Type Here to Get Search Results !

Translate

ADVERTISEMENT

Top 10 hygiene mistakes | మీరు ప్రతిరోజూ చేసే 10 పరిశుభ్రత తప్పులు ప్రమాదకరం

Top 10 hygiene mistakes

hygiene-mistakes

These 10 hygiene mistakes you make every day are dangerous రోజు పరిశుభ్రత పేరుతో చాలా మంది ఆచరించే పద్ధతి కూడా తప్పే. మేము చెప్ప బోయే సంగతులు అక్షరాలా నిజం. అందులో అబద్ధం ఏమాత్రం లేదు. మన రోజువారీ జీవితంలో తెలిసో తెలియకో ఎవరైనా ఈ పొరపాట్లు చేస్తుంటే కనుక వాటిని సరిచేయాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. ఈ ఆర్టికల్ లో హైజీన్ పేరుతో మనం చేసే 10 పొరపాట్లను తెలియజేసి వాటిని సవరించే ప్రయత్నం చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అలాంటి పొరపాట్లు మానుకుంటేనే మంచి అలవాట్లను కొనసాగిస్తారు. 

1. స్నానం చేయడానికి ఒక్కొక్కరు ఎంత టైమ్ కేటాయిస్తారు

ఆఫీసులకి, స్కూల్స్ కి వెళ్లేవారు 5నిమిషాల కన్నా ఎక్కువ సేపు స్నానం చేయాలి. కాలేజ్ కి వెళ్లే పిల్లలైతే నీళ్లు పొదుపు చేద్దామని ప్రయత్నిస్తారు. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా సెలవు రోజుల్లో మాత్రం ప్రశాంతంగా స్నానం చేయడం చాలామందికి ఇష్టమైన పని. 4బకెట్స్ నీళ్లతో తలస్నానం చేయడం, బాత్ టబ్ లో కూర్చుని గంటల తరబడి పాటలు వింటాం. ఇలాంటివన్నీ చాలా మందికి ఇష్టమైన పనులు. స్నానం చేయడం తప్పు కాదు. రోజూ చేయాలి. అది ఆరోగ్యానికి మంచిదే. కానీ ఎక్కువ సేపు స్నానం చేయడం మాత్రం మంచిది కాదు. మనం వాడే సబ్బులు, షాంపూలలో కెమికల్స్ చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఆ కెమికల్స్ మన శరీరంలోని P.H స్కేల్ పాడు చేస్తాయి. అంతేకాదు ఎక్కువసేపు స్నానం చేస్తే చర్మం కూడా పొడిబారిపోతుంది. దాంతో చర్మం మీద దురద లేదా మంట లాగా వస్తుంది. చాలా పరిశోధన చేసిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే వారంలో 3 నుంచి 5రోజుల పాటు స్నానం చేస్తే సరిపోతుంది. భారతీయులు ప్రతిరోజు స్నానం చేస్తారు. చైనాలో వారానికి 2రోజులు మాత్రమే స్నానం చేస్తారట. 

రోజు ఎండలో పనిచేసే వారు మట్టి పని చేసే వారు మాత్రం రోజూ స్నానం చేయాలి. ఎందుకంటే మీరు వాడే సబ్బులతో మీకు హాని జరగకుండా ఉండాలంటే మీ చర్మ సౌందర్యం తగ్గిపోకుండా ఉండాలంటే త్వరగా స్నానం ముగించాలి. 

2. గోళ్లను కట్ చేసే సరైన పద్ధతి

ప్రతి 2వారాలకు ఒకసారి మన గోళ్లు పెరిగిపోతుంటాయి. వెంటనే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి నెయిల్ కట్టర్ తీసి గోర్లు కట్ చేసుకుంటారు. చాలా సార్లు ఇంటిల్లిపాది ఒకే నెయిల్ కట్టర్ ని వాడుతూ ఉంటారు. అందరు ఒక్కటే నెయిల్ కట్టర్ వాడితే ఏం జరుగుతుంది అనుకుంటాం. కానీ చాలా రకాల బ్యాక్టీరియాలు ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుంది. పొడుగ్గా పెరిగిన గోళ్లలో మురికి చేరుతుంది. ఆ గోళ్లల్లో చాలా రకాల బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి. బ్యాక్టిరియా చేరిందంటే ఇన్‌ఫెక్షన్ చేరినట్టె, చాలా సార్లు మనం అలాంటి విషయాల పట్ల నిర్లక్ష్యంగా ఉంటాం. కానీ జాగ్రత్త తీసుకోవడం తప్పనిసరి. ఇంట్లో నెయిల్ కట్టర్ ఒకటే ఉంది అనుకుంటే మీరు వాడే కంటే ముందు ఆ నెయిల్ కట్టర్ ని శుభ్రంగా కడగండి. మీరు వాడిన తర్వాత కూడా దాన్ని శుభ్రంగా కడిగి పెట్టండి. దీంతో మీకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. 

