How to improve liver health naturally లివర్ యొక్క విధులు, లివర్ పాడవకుండా ఎలా కాపాడుకోవాలి పూర్తి సమాచారం.
How to improve liver health naturally మన శరీరంలో లివర్ అనేది ఒక అద్భుతమైన ఒక పెద్ద కర్మాగారం. సుమారు 600 రకాల పనులను 1కిలోన్నర బరువు ఉండే లివర్ ప్రతిరోజు నిర్వహిస్తుంది. లివర్ కి ఉన్న గొప్ప విశిష్టత ఏమిటంటే కేజిన్నర బరువులో సుమారుగా ఒక అరకేజీ లివర్ ని ఉంచేసి కేజీ లివర్ ని తీసేసిన 3 నుంచి 6 నెలల్లో మరలా ఈ కేజీ లివర్ ని తిరిగి తయారుచేసుకోగలుగుతుంది. లివర్ కి ఉన్న గొప్పతనం ఇది. శరీరం లో ఉన్న ఏ పార్ట్ కి కూడా ఇలాంటి గుణం లేదు, ఒక్క లివర్ కి మాత్రమే ఉంది. కేజిన్నర లివర్ లో కేజీ తీసేసినప్పుడు మిగిలిన అరకేజీ లివర్ శరీరం లోని అన్ని విధులను నిర్వర్తిస్తుంది.
ఇలాంటి విశిష్టత ఉన్న ఈ లివర్ మన శరీరం లో సవ్యంగా పని చేస్తే ఎంత మేలు జరుగుతుందో అర్ధం చేసుకోవాలి. ఇలాంటి పొల్యూటెడ్ ప్రపంచంలో కూడా మనం హ్యాపీ గా బ్రతికేటట్లు చేసే ఒకే ఒక్క పార్ట్ లివర్. ఎరువులు, పురుగు మందులు, కార్బైడ్లు, సిగరెట్స్, గంజాయి, ఒక్కపొడి, ఆల్కహాల్, కూల్డ్రింక్స్, ఐస్క్రీమ్స్, చాకోలెట్స్, వీటన్నిటి తయారీలో వాడే ప్రిజర్వేటిస్, కలర్స్ అఫ్ ప్లేవర్స్, అలాగే వీటితో పాటు మనందరం విపరీతంగా బాగా టాబ్లెట్స్ వేసుకుంటుంటాం జబ్బులు వచ్చునప్పుడు. ఈ టాబ్లెట్స్ యొక్క దుష్ప్రభావాలు, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం వీటన్నిటి నుంచి బాడీని రక్షించి శుద్దిసేసి టోటల్ డీటాక్సీపై చేసి మనందరం ఈ భూమ్మీద తిని తిరుగుతున్నామంటే ఆ ఒక్క లివర్ బాగా పని చేస్తుంది కాబట్టి.
కానీ లివర్ కొంచెం డల్ గా ఉండటం వలన కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి. లివర్ కొంచెం యాక్టీవ్ గా మనం కొద్దిగా సపోర్ట్ చేస్తే అది చురుగ్గా పని చేస్తే ఈ ఎరువులు, పురుగు మందులు కాస్త ఈ పొల్యూటెడ్ ప్రపంచంలో ఉన్న పొల్యూషన్ ఏది మనల్ని ఏమి చేయదు. అంత బాగా రక్షించే పవర్ ఉన్న ఒకే ఒక్క ఆర్గాన్ లివర్. ఇది ఒక్కటి మంచిగా ఉంటె చాలు అన్నిటికి మంచి పోషకాలు వెళ్తాయి. మన బాడి లోకి వచ్చే ఈ పొల్యూషన్ ని అంతా క్లీన్ చేస్తుంది.
లివర్ చేసే యొక్క విధులు ఏంటి?
- పొట్ట భాగానికి కుడి వైపున లివర్ ఉంటుంది. లివర్ ఎర్రగా కలర్ ఫుల్ గా ఉంటుంది. దానికి దిగువ భాగం లో గాల్బ్లాడర్(పసర తిత్తి) ఉంటుంది. ఈ గాల్బ్లాడర్ (పసరు తిత్తి) 90ml పైత్య రసాన్ని నిల్వచేసుకునే సంచి లాగా ఉంటుంది.
