How To Stop Being Tired All The Time-Health Tips Telugu రోజు మొత్తం ఉత్సహంగా (Active) గా ఉండాలంటే ఇలా చేయండి.
మనందరం సమయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాం. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం అనుకుంటాం. టైం మేనేజ్మెంట్ మీద మేము కూడా చాలా ఆర్టికల్స్ రాశాం. అయితే లాస్ట్ 3 ఇయర్స్ లో మాకు ఒక విషయం అర్థమైంది. టైం మేనేజ్మెంట్ కంటే కూడా ఎనర్జీ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఒక రోజులో మన ఎనర్జీ ని సరిగ్గా వాడితే ఆటోమాటిక్ గా మనం సమయాన్ని కూడా సరిగ్గా వాడిన వాళ్ళం అవుతాము. అలాగే ఈ అలవాట్లు చాలా కష్టం అని కూడా అనుకోకండి. మీరు నార్మల్ గా డైలీ లైఫ్ లో పాటించేవే. ఇందులో మీ ఎనర్జీ ని డ్రైన్ చేయకుండా మీ ఎనర్జీ ని ఇంక్రీజ్ చేసేలా ఎం చేయాలి అనేది మాత్రం మేము చెప్తాము.
1. Exercise everyday ( ప్రతీ రోజు వ్యాయామం చేయండి )
ఉదయం లేచాక ఎక్సర్ సైజ్. రన్నింగ్ గాని, వాకింగ్ గాని, చిన్నదైనా, పెద్దదైన ఏదైనా ఒక ఎక్సర్ సైజ్ చేయడం మనలో ఉత్సహాన్ని నింపుతుంది. ఎక్సర్ సైజ్ అనేది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్. ఎదో ఒకరోజు లేకపోతే వారం రోజులు చేసేసి చూస్తే మనకి పెద్దగా ఏమి ఉపయోగం ఉండదు. డైలీ మార్నింగ్ లేదా ఈవెనింగ్ ఎదో ఒక రొటీన్ లా మన లైఫ్ లో ఇది ఉండాలి. అప్పుడే మనకి ఫిజికల్ గా మెంటల్ గా ఎనర్జీ లెవెల్స్ లో డిఫరెన్స్ ఉంటుంది. చాలా మంది ఎక్సర్ సైజ్ అంటే జిమ్ కి వెళ్లిపోవడం మాత్రమే అనుకుంటారు. కానీ ఇంట్లోనే మనం ఎన్నో రకాల ఎక్సర్ సైజ్ లు చేయవచ్చు. నా ఫ్రెండ్ అట్టం గురునాధ్, అసలు ఎలాంటి జిమ్ కి వెల్లడు. కేవలం పుష్ అప్స్ ద్వారానే మంచి ఫిజిక్ తో ఉంటాడు. పుష్ అప్స్ అనేవి మీ కంప్లీట్ బాడీని కదిలిస్తుంది. అలాగే బర్పీస్ కూడా టోటల్ బాడీని కదుపుతుంది. అంతేకాదు ఇది మీ బ్లడ్ ఫ్లో ని షార్ప్ గా ఉంచుతుంది. అలాగే దీనికోసం మీరు ఎంతో సమయాన్ని కూడా ఇవ్వక్కర్లేదు. రోజుకి 10 నుంచి 20 నిముషాలు అంతే.
2. Believe in your goals ( మీ లక్ష్యాలను నమ్మండి )
ఇప్పుడు మీరు ఎక్సర్ సైజ్ చేసారు. ప్రెష్ అయిపోయారు. ఇప్పుడు మీరు మీ ఇన్నర్ సెల్స్ ని యాడ్ చేయాలి. మీకు మీరు ఎందుకు మీరు పనిచేయాలి అనే దానికి ఒక ట్రిగ్గర్ ఇవ్వాలి. దానికి ఉపయోగపడేదే బిలీవ్ ఇన్ యువర్ గోల్. ఏ ఊరు వెళ్లాలో తెలియని ప్రయాణికుడు ఎక్కడికి వెల్లడు అక్కడే ఉంటాడు. తనేంటంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలిరా బాబు అని ఆలోచిస్తూనే ఉంటాడు. కానీ గోల్ మీద నమ్మకం క్లారిటీ ఉన్నవాడు ఎలాగైనా తన గోల్ వైపు వెళ్ళిపోతాడు. మన గోల్ మీద నమ్మకం ఉంటె మనం చేసే పనిలో కూడా మంచి ఎనర్జీ ఉంటుంది. మనలో చాలా మంది ఎవరెవరో సాధించిన కీర్తి ల గురించే మాట్లాడుకుంటాం. ఎవరో సాధించిన గోల్స్ గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. నా ఫేవరేట్ హీరో సినిమా హిట్ అయిందని మనమే ఆనందపడిపోతాం, వేరే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటాం. మన ఎనర్జీ మొత్తాన్ని దీనికే వాడేస్తున్నాం.
