Type Here to Get Search Results !

Translate

ADVERTISEMENT

Hair growth tips జుట్టు ఊడిపోవడానికి కారణాలు ఏంటి?

Hair growth tips | Health Tips Telugu

Hair growth tips ఈ రోజుల్లో కురుల అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది బాగా కోరుకుంటున్నారు. శరీరంలో ఎన్ని జబ్బులు ఉన్న పెద్దగా ఎవరు ఫీల్ అవట్లేదు కానీ తల మీద జుట్టు ఊడిపోతుందంటే చాలా టెన్షన్ పడుతున్నారు. ముసలివాళ్ళు కూడా అందం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఈ రోజుల్లో ఎన్ని జబ్బులు ఉన్న, ఎన్ని బాధలు ఉన్న ఇవన్నీ ఒక ఎత్తు, తల పైన జుట్టు ఆ జుట్టు నల్లగా ఉంటె చాలు. అందరిలోను ఇటువంటి కోరిక ఉంటుంది. 

జుట్టు సంరక్షణ
జుట్టు సంరక్షణ 

జుట్టు గురించి కొన్ని వాస్తవ నిజాలు  

ఈ జుట్టు అనేది ఎడిటెడ్ ట్రీగా వచ్చే లక్షణం, మన వంశపారపర్వం గా, మన తల్లితండ్రులు, తాత ముత్తాతల్లో ఉన్న జీన్స్ బట్టి మనకు వాళ్ళ జీన్స్ వస్తాయి. వాళ్ళ జీన్స్ ని బట్టి మనకు రంగు, రూపం, ఎత్తు ఇవన్నీ ఎలా ఆధారపడి ఉంటాయో జుట్టు కూడా ఆ జీన్స్ ని బట్టి ఆధారపడి ఉంటాయి. అందుకని మన జీన్స్ లో జుట్టు విషయానికి వస్తే కొంతమందికి రింగులు రింగులుగా జుట్టు ఉంటుంది. కొంతమందికి నక్కులు నక్కులుగా స్పీడ్ బ్రేకర్ లా ఉంటాయి. కొంతమందికి మళ్ళ పంది లాగ ఉంటుంది, డ్రై పెట్టిన వంగదు. ఈ జుట్టు అనేది షేపులు కూడా జీన్స్ బట్టే ఉంటుంది. కొంతమందిలో జుట్టు లావు, జుట్టు కలర్ ఇవన్నీ "హెరిడేట్ ట్రీ ఫాక్టర్" అనమాట. ఈ జుట్టు అనేది రోజుకు సుమారుగా వెంట్రుకలు విషయానికి వస్తే 100 వెంట్రుకలు సుమారుగా ఊడిపోతూ ఉంటాయి, 100 వెంట్రుకలు సుమారుగా తిరిగి మొలుస్తూ ఉంటాయి. పోయేవి 100 పుట్టేవి 100 ఉంటె జుట్టు ఎప్పుడు ఒత్తుగా, చిక్కగా ఉంటుంది. 

కొంతమందికి 25-30సంవత్సరాలు దాటిన దగ్గరనుంచి ఉడేవి 100వెంట్రుకలు, పుట్టేవి దాదాపుగా 50 ఉంటుంది. వీళ్లకు జుట్టు పలుచబడుతుంది. మరికొంతమందికి 35-45సంవత్సరాలు దాటిన దగ్గరనుంచి ఉడేవి 100వెంట్రుకలు, పుట్టేవి 0 ఇక తల పైన రన్వేలాగా నున్నగా అయిపోతుంది. ఇలా బట్టతల వచ్చినవారికి జుట్టుని మొలిపించడం ఆహారంతో సాధ్యం కాదు. ఇక జుట్టుని తలపైన నాటించుకోవడమే (హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ) తప్ప మరొక సొల్యూషన్ లేదు. 

ముఖ్యమైన కారణాలు జుట్టు ఊడిపోవడానికి

hair-fall-health-tips-telugu
ఊడిపోతున్న జుట్టు  

మీకు చుండ్రు ఉందా అయితే జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. ఎందుకంటే ఇది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి జుట్టు ఎక్కువగా లాస్ అవుతూ ఉంటుంది. పుట్టేవాటికంటే ఉడేవే ఎక్కువైపోతోంది. అందుకని చుండ్రు జుట్టు పల్చబడటానికి కారణం అవుతుంది. 

