Type Here to Get Search Results !

Translate

ADVERTISEMENT

Top reasons for weight gain అధిక బరువుకి ముఖ్య కారణాలు

Top Reasons for Weight Gain Health Tips Telugu అధిక బరువు పెరగడానికి ముఖ్య కారణాలు

top-reasons-for-weight-gain-health-tips-telugu

Top reasons for weight gain ఈ రోజుల్లో బరువు పెరగడం ఒక పెద్ద సమస్యగా మారింది. ఇలా అనుకోకుండా పెరిగే అధిక బరువు వలన ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చి చాలా మంది బాధ పడుతున్నారు. ఈ స్థూలకాయత్వాన్ని తగ్గించుకునేందుకు అందరు చాల రకాలుగా శ్రమిస్తూ ఉంటారు.

1. అవసరానికి మించిన ఆహారం తీసుకోవడం

ఆహారం విషయానికి వస్తే వెనకటి రోజుల్లో అయితే రోజుకు మూడుసార్లు తినేవారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రోజుకు మూడుసార్లు అనేది ఆ రోజుల్లో నియమంగా ఉండేది. కానీ ఈ రోజుల్లో పని ఉన్న లేకపోయినా రాత్రిపూట 11 లేదా 12గంటల వరకు ఉండటం అనేది సర్వసాధారణంగా అలవాటు అయిపోయింది. మార్నింగ్ నుంచి నైట్ 12 గంటల వరకు పడుకోకుండా ఉండటం వలన ఈ  ఆహార నియమాన్ని రెండు సార్లు పొడిగించి మార్నింగ్, ఆఫ్టర్నూన్ , ఈవినింగ్, నైట్ కి, ఇంకా పడుకునే ముందు అర్ధరాత్రికి ఇలా దాదాపుగా రోజుకి 3 నుంచి 5 సార్లు తినడం జరుగుతుంది. ఇలా తినే ఆహారంలో కూడా ఏవి రుచిగా ఉంటాయో, ఏవి బాగా ఇష్టమో వాటినే ప్రధానంగా తినడం అనేది జరుగుతుంది. 

food-health-Main-reasons-for-weight-gain-health-tips-telugu
food (ఆహారం)

ప్రతి మనిషి తనకు ఇష్టమైన వాటిని తినడంలో తప్పులేదు కానీ మనం చేసే పని ఎంత? ఆ పనికి తగ్గట్టు తింటున్నామా అనేది ఆలోచించాలి, సాధారణంగా చాల మంది బరువుని పెంచే ఆహార పదార్దాలు తీసుకుంటూ ఉంటారు, వాటిలో ఎక్కువగా రైస్ తినడం, బరువుని పెంచే ఇడ్లిలు, ఉప్మాలు, పూరీలు, ఎక్కువగా తీసుకోవడం, సాయంత్ర సమయంలో స్నాక్స్ పేరుతో నూనెలో వేయించినవె స్నాక్స్ గా తీసుకోవడం, రాత్రిపూట ఫ్రైడ్ రైస్, నాన్వెజ్ ఐటమ్స్, వెజిటేరియన్ లో డీప్ ఫ్రైస్, బొజనంతో పాటు స్వీట్స్, హాట్స్, తీసుకోవడం. ఇవన్నీఎక్కువ శక్తిని ఇచ్చే ఆహార పదార్దాలు, హై క్యాలరీ డైట్ అంటారు. ఇలా రోజు అవసరాన్ని మించి ఆహారాన్ని తింటున్నాము, అందువల్ల ఖర్చు అయ్యే కాలరీస్ కంటే మిగిలిపోయే క్యాలరీస్ ఎక్కువగా ఉండటం వలన క్రొవ్వుగా శరీరం లో పేరుకుపోతుంది. కాబట్టి మన మన శరీరం బరువు పెరుగుతుంది. 

