How to Breathe properly, The correct way to Breathe, శ్వాస తీసుకునే సరైన పద్ధతిThe correct way to Breathe
మనం ఎం తిన్నా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత మంచి జీన్స్ మనకు ఉన్నా, ఎంత సన్నగా ఉన్నా, ఎంత లావుగా ఉన్నా, ఎంత పిట్ గా ఉన్నా కూడా మనం గనుక సరిగ్గా బ్రీతింగ్ అంటే సరిగ్గా శ్వాస తీసుకోకపోతే అనేది మనకు లేకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నవి ఏవి కూడా మనకు ఉపయోగపడవు. అది నేను చెప్పడం లేదు, కొంతమంది రిచేర్చేస్ చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ది మిస్సింగ్ కిల్లర్ ఇన్ అవర్ హెల్త్ ఈజ్ బ్రీతింగ్. ఇదే ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. కొంతమంది సైన్టిస్టులు బ్రీతింగ్ మీద ఎక్స్ పెరిమెంట్స్, అనేక రకాల టెస్ట్ లు చేసాక ఎం తెలుసుకున్నారంటే హ్యూమన్ ఏవేల్యూషన్ మొదలయ్యాక ఇప్పటికి మన బ్రీతింగ్ కెపాసిటీలో చాలా దారుణమైన మార్పులు వచ్చాయి అని.
ఈ శాస్త్రవేత్తలు ఏమంటారంటే ప్రపంచంలోని 90% మంది నేను, మీరు, మనందరం ఊపిరి రాంగ్ గా పీలుస్తున్నామని. మరియు ఇది ఎన్నో రకాల డిసీజెస్, హెల్త్ ప్రొబ్లెమ్స్ ని తీసుకువస్తుంది అని. అసలు ఉపిరితీసుకోవడం కూడా నేర్చుకోవాల అని మీలో చాలా మందికి అనిపించొచ్చు, ఊపిరి సరిగ్గా పీల్చడం నేర్చుకుంటే చాలు ఆరోగ్యంగా బ్రతికేయొచ్చు. ఇది చాలా కష్టం అని కూడా కాదు, ఈ ఆర్టికల్ చదివిన తర్వాత మీరు తీసుకునే మొట్టమొదటి ఊపిరి పర్ఫెక్ట్ బ్రీతింగ్ అవుతుంది. ఈ ఆర్టికల్ లో బ్రీతింగ్ పరంగా మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం. ఎందుకు బ్రీతింగ్ సరిగ్గా ఉండాలి. ఆ సరైన బ్రీతింగ్ అసలు ఏంటి, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.
1. సరిగ్గా శ్వాస తీసుకోవడం
సరిగ్గా శ్వాస తీసుకోవడం అనేది ఎంతగానో ముఖ్యమైన విషయం. కానీ ప్రస్తుతం జనాలు దీన్ని అసలు పట్టించుకోవడం లేదు. మనిషికి ఉండే పని వత్తిడి బాడ్ లైఫ్ స్టైల్ హబిట్స్, అన్ హెల్త్య్ డైట్, పొల్యూషన్ సరౌండింగ్స్ వల్ల శ్వాసమీద ధ్యాస పెట్టడం మనం మానేస్తున్నాం. దీనివల్ల మనకి బద్ధకం, అధిక బరువు శ్వాస మరియు గుండెకి సంబంచించిన వ్యాధులు వస్తున్నాయి. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే ఎంత ఎక్కువ బ్రీతింగ్ చేస్తే అంత ఆరోగ్యం అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఎంత తక్కువ బ్రీతింగ్ చేస్తే అంత మంచిది. ఎక్కువశాతం మంది వాళ్లకు కావాల్సిన దాని కంటే ఎక్కువ ఆక్సిజన్ ని పీల్చుకుంటున్నారు. ఇది క్రానిక్ ఓవర్ బ్రీతింగ్ కి దారితీస్తుంది. ఈ ఒవెర్ బ్రీతింగ్ అంటే ఏంటి మనం కూడా ఇది చేస్తున్నామా, ఎలా తెలుసుకోవాలి అని మీరు గనుక అనుకుంటే ఈ పాయింట్ చదవండి.
