Simple morning habits Health Tips Telugu for healthy mind | ప్రతి ఉదయం ఈ 9 అలవాట్లు పాటించండి.
Simple morning habits for healthy mind ఒక సాలిడ్ మార్నింగ్ రొటీన్ అనేది చాలా మంది సక్సస్ కీ ప్యాక్టర్. అంతేకాదు ఎన్నోరకాల డిఫ్రెషన్స్, యాంగ్జైటీ ఇలాంటివి కూడా దూరం చేయడానికి ఉపయోగపడేది ఒక మంచి మార్నింగ్ రొటీన్.
The main make our propensities and afterward our propensities make us ప్రధానంగా మనం అలవాట్లను రూపొందించుకుంటాం తర్వాత ఆ అలవాట్లే మనల్ని తాయారు చేస్తాయి. అందుకే మార్నింగ్ లేచిన వెంటనే మనం ఇప్పుడు ఈ ఆర్టికల్ లో మాట్లాడుకోబోయే ఈ 9 అలవాట్లలో ఎన్నో కొన్ని మనం తీసుకొని వాటిని మన మార్నింగ్ రొటీన్ హ్యాబిట్స్ లో జాయిన్ చేసుకుంటే అవి మన జీవితాన్ని స్లోగా మార్చేస్తాయి. ముఖ్యంగా మీ మెంటల్ స్ట్రెంత్ కి ఈ 9 అలవాట్లు చాలా ఉపయోగపడతాయి. అయితే అవేంటో ఇప్పుడు చూద్దాం పదండి.
1. Make your bed (లేచిన వెంటనే మన పక్క మనం మంచిగా మడతపెట్టుకోవడం )
ఇది చాలా బోరింగ్ గా ఉండొచ్చు కానీ నన్ను ఒక్కసారి నమ్మి ఇది ట్రై చేయండి. పొద్దున్నే లేచి మీ బెడ్ వైపు ఒకసారి చూడండి. చెదిరిపోయిన మీ బెడ్ ని ఒకసారి నీట్ గా చేసుకొని మల్లి చూడండి. మీకొక చిన్న సెన్స్ అఫ్ హ్యూమర్ ఎచ్చివ్ మెంట్ వచ్చేస్తుంది. చాలా చిన్న పనే కానీ ఒక పని పూర్తి చేశాను, పొద్దున్నే ఒక పని పూర్తి చేశాను అనే ఆ ఫీలింగ్ తో మీరు స్టార్ట్ అయితే మీ డే మొత్తం బాగుంటుంది.
2. Drink water before brushing ( బ్రష్ చేయడానికి ముందు నీళ్లు త్రాగాలి )
పాస్ మొహం వేసుకొని వాటర్ త్రాగాల అని అనుకునేముందు ఈ విషయం ఒకసారి చదవండి. అంటే బ్రష్ చేసే ముందు వాటర్ త్రాగడం వల్ల మంచిదే అని ఎన్నో రిచేర్చేస్ చెప్తున్నాయి. కానీ అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే వాటర్ త్రాగడం, బ్రష్ చేసుకున్నా, చేసుకోకపోయినా వాటర్ అనేది త్రాగాలి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వాటర్ త్రాగడం చాలా మంచిది. బ్లడ్ ప్రెసర్ ని మెంటైన్ చేస్తుంది. పొద్దున్నే బాత్రూం ప్రాబ్లెమ్ ఉన్నవాళ్ళకి ఈ ప్రాబ్లెమ్ ని క్లియర్ చేస్తుంది. అలాగే వాటర్ అనేది కేవలం మార్నింగ్ మాత్రమే త్రాగడానికి కాదు డే మొత్తంలో వాటర్ అనేది బాలెన్సుడ్ గా త్రాగుతూనే ఉండాలి. అది మనల్ని ఎప్పుడు హైడ్రేట్ చేస్తూ ఉంటుంది. అందుకే వాటర్ త్రాగడం అనేది మీ హ్యాబిట్స్ లో కంపల్సరీ పెట్టుకోండి.
