Type Here to Get Search Results !

Translate

ADVERTISEMENT

What diseases can we have due to changes in the nails? గోర్లలో వచ్చే మార్పుల వల్ల మనకు ఎలాంటి జబ్బులు ఉండవచ్చు, జాగ్రత్తలు ఏంటి తెలుసుకుందాం.

What diseases can we have due to changes in the nails

అనారోగ్యం మన ఒంట్లో తిష్ట వేసినప్పుడు దాని తాలూకు సంకేతాలు మనకు చాలా నే కనిపిస్తూ ఉంటాయి. డాక్టర్స్ మన గోళ్లను, కళ్ళను, నాలుకను, దంతాల్ని పరిశీలనగా చూడటం మనలో చాలా మందికి అనుభవమే. మన గోర్లను పరిశిలనగా చూడటం ద్వారా డాక్టర్స్ చాలా వరకు మన అనారోగ్యాన్ని అంచనా వేస్తారు. మన గొర్ల రంగు వాటి ఆకృతి తీరు తెన్నులను బట్టి సాధారణ రక్త హీనత మొదలుకొని విటమిన్ ల లోపాలు, కాలేయ జబ్బులు, ఊపిరి తిత్తుల్లో సమస్యల వరకు చాలా జబ్బుల్నే అంచనా వేయవచ్చు అని చెప్తారు డాక్టర్లు. మన ఆరోగ్యానికి ఆనవాళ్లు గా నిలిచే గోర్లను గురించి అవి తెలియజెప్పే అనారోగ్య సంకేతాలు గురించి తెలుసుకుందాం.

What diseases can we have due to changes in the nails?

Nails Precautions

గోర్లు మన వేళ్ళకీ అందమైన ఆభరణాలు, అతి సున్నితమైన వేలి కొసలకు ఆసరాగా దెబ్బల నుంచి, పట్టుకునే వత్తిడి నుంచి వేళ్ళకు ఆదెరువుగా నిలుస్తున్నవి మన గొర్లె. మొత్తంగా మన గోర్లు చేతి వేళ్ళకి అద్భుతమైన ఆనవాళ్లు అంతేకాదు గోర్లు మన దేహ ఆరోగ్యానికి ప్రతిబింబాలు కూడా గోర్లల్లో కనిపించే ప్రతి చిన్న మార్పు మన ఒంట్లో తలెత్తిన అనారోగ్యం తాలూకు సంకేతమే అంటారు డాక్టర్లు. గోర్లల్లో కనిపించే రంగులు, మార్పులు, వాటి స్థితిగతులు ఇవన్నీ మన శారీరక అనారోగ్యాన్ని పట్టిస్తాయి. రక్తహీనత, విటమిన్ లోపాలు వంటి చిన్నా చితకా ఆరోగ్య సమస్యలు మొదలుకొని హై బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్ల వంటి ప్రమాదకరమైన విపత్తుల వరకు ఎన్నోరకాల అనారోగ్య సంకేతాలు మన గోర్లల్లో ప్రతిఫలిస్తాయి. గోర్లు మన ఆరోగ్యాన్నే కాదు మనం ఎం తింటున్నాం, ఎం లోపించింది అనేది కూడా తెలియజేస్తాయి. 

గోర్లలో వచ్చే మార్పుల వల్ల ఏ విధమైన జబ్బులు ఉండొచ్చు అని మనం చెప్పగల్గుతాము

1) ముఖం చూసి ఎలా చెప్పగల్గుతారో అలాగే గోర్లని చూసి కూడా మనం జబ్బులు చెప్పడానికి వీలవుతుంది. వాళ్లకు గుండె జబ్బులు ఉన్నాయా, లేకపోతే ఐరన్ డెఫిషియెన్సీ ఉందా, లేకపోతే ఊపిరితిత్హుల ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారా, ఇలా లోపల ఉన్నటువంటి జబ్బులు గురించి తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. 