- నోటితో గాలి పీల్చినా
- గురక పెట్టినా
- అప్పర్ చెస్ట్ వరకే బ్రీతింగ్ తీసుకున్నా
ఓవర్ బ్రీతింగ్ పార్టీ లో మనం కూడా సభ్యులమే. ఈ ఓవర్ బ్రీతింగ్ మనిషికి ఎన్నో సమస్యలు తెచ్చిపెడుతుంది. కానీ ఎందుకు ఓవర్ బ్రీతింగ్ జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మన బ్లడ్ లోనే హిమోగ్లోబిన్ ఆక్షిజన్ ని బాడీ మొత్తం డిస్టిబ్యూట్ చేస్తుంది. కానీ హిమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ మన మజిల్స్ కి మన బాడీ లోని వేరే ఆర్గాన్స్ కి వెళ్లాలంటే ఇమోగ్లోబిన్ కి కార్బండైఆక్సాయిడ్ కావాలి. కార్బండైఆక్సాయిడ్ హిమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ ని రిలీజ్ చేయగలదు. మన భూమి మరియు మన శరీరం లో ఒక అన్రీడెడ్ లా ఉంది అది ఏంటంటే ఏదైనా సరే బాలన్సుడ్ గా ఉండాలి. బాడీ లో ఆక్షిజన్ ఉండాలి అంటే మనకి కార్బండైఆక్సాయిడ్ కూడా ఉండాలి. ఆక్సిజన్ ఎక్కువైతే కార్బండైఆక్సాయిడ్ తగ్గుతుంది. కార్బండైఆక్సాయిడ్ పెరిగితే ఆక్షిజన్ తగ్గుతుంది. బాడీ లో కార్బండైఆక్సాయిడ్ ఉంటేనే ఆక్సిజన్ డిస్టిబ్యూషన్ అనేది జరుగుతుంది. కానీ ఓవర్ బ్రీతింగ్ వల్ల అంటే ఎక్కువ ఆక్షిజన్ నోటితో తీసుకోవడం వల్ల మన బాడీ లోని కార్బండైఆక్సాయిడ్ ని మొత్తం మనం ఫ్లెష్ అవుట్ చేసేస్తున్నాం. దీని వల్ల హిమోగ్లోబిన్ ఆక్సిజన్ ని మన మజిల్స్ ఆర్గాన్స్ కి సరిగ్గా డిస్టిబ్యూట్ చేయలేకపోతుంది. ఈ కండిషన్ నే హైపోకాప్నియా అంటారు. అంటే మన బాడీ లో ఉండాల్సిన బాలన్స్ లో ఆక్షిజన్ ఎక్కువ ఉంది, కార్బండైఆక్సాయిడ్ తక్కువగా ఉంది. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఆక్సిజన్ ఉంటె మంచిదే కదా అని కానీ హిమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ మన మజిల్స్ కి బాడీ ఆర్గాన్స్ కి వెళ్ళాలి అంటే కార్బండైఆక్సాయిడ్ కావాలి. కార్బండైఆక్సాయిడ్ లేకపోతె ఆక్సిజన్ హిమోగ్లోబిన్ లోనే ఉంటుంది బయటికి రాదు.
మన బాడీ లోని అన్ని ఆర్గాన్స్ కి సరైన ఆక్షిజన్ డిస్టిబ్యూషన్ జరగట్లేదు. ఇప్పుడు మనం చేయాల్సింది బాడీ లో బాలన్స్ తప్పిపోయిన ఈ సిస్టమ్ ని బాలన్స్ లోకి తీసుకురావడం.