- లివర్ ఆహార పదార్దాలను అరిగించడానికి పైత్య రసాన్ని తయారుచేస్తుంది. దాన్ని బయిల్ జ్యూస్ అంటారు. ఈ పైత్య రసం లో క్రొవ్వులను అరిగించడానికి ఉపయోగపడే ఎంజైమ్స్ ఉంటాయి. అలాగే టాక్సిన్స్ ని కూడా ఈ పైత్య రసంలో పెట్టి ప్రేగుల్లోకి పంపిస్తుంది.
- లివర్ నుంచి ఉత్పత్తి అయినా ఈ పైత్య రసం గాల్బ్లాడర్ లోకి వచ్చి స్టోర్ అయ్యి అవసరమైనప్పుడు ప్రేగుల్లోకి రావడానికి గాల్బ్లాడర్ ముడుచుకుంటుంది. గాల్బ్లాడర్ నుంచి పైత్యరసం నాళం గుండా చిన్న ప్రేగుల మొదట్లోకి వదలబడుతుంది.
- ఈ లివర్ ఫస్ట్ క్రొవ్వు పదార్దాలని డైజెస్ట్ చేయడానికి, టాక్సిన్స్ బయటికి వదలడానికి పైత్య రసం ద్వారా చేస్తుంది.
- 6 నుంచి 12 నెలల వరకు లివర్ 4 రకాల విటమిన్ లని స్టోర్ చేసుకుంటుంది. Vitamin A, Vitamin E, Vitamin D, Vitamin K ఈ నాలుగు విటమిన్ లను స్టోర్ చేసుకుంటుంది.
- లివర్ రక్తం గడ్డకట్టడం నుంచి కాపాడేటువంటి విధులను నిర్వర్తిస్తుంది. Vitamin K ని తయారుచేసుకుంటుంది, లివర్ బాడీ కి కావాల్సిన కొలెస్ట్రాల్ ని తయారుచేసుకుంటుంది. అలాగే బాడీలో కొన్ని రకాల ప్రోటీన్స్ ని తాయారుచేస్తుంది. బ్లడ్ క్లాటింగ్ అయినప్పుడు పెబ్రేలిజం ప్రోత్రంజిన్ ని తయారు చేస్తుంది.
- లివర్ పని చేయకపోతే కుండకు చిల్లు పడితే నీళ్లు కారినట్లు మన బాడిలో నుంచి బ్లడ్ వెళ్ళిపోతుంది. లివర్ వల్లనే దెబ్బలు తగిలినప్పుడు రక్తం గడ్డ కడుతుంది.
- మనం తిన్న ఆహార పదార్దాల ద్వారా వచ్చిన ఈ పోషకాలన్నీ ఫస్ట్ బాడీలోకి వెళ్లాలంటే ఫస్ట్ లివర్ కి వెళ్తాయి. ఈ లీవర్ లోకి వెళ్ళాక మన ఆహారాల్లో ఉండే హానికరమైనవి పొట్టలో ప్రేగుల్లో శుద్ధి అవగా ఏమైనా మిగిలినవి లివర్ లో ఉండే కుఫర్ సేల్స్ అన్నిటిని క్లీన్ చేసి ఏ హాని లేకుండా ఈ పోషకాలు అన్నింటిని రక్తం ద్వారా గుండెకి పంపిస్తుంది. గుండె అక్కడి నుండి శరీర భాగాలకు పంపిస్తుంది.
- అలాగే మనకు పురుగుమందులు, కూల్ డ్రింక్స్, ఎరువులు, కార్బైట్స్, టాక్సిన్స్ ఇలాంటివన్నీఆహారం లో కలిసి మన బాడీలోకి వచ్చినప్పుడు ఈ విషపదార్దాలు అన్నిటిని ముందు ఆక్సీకరణం చేసి పెద్ద బాండ్స్ నుంచి చిన్న చిన్నబాండ్స్ గా విడకొట్టేస్తుంది. తర్వాత వీటిని నిర్వీర్యం చేసేస్తుంది. తర్వాత వీటిని రక్తం గుండా పంపించి మూత్రం గుండా 80%, కొంత పైత్య రసంలో పెట్టి మలం గుండా పంపించేస్తుంది. ఈ రకంగా లివర్ క్లీన్ చేస్తూ ఉంటుంది.