3. Brush with your less dominate hand (మీ తక్కువ ఆధిపత్య చేతితో బ్రష్ చేయండి)
లేచి ఇంతసేపు అయింది ఇంకా బ్రష్ చేయలేదు అనుకుంటున్నారా ఓకే ఇప్పుడు మనం చెప్పుకునే పాయింట్ అదే. మనం బ్రష్ లెస్ డామినేట్ హ్యాండ్ అంటే ఎక్కువగా మనం రైట్ హ్యాండ్ తో పనిచేసేవాళ్ళం అనుకోండి మనం బ్రషింగ్ మాత్రం లెఫ్ట్ హ్యాండ్ తో చేయాలి. దీనివల్ల ఏదో బిపత్యాలు జరిగిపోతాయి అని కాదు. జెనరల్ గా మన బ్రెయిన్ కి ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయం నేర్పుతావున్నామనుకోండి అది బాగా యాక్టీవ్ గా పనిచేస్తుంది. కొత్తపని నేర్చుకున్నా, కొత్తగా ఏమైనా చేసినా కొత్త న్యూరల్ పాత్ వేవ్స్ అనేవి పామ్ అవుతాయి. ఇది మీ మైండ్ కి చాలా మంచిది. అందుకే ఒకసారి ట్రై చేయండి.
4. Sunlight meditate positive self talk
సన్ లైట్ అనేది బాడీ కె కాదు మన మైంది కి కూడా చాలా మంచిది. ఎక్కువగా సన్ లైట్ చూడకుండా ఉండేవారు డిప్రెషన్ కి గురైయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకే డెఫినెట్ గా మార్నింగ్ కొంత సమయం మీ వీలుని బట్టి సన్ లైట్ లో కూర్చోండి. మెడిటేషన్ లేదా యోగా ఇది ప్రస్తుతం అందరు సజెస్ట్ చేస్తున్నారు. మరియు వాళ్ళందరూ ఇది చెప్పడానికి కూడా ఒక మెయిన్ కారణం ఉంది. మార్నింగ్ మీరు మెడిటేషన్ చేయడం వల్ల మీరు కొత్త ప్రపంచంకి వెళ్ళిపోతారు, తెలియని శక్తి వస్తుంది, మర్వెల్ సూపర్ హీరో అయిపోతారు అని కాదు. కానీ మెడిటేషన్ చేయడం వల్ల మీ లిమిట్స్ మీరు పెంచుకున్నవాళ్ళు అవుతారు. మీలోని మీ మనిషిని తెలుసుకోవడం మొదలుపెడతారు. ఈ కాలంలో అన్నింటి కన్నా ముఖ్యమైనది మన ఇమ్యూనిటీ మెడిటేషన్ చేయడం వల్ల మీ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. మరియు ఇంకా ఎమోషనల్ గా బ్యాలన్సుడ్ గా ఉంటారు. ఇప్పుడు ఈ ఆర్టికల్ చదువుతున్న అందరికి గోల్స్ ఉంటాయి. ఒకరు IAS అవ్వాలనుకుంటారు, ఒకరు ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలనుకుంటారు, ఒకరు హ్యాపీ గా లైఫ్ లీడ్ చేయాలనుకుంటారు. అయితే మీ అందరికి ఉపయోగపడే కొన్ని సెల్ఫ్ టాక్ ని, పాజిటివ్ సెల్ఫ్ టాక్ ని మీరు రాసుకొని, రికార్డు చేసుకొని అది డైలీ వినండి, లేకపోతే మీతో మీరు చెప్పుకోండి. మరియు అది మార్నింగ్ అయితే ఇంకా మంచిది. దీనివల్ల ఈ పని మీరు ఎందుకు చేస్తున్నారు. దానికి మెయిన్ కారణం ఏంటి, మీ పర్పస్ అఫ్ లైఫ్ ఏంటి అనేది మీకు ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు. మీ మైండ్ ఎప్పుడు మర్చిపోకుండా మిమ్మల్ని ముందుకు తీసుకుపోతూ ఉంటుంది.
5. Move your body
మార్నింగ్ రొటీన్ లో బాడీ వర్కౌట్స్, జాగింగ్ చేయడం చాలా మంచిది. ఒక కాలంలో శరీర కష్టం మీదే మనకి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు దొరికేవి, ఉండేవి. కానీ ఈ కాలంలో మన ఫింగర్స్ కదలికతోనే చాలా డబ్బులు సంపాదించేస్తున్నాం. అయితే మన బాడీ మొత్తం కదలడం కష్టం అయిపోతుంది. దీనివల్ల మన బ్రెయిన్ కి, మన బాడీ కి మంచి అయితే జరగడం లేదు. రోజుకొక ఫిక్సిడ్ టైం లో ముఖ్యంగా మార్నింగ్ టైంలో వర్కౌట్స్ చేయడం వల్ల మీ బాడీ ఈ రోజు చేయబోయే టాస్క్ కి రెడీ గా ఉంటుంది. అండ్ అల్సొ మీ మైండ్ కూడా కొంచెం ఫ్రెష్ గా, ఎనేర్జిటిక్ గా ఫీల్ అవుతుంది.
