Type Here to Get Search Results !

Translate

ADVERTISEMENT

Complete information about human body organs in Telugu. మానవ శరీర అవయవాల గురించి పూర్తి సమాచారం.

Complete information about human body organs in Telugu

Complete-information-about-human-body-organs-in-telugu

చూడటానికి సింపుల్ గా కనిపించినా మన విశ్వంలో అన్నిటికన్నా మిస్టీరియస్ కాంప్లికేటెడ్ విషయం ఏదైనా ఉంది అంటే అదే మన బాడీ. మన బాడీకి సంబంధించిన ఎన్నో రకమైన ఆశ్చర్యం కలిగించే విషయాలను ఆర్టికల్ లో నేను చెప్పబోతున్నాను.

మానవ శరీర అవయవాల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే ఆర్టికల్ ని పూర్తిగా చదవండి.

1. DNA Storage Capacity ({డి.ఎన్.ఎ} స్టోరేజ్ కెపాసిటీ):

మన బాడీలో ఉన్న 1గ్రాము DNAలో దాదాపు 700 TB (టెరాబైట్స్) అంటే 7లక్షల GBల డేటాని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది. ఇదే డేటాని లేటెస్ట్ టెక్నాలజీ తో వాడి తయారు చేసిన 3TB హార్డ్ డిస్క్ లలో స్టోర్ చేయడానికి మనకి 233 హార్డ్ డిస్క్ లు కావాల్సి ఉంటుంది. వాటి బరువే 150 కేజీలు ఉంటుంది. ఇన్ని హార్డ్ డిస్క్ లలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకునే కెపాసిటీ మన 1గ్రాము DNAకు ఉంది. అది మన DNA కి ఉన్న పవర్. 

  • మన బాడీలోని మొత్తం DNA ని కలిపి ఒక చైన్ ని తయారుచేస్తే ఆ చైన్ 1600 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. 

2. Brain (బ్రెయిన్): 

brain-health-tips-telugu
Brain

బ్రెయిన్ లో జరిగే కెమికల్ రియాక్షన్స్ మన బ్రెయిన్ లో 1సెకెన్ కి దాదాపు 1లక్ష కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ రియాక్షన్స్ వల్లే మనం చూడగలుగుతున్నాం, మాట్లాడ గలుగుతున్నాం, మాట్లాడింది అర్థం చేసుకో గలుగుతున్నాం. వీటిలో ఏ ఒక్క రియాక్షన్ ఆగిపోయిన మనం బ్రతకడం చాలా కష్టం.

మన బ్రెయిన్ లో జరిగే న్యూరాన్ కమ్యూనికేషన్స్ మనం పని చేసిన దానికి కారణం ఈ న్యూరాన్స్. మన బ్రెయిన్ లో 86మిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. ఒక్కో న్యూరాన్ మరో 10 వేల న్యూరాన్స్ తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. అలా మన బ్రెయిన్ లో ట్రిలియన్ల న్యూరాన్ కనెక్షన్స్ ఉంటాయి. వీటిలో సిగ్నల్స్ 1గంటకి 322కిలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణిస్తాయి. అంటే ఫాస్టెస్ట్ బుల్లెట్ ట్రైన్ కన్నా ఎక్కువ స్పీడ్ తో మన బ్రెయిన్ లో న్యూరాన్స్ మధ్య సిగ్నల్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇన్ని జరుగుతున్నా కొంచెం కూడా సౌండ్ ని బయటికి రానివ్వని ఒకే ఒక్క మోస్ట్ సైలెంట్ మిషన్ మన బ్రెయిన్.

మన బ్రెయిన్ అంటేనే కొన్ని కోట్ల న్యూరాన్స్, కొన్ని కోట్ల సెల్స్, కొన్ని కోట్ల బ్లడ్ వెజిల్స్ అన్నీ ఒక చిన్న సైజ్ లో దగ్గరగా ఫిక్స్ చేయబడి ఉంటాయి. ఎంత దగ్గరగా ఫిక్స్ చేయబడి ఉంటాయంటే ఒకవేళ బ్రెయిన్ లో గనుక పెయిన్ రిసెప్టార్స్ ఉంటె అప్పుడు వచ్చే హెడేక్ ని తట్టుకోవడం మనిషి వల్ల కాదు. 