- రోజు మొత్తంలో మనందరం పగలు పని చేసి రాత్రి పడుకుంటాం. పొట్ట, ప్రేగులు కూడా విశ్రాంతి తీసుకుంటాయి. కానీ లివర్ కి మాత్రం 24 గంటలు పనే ఉంటుంది. ఆహారం ఉన్నంతసేపు అరిగించే పని చేస్తుంది. ఆహారం అయిపోయాక తెల్లవార్లూ బాడిలో ఉండే టాక్సిన్స్ అన్నిటిని తీసుకొచ్చి బాడీ లివర్ లో వదిలేస్తుంది. లివర్ వీటన్నిటిని శుద్ధి చేసేసి మీ బాడీని, బ్లడ్ అంతటిని ఫ్యూరిపై చేసేస్తుంది.
- ఇలాంటి అద్భుతమైన పనులన్నీ ఏ పార్ట్ కి చేసే అవకాశం లేదు. ఇంత సామర్థ్యం కలిగి ఉన్న మనలో మన అనుమతి లేకుండా మనం పడుకున్న కూడా లివర్ విశ్రాంతి లేకుండా ఇంత కష్టపడి పనిచేస్తూ మనల్ని రక్షిస్తూ ఉంటె మనం ఆల్కహాల్ తీసుకుంటే, పాపం అది మత్తు వచ్చి పడుకుంటుంది. దానికి మత్తు ఇస్తే ఏముంది అది చేసే పనులన్నీటిని చేయకుండా ప్రక్కన పెట్టేస్తుంది. దీనివలన చెడు అంతా లోపల పేరుకుపోతుంటాయి. లివర్ యాక్టీవ్ గా ఉంటె మనం బాగుంటాం, దానికి మత్తు ఇచ్చి పడుకోబెడితే ఆరోగ్యం పాడవుతుంది.
- ఈ ఆల్కహాలు కూడా డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్ళిపోతే చనిపోతాము. కాఫీ లో ఉండే కెఫిన్ అనేది డైరెక్ట్ గా బ్లడ్ లోకి ఎక్కిస్తే మనం అరగంటలో చనిపోతాము. కానీ ఈ మందులన్నిటిని బాడీ లోకి ఒక్కసారి వెళ్లకుండా లివర్ ఆపుకుని కొద్దీ కొద్దిగా ఇబ్బంది లేని డోసుల్లో విడగొట్టి మరి పంపిస్తుంది. మత్తు కూడా ఒకేసారి బాడీ అంతటికి వెళ్లకుండా తను డైల్యూట్ చేసి పంపుతుంది.
Also Read :- Dietary principles for kidney stones కిడ్నీ లో రాళ్లు ఉన్నప్పుడు ఏం తినాలి.
లివర్ ని పాడు చేసే ఆహారపు అలవాట్లు, వ్యసనాలు
- మెయిన్ గా ఆల్కహాల్ త్రాగటం వలన లివర్ ఎక్కువ డామేజ్ అవుతుంది. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ దాకా వెళ్ళేది దానివల్లనే.
- నూనె పదార్దాలు ఎక్కువ లివర్ ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
- వీటితో పాటు ఎసిటిక్ ఫుడ్స్ బాడి లో ఉండే PH అంతటిని రెగ్యులేట్ చేస్తుంది. లివర్ బాడి లో ఆమ్లత్వం పెరక్కుండా క్షారత్వాన్ని కరెక్ట్ గా బాలన్స్ గా ఉంచుతుంది. అందుకే అలాంటిది రెగ్యులేట్ చేయాలంటే లివర్ కి చాలా పోషకాలు కావాలి. చాలా విటమిన్ లు కావాలి. ఇవన్నీ అందేలా చూడాలి. కానీ ఇలాంటివి అందించే బదులుగా చాలా మంది కూల్డ్రింక్స్, పంచదార, వైట్ ప్రోడక్ట్స్, వైట్ పాయిజన్స్ లాంటివి బాగా ఎక్కువగా తీసుకుంటే వీటన్నిటిని తట్టుకోలేక లివర్ ఇబ్బంది పడుతుంది.