ఇంకా చాల మంది బరువు ఎక్కువైపోయి బరువు తగ్గాలని డైటింగ్స్ చేస్తుంటారు, ఈ డైటింగ్స్ చేసే వారికీ ప్రోటీన్ డెఫిషియన్సీ (మాంసకృత్తుల లోపం) ఎక్కువవుతుంది. ఈ ప్రోటీన్ నుంచే జుట్టు ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అందువల్ల జుట్టు ఊడిపోవడం ప్రోటీన్ తక్కువ అవడం వల్ల  జరుగుతుంది. ఒకవేళ డైటింగ్స్ చేయకపోయినా చాల మంది ప్రోటీన్ ఫుడ్ సరిగ్గా తినరు దీని యొక్క ప్రభావం కూడా జుట్టు ఊడిపోవడానికి కారణమవుతుంది. మిగతా అనేక కారణాలు కూడా ఉన్నాయి కానీ ప్రధాన కారణాలు ఇవే. 

చుండ్రు ఎలా వస్తుంది? పోవాలంటే ఏం  చేయాలి. 

చాలా మంది రోజు ఒంటికి మాత్రమే స్నానం చేస్తారు. వారం రోజుల్లో ఒక్కసారి మాత్రమే చాలామంది తలకు స్నానం చేస్తూ ఉంటారు. అందరు చేసే తప్పు చాలావరకు ఇదే. ఒంటికి కూడా వారానికి ఒకసారి స్నానం చేసి చూడండి అప్పుడు ఒళ్ళంతా చుండ్రు వస్తుంది. అంటే స్నానం రోజు ఎందుకు చేస్తున్నాం చెమట [పట్టడం, చర్మం జిడ్డుగా మారడం లాంటి కారణాల వల్ల  రోజు స్నానం చేసి ఒంటిని శుభ్రం చేసుకుంటున్నాం. అలాగే తలను కూడా రోజు శుభ్రం చేసుకోవాలి. చెమటలో ఉండే వెస్ట్ ఏమిటంటే డెడ్ సెల్ వేస్ట్, టాక్సిన్స్, ఎక్సాస్ సాల్ట్, ఇవన్నీ చెమటలో ఉంటాయి. చెమటలో ఉండే నీరు ఆవిరైపోతుంది, చెమటలో ఉండే వ్యర్దాలన్నీ పేరుకుపోతాయి, దాన్నే చుండ్రు అంటారు. రోజు స్నానం చేయడం వల్ల శరీరం పైన చుండ్రు రాదు, వారానికి ఒకసారి మాత్రమే తలని శుభ్రం చేయడం వల్ల ఈ వారం రోజుల్లో చెమటలో ఉండే వేస్ట్, డెడ్ సెల్స్, టాక్సిన్స్ ఇవన్నీ తలపైన అట్టకట్టి చుండ్రుల మారుతుంది. కేవలం తల స్నానం చేయకపోవడం వల్లనే చుండ్రు వస్తుంది. 

రోజు తల స్నానం చేయండి, మాడుమీద వేళ్ళతో మాత్రమే రఫ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఇక తర్వాత చుండ్రు అనే అడ్రెస్ ఉండదు. ఎప్పుడైనా పొరపాటున రోజు తల స్నానం చేయడం కుదరకపోతే రెండురోజులకు ఒకసారి తల స్నానం చేయండి. ఒకవేళ చెమటలు బాగాపట్టి తలంతా తడిచిపోతె సాయంత్రం సమయంలో తల స్నానం చేయండి, చెమటలు అంత ఎక్కువగా పట్టనివాళ్ళు ఉదయం పూట తల స్నానం చేయండి. రోజుకొక్కసారి తలస్నానం కంపల్సరీగా చేయాలి. శరీరాన్ని కడగడం ఎంత ముఖ్యమో, తలను కూడా కడుక్కోవడం అంత బాధ్యతగా చేయండి. జుట్టు కుదుళ్ళు ఆరోగ్యాంగా ఉంటాయి. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తలలో రాదు, దురద రాదు, చుండ్రు రాదు, ఆరోగ్యాంగా బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది. 

జుట్టు ఆరోగ్యాంగా, ఒత్తుగా ఉండడానికి ఎటువంటి డైట్ పాటించాలి ?