2 . వ్యాయామం చేయకపోవడం 

సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితితుల వలన చాల మంది శారీరక శ్రమకు దూరంగానే ఉంటున్నారు. మనందరికీ డబ్బు సంపాదన కోసం ఏదోఒక రకంగా శ్రమిస్తూనే ఉంటారు. కానీ మనం ఈ రోజుల్లో శారీరకంగా చేసే శ్రమ తక్కువ, మానసికంగా చేసే శ్రమలు ఎక్కువగా ఉంటున్నాయి. అందువల్ల మనం తీసుకున్న ఆహారంతో వచ్చే క్యాలరీస్ సరిగ్గా ఖర్చు అవడం లేదు, తక్కువగా ఖర్చు అవుతున్నాయి. అందువలన మిగిలిపోయిన క్యాలరీస్ మన శరీరంలో క్రొవ్వుగా మారుతుంది. అందువలన పనికి తగినట్లుగా ఆహారాన్ని తీసుకోవాలి, మరియు ముఖ్యంగా ఉదయం, సాయంత్రం కొంత సమయాన్ని కేటాయించుకొని వ్యాయామాన్ని చేయడం వలన బరువు పెరిగే అవకాశం ఉండదు.

Top-reasons-for-weight-gain-weight-loss-exercise-health-tips-telugu
( వ్యాయామం ) Exercise

పనికి తగ్గ ఆహారం, రోజు వ్యాయామం చేయకపోవడం ఇవి రెండు తప్పులు మనం మార్చుకోకుండా బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా లాభం ఉండదు. ఈ రెండింటిని గనుక మనం మార్పు చేసుకోగలిగితే అధిక బరువు సమస్య నుంచి తేలిగ్గా బయటపడవచ్చు. 

3 . జీర్ణవ్యవస్థ 

జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వలన కొందరు అధికంగా బరువు పెరుగుతూ ఉంటారు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వలన మలబద్దకం సమస్య ఏర్పడుతుంది, దీని వల్ల శరీరంలో టాక్సిన్లు పేరుకుపోతాయి, ఇవి క్రొవ్వు నిల్వలను పెంచుతాయి. అందువలన ఫైబర్ పుష్కలంగా లభించేటువంటి ఆహారం తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు అవుతుంది. దీని వలన శరీరంలో క్రొవ్వు పేరుకు పోకుండా జగ్రత్తగా ఉండొచ్చు. 

4. పోషకాలు 

రోజు శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్, ఫైబర్, నూట్రియన్లు ఉన్న ఆహారాన్నీ కచ్చితంగా తినాలి. దీని వలన పోషకాలు మన శరీరానికి సమృద్ధిగా అందుతాయి. లేకపోతే శరీరంలో మెటబాలిజం ప్రక్రియ క్షిణిస్తుంది, ఫలితంగా క్రొవ్వు నిల్వలు పేరుకుపోయి బరువు పెరుగుతారు. 

5 . నీరు చేరడం 

శరీరం నుంచి నీరు ఎప్పటికప్పుడు బయటకి వెళ్లకుండా అలాగే చేరుతూ ఉంటె అధికంగా బరువు పెరుగుతారు. ఇందుకు కారణాలు : క్రొవ్వు పదార్దాలు, ఉప్పు ఎక్కువగా తినడం, మద్యం సేవించడం లాంటి వాటి వల్ల నీరు బాగా చేరుతుంది. ఫలితంగా మన శరీరం బరువు పెరుగుతుంది.

6 . తగినంత నిద్ర

ఎక్కువగా బరువు పెరగడానికి ప్రధానమైనటువంటి కారణాల్లో నిద్ర కూడా ఒకటి, ప్రతిరోజు ప్రతి ఒక్కరు నిర్దిష్టమైన సమయం వరకు నిద్రించడం చాలా ముఖ్యమైన అంశం, లేకపోతే శరీరం లో ఆకలిని నియంత్రించే హార్మోన్లు సరిగ్గా పనిచేయడం మానేస్తాయి, ఫలితంగా అవి ఆహారాన్ని ఎక్కువ తినేలా చేస్తాయి. దీంతో బరువు పెరుగుతారు. 