దానికి ఉపయోగపడే మొట్టమొదటి ముఖ్యమైన టిప్1: Breathe through your nose ఊపిరి తీసుకోవడానికి మన శరీరంలోని ముఖ్యమైన నాచురల్ భాగం ముక్కు. పగలు, రాత్రి మాక్సిమం ముక్కుతోనే పీల్చుకునేటట్లు చూడండి. మనిషి నోటితో ఊపిరి ఓన్లీ ఏదైనా బాగా స్ట్రెస్ అయినప్పుడు, చాలా భయంగా అయినప్పుడు, ఏదైనా ఎమర్జెన్సీ లో ఉన్నపుడు, ఎక్కువ వర్కౌట్స్ చేస్తున్నప్పుడు నోటిని ఉపయోగిస్తారు. కానీ మనం ఎక్కువగా ముక్కుని గనుక ఉపయోగిస్తే మనసులో ఉండే స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. సాధారణంగా కోపం వచ్చినప్పుడు కొంచెం కాముగా ఉండురా, కొంచెం ఊపిరి పీల్చుకో అని అంటారు. ఇలా ఊపిరి ముక్కుతో పీల్చడం వల్ల మన ఫ్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ యాక్టీవేట్ అవుతుంది. అది మన హార్ట్ రేట్ ని తగ్గించి స్ట్రెస్ ని కంట్రోల్ చేస్తుంది. అలాగే వర్కౌట్స్ చేసే సమయంలో మనం నోటితో ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడం వల్ల బాడీ లోని కార్బండైఆక్సాయిడ్ లెవెల్స్ పడిపోతున్నాయి. దీనివల్ల మన మజిల్స్ రికవర్ అవడం కూడా కొంచెం కష్టం అవుతుంది. వర్కౌట్స్ చేసే సమయంలో కూడా నోస్ ని బ్రీతింగ్ కి ఉపయోగించాలి. కానీ ఇది మనం ఆలోచిస్తే అంత ఈజీ ఏమి కాదు. ప్రస్తుతం మనం అలవాటు పడిన లైఫ్ స్టైల్ కి ఇది చాలా చాలా కష్టం. కానీ ప్రాక్టీస్ తో మనం ఏదైనా ఎచ్ఛివ్ చేయొచ్చు. అందుకే ప్రాక్టీస్ చేయడం మర్చిపోకండి.
టిప్2: Practice abdominal breathing మన లంగ్స్ షేప్ ని మనం గనుక చూస్తే అప్పర్ పార్ట్ అఫ్ ద కొంచెం నారో గా అంటే కొంచెం తక్కువగా స్పేస్ ఉంటుంది. కింద పార్ట్ కొంచెం వైడ్ గా కొంచెం పెద్దగా ఉంటుంది. కానీ మనం ఎక్కువ శాతం అప్పర్ పార్ట్ వరకే ఊపిరి తీసుకుంటున్నాం. ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే అప్పర్ లోట్స్ కన్నా కూడా లోయర్ లోట్స్ దగ్గరే బ్లడ్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ శాతం ఆక్షిజన్ ఈ లోయర్ లోట్స్ దాక మనం పీల్చగలిగితే అది బ్లడ్ ఫ్లో లో కలవడానికి ఈజీ అవుతుంది. కానీ మనం షాలో బ్రీతింగ్ వలన అంటే పైపైన బ్రీతింగ్ వలన మనం ఆక్షిజన్ ని బ్లడ్ లోకి ట్రాన్స్ఫర్ చేసే చోట కూడా దాన్ని దెబ్బ తీస్తున్నాం. మరియు ఎవరైతే ఎక్కువ స్ట్రెస్ లో ఉంటారో, రకరకాల యాంగ్జైటిస్ ఉంటాయో వారి ఊపిరి తీసుకునే విధానం గనుక మనం చూస్తే వాళ్ళు కూడా అప్పర్ చెస్ట్ వరకే ఊపిరి తీసుకుంటారు. అందుకే ఈ సారి నుంచి ఎప్పుడు బ్రీత్ తీసుకున్న కొంచెం కాన్సెస్ గా, డీప్ గా, స్లో గా పొట్ట వరకు ఎబ్డోమినల్ వరకు పీల్చండి. అది కూడా చాలా క్యాజువల్ గా పీల్చేలా ప్రాక్టీస్ చేయండి.
తర్వాత ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ది ఎఫర్ట్ లెస్ బ్రీతింగ్ ఈ టెక్నిక్ యొక్క మూలాధారం ఇండియన్ యోగ. ఎందుకంటే ఎవరైతే యోగ, ధ్యానం లాంటి కాన్సెప్ట్స్ తీసుకు వచ్చారో వాళ్ళకి బ్రీతింగ్ మీద ఎవ్వరికి లేనంత జ్ఞానం ఉంది. అంతేకాదు ఈ మోడ్రెన్ లైఫ్ లో జనాల వ్యవహార శైలి మారింది కానీ ఒకప్పుడు వారందరు సరిగ్గానే ఊపిరి తీసుకునేవారు. మోడ్రెనైస్ అయ్యే క్రమంలో జనాలకి స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, యాంగ్జైటిస్ పెరిగిపోతున్నాయి. దీనివల్ల షాలో బ్రీతింగ్ కీ అలవాటుపడిపోతున్నారు. అందుకే ఎఫర్ట్ లెస్ బ్రీతింగ్ చేయాలి అంటే మీరు ఊపిరి కేవలం ముక్కు నుంచే తీసుకోవాలి. ఆ శ్వాశ కూడా పొట్టవరకే తీసుకోవాలి. అంటే పొట్ట కొంచెం ఫుల్ అయినట్లు ఊపిరి తీసుకోవాలి. అలాగే ఇక్కడ పొట్టవరకు ఊపిరి ఇన్ హెల్ చేసాక ఒకటి లేదా రెండు సెకండ్స్ పాజ్ చేసి అంటే ఊపిరి ఆపుకొని స్లోగా బయటికి వదలాలి. ఈ బ్రీతింగ్ కూడా నార్మల్ గా కన్నా కూడా చాలా తక్కువ సార్లు చేయడం మంచిది. ఈ బ్రీతింగ్ కూడా మనం కొంచెం తక్కువగా చేయాలి అలాగే ఒక రిధం లో చేయాలి. అంటే టోటల్ గా ఒక ఎఫర్ట్ లెస్ గా ఉండాలి. అంటే చాలా ఈజీ గా ఉండాలి.