- రక్తం లో చెక్కెర స్థాయిలు ఒకేసారి పెరిగిపోకుండా నియంత్రిస్తుంది. షుగర్ డౌన్ అయినప్పుడు మనం కళ్ళు తిరిగి కిందపడకుండా లివర్ నియంత్రిస్తుంది.
- మీరు తీసుకున్న ఆహారం ఎక్కువైనప్పుడు లివర్ దాన్ని క్రొవ్వుగా మారుస్తుంది. ఆహారం తినకుండా ఉన్నప్పుడు క్రొవ్వుని కరిగించి రక్తం లోకి చెక్కెరని విడుదల చేస్తుంది.
- మరి ఇవన్నీ సమర్థవంతంగా జరగాలంటే నూనె పదార్దాలు, ఆల్కహాలు లాంటి వాటికి దూరంగా ఉండాలి.
- సాధ్యమైనంతవరకు కూల్ డ్రింక్స్, ఐస్క్రీమ్స్, ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఎక్కువగా ఉన్నవాటిని వాడితే లివర్ యొక్క విధుల్ని సగానికి సగం పని చేయనీయకుండా దాన్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు త్రాగించే పనులే ఈ బాడ్ హ్యాబిట్స్.
- గుట్కాలు, జరదాలూ, గంజాయి, సిగరెట్స్, టీ, కాఫీ లు ఇవన్నీ లివర్ ని సమర్థవంతంగా పని చేయనీయకుండా అడ్డు పడుతుంటాయి. దాని మెకానిజం వీక్ అయిపోతుంది. మనము సిక్ అవుతాము. కాబట్టి దాన్ని హెల్త్య్ గా ఉంచాలంటే ఇలాంటి వ్యసనాల నుంచి కాస్త లివర్ ని రక్షిస్తే బాగుంటుంది.
లివర్ కి ఎదురయ్యే ఇబ్బందులు:
- మాములుగా ఇప్పుడు అందరు చాలా మట్టుకు ఊబకాయం తో ఉంటున్నారు. వీళ్లకు లివర్ కూడా ఊబకాయం పట్టేస్తుంది, దీన్నే పాటీ లివర్ అని అంటారు. లివర్ సెల్స్ కూడా క్రొవ్వు పట్టేసి పెద్దగా అయిపోతాయి.
- ఎన్ లార్జ్ డ్ లివర్, పాటి లివర్, హార్డ్ అండ్ లివర్(నిదానంగా క్రొవ్వు ఎక్కువైపోయి గట్టిపడిపోతుంది) నిదానంగా ఇది సిరిరోసిస్ గా కూడా మారుతుంది. ఇది ప్రమాదకరమైన స్టేజ్. కొంతమంది ఆల్కహాల్ త్రాగడం వల్ల సిరిరోసిస్ వస్తుంది. నానాల్కహాల్ సిరిరోసిస్ కూడా వస్తుంది. ఆల్కహాల్ త్రాగనివాళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల, కొంచెం జీవన విధానం బాగులేనందువల్ల ఇమ్మ్యూనిటి తగ్గిపోయి ఈ సిరిరోసిస్ వస్తుంది.
- అలాగే లివర్ కి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి కామెర్లు రావడం, ఇలాంటివన్నీ ప్రధానంగా లివర్ కి వచ్చే జబ్బులు. మన అలవాట్లు మార్చుకుంటే లివర్ మరల రివర్స్ అయ్యి ఇవన్నిటిని తగ్గించుకోగలుగుతుంది. లివర్ కి ఉన్న గొప్ప గుణం ఇది.
లివర్ ని కాపాడుకునే ఆహార నియమాలు (Improve liver health)
Fruits and Vegetables |
ముఖ్యంగా లివర్ కి ప్రతి రోజు అన్నిటికంటే బాగా హెల్ఫ్ జరగాలంటే సాయంత్రం 6 లేదా 7 గంటల లోపల ఆహారం తిని ఆపేయాలి. నైట్ డైజెస్ట్ పని లివర్ కి పడితే రిపేర్ అండ్ ఇవన్నిటిని క్లీన్ చేసుకునే పని చేయలేక ఇబ్బంది పడుతుంది.