ప్రస్తుతం ఈ ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ K. దీంతో మన బ్రెయిన్ ని గనుక కంపేర్ చేస్తే 2.2 బిలియన్స్ ఆపరేషన్స్ చేయడానికి మన బ్రెయిన్ 20వాట్ల పవర్ ని తీసుకుంటే K కంప్యూటర్ 9.9బిలియన్స్ ఆపరేషన్స్ చేయడానికి 10వేల వాట్ల పవర్ ని తీసుకుంటుంది. ఈ ఎనర్జీ దాదాపు 10వేల ఇండ్లకు వాడే కరెంట్ తో సమానం. తక్కువ ఎనర్జీ తో నడిచే సూపర్ కంప్యూటర్ మన బ్రెయిన్ తప్ప ఈ ప్రపంచంలో మరొకటి లేదు. 

మన బాడీలో ఎక్కడైనా దెబ్బ తగిలిన లేదా ఖాలినా మనం వెంటనే నొప్పిని ఫీల్ అవుతాం. దానికి కారణం మన బ్రెయిన్. కానీ మన బ్రెయిన్ లో పెయిన్ కి సంబంధించిన రిసెప్టార్స్ ఉండవు. అంటే ఒకవేళ మన బ్రెయిన్ ఏదైనా దెబ్బ తగిలిన మనకు అసలు నొప్పి అంటూ ఉండదు. ఇలా మన బ్రెయిన్ లో పెయిన్ కి సంబంధించిన రిసెప్టార్స్ లేకపోవడం వల్లే మనం ఇంకా బతికి ఉన్నాము. 

  • మన బ్రెయిన్ పై మడతలు గనుక లేకపోతే మన బ్రెయిన్ ఒక పిల్లో(తలదిండు) అంత సైజ్ లో ఉంటుంది. 

3. Blood Cells (బ్లడ్ సెల్స్): 

మన పూర్తి బాడీలో ఒక్క కంటిలోని కార్నియాకు తప్ప మిగిలిన అన్ని భాగాలకు బ్లడ్ ఫ్లో అవుతుందని మనందరికీ తెలుసు. కానీ మీకు తెలుసా? మన బ్లడ్ 1రోజులో మన బాడీలో ఎంత దూరం ప్రయాణిస్తుందో అక్షరాల 19,312 కిలోమీటర్లు. ఈ దూరం ఇండియా నుంచి అమెరికా మధ్య ఉన్న దూరం కన్నా ఎక్కువ. ఇంత దూరాన్ని మన బ్లడ్ సెల్స్ కేవలం 1రోజులో ప్రయాణిస్తాయి. 

  • మన బాడీ లో రోజుకి 2 వేల కోట్ల రెడ్ సెల్స్, 4వేల కోట్ల ప్లేట్లెట్స్ 1000కోట్లు వైట్ సెల్స్ తయారవుతాయి. 
  • మన ఒక్క చుక్క రక్తం లో 10వేల రక్తకణాలు 2లక్షల 50వేల ప్లేట్లెట్స్ ఉంటాయి. 

4. Blood Groups (బ్లడ్ గ్రూప్స్): 

ప్రపంచంలో ఎన్ని రకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయంటే మనకి తెలిసిన సమాధానం 8. A+, B+, O+, AB+, A-, B-, O-, AB- ఇవే మనకి తెలిసిన బ్లడ్ గ్రూప్స్, కానీ I.S.B.T (International Society of Blood Transportation) దాదాపు ఇప్పటి వరకు 30 రకాల బ్లడ్ గ్రూప్స్ ని డిటెక్ట్ చేసింది. ఉదాహరణకి ఆర్యచనల్ లేదా గోల్డ్ బ్లడ్ ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ప్రపంచంలో కేవలం 43 మంది వ్యక్తులు మాత్రమే ఉన్నారు. 

5. Strang Bones (స్ట్రాంగెస్ట్ బోన్స్: 

మన బాడీలో అన్నిటికన్నా స్ట్రాంగెస్ట్ బోన్ మన తొడలు ఉండే ఎముక. ఇది కాంక్రిట్ కన్నా గట్టిది. మన బోన్ యొక్క కెపాసిటీ ఎంతో తెలుసా? 1 ఇంచ్ సైజ్ వెడల్పున్న మనకు దాదాపు 8,625 కేజీల బరువుని తట్టుకునే కెపాసిటీని కలిగి ఉంటుంది. బరువు 5 ట్రక్స్ యొక్క బరువుతో సమానం. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇంత స్ట్రాంగ్ గా ఉన్న ఈ బోన్స్ లో కూడా 31% శాతం నీరు ఉంటుంది.