7. ఒత్తిడి 

ఒత్తిడి కూడా అధిక బరువు పెరిగేందుకు కారణం అవుతుంది. ఒత్తిడి బాగా ఉన్నప్పుడు శరీరంలో అడ్రినలీన్ పెరుగుతుంది, కార్టిసోల్ హార్మోన్స్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. ఇవి స్ట్రెస్ హార్మోన్స్ కనుక బాగా ఆకలిని కలిగించి ఆహారాన్ని ఎక్కువగా తీసుకునేలా ప్రభావితం చేస్తాయి. అందుకే ఎక్కువగా ఆహారాన్ని తీసుకొని బరువు పెరుగుతారు. కాబట్టి ఎప్పటికప్పుడు కలిగే స్ట్రెస్ నుంచి దూరంగా ఉండడం వలన అధిక బరువు సమస్యలనుండి బయటపడే అవకాశం ఉంటుంది.

అతిసులభంగా బరువు తగ్గాలనుకునేవారికి 7 రోజుల డైట్ ప్లాన్:

top- reasons-for-weight-loss-health-tips-telugu
( weight loss ) బరువు తగ్గడం

మీరు కొన్ని నెలలుగా తెలియకుండా బరువు పెరిగి ఉంటారు. కాబట్టి ఈ టిప్స్ ని పాటించడం ద్యారా ఒక వారం లో 6 కేజీల బరువు తగ్గడం సులభం చేయొచ్చు. కాకాపోతే మీరు ఈ చిట్కాలను పాటించడానికి మీకు ఓపిక చాలా ఉండాలి. మీలో బరువు తగ్గాలనే దృఢ నిశ్చయం, అనుసరించే శక్తి ఉన్నపుడు కచ్చితంగా ఒక వారంలో 6 కేజీ ల బరువు తగ్గడానికి తప్పకుండ చేరుకుంటారు. 

1. మొదటిరోజు 

డైట్ లో ఇది చాల ముఖ్యమైన అంశం, ఇది కొంచెం ఆరోగ్యకరంగా మరియు లైట్ గా మొదలవుతుంది. ఫస్ట్ డే కేవలం ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. బరువు కచ్చితంగా తగ్గాలని అనుకునేవారు సహజంగా రోజులో తీసుకునే ఏ ఆహారాలు తీసుకోకుండా కేవలం పండ్లు మాత్రమే తీసుకోవాలి. రోజులో అన్ని రకాల పండ్లను  తీసుకుంటూ తగినన్ని నీళ్లు త్రాగాలి, అరటిపళ్ళు తప్ప

2. రెండవ రోజు 

రెండవ రోజు కఠినంగా వెజిటబుల్ డైట్ ని అనుసరించాల్సి ఉంటుంది, ఎందుకంటే వెజిటబుల్స్ ని ఉపయోగించి హెల్త్ సలాడ్స్ ని తయారుచేసుకోవాలి. కలర్ఫుల్ సలాడ్స్ ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా త్వరగా 1-2 రోజుల్లో క్రమంగా బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. అన్ని రకాల వెజిటబుల్స్ సీజనల్ గా లభించే వాటిని రెగ్యులర్ మీ డైట్ లో చేర్చుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. రోజుకి  8 గ్లాసుల నుంచి 12 గ్లాసుల వాటర్ తీసుకుంటూ ఉండాలి. 