ఇది మరి ఎలా కుదురుతుంది. దీని కోసం మీరు కొంచెం కాన్షియస్ గా బ్రీతింగ్ చేయాలి. అంటే మీరు ఇప్పుడిదాకా నోటితో పీల్చేస్తున్నారు అది మీకు తెలియకపోవచ్చు. కానీ మీరు కొంచెం కాన్షియస్ గా మీ ఊపిరి మీద ద్యాస పెట్టి స్లోగా ముక్కుతోనే డీప్ గా స్టమక్ వరకే ఆక్సిజన్ తీసుకోవడం ప్రాక్టీస్ చేయండి. గుర్తుంచుకోండి ఎఫర్ట్ లెస్ బ్రీతింగ్ అంటే మీ పక్కవాడికి కూడా తెలియకూడదు. అంత సైలెంట్ గా ఉండాలి. ముక్కు నుంచి పొట్టలోపల్కి బ్రీత్ తీసుకున్న కూడా బాడీ లో ఎలాంటి మూమెంట్ ఉండకూడదు. అది గుర్తుంచుకోండి. దీని వల్ల ఏమైవుతుందంటే బాడీ లో ఆక్సిజన్ మరియు కార్బండైఆక్సాయిడ్ బాలన్స్ ఉంటుంది.
2) మన బ్రీత్ ఎలా ఉంది
దీనికి ఒక టెస్ట్ ఉంది అదే బోల్ట్ స్కోర్ ( బాడీ ఆక్సిజన్ లెవెల్ టెస్టింగ్ స్కోర్ ). ఈ బోల్ట్ స్కోర్ ఎలా క్యాలుక్యులేట్ చేయాలంటే స్లోగా ఆక్సిజన్ తీసుకుని హోల్డ్ చేసి ముక్కుని రెండు ఫింగర్స్ తో క్లోజ్ చేయండి. ఇలా ఎన్ని సెకండ్స్ ఉండగలరో చూడండి. అంటే మీకు ఆక్సిజన్ తీసుకోవాలి అని పుస్ వచ్చేసినప్పుడు వెంటనే ఆ ముక్కును వదిలేయండి, ఆక్సిజన్ ని తీసుకోండి. ఇలా మీరు గనుక కనీసం 20 సెకండ్స్ ఉంటె ఓకే యావరేజ్ స్కోర్ అంటే ఒక ఎట్రీ లెవెల్ స్కోర్ మంచిదే అని అనుకోవచ్చు. కానీ ఈ స్కోర్ గనుక 30-40 సెకండ్స్ ఉంటె అది ఇంకా మంచి స్కోర్. 20 కన్నా తక్కువ ఉందంటే అది అంత మంచి స్కోర్ కాదు. మీకు ఊపిరి పీల్చాలి అని కోరిక లైట్ గా అనిపించినా వెంటనే వదిలేయండి. అది చాలా ముఖ్యం గుర్తుంచుకోండి.