6. Hiccups (ఎక్కిళ్లు): 

మనందరం లైఫ్ లో ఒక్కసారైనా వీటిని పేస్ చేసి ఉంటాము. వెక్కిళ్లు మహా అయితే ఎంతసేపు ఉంటాయి? 2 నిమిషాలు లేదా 5నిమిషాలు. కానీ అమెరికా లోని చార్లెస్ హోజెబ్రోన్ అనే వ్యక్తికి 68సంవత్సరాల వరకు వెక్కిళ్లు ఆపకుండా వస్తూనే ఉన్నాయి. 1922 నుంచి 1990 వరకు 68సంవత్సరాల పాటు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇతను పడుకున్న కూడా ఇతని వెక్కిళ్లు మాత్రం ఆగేవి కావు. ఇదే ఇప్పటివరకు వరల్డ్ రికార్డు. బాడ్ న్యూస్ ఏంటంటే వెక్కిళ్లు ఆగిన నెక్స్ట్ ఇయర్ ఇతను చనిపోవడం జరిగింది. 

7. Body (శరీరం): 

ఈ సృష్టిలో ప్రతిది అణువులతో తయారు అయింది. అలాగే మన బాడీ కూడా మన బాడీ 7ఆక్టీలియన్ అణువులతో తయారయింది. ఈ ప్రపంచంలో ఉన్న జనాభా కన్నా 5000రెట్లు ఎక్కువ నువ్వులతో మన బాడీ తయారయ్యింది. ఒకవేళ మీరు సైన్స్ స్టూడెంట్ అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ప్రతి అనువు 99% శాతం ఖాలీ ప్లేస్ ని కలిగి ఉంటుంది. మన బాడీ లోని ఈ 7 ఆక్టీలియన్ అణువుల నుంచి గనుక మనం ఆ ఖాళీ ప్లేస్ ని తీసివేయగలిగితే. మన పూర్తి బాడీని ఒక ఇసుక రేణువులో పట్టించవచ్చు. దీనికి బెస్ట్ ఎక్సమ్ పుల్ న్యూట్రాన్ స్టార్స్, ఒక బియ్యం గింజ సైజ్ ఉండే న్యూట్రాన్ స్టార్ 15వేల కోట్ల టన్నుల బరువు ఉంటుంది. దీనికి కారణం వీటి అణువులలో యమ్టి స్పేస్ లేకపోవడం. 

8. Heart (గుండె): 

heart-health-tips-telugu
Heart

యావరేజ్ గా మనిషి యొక్క గుండె నిమిషానికి 72సార్లు కొట్టుకుంటుంది. ఇది మనందరికీ తెలిసిన ఒక నిజం. కానీ మీకు తెలుసా? మగవారి కన్నా ఆడవారి గుండె ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. అవును ఇది నిజం. యావరేజ్ గా మగవారి గుండె నిమిషానికి 70సార్లు కొట్టుకుంటే, ఆడవారికి ఉండే నిమిషానికి 78సార్లు కొట్టుకుంటుంది. దానికి కారణం ఏంటంటే పురుషులలో ఉండే గుండె 180గ్రాముల బరువు ఉంటె స్త్రీలలో ఉండే గుండె 120గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. సైజ్ లో మరియు బరువులో తక్కువగా ఉన్న కారణంగా ఆడవారి గుండె బ్లడ్ ని పంప్ చేయడానికి మగవారి గుండె కన్నా ఎక్కువ సార్లు పెట్టుకోవాల్సి వస్తుంది. 

మన గుండె మన తల్లి కడుపులో ఉన్న 4వారాల తర్వాత కొట్టుకోవడం మొదలు అవుతుంది. అలా మొదలైన హార్ట్ నిమిషానికి 72సార్లు నెలకి 36లక్షల సార్లు మన పూర్తి లైఫ్ టైమ్ లో 250కోట్ల సార్లు కొట్టుకుంటుంది. అలా కొట్టుకుంటూ మనకు గుండె మన పూర్తి జీవితకాలంలో 150కోట్ల బారెల్స్ రక్తాన్ని పంపు చేస్తుంది. ఇది ఎంత ఎక్కువ అంటే ఈ బ్లడ్ తో మనం 200ట్రైన్ ట్యాంక్స్ ని ఫిల్ చేయవచ్చు. ఇంత పని చేసిన ఎప్పటికీ అలసిపోని ఒక గొప్ప యంత్రమే మన గుండె. 