కానీ అదే సమయంలో మనం మన గోల్ ని నమ్మి దాని వైపు వెళ్తే అనవసరమైన విషయాల కన్నా కూడా మనకు అవసరమైన మన గోల్ మీద ద్రుష్టి పెట్టాలి. మన గోల్ ని చాలా ఎక్సయిటింగ్ గా చెప్పుకోవాలి. మన గోల్ గురించి వేరే వారికీ చెప్పినా, మనకి మనమే తలుచుకున్నా మనకి ఒక ఛాలెంజ్ లాగా ఇప్పుడే పని చేసేయాలి అన్నట్టు ఉండాలి. కొన్ని గోల్స్ మీకు బోరింగ్ గా అనిపించవచ్చు. కానీ దాన్ని కూడా ఎక్సయిటింగ్ గా ప్రెజెంట్ చేయడం మర్చిపోకండి. ఎవరికో అక్కరలేదు. మనకి మన గోల్ ఎక్సయిటింగ్ గా అనిపించాలి. మన ఎనర్జీ లెవెల్స్ ని ఆ గోల్ తలచుకున్నప్పుడల్లా పెంచాలి. అందుకే ప్రతిరోజు కూర్చుని మీ గోల్ గురించి ఆలోచించండి. ఈ రోజు మీరు మీ గోల్ వైపు వెళ్లేలా ఎం చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించండి.
3. Work in the morning ( ఉదయం పని చేయడం )
మీ ఇన్నర్ ఎనర్జీ ని ఫుల్ రీఛార్జ్ చేశాక మీరు ముందు మీ ఇంపార్టెంట్ వర్క్ ని కంప్లీట్ చేయడానికి ఆ ఇన్నర్ ఎనర్జీ ని వాడాలి. అప్పుడే మీరు మీ వర్క్ లో చాలా ఫాస్ట్ గా ఎఫిసియెంట్ గా ఉంటారు. ప్రస్తుతం మన జీవితం ఎలా అయిపోయిందంటే 8-9 గంటలకు లేస్తున్నాం, లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ చేసి అఫిస్ కి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ వన్ హావర్ లో లంచ్ బ్రేక్ వస్తుంది తింటాం. ఆ తర్వాత నుంచి డే ఎప్పుడు అయిపోతుంది అని అనుకుంటా ఉంటాం. ఇక్కడ మన ఎనర్జీ ని సరైన టైం లో మనం వాడడం లేదు. మనకి హై ఎనర్జీ లెవెల్స్ ఉండేవి మార్నింగ్ టైమే. ఎందుకంటే ఆ సమయంలో మన బ్రెయిన్ లో చాలా తక్కువ థాట్స్ ఉంటాయి. మరియు రాసే దానిమీద కన్ఫ్యూజన్ తక్కువ క్లారిటీ ఎక్కువ ఉంటుంది. ఫాస్ట్ గా వర్క్ చేయగలుగుతారు. ఇలాగె చాలా మంది లీడర్లు, ఆంట్రప్రెన్యూర్స్ ఒక ఇంపార్టెంట్ వర్క్ ని మార్నింగ్ అప్పుడే స్టార్ట్ చేసేస్తారు. దీనివల్ల వాళ్ళ డే మొత్తం వాళ్ళు ఇంకా వేరే వర్క్ చేయడానికి వాళ్ళ ఎనర్జీ ని వాడుకుంటారు.
4. Take naps in between your work ( మీ వర్క్ మధ్యలో ఒక కునుకు తీయండి)
మన మైండ్ సాధారణంగా లంచ్ తర్వాత కొంచెం నాప్ వెయ్యాలి అని అనుకుంటుంది. కొంచెం నిద్రొస్తున్నట్టు, కొంచెం మత్తుగా అనిపిస్తుంది. కానీ ఆ సమయంలో ఎందుకులే ఏమనుకుంటారో అనుకుని డెస్క్ మీద కూర్చొని వర్క్ చేద్దాం అనుకుంటాం. కానీ ఆలా ఇలా చూస్తూ మత్తులోకి వెళ్ళిపోతాం. దానికన్నా మీరు టైం తీసుకుని అంటే ఒక 15 లేదా 20 మినిట్స్ టైం తీసుకుని నిద్రపోతే మంచిదని రిచేర్చేర్స్ చెప్తున్నారు. వర్క్ మధ్యలో లేకపోతే స్టడీ మధ్యలో చిన్నగా షాట్ నాప్ తీసుకోవడం మన మెమోరికి చాలా మంచిదని వాళ్ళు చెప్తున్నారు. జపాన్ లాంటి దేశాల్లో కూడా ఆఫీస్ అండ్ స్కూల్స్ లో ఇలాంటి షాట్ నాప్ తీసుకుంటాకి అడ్డుకుడా చెప్పరు. అయితే మనదేశంలో కుదరదు బయ్యా అని మీరు అనుకోవచ్చు. లంచ్ చేసిన వెంటనే 15-20 మినిట్స్ ఎవరితోనూ కబుర్లు చెప్పకుండా మీరు హ్యాపీగా ఒక కునుకు వేసేయండి. ఆ తర్వాత మీ ఎనర్జీ ఫుల్ రీఛార్జ్ అయిపోతుంది.