3. చెవుల్లో దురదగా ఉందని ఏదోఒకటి తీసుకొని చేవిలో పెట్టేస్తారు

చెవుల్లో దురదగా ఉందని క్లీన్ చేయడానికి కీచైన్, పెన్సిల్, పేపర్ ముక్కలు కూడా ఉపయోగిస్తుంటారు. మీరు అలా చేయకపోవాడమే మంచిది. మీ చెవులను మీరే పాడు చేసుకోకండి. చెవిలోని మురికిని శుభ్రం చేయడానికి ఏదో ఒక వస్తువు చెవుల్లో దూర్చి ప్రమాదాలు కొనితెచ్చుకోకండి. మీరు వాడే వస్తువుల్లో ఉన్న దుమ్ము చెవిలోకి చేరడమే కాదు వాటి కొనలు పదునుగా ఉంటే లోపల గుచ్చుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మనం స్నానం చేసేటప్పుడు ఇయర్ కెనాల్ లోకి నీరుపోతూ ఉంటుంది. కాసేపటి తర్వాత అదే సర్దుకుంటుంది. అలా కాక మీ చెవుల్లో ఇయర్ వాక్స్ చాలా పేరుకుపోతుందనుకుంటే స్నానం చేసేటప్పుడు వేడినీళ్లతో చెవుల్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. 

4. మీ టూత్ బ్రష్ తరచు మార్చుకోరా?

మీ టూత్ పేస్ట్ మారుస్తూ ఉంటారా? లేదా మనం వాడుకునే పిల్లో, బెడ్ షీట్స్, రెగ్యులర్‌గా మార్చుకుంటూ ఉంటాం. కర్టెన్లు, కార్పెట్లు కూడా రెండు మూడు నెలల కోసారి తీసి ఉతికేస్తుంటారు. కానీ చాలా మంది టూత్ బ్రష్ మాత్రం చాలా రోజుల పాటు అలాగే ఉపయోగిస్తుంటారు. ఒక్కో సారి దాని రంగు రూపమే మారిపోతుంది. కానీ అలాగే వాడేస్తూ ఉంటారు. ఇది మాత్రం దురలవాటనే చెప్పాలి. డాక్టర్లు చెప్పే మాట ఏంటంటే మనం వాడే టూత్ బ్రష్ కనీసం ప్రతి రెండు మూడు నెలలకోసారి మార్చు కోవాలి. 

ఎక్కువ నెలలు బ్రష్ ని వాడటం వలన బ్రష్ లోని బ్యాక్టీరియా మన నోట్లోకి చేరుతుంది. పాత బ్రష్ ని వాడుతూ ఉంటే వాటి బ్రిజిల్స్ కూడా అరిగిపోయి పాళ్లను శుభ్రం చేయడం మానేస్తాయి. అందుకే బ్రష్ మార్చుకుంటూ ఉండాలి.

5. రిమోట్ ని క్లీన్ చేసుకోవట్లేదా?

మనం ప్రతి రోజు ఎన్నో రకాల వస్తువులను ఉపయోగిస్తుటాం. స్పూన్స్. మొబైల్స్, రిమోట్స్, గిన్నెలు, ఫ్రెష్, బాత్‌రూమ్‌లోని నల్లాలు ఇలా రకరకాల వాటిని మనం ఎన్ని సార్లు శుభ్రం చేస్తూ ఉంటాం. స్పూన్లు సంగతి పక్కన పెట్టండి. రెగ్యులర్ గా మారుస్తూ ఉంటాం. ఇంటిని రెగ్యులర్ గా క్లీన్ చేస్తూ ఉంటాం. మరి మనం ఉపయోగించే మిగతా వస్తువుల సంగతేంటి? 

మొబైల్స్, రిమోట్స్ లాంటి వస్తువులు ఎంత మంది వాడుతూ ఉంటారు. మీకు నమ్మశక్యం కాదు కానీ వీటి మీద బాత్రూంలో కన్నా కూడా ఎక్కువ బాక్టీరియా ఉంటుందట. లక్షల కోట్ల సంఖ్యలో సూక్ష్మక్రిములు వాటి మీద చేరిపో తుంటాయి. ఎన్ని సంవత్సరాలపాటు మన మొబైల్ చేతిలో ఉందో అన్ని సంవత్సరాల పాటు సూక్ష్మక్రిములు వాటి మీద అలాగే ఉంటాయి. అందుకే వీటిని రెగ్యులర్‌గా శుభ్రం చేయడం చాలా అవసరం. 

అలాగని వాటిని నీళ్లలో వేసి కడగమని కాదు. మెత్తని కాటన్ క్లాత్‌తో శానిటైజర్‌తో శుభ్రం చేస్తే సరిపోతుంది. 

6. వ్యాయామం ఆరోగ్యానికి చాలా అవసరం. 

మీరు రోజూ వ్యాయామం చేస్తే చాలా సంతోషం కాకపోతే వర్క్అవుట్ చేసిన ప్రతి సారీ స్నానం చేయడం కూడా చాలా ముఖ్యం. రోజులో ఎప్పుడో ఒకసారి చేస్తే సరిపోతుందిలే అనుకుంటే పొరపాటే. వర్క్ఔట్ చేసిన ప్రతిసారీ స్నానం చేయాల్సిన అవసరం ఉంది. మనం వర్క్ చేసినప్పుడు వచ్చే చెమటలో సూక్ష్మక్రిములు ఏర్పడతాయి. స్నానం చేసి వాటిని శుభ్రం చేసుకోకపోతే ఇవి అనారోగ్యానికి కారణమవుతాయి. 