  • మన బాడీ ఫుడ్(ఆహరం) యొక్క టేస్ట్ ని కేవలం 0.15సెకండ్స్ లో డిటెక్ట్ చేస్తుంది. ఈ టైమ్ మనం కంటి రెప్ప వేసే టైమ్ కన్నా చాలా తక్కువ. 
  • మన గుండె శరీరంలోని ప్రతి భాగానికి బ్లడ్ ని పంపించేస్తుంది ఎంత ప్రెజర్ తో పంప్ చేస్తుందో తెలుసా మన గుండె ఒక చిన్న పంపు అనుకుంటే దాని ద్వారా వచ్చే వాటర్ ఎలాంటి పైకి అవసరం లేకుండా 4 ఫ్లోర్ ల ఎత్తు వరకు రీచ్ అవుతుంది. అంత ప్రెజర్ తో మన గుండె మన శరీరంలో రక్తాన్ని పంపించేస్తుంది. 
  • మన గుండె పనిచేయడానికి తీసుకునే 1రోజు ఎనర్జీతో ఒక ట్రక్ ని 32కిలోమీటర్ల పాటు నడిపించవచ్చు. అదే లైఫ్ టైంలో చూసుకుంటే భూమి నుంచి చంద్రుడి వరకు మళ్ళీ చంద్రుడి నుంచి భూమి వరకు నడిపించవచ్చు. దీన్ని మించిన ప్రపంచంలో మరొకటి లేదు. 

9. Ear (చెవి): 

మన శరీరంలో ఎప్పటికీ పెరుగుతూ ఉండే ఒకే ఒక్క అవయవం మన చెవి. ఇది సంవత్సరానికి మిల్లీమీటర్ చొప్పున మనం చనిపోయేవరకు పెరుగుతూనే ఉంటుంది. మనం పడుకున్నప్పుడు కూడా మన చెవి సౌండ్స్ ని వింటూనే ఉంటుంది. కానీ ఆ సౌండ్స్ ని మన బ్రెయిన్ బ్లాక్ చేస్తుంది. మనం ఏదైనా ఒక సౌండ్ ని వింటున్నాము అంటే దానికి కారణం మన చెవిలో ఉండే ఇయర్ డ్రమ్ఇది మన చెవిలో 0.7ఇంచెస్ సైజ్ లో ఉంటుంది. 

ఎదుటి వ్యక్తి మాట్లాడిన వాయిస్ మన చెవిలోకి వెళ్ళినప్పుడు ఈ ఇయర్ డ్రమ్ 1అంగుళం లో 100కోట్లు వంతులో కొన్ని వేల సార్లు కదులుతుంది. అంత తక్కువ సైజ్ లో ఇది కలవడం వల్లే మనం చిన్న చిన్న సౌండ్స్ ని కూడా స్పష్టంగా వినగలుగుతాం. అది కూడా ఎంత స్పష్టంగా అంటే అణువుల యొక్క సౌండ్స్ ని కూడా మనం వినే అంత రేంజ్ లో.. ఏంటి? నమ్మట్లేదా? అయితే ఈ ఆర్టికల్ చదివిన తర్వాత టెస్ట్ చేయండి. ముందుగా మీరు కళ్ళను మూసుకొని మీ ఫ్రెండ్ ని పిలవండి. ఒక గ్లాస్ లో కోల్డ్ వాటర్ ని మరో గ్లాస్ లో హాట్ వాటర్ ని పోయమని చెప్పండి. జస్ట్ ఆ వాటర్ పోస్తున్నప్పుడు వచ్చిన సౌండ్ ని బేస్ చేసుకొని ఎప్పుడు కోల్డ్ వాటర్ పోసారు. ఎప్పుడు హాట్ వాటర్ పోసారు. అనేది మీరు కళ్ళు మూసుకొని చెప్పగలరు. కావాలంటే టెస్ట్ చేయండి. ఈ రెండు విషయాల్లో నీటిని గ్లాస్ లోనే పోయడం జరిగింది. దాని తేడా ఏంటంటే జస్ట్ అణువులలో స్పీడ్ మాత్రమే. అందుకే ఎప్పుడు మీ చెవి యొక్క పవర్ ని తక్కువ అంచనా వేయకండి.