5. Have good friends ( మంచి ఫ్రెండ్స్ తో ఉండండి )
ప్రశాంతం గా వర్క్ చేసాక మనందరికీ ఈవినింగ్ ఫ్రెండ్స్ తోనో లేకపోతే కొలీగ్స్ తోనో కబుర్లు చెప్పడం ఇష్టం. అయితే మీరు మామ లైఫ్ ఎలా ఉందిరా అని అడిగే వాళ్ళు ఉన్నారా, నా లైఫ్ చాలా దరిద్రం గా ఉందని రోజు మీతో చెప్పుకొని బాధపడే వాళ్లున్నారా అనేది ఒకసారి ఆలోచించండి. మనందరి జీవితాల్లో నెగిటివిటీ ఎక్కువగా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళతో మనకి ఫాస్ట్ లో రిలేషన్ ఉన్నా, చిన్నప్పటి నుంచి వాళ్ళు మనకి ఫ్రెండ్స్ అయినా వాళ్ళు పెరిగే క్రమంలో వాళ్ళ మైండ్ సెట్ వలన మారవచ్చు. మీతో నెగిటివ్ గా ఉండవచ్చు. నెగిటీవ్ విషయాలు, నెగిటీవ్ హ్యాబిట్స్ గురించే మీతో చెప్పవచ్చు. నాకు చిన్నప్పటినుంచి తెలిసినవాడు కదా అని మనం ఎలాగైనా సర్దుకుని పోయి అతనితో మాట్లాడతాము. కానీ తెలివైన పని ఏంటంటే వాళ్ళని మనం వదిలేయడమే మంచిది. ఉదాహరణకి నాకు ఒక చిన్నప్పటి ఫ్రెండ్ రీసెంట్ గా అంటే పెరిగిన తర్వాత బాగా నెగిటివ్ గా అనిపించడం స్టార్ట్ చేసాడు. తన ఆలోచనలు తన హ్యాబిట్స్ ఇవన్నీ కూడా నాకు ఇబ్బంది కరంగా అనిపించేవి అతనితో మాట్లాడిన ఒక్కరోజు నాలో ఒక ఎనర్జీ డిప్రెషన్ అనేది నేను అబ్జర్వ్ చేశాను. అతనితో మాట్లాడ్డం తగ్గించిన తర్వాత నాలో ఎనర్జీ డిఫెరెన్స్ నేను గమనించాను. బాడ్ ఫ్రెండ్స్ మన లైఫ్ లో బాడ్ ఇన్ ఫ్లియెన్స్ తెస్తారు. ఆ బాడ్ ఇన్ ఫ్లియెన్స్ మనకి బాడ్ ఎనర్జీ నే మిగిలిస్తుంది. ఎవరైనా సరే మిమ్మల్ని కేవలం వాళ్ళ బాధల కోసమే యూజ్ చేసుకుంటుంటే వాళ్ళని అబ్జర్వ్ చేయండి. వాళ్ళకి దూరంగా ఉండండి. మన లైఫ్ లో ఫామిలీ ని సెలెక్ట్ చేసుకోలేము కానీ ఫ్రెండ్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీ బాధ వినేవారు, వాళ్ళ బాధను మీరు అర్ధం చేసుకునేలా ఎవరైనా ఉంటె ఆ గుడ్ ఫ్రెండ్స్ తో ఉండండి. అంతేగాని మీ దగ్గర ఎప్పుడు బాధలు చెప్పుకుంటూ, అసలు మీ మాట వినని వాళ్ళు ఎవరైనా ఉంటె వాళ్ళకి దూరంగా ఉండండి. అప్పుడు మీ ఎనర్జీ డబల్ స్ట్రాంగ్ అయిపోతుంది.
