Hair growth at home(ఇంటి చిట్కాలు)-Health tips telugu
Hair growth at home పుదీనా మంచి వాసన ఇచ్చే ఒక ఆకు. ప్రతి ఇంట్లో కూడా చాలా మంది ఆ పుదీనా ని చిన్న మొక్కని వేసుకుంటే చక్కగా పుదీనా పాకి మంచిగా అల్లుకుపోయి పెరుగుతూ ఉంటుంది. ఏ వంటలో అయినా సరే కమ్మటి సువాసన రావాలంటే పైనల్ గా కొంచెం పుదీనా ఆకులు చల్లిన, బిర్యానీల్లో, మసాలా కూరలన్నింటిలో పుదీనా వాడుతుంటాం. అలాంటి మంచి వాసనని, మంచి రుచిని ఇచ్చే పుదీనా వెనక ఉన్న ఆరోగ్య రహస్యాలు మీకు తెలిస్తే ఇంకా బాగా ఉపయోగించుకుంటారు.
- పుదీనాలో పోలిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆకుల్లో పోలిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న ఆకు పుదీనానే.
- ఒక రోజుకు మనకు 400 మైక్రో గ్రాముల ఫోలిక్ యాసిడ్ కావాలి.
- 100 గ్రాముల పుదీనాలో 114 మైక్రో గ్రాముల పోలిక్ యాసిడ్ ఉంటుంది.
పుదీనా వాడటం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి?
- పుదీనాలో ఫోలేట్ ఉంటుంది. పుదినాను తిన్నప్పుడు ఇది లోపలి వెళ్లి ఈ ఫోలేట్ ఫోలిక్ యాసిడ్ గా మారుతుంది.
- ఇందులో ఫోలిక్ యాసిడ్ బాగా ఉండటం వల్ల రక్త కణాలు బాగా తయారవడానికి ఈ ఫోలిక్ యాసిడ్ బాగా ఉపయోగపడుతుంది. అందుచేతనే ఫోలిక్ యాసిడ్ లోపం ఉన్నవారికి రక్త కణాలు సరిగ్గా తయారుకాక రక్తహీనత సమస్యలు వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి ప్రధానంగా ఉపయోగపడుతుంది.
- పుదీనాలో ఉండే పోలిక్ యాసిడ్ అనేది జుట్టుకి అన్నింటికన్నా చాలా లాభం అని సైన్టిస్టులు స్పష్టంగా నిరూపించడం జరిగింది.
- జుట్టు కుదుర్ల భాగంలో కెరటినోసైట్స్, మెలనోసైట్స్ అనే కణజాలాలు ఉంటాయి. ఇవి కరెక్ట్ గా పని చేస్తేనే జుట్టు ఒత్తుగా చక్కగా hair growth బాగుంటుంది.
- ఈ ఫోలిక్ యాసిడ్ సరిగా లేదు అనుకోండి జుట్టు కూతుర్లు బలహీనమైపోతుంటాయి. జుట్టు ఊడిపోవడం, రాలిపోవడం, పల్చబడటం ఎక్కువ జరుగుతుంది.
- ఈ పుదీనా లో ఉండే ఈ ఫోలేట్ అనేది బాగా జుట్టు కుదుర్లలో ఉండే కెరటినోసైట్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. జుట్టు బాగా ఎదగడానికి, జుట్టు బాగా దృడంగా ఉండటానికి ఈ కెరాటినోసైట్స్ బాగా పని చేస్తాయి. కేరాటిన్ అనేది బాగా ప్రొడక్షన్ వచ్చేసి జుట్టు బాగుంటుంది.
- అలాగే మెలనోసైట్స్ తీసుకుంటే ఇవి మెలనిన్ అనే ఒక నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలం. ఈ పోలిక్ యాసిడ్ బాగా పుదీనాలో ఉండటం వలన ఫోలేట్ అనేది ముఖ్యంగా ఈ మెలనోసైట్స్ ని స్టిమ్యులేట్ చేసి మెలనిన్ అనే నలుపు వర్ణాన్ని బాగా ఉత్పత్తి చేసేందుకు ప్రేరణ కలిగిస్తాయి.
- ఈ రెండు బాగా పనిచేస్తే జుట్టు నల్లగా ఉండటానికి, జుట్టు ఒత్తుగా ఉండటానికి, ఊడిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రావడానికి, జుట్టు ఎదగడానికి ఈ రెండు సేల్స్ ని ప్రభావితం చేయడానికి పుదీనాలో ఉన్న ఫోలిక్ యాసిడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది.
- రోజ్మానిక్ యాసిడ్ అని పుదీనాలో ఉంటుంది. ఇది యాంటీ ఇంఫ్లఆమెట్రీ గా పనిచేస్తుంది.
- పుదీనాని తిన్నప్పుడు ఇది లోపలికి వెళ్ళాక రోజ్మానిక్ యాసిడ్ అనేది ఆస్తమా ఉన్నవారికి, స్లేస్మాలు ఉన్నవారికి లంగ్స్ లో కాస్త ఇంఫ్ల మేషన్స్ రాకుండా, అలాగే అలర్జీ లు ఉన్నవారికి అలర్జీలు పెరగకుండా నిరోధించడానికి పనికి వస్తుంది. అంటే అక్కడ ఇంఫ్ల మేషన్స్ తగ్గించడానికి అలర్జీ లు ఉండటం వల్ల ఏమవుతుంది అంటే మన శరీరం లో కణజాలం అతిగా వర్క్ చేస్తాయి. ఓవర్ యాక్టివ్ గా ఉంటాయి. ఇలాంటి ఓవర్ యాక్టీవ్ వల్ల అలర్జీలు ఎక్కువ డవలప్ అవుతూ ఉంటాయి. ఆ ఓవర్ యాక్టీవ్ సేల్స్ ని నార్మల్ కి తీసుకువచ్చి అలర్జీని తగ్గించడానికి నాచ్చురల్ గా పనికొస్తుంది.