6. Take a cold shower ( చల్లటి స్నానం చేయండి )
యాక్చువల్ గా చల్లగా ఉన్న నీళ్లతో స్నానం చేయడం చాలా మంచిది. పొద్దున్నే లేచిన వెంటనే మనం కోల్డ్ వాటర్ తో స్నానం చేయడం వల్ల మన బాడీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. దానివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఛల్నిళ్లతో స్నానం చేయడం వల్ల మీకు ఆక్సిజన్ ఇన్ టేక్ పెరుగుతుంది. కోల్డ్ వాటర్ మన బ్రెయిన్ కి ఎలెక్ట్రిక్ ఇంపల్సస్ పంపుతుంది. దీనితో మన సిస్టం కొంచెం షేక్ అయ్యి మనలో ఎలెర్ట్ నెస్ ని పెంచుతుంది. మన ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అంతేకాదు మన బ్రెయిన్ లో ఎండార్పిన్స్ ని ఈ కోల్డ్ వాటర్ రిలీజ్ చేయిస్తుంది. దీన్నే హ్యాపీ హార్మోన్స్ అని అంటారు. అందుకే కోల్డ్ షవర్ చేయండి. అలాగే ఒకవేళ మీకు ఫీవర్ గాని, జలుబు గాని ఉంటె ఈ కోల్డ్ షవర్ ని అవాయిడ్ చేయండి.
7. Breakfast (అల్ఫాహారం )
నైట్ నిద్రపోయిన దగ్గరనుంచి ఇప్పుడు తినే దాక మీరు ఫాస్టింగ్ లో ఉంటారు. అయితే ఇప్పుడు తినబోయే ఈ టిఫిన్ చాలా ఇంపార్టెంట్. దీన్నే ఇంపార్టెంట్ మీల్ అఫ్ ది డే అని కూడా అంటారు. ఎన్నో రిచేర్చేస్ లో ఎం తెలిసిందంటే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ వల్ల మెమరీ మరియు కాన్సంట్రేషన్ రెండు పెరుగుతాయి. చేసే వర్క్ మీద మంచి ఫోకస్ ఉంటుంది. మరియు ఆలాగే తినమన్నాం కదా అని మన స్టమక్ ఫుల్ గా తింటే అది మన మైండ్ మీద ఆ ప్రెజర్ పడుతుంది. మనకి నిద్రపోవాలి అని అనిపిస్తుంది. అందుకే స్మాల్ పోర్షన్స్ లో ఓకె చాలు అన్నట్టు తినాలి. ఎం తిన్న కూడా ప్రోటీన్స్, విటమిన్స్, హెల్ది ఫ్యాట్స్, ఫైబర్ ఇవన్నీ సమపాళ్లలో ఉండేలా బ్రేక్ ఫాస్ట్ ని సిద్ధం చేసుకొని తినడం మంచిదని న్యూట్రీషినర్స్ చెప్తున్నారు. అవేవి మనకు తెలియదు అంటే మీరు తినే టిఫిన్ నే మరి ఫుల్ గా కాకుండా నార్మల్ గా తినండి చాలు.
8. Work on the hardest tasks first ( ముందుగా కష్టమైన పనులపై పని చేయండి )
టైం మేనేజ్మెంట్ మీద కొన్ని టెక్నిక్స్ ని కలిపి ఒక ఆర్టికల్ రాశాం. అది వెరీ రీసెంట్ గా చేసాం. మార్నింగ్ ఒక 7 మినిట్స్ కూర్చొని ఈ రోజు చేయబోయే పనులు ఏమిటి అని చిన్న ప్లాన్ చేసుకొని తర్వాత నైట్ నిద్ర పోయే ముందు మల్లి ఇంకో 7 మినిట్స్ కూర్చొని ఆ పనులన్నీ ఎలా కంప్లీట్ చేసాం అని రివ్యూ ఇచ్చుకోవాలి. ఈ 7 మినిట్స్ ప్లాన్ లో చిన్న ఎడిషన్ ఏమిటంటే అందులో చేయాల్సిన పనులలో ఏదైతే హార్డెస్ట్ టాస్క్ ఉంటుందో అంటే ఒక రోజులో మనం చేయాల్సిన పనుల్లో ఏదైతే హార్డెస్ట్ టాస్క్ ఉంటుందో దాన్ని ముందు చేసెయ్యాలి. అసలు ఎందుకు హార్డెస్ట్ టాస్క్ ముందే చేసెయ్యమంటున్నారు. అని మీరు ఆలోచిస్తే విల్ పవర్ అనేది ఎంత ఉంటుంది, ఎలా పనిచేస్తుంది. అని తెలుసుకోవడానికి చేసిన రిచేర్చ్ లో ఎం తేలిందంటే విల్ పవర్ అనేది మనకి ఎప్పుడు పడితే అప్పుడు రాదు. అది ఉన్నప్పడు మనం దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మీ విల్ పవర్ హై లో ఉన్నప్పుడు మార్నింగ్ టైమ్స్ లో మెయిన్ వర్క్ కంప్లీట్ చేసేసుకోండి. హార్డెస్ట్ టాస్క్ ని కంప్లీట్ చేసేసుకోండి. ఆ తర్వాత పెద్ద పని చేసిన మూడ్ లో చిన్న చిన్న పనులు ఈజీగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు.