6. Read good books ( మంచి బుక్స్ చదవండి )
సో ఇప్పుడు ఫ్రెండ్స్ తో మాట్లాడేశారు, ప్రశాంతం గా ఇంటికొచ్చారు. ఇంటికి వచ్చాక పర్టిక్యూలర్ గుడ్ బుక్స్ చదివితే మీలో మంచి ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే పుస్తకాల్లోని ఐడియాలు చదవడం వల్ల మీ మెంటాలిటీ మారుతుంది. సబ్కాన్షియస్ లెవెల్లో మీ ఆలోచనలు ఇంకా బెటర్ అవుతాయి. దీనివల్ల మీలో ఎనర్జీ ఎప్పుడు పాజిటివ్ గా ఉంటుంది. పుస్తకాలూ చదివే ఓపికలేదు బయ్యా అని అనుకుంటే డెఫినెట్లీ మా వెబ్సైట్ ని డైలీ ఫాలో అవుతూ ఉండండి. మీరు డ్రైవ్ చేస్తున్నపుడు, మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు ఏమైనా కాలిగా ఉన్న కూడా ఆడియో బుక్స్ వింటూ వేరే ప్రపంచానికి మీరు వెళ్లిపోవచ్చు. సో మంచి పుస్తకాలూ చదవండి. మీ ఎనర్జీ ని డబల్ స్ట్రాంగ్ చేసుకోండి.
7. Set the day before what to do (ఏమి చేయాలన్నా ముందు రోజు సెట్ చేయండి)
డిన్నర్ చేసాక లేకపోతే చేసేముందు మీరు నెక్స్ట్ డే ని ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఎనర్జీ అనేది అసలు దేనికి వాడాలి అనే క్లారిటీ ఉంటె మన మైండ్ కూడా దానిమీద ఫోకస్ చేస్తుంది. ఉదయాన్నే లేచిన వెంటనే ఎం చేయాలి అనే ఐడియా ఉంటె మనం సిట్యువేషన్ ని ఇంకా బాగా డీల్ చేస్తాం. మనం ఒక ప్లాన్ అనుకోని వెంటనే పనిలోకి వెళ్ళిపోతే మీ ఎనర్జీ మరీ ముఖ్యంగా మీ మెంటల్ ఎనర్జీ వేరే ఆలోచనలకూ లోనవదు. ఓవర్ థింకింగ్ అనే కొచెనే ఉండదు. సో నిద్రపోయే ముందు నెక్స్ట్ రోజు ఎన్నింటికి లేవాలి, లేచిన వెంటనే ఎం చేయాలి. ఆ రోజులో మీరు కంప్లీట్ చేయాల్సిన ముఖ్యమైన పనులను షెడ్యూల్ చేసుకోండి. దీనితో నిద్రపోయేముందే మీకు నెక్స్ట్ డే ఎం చేయాలి అనే ఐడియా తో మీరు హ్యాపీగా నిద్ర పోవచ్చు. మీ ఎనర్జీ కూడా మార్నింగ్ రెడీ గా ఉంటుంది.
8. Align your life ( మీ జీవితాన్ని సమలేఖనం చేయండి )
ఇది నిద్రకి ముందు చేయడం మంచిది. కానీ ప్రతిరోజు ఇది చేయాల్సిన అవసరం లేదు. వీక్లి వన్స్ ఒకసారి పెట్టుకుంటే చాలు చాలా మంది వాళ్ళ పాజిటివ్ ఎనర్జీ లూజ్ అవడానికి ఒక ముఖ్యమైన కారణం వర్క్ మరియు పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం. ఉదాహరణకి ఆఫీస్ లో మీకు ప్రమోషన్ రావడం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. మీ గోల్స్ గురించి మీరు ఎవరికైనా చెప్తే అది నవ్వే ఫ్రెండ్స్ ఉంటారు. మీ ఎదుగుదలకి కుళ్లిపోయేవాళ్లు కూడా ఉంటారు. వీళ్లందరి గురించి మనం అలోచించి అలోచించి పర్సనల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ని పెంచుకుంటాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ ఎనర్జీ ని డ్రైన్ చేసేస్తుంటాయి. సో ఒకసారి కూర్చోండి, రోజు కాకపోయినా లేదా వారానికి ఒకరోజు కూర్చొని మీ గోల్స్ గురించి ఆలోచించండి. వేరేవాళ్ళ వల్ల మీరు పడుతున్న టెన్షన్స్ గురించి ఒకేసారి ఆలోచించండి. వాటిని ఎలా దాటాలి ఒక ప్లాన్ రాసుకోండి. ఆ ప్లాన్ ని అమలు చేసి మీ ఎనర్జీ ని బీపత్యంగా పెంచేయండి.
nice article.
ReplyDeleteమంచి విషయాలను చెప్పారు. నేను కూడా మీరు చెప్పినట్లు చేస్తాను.
Thank you for the article.