మనకి చెవి ప్రక్కన ఒక చిన్న పార్ట్ ఉంటుంది. ఈ చిన్న పార్ట్ మనకి విధంగా ఉపయోగపడుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పార్ట్ వల్లే మనకు వినిపించే సౌండ్స్ వెనక నుంచి వస్తుందా లేదా ముందు నుంచి వస్తుందా అనే విషయాన్ని మన బ్రెయిన్ తెలుసుకో గలుగుతుంది. అదెలా అంటారా వెనకాల నుంచి వచ్చే సౌండ్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీ గా మన చెవి లోనికి వెళ్ళిపోతాయి. కానీ ముందు నుంచి లేదా పక్క నుంచి వచ్చే సౌండ్స్ ని ఈ అవయవం కొద్ది వరకు ఢిఫెంట్ చేస్తుంది. అంటే ముందు నుంచి లేదా పక్క నుంచి వచ్చే సౌండ్స్ కి అవయవం ఒక స్పీడ్ బ్రేకర్ లా పనిచేస్తుందనమాట. 

జస్ట్ ఈ చిన్న తేడాని బేస్ చేసుకొని మన బ్రెయిన్ ఆ సౌండ్ ముందు నుంచి వస్తుందో లేదా వెనక నుంచి వస్తుందో కనిపెడుతుంది. ఒకవేళ ఈ పార్ట్ గనుక లేకుంటే ఆ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో మనం గుర్తించలేము. 

10. Skin Cells (స్కిన్ సెల్స్): 

ప్రతిరోజు మన చర్మం పై నుండి 10లక్షల స్కిన్ సెల్స్  ఊడిపోతాయి. అలా సంవత్సరానికి 2కేజీలు చొప్పున యావరేజ్ గా మన పూర్తి జీవిత కాలంలో దాదాపు 140కేజీలు స్కిన్ సెల్స్ మన బాడీ నుంచి విడిపోతాయి. మన వాతావరణంలో ఇలా ఊడిపోయిన స్కిన్ సెల్స్ యొక్క బరువే లక్షల టన్నులు ఉంటుంది. 

మనం తీసుకునే ఫుడ్ వల్ల మన బాడీ పోయిన స్కిన్ సెల్స్ ప్లేస్ లో కొత్త స్కిన్ సెల్స్ ని తయారు చేస్తుంది. ఇలా మన చర్మం ప్రతి 30రోజులకి ఒకసారి కొత్త దానిలా మారుతుంది. మన పూర్తి జీవిత కాలంలో మన చర్మం దాదాపు 1000సార్లు కొత్త దానిలా మారుతుంది. 

11. Hair (జుట్టు):

  • చూడడానికి వెంట్రుకే కదా అని తక్కువ అంచనా వేస్తాం. కానీ మన ఒక్క వెంట్రుక దాదాపు 100గ్రాముల బరువును అంటే ఒక యాపిల్ అంత బరువుని మోసే కెపాసిటీ ని కలిగి ఉంటుంది. 
  • మన తలపై ఉండే అన్ని వెంట్రుకలు కలిపి దాదాపు 12టన్నుల బరువుని లాగే కెపాసిటీ ని కలిగి ఉంటాయి. ఇప్పటి నుండి అయినా వెంట్రుకని చులకనగా చూడడం ఆపేయండి. 

12. Eyebrows (కనుబొమ్మలు)

మనలో చాలా మందికి కనుబొమ్మలు ఎందుకు ఉంటాయో తెలీదు. ఈ కనుబొమ్మలు ఒక విధంగా మన కంటిని సేఫ్గా ఉంచడానికి తయారుచేయబడ్డాయి. ఉదాహరణకి మీరు ఇప్పటివరకు ఎన్నోసార్లు వర్షంలో తడిసి ఉంటారు. ఆ టైమ్ లో మీ కళ్ళను తెరిచి ఉంచిన ఒక్క వర్షపు చుక్క కూడా మీ కంటి లోకి వెళ్ళదు. ఎందుకంటే మన కనుబొమ్మలు ఈ విధంగా డిజైన్ చేయబడి ఉంటాయి. వీటి పై నుండి వచ్చే వాటర్ ని పక్కకి నెట్టేసేయడమే వీటి పని. కేవలం వర్షపు నీరే కాదు మనం పనిచేసినప్పుడు రిలీజ్ అయ్యే చెమట నుంచి కూడా ఈ కనుబొమ్మలు మన కంటిని కాపాడతాయి. 