- పుదీనా ఆకుల్ని ఎప్పుడైనా ఆస్తమా అలర్జీలు ఉన్నవారు వేడి నీళ్లలో కొన్ని ఆకులు వేసి మరిగించుకొని ఆవిరి పెట్టుకోవచ్చు, ఆవిరి పీల్చుకోవచ్చు. లేదా పెప్పెర్మెంట్ ఆయిల్ నీళ్ళల్లో వేసి ఆవిరి పట్టుకొని ఆవీరి పీల్చుకోవడం కూడా బాగా మంచిది.
- అలర్జీలు ఎక్కువ ఉన్నవారికి, ఆస్తమా ఎక్కువ ఉన్నవారికి మరిగించిన నీళ్ళల్లో పుదీనా ఆకులూ వేసి బాగా మరిగించి వడకట్టి ఆకులను తీసేసి ఆ పుదీనా నీరు ప్రొద్దున్నే త్రాగడం చాలా మంచిది. ఇది యాంటీ ఇంప్ల మెంట్రీగా పనికొస్తుంది.
పుదీనాలో ప్రధానంగా రెండు కెమికల్స్ ఉంటాయి.
- బీటా పినిన్.
- బీటా కెరియో పినిన్.
Mint (పుదీనా) |
దీనితో పాటు ఈ కెమికల్స్ కూడా పెయిన్ కిల్లర్ లాగా చక్కగా పెయిన్ తగ్గించడానికి నెచ్చురల్ పెయిన్ కిల్లర్ లాగా పనికొస్తున్నాయని సైన్టిస్టులు నిరూపించడం జరిగింది. అందుకని పూర్వం రోజుల్లో మన ఋషులు ఇలాంటి పుదీనాలో ఇన్ని లాభాలు ఉన్నాయని గ్రహించి మనం అటు కరివేపాకు, ఇటు కొత్తిమీర, ఇటు పుదీనా వంటల్లో చివర్లో చెల్లేసుకుని తినేటువంటి పోషకాలు పోకుండా, మేడిషనల్ ప్రాపర్టీస్ నశించకుండా చక్కగా మన లోపలి వెళ్లి ఇన్ని రకాల మేలు చేయడానికి ఉపయోగపడతాయని వారు గ్రహించారు కాబట్టే ఇలాంటి ఆచారం పెట్టారు. అందుకని పుడినాని రోటి పచ్చళ్ళు చేసుకొని ఎక్కువగా వాడుకోవడంగాని, పుదీనా ని కూరల్లో ఎక్కువగా వేయడంగాని, పుదీనా రసం తీసుకొని వంటల్లో పోయడంగాని, పుదీనా ని మరిగించి ఆ నీళ్లు త్రాగడంగాని, పుదీనా గ్రైండ్ చేసి వాసన పీల్చడంగాని, వేడి నీళ్ళల్లో వేసి ఆవిరి పట్టడంగాని, పుదీనా నుంచి వచ్చిన ఆయిల్ ని వాసనగాని, రాసుకోవడంగాని, నొప్పులకు ఉపయోగించుకోవడం ఇన్ని కోణాల్లో మంచిదని సైన్టిఫిక్ గా స్టడీస్ చేసి నిరూపించిన శాస్త్రవేత్తలు ఎవరంటే 2017వ సంవత్సరంలో యూనివర్సిటీ అఫ్ ఇస్లామిక్ ఆజాద్ ఇరాన్ వారు ఈ పరిశోదనాలు అన్ని కూడా చేసి నిరూపించారు.
అలాగే యూ.కే వారు కూడా పిప్పర్మెంట్ ఆయిల్ మీద స్పష్టంగా సైన్టిస్టులు పరిశోధన చేసి ఎన్ని ఫలితాలు ఉంటాయో నిరూపించారు. మరి ఇవన్నీ పుదీనాలో ఉండే ఔషధగుణాలు పుదీనా నుంచి తీసిన పిప్పర్మెంట్ ఆయిల్ లో ఉన్న ఔషధగుణాలు కాబట్టి మనకి అందుబాటులో దొరికిన పుదీనా ని చిన్న చిన్న కుండీలు కానీ, ప్లాస్టిక్ ట్రై ల్లో మట్టి వేసి కొన్ని పుదీనా మొక్కలు వేస్తె చాలు ఎప్పుడు ఫ్రెస్ గా పుదీనా అందుబాటులో ఉంటుంది. మనం మంచిగా అన్ని సందర్భాలు ఇలా వాడుకోవచ్చు. అందుకనే నాచ్చురల్ గా ప్రకృతి ప్రసాదించిన చక్కటి సువాసనని ప్రసాదించే పుదీనా వెనక ఇన్ని ఆరోగ్య వాస్తవాలు దాగి ఉన్నాయి.
ఇటువంటి మంచి హెల్త్ టిప్స్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం మన Health Tips Telugu వెబ్సైట్ ని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఈ ఆర్టికల్ గురించి ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రాయండి.
Hair grow gurinchi chala baga rasaru, Nice article bro��
ReplyDeleteHair growth gurinchi chala baga rasaru thank you so much your information thelipinanduku
ReplyDelete