2) చాలా మంది గోర్లకు సంబందించిన డాక్టర్స్ వేరే ఉంటారు అని అనుకుంటారు. కానీ డెర్మటాలజిస్ట్ అంటే స్కిన్ కి సంబందించిన డాక్టరే గోర్లను, జుట్టుని చూస్తూ ఉంటారు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గోర్లు ఏ విధమైన ప్రోటీన్స్ తో తయారైందో అదే ప్రోటీన్ తో హెయిర్ కూడా తయారవుతుంది. హెయిర్ యొక్క ఆరోగ్యానికి ఏవైతే కావాలో అలాగే గొర్ల యొక్క ఆరోగ్యానికి కూడా అవే ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ కావాలి. ఇవన్నిటిని హార్డ్ కెరిటనిన్ మెటీరియల్ అంటారు. 

ఎక్కువశాతం ఎలాంటి నైల్ ప్రాబ్లెమ్స్ తో డాక్టర్స్ దగ్గరకు వెళ్తారు

గోర్లు రంగు మారిందని, గోర్లు చాలా దళసరిగా అవుతున్నాయని, గొర్ల కింద బాగా మెటీరియల్ వచ్చేస్తుందని, గోర్లు చిలకముక్కులాగా అవుతున్నాయటని, కొంతమందికి గొర్ల మూలాన నొప్పి వస్తుందని, గోర్లలో పసుపు రంగు వచ్చిందని ఇలా రకరకాల కారణాలతో డాక్టర్స్ ని కలవడం జరుగుతుంది. 

వేళ్ళపైన మనకు పైకి కనిపించే గోరు నిజానికి నిర్జీవమైన ఒక మృత పదార్థం. అందుకే గోరుని కత్తిరించినా మనకు నొప్పి బాధ తెలియవు. అయితే గోరు కు జీవమూలం గోరు వెనుక భాగంలో చర్మం కింద ఉండే మాట్రిక్స్ లో ఉంటుంది. దీనికి రక్తప్రసారం, నాడులు వంటివన్నీ ఉంటాయి. ఇక్కడ జీవకణాలు విభజన చెందుతూ కెరటిన్ అనే పారదర్శకమైన ప్రోటీన్ కణాలు పుడుతుంటాయి. ఇవన్నీ కలసి గట్టిగా తయారై గోరులా బయటకి తోసుకొస్తుంటాయి. మన కాళీ వేళ్ళ గొర్ల కంటే కూడా చేతి వేళ్ళ గొర్లె వేగంగా పెరుగుతాయి. స్త్రీ లలో కంటే పురుషులలో గోర్లు పెరిగే వేగం ఎక్కువగా ఉంటుంది. గొర్ల స్వభావం ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఉంటుంది. కొందరిలో అవి మందంగా వేగంగా పెరగొచ్చు. లేదా నెమ్మదిగా పెరగొచ్చు. గోర్లు పగిలి పొరలుగా ఊడిపోతూ ఉండొచ్చు. వాటి ఆకృతి అడ్డదిడ్డంగా ఉండొచ్చు. ఇలా గోర్లల్లో కనిపించే ప్రతి చిన్న మార్పుని, వాటిలో కనిపించే రంగుల్ని, మచ్చల్ని పరిశీలించడం ద్వారా ఇప్పటికే ఒంట్లో ఉన్న అనారోగ్యం గురించి భవిషత్తులో వచ్చి పడే విపత్తుల గురించి కూడా సులభంగా అంచనా వేయచ్చని చెబుతారు డాక్టర్లు. 