సొయా బీన్స్
సొయా బీన్స్ 

మంచి ప్రోటీన్ ఉన్న ఆహరం తినాలి, జుట్టు బాగా రావాలంటే, ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం విత్తనాల్లో సోయాబీన్స్, ఇవి అంత మంచివి కావని కొంతమంది అంటుంటారు, కానీ మనకి అంత ఇబ్బందులు రావు. అందుకని సోయాబీన్స్ చిక్కుడు గింజల్ని 12 గంటలు నానబెట్టి తర్వాత కుక్కర్లో  ఉడకబెట్టాలి. ఇంకా ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి అని అనుకుంటే Sprouts (మొలకలు) వీటిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. పేసర్లలో 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, అలసందల్లో ఉంటుంది. ఇవన్నీ మొలకెత్తే సరికి వీటిలో ప్రోటీన్ పెరుగుతుంది. రోజు మొలకెత్తిన విత్తనాలు తినడం వలన జుట్టు ఊడింది ఊడినట్టు మల్లి రీప్లేస్ అయి ఒత్తుగా, చిక్కగా అవుతుంది. ఈ మొలకెత్తిన విత్తనాలు తినడం వలన బరువు పెరగరు, బరువు తగ్గుతారు. బాడీ లో ఉన్న హార్మోన్స్ అన్ని కూడా ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. నేచర్ లో ఉన్న మొట్టమొదటి అతి బెస్ట్ ఆహారం మొలకెత్తిన విత్తనాలు. ఈ ఆహారాన్ని మించిన ఆహారం మరొకటి లేదు, ఈ మొలకెత్తిన విత్తనాలు అంటే హార్మోనల్ డైట్ అని గుర్తుపెట్టుకోవాలి. హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఇంతకన్నా బెస్ట్ డైట్ మరొకటి లేదు. రోజు కొన్ని మొలకలు తింటే జుట్టు ఊడిన ప్లేస్ లో మల్లి వస్తుంది. థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ఇంప్రూవ్ అవడం జరుగుతుంది. ఓవరీస్ లో హార్మోన్స్ ఇంప్రూ అవుతాయి, మగవాళ్లలో వీర్యకణాలు యుటిలిటీ పెరుగుతాయి, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, రెసిస్టర్స్ పెరుగుతుంది. ఒక్క జుట్టు కోసం మీరు మంచి డైట్ తింటే ఇన్ని లాభాలు ఉన్నాయి. 

మొలకలు
మొలకలు 

ఈ మొలకెత్తిన విత్తనాలు ఈజీగా తినాలంటే, వాటికీ కొన్ని ఖర్జురాల్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ముక్కలను మొలకల్లో కలిపేయాండి, దానిమ్మ గింజలను కొన్ని కలపండి, ఎండు కిస్మిస్ లు ఒక 20-30 మొలకల్లో కలిపేయండి, వీటన్నింటిని తినండి పులుపు, తీపిలో మొలకలు ఈజీగా తినేయొచ్చు. మరొకరోజు ఆపిల్ ముక్కలు, కర్బుజా ముక్కలు కలపండి, ఇంకొకరోజు కొన్ని ద్రాక్ష కలపండి, ఇలా ఫ్రూట్స్ ముక్కలను కలుపుకొని తినాలి. అనేక సమస్యలకు సరైన సమాధానం చెప్పే అతిగొప్ప ఆహారం మొలకలు. 

ఇంకా ఎవరైనా బరువు తక్కువగా ఉన్నారంటే బాదాం పప్పు 20-25, పిస్తా పప్పు ఒక 20-25, కొన్ని గ్రౌండ్ నట్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి. దానివల్ల ప్రోటీన్ బాగా అందుతుంది. బాదాం పప్పు లకు జుట్టు బాగా వస్తుంది. దింతో పాటు మధ్యాహ్నపు ఆహారాల్లో రోజు ఆకుకూరలు వండుకోవడం చాలా మంచిది, వారంలో 2-3 రోజులు కందిపప్పు, పెసర పప్పు వాడండి మంచి ప్రోటీన్ డైట్ ఆకుకూరల్లో లవణాలు, విటమిన్స్ బాగా ఉంటాయి. జుట్టు రావాలంటే కేవలం ప్రోటీన్ మాత్రమే కాదు విటమిన్స్, మినరల్స్ జుట్టు ఆరోగ్యాంగా ఉండటానికి ఇవన్నీ కూడా కావాలి. అందుచేత జుట్టు సంరక్షణకు బయటనుంచి తలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, లోపలనుంచి జుట్టు మంచిగా ఉత్పత్తి పెరగడానికి మంచి ప్రోటీన్ డైట్ మరియు న్యూట్రిషన్ డైట్ బాగా తీసుకోవాలి. ఇలాంటి నియమాలు పాటించినట్లయితే ఊడిన జుట్టు ప్లేస్ లో మల్లి కొత్తవి రావడం జరుగుతుంది. చాలా మంది రోజు తల స్నానం చేస్తే ఎక్కువగా వెంట్రుకలు ఊడిపోతాయి అని అనుకుంటారు. వారానికి ఒకసారి చేసినప్పుడు ఎక్కువ కనిపిస్తుంది, రోజు చేసేటప్పుడు అట్లా ఉండదు, ఆటోమేటిక్ గా మార్పు వచ్చేస్తుంది. ఈ విషయంలో శ్రద్ద పెట్టండి, మార్పు వస్తుంది.