13. Kidneys (కిడ్నీలు)

మన కిడ్నీస్ లో దాదాపు 1 నుంచి 2 మిలియన్ ల నెఫ్రాన్స్ అనే ఫిల్టర్స్ ఉంటాయి. ఫిల్టర్స్ మన బ్లడ్ లో ఉన్న వేస్టేజ్ ని రిమూవ్ చేస్తాయి. మన శరీరంలో ఉండే ఒక్కో రక్తపు చుక్క ఈ 20లక్షల ఫిల్టర్స్ ద్వారా ఫిల్టర్ చేయబడుతుంది. అలా మన కిడ్నీస్ ప్రతి 50నిమిషాలకు ఒకసారి మన శరీరంలోని పూర్తి బ్లడ్ ని క్లిన్ చేస్తాయి. ఇలా రోజుకి 400సార్లు మన బాడీలోని పూర్తి రక్తం ఫిల్టర్ అవుతుంది. 

14. EYES (కళ్ళు) :

మనందరికీ తెలుసు మన కన్ను 576మెగా పిక్సెల్ కెపాసిటీ ని కలిగి ఉంటుందని కానీ మన బ్రెయిన్ యొక్క కెపాసిటీ ఎంతో తెలుసా? 2.5PB(పెటాబైట్) KB, MB, GB, TB, PB. 1000GBలు 1TBతో సమానం. 1000TBలు 1PBతో సమానం. అంటే పెటాబైట్. మన బ్రెయిన్ 2.5 PBల ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకునే కెపాసిటీ ని కలిగి ఉంటుంది. ఒక నార్మల్ మనిషి తన పూర్తి లైఫ్ లో ఆఫ్ PBని కూడా యూజ్ చేయలేడు.

  • మన కన్ను దాదాపు 20లక్షల పార్ట్స్ తో తయారయ్యింది. మనం తెలుసుకునే ఇన్ఫర్మేషన్ లో 85% శాతం ఇన్ఫర్మేషన్ కంటి ద్వారా మనం తెలుసుకుంటాం. 
  • మన బ్రెయిన్ పవర్ లోనీ 65% పవర్ మన కన్నులు ఉపయోగించుకుంటాం. 
  • మన కన్ను 1కోటి డిఫెరెంట్స్ కలర్స్ ని డిటెక్ట్ చేయగలుగుతుంది. కానీ అన్ని కలర్స్ మన బ్రెయిన్ గుర్తుంచుకో లేదు. 
  • మనం ఒక్ ఒక వస్తువుని చూస్తున్నామంటే మన 8గ్రాముల సైజ్ ఉండే కంటి వెనకాల 10కోట్ల ఫోటో సెన్సిటివ్ సెల్స్ లైట్ ని గుర్తిస్తూ ఉన్నాయని, 70లక్షల కోన్ సెల్స్ కలర్ ని గుర్తిస్తూ ఉన్నాయని 1కోటి 30లక్షల రాడ్ సెల్స్ బ్లాక్ అండ్ వైట్ మధ్య ఉన్న తేడాని గుర్తిస్తూ ఉన్నాయని అర్థం. 
  • ఇన్ని సెల్స్ పని చేయడం వల్లే మనం ఒక వస్తువుని పర్ఫెక్ట్ గా చూడగలుగుతున్నాం.

ఈ ప్రపంచం అందరికీ ఒకేలా కనిపిస్తుందా? 

సమాధానం: కాదు. 

అబ్బాయిలు చూసే ప్రపంచం వేరు, అమ్మాయిలు చూసే ప్రపంచం వేరు. అమ్మాయిలకు ఈ ప్రపంచం 2రెట్లు ఎక్కువ రంగులతో కనిపిస్తుంది. దానికి కారణం అమ్మాయిలో ఉండే క్రోమోజోమ్స్. అబ్బాయిల్లో XY అనే క్రోమోజోమ్స్ ఉంటాయి. కానీ అమ్మాయిల్లో రెండు Xక్రోమోజోమ్స్ ఉంటాయి. Xక్రోమోజోమ్స్ కి రంగులను గుర్తించే శక్తి ఎక్కువగా ఉంటుంది. అమ్మాయిలలో రెండు Xక్రోమోజోమ్స్ ఉండడం వల్ల వారి కలర్ పెర్సెప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. వారు ప్రపంచాన్ని మనకన్నా 2రెట్లు ఎక్కువ రంగులతో చూడగలుగుతారు. 

నిజంగా అమ్మాయిలు చాలా లక్కీ అన్ని అద్భుతమైన కలర్స్ తో ఈ ప్రపంచాన్ని చూసే ఎక్స్పీరియెన్స్  ని అబ్బాయిలు ఎప్పటికి పొందలేరు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

ADVERTISEMENT