10 రోజుల నుంచి, రెండు వారాలనుంచి గోరు చుట్టూ వాచీపోయింది, గోరు కూడా రంగు మారిపోయింది అంటూ ఎక్కువ శాతం డాక్టర్స్ దగ్గరకు వెళ్తూ ఉంటారు. నొప్పి ఉంది అంటే దాని అర్ధం ఇది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది కామన్ గా ఎందుకు వస్తుంది అంటే నీళ్ళల్లో ఎక్కువగా పని చేసేవాళ్ళకి ఈ నైల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ గా వస్తాయి. ఎక్కువసేపు నీళ్లలో పని చేయడం వలన గోర్లలో వాటర్ చేరిపోవడం, మట్టి చేరిపోవడం దాని మూలంగా ఫంగస్ గ్రో అయ్యి, బాక్టీరియా గ్రో అయ్యి వాటితోటి చీము పట్టి నొప్పి వస్తుంది. అలాగే నైల్ డిస్కోలరేషన్ అవడం జరుగుతూ ఉంటుంది. ఇది బాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇంకా వేరే విధంగా కూడా రావొచ్చు. గోర్లు నల్లగా అవొచ్చు, తెల్లగా అవొచ్చు, తర్వాత గోర్ల కింద బాగా మట్టి పేరుకుపోయినట్టు బాగా తెల్లటి మెటీరియల్ పేరుకుపోవడం అవచ్చు. లేకపోతే గోరు లేచిపోయి అడుగున కాళీ అయిపోయినట్టు ఈ విదంగా కూడా పంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు.

గోర్లు రంగు మారడం నలుపు, నీలం, ఆకుపచ్చ, తెలుపు, పసుపు, ఇలాంటి రంగులన్నీ కూడా ఇంకా  ఇంపార్టెంట్ ఏంటంటే ఈ నెయిల్స్ మనిషి  తర్వాత శవ పరీక్షలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అంటే అర్షానిక్ పాయిజనింగ్, మెర్కురీ పాయిజనింగ్, లెడ్ పాయిజనింగ్ లాంటి ఫాయిజనింగ్స్ లో టీత్ లో ఎలాగైతే పేరుకు పోయి చనిపోయిన తర్వాత కూడా ఎలా ఉంటాయో అలాగే ఈ గోర్లలో కూడా ఇది ఉండిపోతుంది. అందుకే ఈ నెయిల్ ఎక్సమినేషన్ మూలంగా ప్రాబ్లెమ్ పాయిజనింగ్ మూలాన డెత్ అయ్యారా? లేదా? అని ఫోరెన్సిక్ వాళ్ళు చెప్పడానికి ఉపయోగపడతాయి.

👉గోర్లను పరిశీలనగా చూడటం ద్వారా రక్తహీనత  సాధారణ సమస్యలే కాదు, గుండె జబ్బులు, మధుమేహం, కాలేయ వ్యాధుల్ని కూడా చాలా వరకు ముందుగానే పసిగట్టవచ్చు. ఒంట్లో తీవ్రమైన జబ్బులు ఉన్నప్పుడు గోర్లలో కనిపించే మార్పులు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

మన గొర్లకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది

⇒ శరీరంలోని అవయవాలన్నీ ఎదగడం ఆగిపోయిన మన గోర్లు మాత్రం మనం చనిపోయే దాక పెరుగుతూనే ఉంటాయి. 

⇒ మన గోర్లను నిత్యం పరిశీలనగా చూసుకుంటూ వాటిలో కనిపించే మార్పులపై అవగాహన పెంచుకుంటే మన ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవచ్చు. 

⇒ కొంతమందికి గోర్లు కొద్దిగా పెరగ్గానే వాటిఅంతటా అవే విరిగిపోతూ ఉంటాయి. అలా గోర్లు విరిగిపోతుంటే క్యాల్షియం తక్కువగా ఉందని, vitamin D లేదా జింక్ వంటి పోషకాహర లోపం ఉంది అని గుర్తించాలి. 

⇒ దీని పరిష్కరానికి కొవ్వు శాతం తక్కువగా ఉన్న పాల ఉత్పత్తులు, చేపలు, ఆహారం లో అధికంగా తీసుకోవాలి. 

