ఓపెన్ గా ఉంటారు. వాళ్ళను గుర్తించండి. అలాగే ఎప్పుడు అందరికి దూరం గా ఉండకండి. అసలు మీకు ఎవరితోను మాట్లాడ్డం ఇంట్రెస్ట్ లేదు అని జనాలు అనుకుంటారు. జనాలకు దగ్గరలోనే ఉండండి. అలాగే మీరు మాట్లాడాలి అని అనుకుంటున్న అతను లేదా ఆమెను ఎలా గుర్తించాలి. దీనికోసం మనం ఎం చేయాలంటే ఇప్పుడు అక్కడ ఏమైనా బఫె స్టైల్ లో ఏమైనా భోజనాలు జరుగుతున్నాయనుకోండి లేదా డ్రింక్స్ లో ఎవరైన ఉన్నారనుకోండి అందులో ఎవరైతే ఒక్కళ్ళే తింటున్నారో వాళ్ళను అబ్జర్వ్ చేయండి. ఎవరైనా సరే ఒక్కళ్ళే ఉన్నారంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గరకు వెళ్లి ముందు మిమ్మల్ని మీరు ఇంట్రుడూస్ చేసుకోండి. వాళ్ళను కూడా అడగండి ఎక్కడినుంచి వచ్చారు, ఎం చేస్తూ ఉంటారు ఇలా వాళ్ళతో మాట్లాడండి. ఎందుకంటే ఎవరైతే ఒంటరిగా భోజనం చేస్తూ ఉంటారో వాళ్ళు మాట్లాడ్డానికి ఇష్టపడతారు. ఇలా గనుక మనం చేస్తే మన కంఫర్ట్ జోన్ లోనే మన జనాలతో ఈజీగా మాట్లాడేయొచ్చు. 

3. అసలు వాళ్ళతో నేనేమి మాట్లాడాలి.?

చల్లగా ఒక వెన్నెల ఐస్క్రీమ్ తినాలని ఒకసారి నేను బయటకి వచ్చాను. మంచి ఐస్క్రీమ్ షాప్ కనపడింది అందులోకి వెళ్ళాను. ఒక వెన్నెల ఐస్క్రీమ్ కావాలని అడిగాను. దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేయమంటారా బాగుంటుంది అని అన్నాడు. సరే కొంచెం వేయండి అన్నాను. అలాగే ఒక చాకొలేట్ ప్లేవర్ స్పూప్ కూడా వేస్తాను బాగుంటుంది అన్నాడు. ఓకే అదికూడా కలపండి అన్నాను. తర్వాత కొంచెం చాకొలేట్ సిరప్ కూడా వేసాడు. కొన్ని వేపర్స్ ని పీసెస్ గా చేసి ఐస్క్రీమ్ లో కలిపాడు. ఆ తర్వాత ఆ ఐస్క్రీమ్ తింటుంటే స్విట్జర్లాండ్ ఈ ఐస్క్రీమ్ బార్లల్లోనే ఉంది అని అనిపించింది. ఈ స్టోరీ వింటున్న సమయంలో ఎవ్వరికైనా ఐస్క్రీమ్ తినాలి అని గాని, ఐస్క్రీమ్ టేస్ట్ చేయాలనీ గాని అనిపించిందా... ఒకవేళ అనిపిస్తే దాన్నే న్యూరల్ కపిలింగ్ అని అంటారు. అంటే ఏమి తినకుండా, ఎక్కడికి వెళ్లకుండానే కేవలం ఇమాజినేషన్ లో ఊహించుకుంటూ ఫీల్ అవడం. ఇది ప్రతి మనిషికి జరిగేదే. ఇలా జరగడానికి మెయిన్ రీసన్ స్టోరీ. ఏ మనిషికైనా ఒక కధని చెప్తున్నప్పుడు ఆటోమేటిక్ గా దాన్ని ఇమాజినేషన్ లో చూడటం మనుషులకు ఉన్న ఒక అలవాటు. మీరు ఏదైతే కధ చెప్తున్నారో ఆ కధతో అతను ఎంగేజ్ అవుతూ ఉంటాడు. అతను ఊహించుకుంటూ ఉంటాడు. ఇది ని కధ ఎంత బాగుంటే అంత బాగా అతని ఇమాజినేషన్ ఉంటుంది. మీరు ఎక్కడైనా ఎం మాట్లాడతాంరా బాబు అనే ఆలోచనతో జనాల్ని అవైడ్ చేయాలి అనుకుంటే ఇది గుర్తు పెట్టుకోవాలి. జనాలకి కధలు వినడం  అంటే చాలా ఇష్టం. 

మరి  నేనేమి కధ  చెప్పాలని ఆలోచిస్తున్నారా మొత్తం మనం మూడు రకాల కధలు చెప్పొచ్చు. అవేంటంటే...

1) ట్రిగర్ టాపిక్స్ 

ప్రస్తుతం ఏదైనా న్యూస్ గురించో లేదా వెథర్ గురించో ఇప్పుడు జరుగుతున్న క్రికెట్ గురించో మాట్లాడొచ్చు. అంటే ఆ సమయానికి ఉండే ఒక ట్రిగర్ టాపిక్ ని సెలెక్ట్ చేసుకొని దాని గురించి మాట్లాడటం. 

