Type Here to Get Search Results !

Translate

ADVERTISEMENT

Don't take Health Insurance without knowing these things. ఈ విషయాలు తెలుసుకున్నాకే హెల్త్ ఇస్యూరెన్స్ తీసుకోండి

Health Insurance: -

Health-Insurance-Policy

హౌసింగ్, ఎడ్యుకేషన్, ఫుడ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ తాము కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి వీటి కోసం ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటారు. కానీ అదే మిడిల్ క్లాస్  మ్యాన్ ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆస్పటల్  బిల్స్ కట్టడానికి రెడీగా  ఉండడు. ఇంకా చెప్పాలంటే ఇష్టపడడు కూడా. కానీ హెల్త్  ప్రాబ్లమ్స్ అనేవి మన కంట్రోల్ లో ఉండవు. ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో ఒక టైంలో హాస్పిటల్ కి డబ్బులు పెట్టాల్సి వస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నా కానీ వాళ్లు ప్రొవైడ్ చేసే మెడికల్ కేర్ తో మన ప్రాణాలు నిలుస్తాయి అని నమ్మకం లేదు. మరోవైపు ప్రైవేట్ హాస్పిటల్స్ వాటిని భరించే అంత స్తోమత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కి ఉండదు. ఇలాంటి సిచువేషన్ లో మధ్యతరగతి వ్యక్తిని  ఆదుకునేది హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే.

హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పేసి మీకు ఏ హెల్త్ ఇబ్బంది వచ్చినా ఫ్రీగా  చేస్తారు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. చాలా విషయాలలాగే హెల్త్ ఇన్సూరెన్స్ లో కూడా చాలా లొసుగులు ఉంటాయి. చాలా కన్ఫ్యూజ్ చేసే విషయాలు కూడా ఉంటాయి. అవేంటో ఈ ఆర్టికల్ లో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఇన్సూరెన్స్ టాపిక్ అనేది మీకు  కొంచెం బోరింగ్ గా అనిపించొచ్చు. ఈ ఇన్సూరెన్స్ గురించి  మీకు తెలుసుకుంటే మీ కానీ మీ ఫ్యామిలీ కానీ మీకు ఫ్యూచర్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. 

ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా పనిచేస్తాయో సింపుల్గా తెలుసుకుందాం. 

For example ఏదో ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు అనుకోండి, మీకు సడన్గా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, మీకు అయ్యే మెడికల్ ఖర్చు ఈ కంపెనీ వాళ్లు భరిస్తారు.  మీకు అర్థం అవ్వడానికి సింపుల్ గా చెప్పాను. కానీ ఇన్సూరెన్స్ అనేది ఇంత ఈజీ గా ఉండదు. చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది.

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.  చీప్ గా ప్రీమియం వస్తుంది కదా అని చెప్పేసి ఏది పడితే అది తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇన్సూరెన్స్ తీసుకునే విషయాలు, మీరు చాలా విషయాలు మైండ్ లో పెట్టుకోవాలి.

1. మీ ఇన్సూరెన్స్ క్యాష్ లెస్ ఆ కాదా? క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ నె సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీది క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ కాకపోతే మీరు ఆస్పటల్ కి అయ్యే ఖర్చు మొత్తం  ముందే పే చేసిన తర్వాత ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ నీ ఆ డబ్బుల్ని మీకు పే చేస్తుంది.  మరియు దీంట్లో పేపర్ వర్క్స్ చాలా ఉంటుంది. చాలా టైం కూడా పడుతుంది. అదే క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ అనుకోండి ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్టుగా మీ హాస్పిటల్ కె బిల్ కట్టేస్తుంది. మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ cash-less ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ కింద ఉన్న హాస్పిటల్స్ ఎంటో చెక్ చేసుకోండి. మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి వెళ్లి జాయిన్ అయిపోయి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎమర్జెన్సీ టైం లో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 