9. Listen to brain soothers ( మెదడు ఉపశమనాన్ని వినండి )
ఉదయం లేచిన వెంటనే డించక్ డించక్ అనే పాటలు కొంతమందికి నచ్చోచ్చు. కానీ మన బ్రెయిన్ కి ప్రొద్దున్నే అంత హెవీ బీట్స్ ఇవ్వడం మంచిది కాదు. మరి ముఖ్యంగా వర్కులో ఉన్నప్పుడు ఇలాంటి మ్యూజిక్ అస్సలు మంచిది కాదు. బ్రెయిన్ కి సూతింగ్ గా ప్రొడక్టివిటి ని పెంచేలా కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి. నేనైతే 90s అండ్ ఎర్లీ 2000 లో వచ్చిన రెహ్మాన్స్ హిట్స్, మణిశర్మ హిట్స్ ఇవి వింటాను. ఇందులో మెయిన్ లీ సూథింగ్ గా ఉండే సాంగ్ నే వింటాను. అలా కాకపోతే స్ఫోటిపై లో లో పై బీట్స్ అని ఉంటుంది. ఆ ప్లే లిస్ట్ ప్లే చేస్తూ మీ పని మీరు చేసుకోండి. మీ బ్రెయిన్ చాలా హ్యాపీ ప్లేస్ లో ఉన్నట్టు హ్యాపీగా పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది.
ఈ ఆర్టికల్ లో మనం మాట్లాడుకున్న మెయిన్ పాయింట్స్
- ముందుగా Make your bed మీ బెడ్ మీరే మడతపెట్టుకోవడం మీరు సాదించబోయే మొదటి ఇచ్చివమెంట్ ఇదే.
- Drink water before brushing బ్రష్ చేసుకోవడానికి ముందే వాటర్ త్రాగడం వల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ట్రై ఇట్.
- Brush with less dominate hand మనం ఎక్కువగా యూజ్ చేసే హ్యాండ్ కాకుండా బ్రష్ చేసుకునేప్పుడు వేరే హ్యాండ్ ఉపయోగిస్తే మీ బ్రెయిన్ లెర్నింగ్ కి మంచిది.
- Sunlight meditate positive self talk సన్ లైట్ లో కూర్చోండి, మెడిటేషన్ చేయండి. మీ గోల్స్ ని, మీ పనులని పాజిటివ్ గా మీతో మీరు చెప్పుకోండి.
- Move your body మార్నింగ్ రొటీన్ లో ముఖ్యమైనది వర్కవుట్ అది ఏదైనా వాకింగ్, జిమ్ ఏదైనా సరే మీ రొటీన్ లో ఉంచుకోండి.
- Take a cold shower కోల్డ్ షవర్ చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీ మైండ్ ని కూడా ఇది ఎలెర్ట్ చేస్తుంది. సో ట్రై ఇట్.
- Breakfast మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ అఫ్ ది డే ఇది, సో డోంట్ మిస్ థిస్.
- Work on the hardest tasks first ముందే కష్టమైన పనులని చేసేయండి. విల్ పవర్ ని వేస్ట్ చేయకండి.
- Listen to brain soothers మంచి కామ్ గా ఉండే మ్యూజిక్ వినండి. అది మీ బ్రెయిన్ కి హ్యాపీగా అనిపిస్తుంది. మీ ప్రొడక్టివిటి ని కూడా డబల్ చేస్తుంది.
సో ఇది ఫ్రెండ్స్ మీ బ్రెయిన్ కి ఉపయోగపడే 9 మార్నింగ్ హ్యాబిట్స్. ఇందులో మీకు నచ్చిన హ్యాబిట్స్ ఏంటో చుడండి, వాటిని ప్రాక్టీస్ చేయండి. అండ్ అల్సొ మీరు ప్రాక్టీస్ చేయబోయే హ్యాబిట్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.