జుట్టు ఊడకుండా పర్మనంట్ సొల్యూషన్:

ఆరోగ్యకరమైన జుట్టు
ఆరోగ్యకరమైన జుట్టు 

జుట్టు ఊడటం అనేది ఈ మధ్యకాలంలో చాలా మందిలో ఎక్కువగా కనిపిస్తున్న పెద్ద సమస్య జుట్టు పల్చబడిపోవడం, బట్టతల రావడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి పై నుంచి ఆయిల్స్ కానీ, రకరకాల మందులు వాడినప్పటికీ ఆశించినంత పలితం కనిపించక చాలా మంది అసలు పర్మనంట్ సొల్యూషన్ ఏంటి, జుట్టు ఊడకుండా రూట్ క్రాష్ ఏమిటి అనేది ఆలోచిస్తున్నారు. మరి అలాంటివారికి కొన్ని ముఖ్యమైన మీరు మార్చుకోవాల్సిన విషయాలుజుట్టు ఊడకుండా కొన్ని మీరు చెక్ చేసుకోవాల్సిన విషయాలు. 

మొదటి టెస్ట్ 

మీరు ఫస్ట్ థైరాయిడ్ సమస్య ఏమైనా ఉందా అని చెక్ చేయించుకోవాలి, థైరాయిడ్ సమస్య వచ్చినప్పుడు జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. కానీ చాలా మందికి ఇతర లక్షణాలు ఏమి కనిపించట్లేదు కదా అని వయసులో ఉన్నామని చెక్ చేసుకోవడం లేదు. కాబట్టి జుట్టు ఎక్కువగా ఊడుతుందంటే 15 సంవత్సరాల వయస్సు నుంచి ఎవరైనా సరే థైరాయిడ్ టెస్ట్ కంపల్సరీగా చేయించుకోవడం మంచిది.

రెండవ టెస్ట్ 

రెండవ టెస్ట్ ఏమిటంటే విటమిన్ B12 టెస్ట్ చేయించుకోవాలి. ఇది శాకాహారులు అయితే చేయించుకోండి మాంసాహారం బాగా తినేవారికి అవసరం లేదు. లోపం రాదు కాబట్టి సాధ్యమైనతవరకు వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. B12 లోపం ఉంటె జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. క్రొత్త జుట్టు సరిగ్గా రాదు. 

మూడవ టెస్ట్ 

మూడవ టెస్ట్ ఏమిటంటే విటమిన్ D టెస్ట్ చేసుకోండి ఇది అందరు చేయించుకోవాలి. 10-15 సంవత్సరాల పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు జుట్టు కావాలనుకుంటే. విటమిన్ D లోపం ఉన్నప్పుడు కూడా జుట్టు ఎక్కువగా ఊడిపోవడం జరుగుతుంది. 

ఈ లోపాల వల్ల జుట్టు ఎక్కువగా లాస్ అవడం జరుగుతుంది కాబట్టి ముందు ఈ పరీక్ష చేయించుకోవడం మరి లోపాలు ఎక్కువ ఉంటె గనుక మెడిసిన్ స్టార్ట్ చేయండి. తర్వాత నేచురల్ గా మంచి ఆహారాల ద్వారా ఆ విటమిన్స్ కూడా పొందే విదంగా ఎం చేయాలనేది సొల్యూషన్ ఆలోచించాలి. ఇమ్మీడియేట్ గా మెడిసిన్ వాడితే మీకు ఉపశమనం కలుగుతుంది. జుట్టు ఉడటం కూడా వెంటనే ఆగుతుంది