2. నెక్స్ట్ చూడాల్సింది మీ ఇన్సూరెన్స్ పాలసీ ఫ్రీ అండ్ పోస్ట్ ఆస్పటలైజేషన్ బిల్స్ ని కవర్ చేస్తుందా లేదా? ట్రీట్మెంట్ సమయంలో బిల్స్ ని కవర్ చేస్తున్నారు. కానీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కొన్ని టెస్టులు తీసుకోవాలి, డాక్టర్ కన్సల్టేషన్ ఉండిద్ది, కొన్ని కొన్ని సార్లు ఫిజియోథెరపీ కూడా చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ట్రీట్మెంట్ కు ముందు కూడా చాలా టెస్ట్లు అనేవి చేపించుకోవాలి. వీటికి కూడా కచ్చితంగా మనకు డబ్బులు అవసరం అవుతాయి కదా. ట్రీట్మెంట్ కు ముందు తర్వాత అయ్యే ఖర్చులను కూడా ఫ్రీ అండ్ పోస్ట్ ఆస్పటలైజేషన్ బిల్స్ అంటారు. మీరు తీసుకునే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా లేదా అనేది ముందు చూసుకుని ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు వైఫ్, చిల్డ్రన్స్, పేరెంట్స్ ఇంకా చాలామంది ఇండిపెండెన్స్ ఉన్నారు. కానీ ఇంట్లో అతనొక్కడే సంపాదించేది. ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి. ప్రతిసారి ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లడం అనేది ఇది చాలా కష్టమైన పని.  కానీ ఏదైనా మేజర్ హెల్త్ ఇష్యూ వచ్చిందంటే ఈ మిడిల్ క్లాస్ మాన్ పావర్టీ లోకి వెళ్ళి పోతాడు. 

హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మన దగ్గర రెండు ఆప్షన్స్ ఉంటాయి. 

  1. ఆస్పిటల్ కి అయ్యే బిల్స్ అన్ని మనం కట్టగలిగే అంత స్థోమత మన దగ్గర ఉండాలి.
  2. లేదా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. 

ఇప్పుడు మీరు developed countries చూశారంటే ఆ దేశంలో ప్రజలందరికీ ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance) ఉంటుంది. 20 కి పైగా దేశాల్లో 100% ప్రజలకి హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరిగా ఉంటుంది. కానీ మన దేశంలో అలాంటి పరిస్థితి లేదు. దేవుడు చూసుకుంటాడు లే అని అనుకుంటారు. కానీ ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులు పడతారు. అందులో ఇన్ఫ్లేషన్ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే ఫస్ట్ ఎఫెక్ట్  అయ్యేది మెడికల్ ఫీల్డ్. ప్రతి సంవత్సరం ట్రీట్మెంట్ కి గాని మెడిసిన్స్ కి గాని కాస్ట్ బాగా పెరిగిపోతోంది. ఇలాంటి టైమ్ లో  హెల్త్ ఇన్సూరెన్స్ చాలా చాలా అవసరం. 

మార్కెట్లో చాలా రకాల ఇన్సూరెన్స్ కంపెనీ లు ఉన్నాయి. మీ అవసరాన్ని బట్టి మీకు కావలసిన ఇన్సూరెన్స్ ను మీరు తీసుకోవాలి