2) స్పార్కింగ్ స్టోరీస్ 

ఇది ట్రిగర్ టాపిక్ కన్నా కొంచెం డెప్త్ ఉండే సబ్జెక్టు. మీ లైఫ్ లో జరిగిన ఇన్సుడెంట్స్, మీరు చూసిన ఒక ఇన్సుడెంట్, మీకు నచ్చిన ఒక ఇన్సుడెంట్ ఇలాంటివి చెప్పాలి. అంటే వినేవాళ్ళకి ఒక ఎమోషన్ ఉండేలాగా ఆ కధ ఉండాలి. నవ్వు రావడం, ఏడ్పు రావడం, ఆలోచింపచేయడం ఇలాంటి ఒక ఎమోషన్ ని ఈ డెప్త్ ఉండే స్టోరీ తో చెప్పాలి.

3) బూమరాంగ్స్ 

పేరులో  ఉన్నట్లే మీరు మాట్లాడిన మాటతో ఎదుటివారు మీతో మాట్లాడాలి. అంటే ఏదైనా టాపిక్ చెప్పి దాని మీద అతన్ని ఒక ప్రశ్న అడగటం. ఉదాహరణకి : మీరు ఎదో ప్లేస్ కి వెళ్లారు, ఆ ఊరు చాలా బాగుందని చెప్పి మీరు ఏమైనా రీసెంట్ గా ట్రిప్స్ కి వెళ్ళారా అని అడగొచ్చు. అప్పుడు ఎదుటివారికి మీరు మాట్లాడ్డానికి ఒక టాపిక్ ఇచ్చినట్టు ఉంటుంది. అతనికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. నెనైతే పర్సనల్ గా చాలా సార్లు ఈ బూమరాంగ్ కాన్సెప్ట్ ని యూజ్ చేశాను. దానివల్ల మనం కధ చెప్పవచ్చు, ఎదుటివారిని ఒక ప్రశ్న అడిగి మన కన్వర్జేషన్ లో ఇన్వాల్వ్ కూడా చేయొచ్చు. ఇలాంటి స్టోరీ కాన్సెప్ట్స్ ని సెలెక్ట్ చేసుకొండి. అంతేకాదు ఈ స్టోరీలను మీరు రెడీగా  పెట్టుకోండి. కొన్ని సెట్ అఫ్ స్టోరీలని టాగ్ చేసి గుర్తుంచుకోండి. ఇలాంటి ఈవెంట్స్ లలో లేదా పంక్షన్స్ లలో మీకు బాగా ఉపయోగపడతాయి. 

Total Important Points

  • ఎలాంటి ఈవెంట్ కి  వెళ్లిన మనం అనవసరమైన వీక్నెస్ ని చూపించకూడదు. మన స్ట్రెంత్ మీద ద్రుష్టి పెట్టాలి కానీ వీక్నెస్ మీద కాదు. 
  • నీ ఫస్ట్ ఇంప్రెషన్ బాగుండాలంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ట్రిపుల్ థ్రెట్. 
  • హాండ్స్ ఇవి ఫ్రీగా మాట్లాడుతున్న వ్యక్తికి కనపడేలాగా ఉండాలి.
  • పోశ్చర్ భుజాలు కొంచెం వెనక్కి అనుకోని కిందకి వదిలి మీ చిన్ మరియు చెస్ట్ స్ట్రైట్ గా  ముందుకు ఉండేలా చూసుకోవాలి. అలాగే మీ హాండ్స్ ఇక్కడ మీ బాడీకి తగలకుండా దగ్గరగా ఉండేలా చూసుకోండి. 
  • ఐకాంటాక్ట్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి తో ఐకాంటాక్ట్ కనీసం 60-70% మెయిన్ టైన్ చేయాలి. అప్పుడే అవతలి వ్యక్త్తికి మీకు బాండింగ్  ఏర్పడుతుంది.
  • చివరగా మనం  మాట్లాడేది ఏదైనా ఒక స్టోరీ పామ్ లో ఉంటె వినేవారు ఎక్కువగా ఎంగేజ్ అవుతారు. దానికి గాను మనం ట్రిగర్ టాపిక్స్ అంటే అప్పుడే ఏదైనా న్యూస్ గురించి మాట్లాడటం, కరెంట్ ఎఫైర్స్ గురించి మాట్లాడటం చేయాలి. 
  • స్పార్కింగ్ స్టోరీస్ కొంచెం డెప్త్ ఉండే ఎదుటివారిలో ఎమోషన్స్ ని లేపే కధలు చెప్పడం. 
  • బూమరాంగ్స్ అంటే మనం చెప్పే కధలో ఒక ప్రశ్న ని ఉంచి ఎదుటివారిని మాట్లాడేటట్లు చేయడం. 

ఇలా చేస్తే మీరు మీ సిగ్గుని పక్కన పడేసి కొంచెం ఓపెన్ గా జనాలతో కలుస్తారు. అలాగే ఈ ఆర్టికల్ లోని పాయింట్స్ ని ఒకసారి మల్లి చదివి ఆ పాయింట్స్ ని ప్రాక్టీస్ చేయండి. లాంచ్ స్టాండ్స్ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. మీ స్టోరీస్ అన్నింటిని అప్పుడప్పుడు మీ మైండ్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇలా చేస్తే మీరింకా ఎప్పటికి రెడీగా ఉంటారు. సిగ్గులు, మొహమాటాలు లేకుండా మీ లోలోపల దాగి ఉన్న ఆ బెస్ట్ కమ్యూనికేటర్ ని బయటకి తీస్తారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

ADVERTISEMENT