Type Here to Get Search Results !

ADVERTISEMENT

Stress is a contagious disease ఒత్తిడి అనేది ఒక అంటురోగం

Stress-is-a-contagious-disease

Stress is a contagious disease ఒత్తిడి ప్రస్తుతం ప్రతి పౌరుడికి ఉన్న సాధారణ రోగం ఇది. ఈ ఒత్తిడి అనేది పిడికిలి బిగించడం లాంటిది. కానీ మనిషి ఎక్కువసేపు బిగించి ఉండలేడు. ఎందుకంటే అది మనిషి స్వభావం కాదు కాబట్టి. పైగా పిడికిలి బిగించడం వల్ల ఎనర్జీ ఎక్కువ ఖర్చయి అనవసరంగా అలసిపోతున్నారు. 

అయితే మీరు ఇప్పుడు అడుగుతున్నారు. 

పిడికిలి ఎలా విప్పాలి? ఏం చేయాలి? రెండవ పిడికిలి కూడా బిగించాలా? లేదా కాళ్ళు పైకి ఎత్తి తల కిందకు పెట్టాలా? 

విప్పడానికి ఏదైనా ఉపాయం ఉందా అని అడుగుతున్నారు. ఇది కొంచెం నవ్వులాటే. కానీ జనాలు ప్రతి రోజు చేసేది ఇదే. నిజానికి పిడికిలి విప్పడానికి మనిషికి సాధన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే విప్పడం లోనే మనిషి ఫ్రీ అవుతాడు. ఇంకొంచెం శక్తి పుంజుకుంటాడు. కానీ బిగించడానికి ఎక్కువ శక్తి కావాలి. ఎక్కువ శ్రమ కావాలి. 

మనిషి ఎందుకు పిడికిలి విప్పడానికి వెనకాడుతున్నాడు? 

ఎందుకంటే ఆ పిడికిలిలో వజ్రం ఉందని మన బ్రమ. ఆ వజ్రం భార్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, బంధాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. దేన్నైనా పట్టుకొని బిగించి ఉండటం వల్లే ఈ ఒత్తిడి వస్తుంది. అదే వదిలేస్తే ఏది ఉండదు. 

నా స్నేహితుడు ఒకడు ఉండేవాడు. వాడిని ఒక అమ్మాయి మోసం చేసింది. దాంతో వాడు అందరి సాధారణ అబ్బాయిల లాగే తాగుతూ, అరుస్తూ, జుట్టు పీక్కుంటూ ఘోరంగా డిప్రెషన్ లోకి వెళ్ళాడు. సొ వాడి ఓవర్ యాక్షన్ చూడలేక ఒకరోజు వాడితో అన్న ( 2సంవత్సరాలు నిన్ను ఎదవని చేసినందుకు బాధ పడుతున్నావా? లేదా జీవితాంతం ఎదవని చేయనందుకు బాధ పడుతున్నవా అని. ) అంతే ఒక్కమాటతో వాడు రియలైజ్ అయ్యి ముందు స్టంట్ లు వేయడం ఆపేసాడు. 

వాడు ఇప్పటికి అంటూ ఉంటాడు. రమేష్ గాడు నన్ను సరైన టైమ్ లో గైడ్ చేసి నా బాధల నుంచి డిప్రెషన్ నుంచి బయటపడేసాడని. అలా అనుకోవడం వాడి మూర్ఖత్వం, అమాయకత్వం. 

ఎందుకంటే వాడి బాధ పండి పక్వానికి వచ్చింది. ఒత్తిడి చివరి దశలో ఉంది. వాడి శక్తి మొత్తం, కన్నీరు మొత్తం అడుగుకు చేరుకున్నాయి. ఇక వదిలించుకోక తప్పదు. 

సో సేమ్ ఒత్తిడి కూడా అంతే. మీరు మీ పిడికిలిని వీలైనంత బలంగా బిగించి చూడండి. కేవలం కొన్ని క్షణాలు మాత్రమే బిగించి ఉండగలరు. తర్వాత వెంటనే మీ వెళ్ళని వదిలి వేయాలి. తప్పదు మరి! ఒత్తిడి కూడా అంతే. వదిలేయాలి లేదా మూలల్లోకి వెళ్లి రియలైజ్ అవ్వాలి. 

నాకు తెలిసి చాలా మంది పక్క వాళ్ళ మీదకి వదిలేస్తారు. 

ఉదాహరణకు : మీ బాస్ నిన్ను అమ్మ నా బూతులు తిట్టాడు. కానీ తిరిగి మీ బాస్ మీరు పెట్టలేరు. దాంతో ఒత్తిడి ని చేతిలో గట్టిగా బిగిస్తారు. కానీ మీరు ఎంత సేపు అలా బలంగా బిగించి ఉండగలరు. ఆ టైం రానే వచ్చింది. ఇంటికి రాగానే కూరలో ఉప్పు ఉన్నా కూడా ఉప్పు లేదని పెళ్ళాంన్నీ తిడతారు. ఆమె కూడా నిన్ను తిట్టలేదు కాబట్టి, అక్కడ పిడికిలి బిగించి కొడుకుని తిడుతుంది. వాడేమో. తల్లిని తిట్టలేడు కాబట్టి టెడ్డి బేర్ ని ఒక్క గుద్దు గుద్దుతాడు. 

సింపుల్ గా చెప్పాలంటే ఒత్తిడి అనేది ఒక అంటు వ్యాధి లాంటిది.

సో పాయింట్ ఏంటంటే ఒత్తిడిని వదిలించుకోక తప్పదు. మనిషి బాధనైనా భరిస్తాడెమో కానీ ఒత్తిడి ని మాత్రం భరించలేడు. ఎందుకంటే వాడికి అంత శక్తి లేదు. అందుకే వీడు ఒత్తిడిని పక్కవాడికి అంటించాలి అని ఆత్రుత పడతాడు. కానీ తోక లేని కోతికి తెలియని విషయం ఏంటంటే ఈ ప్రపంచం చాలా చిన్నది. అది మరలా మనల్ని అంటుకోవడానికి ఎంతో సమయం పట్టదు.

మా వెబ్ సైట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచినట్లైతే మా వెబ్సైట్ ని ఫాలో అవ్వండి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

ADVERTISEMENT