⇒ కొందరికి గోర్లు త్వరగా పెరగవు, పైగా పాలిపోయి ఉంటాయి. రక్తహీనత పోషకాహార లోపం ఉన్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి. అంతేకాదు గుండె లేదా కాలేయానికి సంబందించిన జబ్బులు వచ్చే అవకాశం ఉంది. 

⇒ చేతివేళ్ళ మొదల్లో వాపు వచ్చిందంటే దాన్ని లబ్బింగ్ అంటారు. ఇది గుండె జబ్బులకు సంకేతం. 

⇒ గోర్లపై సన్నటి ఎర్రటి గీతలు కనిపిస్తూ గొర్ల  కింద భాగం నలుపు రంగులోకి  మారితే దాన్ని గుండె పై పొరలో వాపుకు సంకేతం గా చెప్పుకుంటారు డాక్టర్లు. 

గోర్లకు చర్మం లాగానే బ్లడ్ సప్లై అవసరం, గోర్లకి నెయిల్ మాట్రిక్స్ అంటే నెయిల్ ఫోల్డ్ కింద ఉంటుంది. అలాగే నెయిల్ బెడ్, నెయిల్ ప్లేట్  ఇలాగ వీటికి మూడు ఉంటాయి. వీటికి నెయిల్ మాట్రిక్స్ నుంచి నెయిల్ గ్రో అవుతుంది. ఈ నెయిల్ మాట్రిక్స్ కి బ్లడ్ సప్లయ్ ఉంటుంది. ఈ బ్లడ్ సప్లై తక్కువైతే నీలంగా మారడానికి అవకాశాలు ఉంటాయి. 

మన కళ్ళు, చర్మం, జుట్టు, పళ్ళు ఇవన్నీ మన ఆరోగ్యం గురించి ఎంతో కొంత బయటకు చెప్తుంటాయి. అలాగే మన చేతివేళ్ళ గోర్లను బట్టి కూడా మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము, ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నాము అనేది తెలుసుకోవచ్చు. మనలో కొంతమందికి గోర్లు చాలా పలుచగా ఉండి పెళుసుగా విరిగిపోతుంటాయి. పగుళ్ళొస్తుంటాయి. చాలా కాలంగా గొర్ల కింద పెళుసుగా కనబడుతుంటే దాన్ని ఐరన్ లోపంగా గుర్తించాలి. రక్తం తక్కువగా ఉన్నప్పుడు, రక్తహీనతతో బాధపడుతున్నప్పుడు గోర్లన్నీ తెల్లగా పాలిపోయినట్టుగా కనబడుతుంటాయి. గోర్లు వంపుపోయి చెంచా లాగా కనిపించడం రక్తహీనతకు సంకేతం. గోర్లమీద తెల్లని చిన్నపాటి గీతలు కనిపిస్తున్నపుడు ప్రతి గోరు మీద తెల్లటి గీతలు కాస్త హెచ్చు స్థాయిలో కనబడుతుంటే రక్తంలో ప్రోటీన్లు లోపించాయని అర్ధం. ఇలాంటప్పుడు గుడ్డులోని తెల్లసొన, పప్పు ధాన్యాలు, సొయా ఆహారంలో చేర్చుకుంటే ఈ తెల్లని గీతలు మాయమైపోతాయి. గొర్ల ఉపరితలం హెచ్చుతగ్గులుగా అక్కడక్కడా లొట్టలు పడినట్లుగా ఉంటె అది సోరియాసిస్ రానున్నది అనడానికి సంకేతం కావచ్చు. 

ఈ రక్తహీనత చాలా కామన్ గా ఉంటుంది, దీన్ని ఎనిమియా అంటారు. ఈ ఎనిమియా లో గొర్లకు కూడా ప్రాబ్లెమ్ ఉంటుంది. ఈజీగా గోర్లను చూసి రక్తహీనత ఉందని చెప్పచ్చు. మొదట్లో చాలా పెయిర్ గా అయిపోతాయి, స్లోగా దాన్ని కరెక్ట్ చేయకపోతే నెయిల్ ప్లేట్ పల్చబడిపోయి స్పూన్ ఆకారంలోకి తయారైపోతుంది. అంటే దానిమీద నీళ్లు పోస్తే ఆ నీళ్లు ఆలా నిలబడతాయి అనమాట. దీన్ని డాక్టర్లు డి డయాగ్నొస్టిక్ అంటారు. 