3) How to sleep better ( బాగా నిద్రపోవడం ఎలా )
నైట్ సరిగ్గా నిద్ర పట్టకపోవడం, నిద్ర లేచాక కూడా చాలా లేజి గా ఉండటం, కాన్సంట్రేషన్ సరిగ్గా ఉండకపోవడం ఇప్పుడు ఇది ఒక ప్రాబ్లమ్ అయిపోయింది. కానీ ఇంత పెద్ద ప్రాబ్లమ్ కి సొల్యూషన్ చాలా సింపుల్ అదేంటంటే నోరుమూసుకుని నిద్రపోవడమే..! నిద్రపోయినప్పుడు మూసుకుని ఉండే నోరు నిద్రలో ఎప్పుడు ఓపెన్ చేస్తామో మనకు తెలియదు. దీనికి ఒక టెక్నిక్ ఉంది అది ఏంటంటే నిద్రపోయేముందు ఒక పేపర్ టేప్ నోటికి వేసుకొని అంటే లిప్స్ మీద అంటించుకొని నిద్రపోవడం. దీని వల్ల మీరు నోటి నుంచి ఇంహెల్ చేయడం తగ్గించేస్తారు. మరియు ఎక్కువగా ముక్కుతోనే ఊపిరి పిల్చుతారు. ఎప్పుడైతే ముక్కుతోనే బ్రీతింగ్ చేస్తారో మీకు చాలా మంచి నిద్ర వస్తుంది. మంచి నిద్ర అంటే మీ హెల్త్ కి మీ ప్రొడక్టివిటీ కి కూడా చాలా మంచిది. అలాగే ఇది చిన్నపిల్లలు, శ్వాస ఇబ్బంది ఉన్నవాళ్లు ట్రై చేయకూడదు. నార్మల్ హెల్త్ లో ఉన్నవాళ్లు మాత్రమే ట్రై చేయాలి.
ప్రస్తుతం మనిషి ఆరోగ్యం గా ఉండటం చాలా ముఖ్యం. అన్నిటి కన్నా ముఖ్యమైనది ఏంటంటే తన రెస్పెరేటరీ సిస్టం బాగుండటం.
- మనం ఊపిరి తీసుకోవడానికి నాచ్చురల్ గా ఉపయోగపడే ముక్కుకంటే కూడా నోటితోనే ఎక్కువగా ఊపిరి పీల్చుతున్నాం. అది ఓవర్ బ్రీతింగ్ కి దారి తీస్తుంది. కార్బండైఆక్సాయిడ్ తగ్గడం వల్ల ఆక్సిజన్ మన మజిల్స్ కి ఆర్గాన్స్ కి కావాల్సినంత ఇవ్వడం లేదు. అందుకే మన బాడీలో ఆక్సిజన్ మరియు కార్బండైఆక్సాయిడ్ లెవెల్స్ బాలన్స్ చేయాలి అంటే మనం ముక్కుతోనే ఊపిరి పీల్చుకోవాలి.
- ఊపిరి సాలో గా అప్పర్ చెస్ట్ వరకే తీసుకోకుండా డీప్ గా, స్లో గా, పొట్టవరకు బ్రీత్ తీసుకోవాలి. దీన్నే ఎఫర్ట్ లెస్ బ్రీతింగ్ అంటారు. ఈ బ్రీతింగ్ టెక్నిక్ ని మీ ప్రక్కన ఉన్నవాళ్లకు కూడా వినపడకుండా చాలా స్మూత్ గా ఎఫర్ట్ లెస్ గా చేసేయాలి. ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి.
- బోల్డ్ స్కోర్ ( బాడీ ఆక్సిజన్ లెవెల్ టెస్టింగ్ ) దీని ద్వారా మీరు కూడా మీ ఆక్సిజన్ లెవెల్ ని టెస్ట్ చేసుకోవచ్చు. మినిమమ్ 20 సెకండ్స్ ఉండాలి, అలాగే 30-40 ఉంటె ఇంకా చాలా మంచి స్కోర్.
- చివరగా మీకు నిద్రపోవడం లో గాని ఇబ్బంది ఉంది అంటే ఒక పేపర్ టేప్ తీసుకొని పెదాలపై అంటించుకొని నిద్రపోండి. దీనివల్ల ఎక్కువ ఆక్సిజన్ ముక్కునుంచే తీసుకుంటారు. ఓవర్ బ్రీతింగ్ చాలా వరకు కంట్రోల్ లోకి వస్తుంది.
ఇటువంటి బెస్ట్ కమ్యూనికేషన్ అండ్ సైకాలజీ టిప్స్ కోసం మన హెల్త్ టిప్స్ తెలుగు ని రోజు పాలో అవుతూ ఉండండి, మీ కోసం మంచి మంచి హెల్త్ టిప్స్, ఫిట్నెస్ టిప్స్, ఆయుర్వేదానికి సంబందించిన విషయాలను తెలియజేయడం జరుగుతుంది. మీరు ఏమైనా సలహాలు, సందేహాలు తెలపాలనుకుంటే ఈ పోస్ట్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ ద్వారా తెలపండి.