అందుకని నేచర్ ఇచ్చిన Time Table పగలు తినే జంతువులకు నైట్ రెస్ట్. రాత్రి తినే జంతువులన్నిటికి పగలు రెస్ట్. కాబట్టి 6 గంటలకల్లా డిన్నర్ ని ఓన్లీ ఫ్రూట్స్ తినేస్తే సరిపోతుంది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, నీడపూట కూర్చునే వారు. శక్తి చాలదు అనుకున్నవారు. ఫ్రూట్స్ తో పాటుగా కొంచెం నానబెట్టిన విత్తనాలు, ఏవైనా ఎండు విత్తనాలు నానబెట్టుకొని మొలకలెత్తినవి తినేసి వాటితోపాటు ఫ్రూట్స్ తేనెస్తే భోజనం చేసినంత బలం. వీటన్నిటిలోVitamin A, Vitamin C, Vitamin E, Vitamin B, అమైనో యాసిడ్స్, మినరల్స్ ఇవన్నీ పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ లివర్ ని నైట్ ఉపయోగించుకొని విషపదార్దాలను, టాక్సిన్స్ , కెమికల్స్ అన్నింటిని విడగొట్టి బయటికి పంపిస్తుంది. అందుకని లివర్ బాగా క్లీన్ చేయాలంటే పోషకాలు ఉన్నవి ఎర్లీ గా తినాలి. ఇలా డిన్నర్ తీసుకోవడం లివర్ యొక్క హెల్త్ కి చాలా మంచిది.
వారానికి ఒకసారి ఉద్యోగాలకి సెలవు తీసుకుంటున్నాం కదా అలాగే మన లివర్ కోసం వారానికి ఒక్క రోజు సెలవు ఇవ్వాలి. Monday ఫాస్టింగ్ చేస్తే సరి. ఇక్కడ సండే ఎందుకు చెప్పలేదో అర్థమై ఉంటుంది. పాస్టింగ్ చేసిన ఆ 24 గంటలు లివర్ డీటాక్సిఫికేషన్ చేసి 5-6 రోజుల్లో మిగిలిన పెండింగ్ హోంవర్క్ అంతటిని ఆ రోజు వాష్ అవుట్ చేసుకుంటుంది. లివర్ ఏరోజుదారోజు నైట్ చేసేసుకుంటుంది, పెండింగ్ వర్క్స్ అన్నింటిని ఉపవాసం రోజు చేసుకుంటుంది. ఆ రోజుల్లో ఋషులు, పెద్దలు అందరు కూడా ప్రతీ శనివారం ఉపవాసం పెట్టారు. ఏకాదశికి ఉపవాసం పెట్టారు. ఇలా సందర్భాల రూపంలో పొట్ట మాడ్చి రక్షించుకోమని నేర్పారు. రోజులో 50% అయినా 60% అయినా మీరు వండకుండా తినడానికి ట్రై చేయండి. పోషకాలు బాగా ఉండే ఆహారాలు మొలకలు, ఆకుకూరలు, కూరగాయలు, పొట్టు తీయని ధాన్యాలు సహజమైన ఆహారాలు ఇలాంటివి ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. దీని వల్ల లివర్ 150 ఏళ్ళు వరకు పని చేసి మిమ్మల్ని రక్షిస్తుంది. వండితే పోషకాలు పోతాయి. వండితే ఉప్పు, నూనెలు వేస్తాము. అందుకని వండకుండానే తింటే సహజంగా అందవలసినవన్నీ అందుతాయి కాబట్టి ఈ లాభాలు అన్ని వస్తాయి. రోజుకు కనీసం 4 లేదా 5 లీటర్ల మంచి నీళ్లు త్రాగాలి. బాడీ లో PH మెంటైన్ చేయాలంటే వాటర్ కావాలి. లివర్ క్లీన్ చేసిన వేస్టేజ్ అంతా బయటికి పోవాలంటే వాటర్ కావాలి.
ఈ ఆర్టికల్ గురించి మీరు ఏదైనా సందేహాలు, సలహాలు తెలపాలనుకుంటే ఈ పోస్ట్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రాయండి. బెస్ట్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ తెలుగు లో తెలుసుకోవాలను కుంటే మన HealthTipsTelugu.com ని డైలీ ఫాలో అవుతూ ఉండండి.