వీటితో పాటు లోపాలను సవరించుకుంటూ అవసరమైతే మెడిసిన్ వాడుకుంటూ మనం చేసే పెద్ద తప్పు జుట్టు ఎక్కువగా ఊడిపోవడానికి కారణం అవుతుంది. అదే తల స్నానం చేసేప్పుడు వేడి ఎక్కువగా ఉండే  నీళ్లను పోసుకోవడం. వేడినీళ్లు స్నానం చేసేప్పుడు జుట్టు ఎక్కువగా లాస్ అవుతుంది. చాలా మంది హాయిగా ఉందనో, కాస్త నొప్పి తగ్గి, స్ట్రెస్ తగ్గి ఫ్రీగా ఉంటుందనో వేడి వేడి నీళ్లను తలపైన పోసేస్తూ ఉంటారు. 40డిగ్రీలు ధాటి వేడి ఎక్కువగా ఉన్న నీళ్లతో తలస్నానం చేసినప్పుడు జుట్టు ఎక్కువగా ఊడిపోతుందని సైన్టిఫిక్ గా నిరూపితం అయింది. ఎక్కువ వేడినీళ్లు తలపై పోసుకున్నప్పుడు ఆ వేడికి జుట్టు  లోపల ఉండే నీటి శాతం తగ్గిపోతుంది. ఎప్పుడైతే జుట్టు కుదుళ్ళు నీరు తగ్గి డ్రై అవుతుందో జుట్టు ఊడిపోవడానికి ఆ డ్రైనెస్ కారణం అవుతుంది. జుట్టు కుదుర్లు చిట్లి పోవడానికి కూడా డ్రైనెస్ ఒక కారణం. అందుచేత ఒక్కసారి వేడినీళ్లు తలపై పోసుకుంటే ఇక ఆ రోజంతా జుట్టు కుదుళ్లు డ్రై గానే ఉంటాయి. ఎందుకంటే వేడి అనేది పై లేయర్, స్కాల్ప్ నుంచి జుట్టు కుదుళ్ళ లోపలికి కూడా వేడి వెళ్ళిపోతుంది. అందుచేత హెయిర్ రూట్ డామేజ్ అవడానికి, జుట్టు కూతుర్లకు రక్త ప్రసరణ తగ్గిపోయి జుట్టు ఊడిపోవడానికి కారణం అవుతుంది. ఇలాగె చాలా రోజుల వరకు జరిగితే కుదుర్లన్నీ కుషించుకుపోతూ హెయిర్ పోలికల్స్ దెబ్బతింటాయి. అందువలన తలకు వేడినీళ్లు మానేయడం చాల ఉత్తమం.


ఊడిన ప్లేస్ లో మంచి జుట్టు రావాలి అంటే ఆహారపు అలవాట్లు కొంచెం మార్చుకోవాలి. ఆహారాల్లో కొంచెం ప్రోటీన్ ఎక్కువగా  ఉండేవి ఎంచుకోవాలి . 
dates-health-tips-telugu
డేట్స్ 


Beat Tip (బెస్ట్ టిప్) :- 
జుట్టు ఎక్కువగా రావాలంటే మనం తీసుకునే ఆహారం అనేది చాలా ముఖ్యమైనది. ఖర్జురాల్లో మనకు కావాల్సిన ఐరన్, కాపర్, జింక్, సిలీనియం, మాలిబినం, అలాగే విటమిన్ D3 ఇలాంటివన్నీ చాలా అవసరం అనమాట ఈ ఖర్జురాల్లో ఐరన్ ఉంటుంది. వీటితో పాటు బాదాం, అంజీర, దానిమ్మ, ములక్కాయ, ఆకుకూరలు, మొలకలు, అలాగే గ్రీన్ పీస్ కూడా హెయిర్ రావడానికి దోహదపడతాయి. నాన్వెజ్ లో అయితే ఫిష్, ఎగ్, ప్రోటీన్ తీసుకోవాలి. 


మరింత సమాచారం తెలుసుకోవడం కోసం Health Tips Telugu ని పాలో అవుతూ ఉండండి. మీ కోసం మంచి మంచి హెల్త్ టిప్స్ ని తెలియజేస్తూ ఉంటాము. ఏమైనా సలహాలు, సందేహాలు తెలియజేయాలనిఅనుకుంటే  ఈ పోస్ట్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. 

Post a Comment

2 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. Good information, food tips is important for health and beauty.

    ReplyDelete
  2. Hair baga ravali ... Antey roju ame thinali.

    ReplyDelete

Top Post Ad

Bottom Post Ad

ADVERTISEMENT