3. మూడవరోజు 

fruits-and-vegetables-salad-health-tips-telugu
ఫ్రూట్స్ మరియు వెజిటబుల్ సలాడ్స్

మూడోవ రోజున డైట్ లో కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున రెగ్యులర్ డైట్ లో వెజిటల్స్ మరియు ఫ్రూప్ట్స్ ఈ రెండింటిని మీరు కలిపి మిక్స్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. మీరు 7 రోజుల్లో 6 కేజీలు తగ్గాలంటే కచ్చితంగా ఈ డైట్ ని అనుసరించాల్సిందే, ఒక బౌల్ ఫ్రూప్ట్స్ ని, ఒక బౌల్ వెజిటబుల్స్ సలాడ్స్ తో మీ భోజనాన్ని ముగించాలి. మరియు డిన్నర్ కి మీకు నచ్చిన పండ్లు, కూరగాయలు తినొచ్చు. మూడవ రోజున బంగాళదుంపలను, అరటిపళ్ళను మీ డైట్ లో చేర్చుకోండి. 

4. నాలుగవ రోజు

నాలుగవ రోజున పాలు, అరటిపళ్ళు మాత్రమే తీసుకోవాలి. అలాగే అరటిపళ్ళు, పాలు, మిల్క్ షేక్స్, కాంబినేషన్ మాత్రమే చేర్చుకోవాల్సి ఉంటుంది. పాలను ఎక్కువగా మరిగించి దాంట్లో మీగడను తీసిన పాలను మాత్రమే త్రాగాల్సి ఉంటుంది. 

5. ఐదవ రోజు 

rice-health-tips-telugu
అన్నం

అన్నాన్ని మీ యొక్క డైట్ లో 5వ రోజున చేర్చుకోవాలి. అన్నం తో పాటు 7 లేదా 8 ఉడికించిన లేదా అలాగే పచ్చిగా బాగా పండినటువంటి టమాటోలను కూడా మీ డైట్ లో చేర్చుకోండి. రోజులో మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ టమాటోలను తీసుకుంటూ ఉంటూ రాత్రికి డిన్నర్ చేయకుండా మానెయ్యాలి. తర్వాత ఈ రోజు నుంచి 12 to 15 గ్లాసుల నీటిని త్రాగడం మొదలుపెట్టాలి. 

6. ఆరవ రోజు 

ఆరవ రోజులోకి వచ్చినట్లైతే మధ్యాహ్నం భోజనం కు ఒక కప్పు అన్నం తీసుకుని రోజంతా పండ్లను తీసుకోవాలి. బరువు తగ్గడానికి ఇది చాల ముఖ్యమైన రోజు కచ్చితంగా బరువు తగ్గాలని అనుకునేవారు వెజిటల్స్ తో చేసే అన్నం మాత్రమే తీసుకోండి. 

7. ఏడవ రోజు 

fruits-and-vegetables-health-tips-telugu
ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్

ఏడవరోజు ఇది మన డైట్ ప్లాన్ లో ఆఖరి రోజు, ఈ రోజున ఒక కప్పు అన్నం తో పాటు మీకు నచ్చిన అన్ని రకాల వెజిటబుల్స్ ని మీరు తీసుకోవచ్చు. మరియు ఫ్రూట్ జ్యూస్ లు, నీళ్లు తగినన్ని త్రాగడం వలన శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ మొత్తం తొలగిపోతాయి. అందుకే ఏడవరోజున ఒకపూట మాత్రమే అన్నం తీసుకొని, రోజంతా ఫ్రూట్ జ్యూస్ లు  తీసుకోవాలి. 

ఇలా ఏడురోజులు ఏడు రకాలైన డైట్స్ తీసుకొని చేసినట్లయితే తప్పకుండా ఏడురోజుల్లో 6 కేజీలు బరువు తగ్గి ఫలితం కనిపిస్తుంది. బరువు తగ్గాలి అని అనుకునే ప్రతిఒక్కరు కూడా ఈ డైట్ ప్లాన్ ని సానుసరించడం వలన కచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు.


Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. Wait loss avadam kosam merichina information chala bagundi, thank you for the best information.

    ReplyDelete

Top Post Ad

Bottom Post Ad

ADVERTISEMENT