నార్మల్ నెయిల్ కేర్ 

What diseases can we have due to changes in the nails?

నెయిల్ కేర్ 

⇒ చాలా మంది బ్యూటీషియన్ దగ్గరకు వెళ్లి నెయిల్ కేర్, టూ నెయిల్స్ అవన్నీ చేయించుకుంటారు. ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే చక్కటి మాయిశ్చరైజింగ్ చేపించాలి. స్కిన్ కి ఎలా మాయిశ్చరైజింగ్ క్రీమ్ అవసరమో ఈ నెయిల్స్ కూడా మాయిశ్చరైజింగ్ క్రీమ్ చాలా అవసరము.

⇒ తర్వాత పనులు చేసేటప్పుడు గోర్లమీద ఒత్తిడి రాకుండా చూసుకోవాలి. అస్తమానం నెయిల్ బైటింగ్ వాళ్లకు కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడం, ఎక్కువసేపు నీళ్ళల్లో పనిచేయడం కూడా నెయిల్స్  పాడైపోవడానికి ఒక కారణం. 

ఇవన్నీ కూడా మనంతట మనమే కంట్రోల్ చేసుకోగలిగితే చాలా మట్టుకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు. 

⇒ స్కిన్ కి ఎలా కేర్ తీసుకుంటామో నెయిల్ కూడా అలానే కేర్ తీసుకోవాలి. నెయిల్ బైటింగ్ హాబిట్స్ ని స్టాప్ చేయడం మంచిది. 

⇒ అలాగే బ్యూటీపార్లర్ కి వెళ్ళినప్పుడు నెయిల్స్ వాళ్ళు చూటికలు అంతా లాగేసి లోపలికి ఇటు అటు చేస్తారు. అంత డెప్త్ లోకి వెళ్లడం అంత మంచిది కాదు. అనవసరంగా హైజీన్ పాటించకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. 

⇒ డయాబెటిస్ ఉన్నవాళ్లు చాలా చాలా కేర్ పుల్ గా ఉండాలి. బ్యూటీపార్లర్స్ కి వెళ్తే వాళ్లకు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా హై గా ఉంటుంది. 

⇒ నెయిల్స్ లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే నెయిల్ కలర్ కూడా నార్మల్ అయిపోతుంది. లేకపోతే ఇన్ఫెక్షన్ క్రోనిక్ అయిపోయి ఆ రంగు కూడా మారిపోయి ఇక ఎప్పటికి అల ఉండిపోతుంది. ఈ జాగ్రత్తలు పాటించగలిగితే నెయిల్స్ చాలా ఆరోగ్యం గా ఉంటాయి. 

ఇటువంటి హెల్త్ టిప్స్ కోసం మన HEALTH TIPS TELUGU ని ఫాలో అవుతూ ఉండండి. మీ కోసం మంచి మంచి హెల్త్ టిప్స్ , ఫిట్నెస్ టిప్స్ , ఆయుర్వేదం, హెల్త్ న్యూస్ తెలియజేయడం జరుగుతుంది. మీకు ఏమైనా సలహాలు, సందేహాలు తెలియజేయాలని అనిపిస్తే ఈ పోస్ట్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి, వీలైనంత వరకు సందేహాలకు రిప్లయ్ తెలియజేయడం జరుగుతుంది. 

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. nails health ki antha important ani ippude telusukunna. thank you manchi information ichinanduku.

    ReplyDelete

Top Post Ad

Bottom Post Ad

ADVERTISEMENT