  • నెక్స్ట్ చూడాల్సిందే మీ ఇన్సూరెన్స్ లో CO-PAY అనే ఆప్షన్ ఉందా లేదా! హెల్త్ ఇన్సూరెన్స్ లో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు CO-PAY ఆప్షన్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ మీరు తీసుకున్నారు అనుకోండి మీ ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకునేటప్పుడు మీ బిల్స్ లో కొంత భాగాన్ని మీరు కట్టాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. అసలు ఇన్సూరెన్స్ తీసుకునేది బిల్స్ కట్టకుండా ఉండడానికి మరి ఈ CO-PAY ఆప్షన్ ఎవరు తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటారు? దీనికి ఆన్సర్ ప్రీమియం తగ్గించడం కోసం తీసుకుంటారు. 
  • ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్సూరెన్స్ పాలసీ ఏజెంట్ 5 లాక్స్ ఇన్సూరెన్స్ కి ప్రీమియం సంవత్సరానికి 7,000 రూపాయలు అని చెప్పి ఇన్సూరెన్స్ పాలసీ అమ్ముతాడు. వెంటనే మీకు ఒక మంచి ఆప్షన్ ఇస్తాడు . సార్ మీరు 20% CO-PAY కి ఒప్పుకుంటే మీ ప్రీమియంలో 25% తగ్గిపోతుంది సార్ అని అంటాడు. మీరు ఆలోచిస్తారు. 25% అంటే 1750 రూపాయలు సేవ్ అయిపోతున్నాయి. ఏముందిలే ఆ 20% CO-PAY కట్టేద్దాం అని మీరు అనుకుంటారు. 20% CO-PAY కి  మీరూ ఒప్పుకుంటారు.  కానీ కట్ చేస్తే సీన్ ఎలా ఉంటుందంటే మీకు ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ  వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనుకోండి దానికి బిల్ చేసే 2 లక్షలు అయింది అనుకోండి. ఆ 2 లక్షల బిల్లులో ఇన్సూరెన్స్ కంపెనీ 1లక్షా 60 వేల రూపాయలు కడితే మిగతా 40 వేల రూపాయలు మీరు కట్టాలి. ఇలా టోపీ పెట్టి మీ చేత డబ్బులు కట్టిస్తారు అన్నమాట. 
  • మరి ఈ CO-PAY ఆప్షన్ తీసుకోవాలా వద్దా? అంటే మాక్సిమం దీన్ని అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ మీరు హెల్దీగా ఉండి మీకు హాస్పిటల్ కి వెళ్లే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి  అని అనుకుంటే ఈ CO-PAY ఆప్షన్ ని తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రీమియం తగ్గుతుంది.  లేదు మీ ఫ్యామిలీ హెల్త్ హిస్టరీ అండ్ మీ హెల్త్ ని దృష్టిలో పెట్టుకొని మీరు హాస్పిటలైజ్ అయ్యే ఛాన్స్ ఉందనుకుంటే ఈ CO-PAY ని అవాయిడ్ చేయడం చాలా అంటే చాలా బెటర్. 
  • నెక్స్ట్ వచ్చేసరికి No claim bonus మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాక ఆ సంవత్సరం మొత్తం ఫిట్ అండ్ హెల్దీ  ఉండి మీ ఇన్సూరెన్స్ ని క్లైమ్ చేసుకోకపోతే మీ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు బోనస్ లు ఇస్తుంది. ఫ్రీ హెల్త్ చెకప్ గాని ప్రీమియంలో తగ్గింపు ఇవ్వటం కానీ లేదా మీ పాలసీ అమౌంట్ ని పెంచడం ఇలా. No claim bonus ఆఫర్ చేసే ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం మీకు బాగా ప్రాఫిటబుల్ గా ఉంటుంది. 
  • నెక్స్ట్ వచ్చే సరికి క్యాప్ ఆన్ కవరేజ్ ఇది ఇన్సూరెన్స్ కంపెనీస్ మ్యాగ్జిమం హైడ్ చేయడానికి ట్రై చేస్తాయి. క్యాప్ అంటే లిమిట్. ఇన్సూరెన్స్ కంపెనీస్ పర్టిక్యులర్ ట్రీట్మెంట్ కి గాని లేదా పర్టిక్యులర్ బిల్ కి గాని ఒక లిమిట్ పెడతాయి. ఆ లిమిట్ దాటిందంటే ఆపైన బిల్ అంతా మీరు  కట్టాలి. మెయిన్ గా ఈ కాప్స్ ని హాస్పిటల్స్ లో రూమ్ రేట్స్ మీద, ఐ సి యూ రూమ్స్ మీద, అంబులెన్స్ చార్జెస్, మెటర్నటీ చార్జెస్, కొన్ని మెడికల్ చార్జెస్ పెడతారు. పాలసీ తీసుకునే ముందు ఈ లిమిట్స్ దేనిమీద ఉన్నాయి. వీటి వల్ల మీరు తీసుకుంటే ట్రీట్మెంట్ లోని కాస్ట్ లో మీరు ఎంత కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. 
  • వీటితోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మార్కెట్లో లభించే అన్ని ఇన్సూరెన్స్ ని కంపేర్ చేసుకోవాలి. ప్రీమియం తక్కువగా వస్తుంది కదా అని చెప్పేసి ఏది పడితే అది తీసుకోకూడదు. ఎమర్జెన్సీ టైం లో బాగా ఇబ్బంది పడతారు.  ఎందుకంటే అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అవసరం వచ్చిన టైమ్ లో హెల్ప్ చేయవు. లక్ష రూల్స్ మాట్లాడతారు ఆ టైంలో. 
  • అందుకే మీరు ఒక కంపెనీ నుండి ఇన్సూరెన్స్ తీసుకున్నారంటే ఆ కంపెనీ యొక్క  క్లయిమ్ సెటిల్మెంట్ రేషియోని చెక్ చేసుకోవాలి. ఎంతమందికి ఇన్సూరెన్స్ క్లైమ్ ని ఇచ్చింది. ఎంతమందికి ఎంతమందికి రిజెక్ట్ చేసిందనేది  క్లైమ్ సెటిల్మెంట్ రేషియో. ఏ కారణం చేత ఆ కంపెనీ నీ పాలసీ ని రిజెక్టు చేస్తుంది. క్లైమ్ చేశాక ఆ కంపెనీ సెటిల్మెంట్ కి ఎంత టైం తీసుకుంటుంది. ఇవన్నీ మీరు పాలసీ తీసుకునే ముందు కచ్చితంగా చెక్ చేయాల్సిన విషయాలు. 