7. షూ వేసుకున్నప్పుడు సాక్స్ తప్పనిసరి

బయటికెళ్ళినప్పుడు గమనించండి ప్రతి ముగ్గురిలో ఒకరు షూ వేసుకుంటారు. కానీ సాక్స్ వేసుకోరు. ఇలా సాక్స్ వేసుకోకుండా షూ వేసుకోవడం వల్ల పాదాల్లో అనేక రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ని కొనితెచ్చుకోవడమే అవుతుంది. అందుకే బద్ధకం వదిలేసి సాక్స్ కొని తెచ్చుకొని వేసుకోండి. 

8. సరైన పద్దతిలో దంతాలను శుభ్రం చేసుకుంటున్నారా

ఈ మధ్యకాలంలో ఆరోగ్యం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు ఏదిచెప్తే అది పాటిస్తున్నారు. రోజుకు 2సార్లు స్నానం చేయడం, ఏదైనా వస్తువు కొనే ముందు శానిటైజర్ వాడటం, రోజంతా కూరగాయలు, పండ్లు తినడం. గంటల కొద్దీ జిమ్ లో ఎక్సర్ సైజ్ చేయడం, ఇలా అన్ని చేసేస్తున్నారు. 

కాని ఇన్ని జాగ్రత్త లు తీసుకునే వారు తమ నోటిలోని దంతాల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. రోజుకి రెండుసార్లు బ్రష్ చేసినా సరిపోదు. ఎందుకంటే పంటి మీద బ్యాక్టీరియా పంటి మధ్యలోకి చేరిపోతుంది. ఆ బ్యాక్టీరియాని బ్రష్‌తో శుభ్రం చేయడం అసాధ్యం. పంటి మధ్యలో చిక్కుకున్న. బ్యాక్టీరియాని తీసేయడానికి సరైన పద్ధతి ప్లస్ ఉపయోగించడమే ఇలా చేస్తే మీ పళ్లలో ఉన్న బ్యాక్టీరియా 100% శుభ్రం అయిపోతుంది. డెంటిస్ట్ లు అందరూ చెప్పేమాట ఇది. ఈ రోజు నుండి రెగ్యులర్ గా ఫోకస్ చేయండి. మీ దంతాలను శుభ్రంగా ఉంచుకోండి.  

9. నీ చేతులు శుభ్రం చేసుకోగానే సరిపోదు. 

టాయిలెట్ కి వెళ్లి రాగానే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నిద్ర లేవగానే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ మాటలు మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము. అంతే నా! టీవీల్లో ప్రకటనల రూపంలో కూడా మనకి అదే మాట చెబుతుంటారు. ఇన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా సరే మనం అలాంటి చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెట్టము. 

రోజంతా మనం రకరకాల వస్తువులను ముట్టుకుంటుంటాం. చేతులు శుభ్రంగా కడుక్కో కుండా భోజనం చేస్తే ఆ పదార్థాల మీద ఉండే సూక్ష్మక్రిములు చేతుల ద్వారా మన కడుపులోకి వెళ్లి మనం జబ్బు పడేలా చేస్తాయి. 

  • మీకు తెలుసా? హోటల్ లో ఉండే మెనూకార్డ్ మీద టాయిలెట్ లో కన్నా 20రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందట. హోటల్ మెనూ కార్డు ముట్టుకున్నాక మనలో ఎంతమంది చేతులు శుభ్రంగా కడుక్కుంటారు చెప్పండి? 
  • మనలో చాలామందికి రకరకాల అలవాట్లు ఉంటాయి. పదే పదే ముఖం మీద రుద్దుకోవడం, చేతులతో కళ్ళు నలుపుకుంటూ కూర్చోవడం మంచిది కాదు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా! చేతిలో ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉంటుంది. 
  • అందుకే ముఖం మీద మురికిగాను చేయి పెట్టగానే అనిపిస్తే చల్లటి నీళ్లతో కడుక్కోండి. ఒక నాప్కిన్ తీసుకుని శుభ్రం చేసుకోండి. 
  • అంతేకాని చేతులతో ముట్టి కొత్త ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకోకండి. 
  • మీ చేతుల్లోనే మీ ఆరోగ్యం ఉంది. అందుకే నిరంతరం మీ చేతులు శుభ్రంగా ఉంచుకోండి.

10. Health Tips Telugu హెల్త్ టిప్స్ తెలుగు

మీరు ఆరోగ్యాంగా ఉండడానికి హెల్త్ టిప్స్ తెలుగు వెబ్సైట్ ని ఫాలో అవుతూ ఉండండి. మీకు హెల్త్ కి సంబందించిన అన్ని ముఖ్యమైన విషయాలను తెలియజేస్తూ ఉంటాము.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

ADVERTISEMENT