కానీ ఒక ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మీ తరపు నుంచి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని విషయాలు మైండ్ లో పెట్టుకోవాలి. పాలసీ తీసుకునేటప్పుడు మీకు ఏదైనా డిసీజ్ ఉంది. లేదా హెల్త్ ప్రాబ్లం ఉందనుకోండి దానికి తగ్గట్టు మీరు పాలసీని తీసుకోవాలి. అంతేకానీ మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ని దాచిపెట్టి పాలసీ తీసుకుని తర్వాత క్లైమ్ చేసుకుందామనే పని అసలు చేయొద్దు. ఎందుకంటే మీరు ఎంత దాచిపెట్టిన మీ హెల్త్  ప్రాబ్లమ్స్ గురించి కచ్చితంగా మీ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళకి తెలిసిపోతుంది. అప్పుడు మీ పాలసీ టర్మ్ నెట్ అయిపోతుంది. మీరు కట్టిన ప్రీమియం కూడా తిరిగి రాదు. మీరు గాని హెల్త్ కండిషన్ గురించి దాచిపెట్టి మీ ట్రీట్మెంట్ టైం లో ఆ కండిషన్ బయటపడింది అనుకోండి మీరు ఎంత ఎమర్జెన్సీ లో ఉన్నా మీ ఇన్సూరెన్స్ కంపెనీ మీ పాలసీని క్లైమ్  చేయనీయదు. అందుకే ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయొద్దు. 

ఇన్సూరెన్స్ ప్లాన్ లో మెయిన్ గా 2 టైప్స్ ఉంటాయి. 

1. ఇండివిడ్యువల్ ప్లాన్:

ఇండివిడ్యువల్ ప్లాన్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. మీ హెల్త్ కి తగ్గట్టు మీరు ప్లాన్ తీసుకుంటారు.

2. ఫ్యామిలీ  ఫ్లోటర్ ప్లాన్:

family-floater-health-insurance

ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అంటే మీ ఫ్యామిలీ కి మొత్తానికి కలిపి ఒక ఇన్సూరెన్స్ పాలసీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 లాక్స్ కి పాలసీ తీసుకున్నారు. మీ ఫ్యామిలీ లో ఎవరికైనా నా హెల్త్ బాగాలేదు అనుకోండి ఆ 5 లాక్స్ లో నుండి మీరు  క్లైమ్ చేసుకోవచ్చు. 

రెండింటిలో ఏది బెస్ట్ అంటే అది మీ ఫ్యామిలీ మీద అ డిపెండ్ అయి ఉంటుంది. ఫ్యామిలీలో ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉంటే ఇండివిడ్యువల్ ప్లాన్ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఇండివిడ్యువల్ ప్లాన్ లో ప్రీమియం తక్కువగా ఉంటుంది. అండ్ క్లైమ్ ఎక్కువ చేసుకోవచ్చు. ఓల్డ్ ఏజ్ వాళ్లకు ఇబ్బంది ఉండదు. ఎంత కావాలంటే అంత  మెడికల్ క్లెయిమ్ చేసుకోవచ్చు. 

కానీ ఫ్లోటర్ ప్లాన్ లో క్లైమ్ ని షేర్ చేసుకోవాలి. ఓల్డ్ ఏజ్ వాళ్లకు క్లైమ్ సరిపోకపోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల జస్ట్ హెల్త్ బెనిఫిట్స్ ఏ కాదు టాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. టాక్స్ సెక్షన్80డీ ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ప్రీమియం కట్టే వాళ్ళు 25 వేల వరకు టాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. 

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా వద్దా… తీసుకుంటే ఎంత తీసుకోవాలి?

హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ మనకు చెప్పి రావు. ఎంత తీసుకోవాలి అనేది మీ ఏజ్, మీ ఫ్యామిలీ హెల్త్ హిస్టరీ, ఫ్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వీటిని దృష్టిలో పెట్టుకుని సరిపడా ప్లాన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. 

జనరల్ గా అయితే మీ ఏజ్ 30 లోపు అయితే 3లాక్స్ పాలసీ తీసుకోవడం మంచిది. మీరు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ ని తీసుకోవాలంటే మినిమం 5లాక్స్ ప్లాన్ ని తీసుకోవడం మంచిది. మెట్రో సిటీస్ లో ఉండేవాళ్ళు కొంచెం ఎక్కువగా ఉండే ప్లాన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే మెట్రో సిటీస్ లో హాస్పిటల్స్ బాగా కాస్ట్లీ గా ఉంటాయి. ఎక్స్పోర్ట్స్ చెప్పే దాని ప్రకారం మీ ఏరియా లో ఉండే హాస్పిటల్స్ లో హార్ట్ సర్జరీ కి ఎంత కాస్ట్ అవుతుందో ఆ కాస్ట్ ని కవర్ చేసే లాగా మీ హెల్త్ ఇన్సూరెన్స్ మీ కవర్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. 

మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఇప్పుడు నేను చెప్పిన విషయాలను మైండ్లో పెట్టుకుని అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీకు బాగా యూస్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళందరికీ చాలా  బాగా యోగపడుతుంది. ఈ  ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ మరియు మీ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

ADVERTISEMENT