Migraine symptoms
నిద్ర చాలనప్పుడు, పని ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు తలనొప్పిగా అనిపించడం మామూలే. ఇలాంటప్పుడు ఒక కప్పు కాఫీ లేదా టీ తాగితే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది. అయితే తలనొప్పి లోనే మైగ్రేన్ అనే మహా తలనొప్పి ఒకటి. తలలో నరాలు చిట్లిపోతున్నాయా! తలపై ఎవరైనా సుత్తిలతో బాదుతున్నారా! అన్నంతగా వేధిస్తుంది. మరీ ముఖ్యంగా మైగ్రేన్ అనేది మహిళలలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నిత్య జీవితాన్ని దుర్బరంగా మార్చే మైగ్రేన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మైగ్రేన్ తలలో ఒకవైపు మాత్రమే వేధించే ఒక రకమైన తలనొప్పి. మాడుపై సుత్తితో బాదుతూ ఉన్నట్లుగా, రక్తనాళాలు చిట్లిపోతున్నట్లుగా, నరనరాల్లో ఉప్పెనలు పోటెత్తుతున్నట్లుగా మైగ్రేన్ మనిషిని బాదిస్తుంది. ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది.
మైగ్రేన్ లక్షణాలు:
- సాధారణంగా ఉదయం నిద్ర నుంచి మేలుకున్నప్పుడు వస్తూ ఉంటాయి. తేలికపాటి తలనొప్పితో ప్రారంభమై తీవ్రమైన తలనొప్పి వస్తుంది. కొందరిలో వాంతి అవుతున్నట్లు గాను, మరికొందరిలో వాంతులతో కూడిన తలనొప్పి ఉంటుంది.
- అధిక వెలుతురును, శబ్దాలను భరించలేరు. కళ్ళ ముందు వెలుతురును ముఖంలో ఒక భాగంలో కానీ లేదా ఒక చేయి, ఒక కాలులో తిమ్మిరి పట్టినట్టుగా సూదులతో గుచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది.
- కళ్ళు తిరగడం, బలహీనత, మాట్లాడటానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు.
- ఈ లక్షణాలతో పాటు తలలో నరాలు చిట్లిపోతున్నాయా? తలపై సుత్తితో వాడుతున్నారా? అన్నంతగా నొప్పి ఉంటుంది.
- మహిళల్లో నెలసరి ముందు, నెలసరి రోజుల్లో మైగ్రేన్ బాధలు అధికంగా ఉంటాయి.
మైగ్రేన్ అనేది ఒక రకంగా ఎపిసోడిక్. అంటే అకస్మాత్తుగా అప్పుడప్పుడు వచ్చే తలనొప్పి, ఈ తలనొప్పితో పాటు కొన్నికొన్ని సార్లు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. దానికి తోడు శబ్దాలను భరించలేకపోవడం, కాంతిని చూడలేకపోవడం, ఈ తలనొప్పి వచ్చే ముందు కొంతమందికి ఆరా అంటే తెలుస్తుంది వీళ్ళకి.
ఉదాహరణకి: కంటి ముందు రంగురంగుల లాగా గాని కొద్దిగా చూపు తగినట్లుగాని, అట్లా రావడమే కాకుండా కొద్దిమందికి మాట మొద్దుగా రావడం. కొద్ది మందికి కాళ్ళు అంటే ఒక పక్కన లాగేయడం లాంటివి కూడా లక్షణాలు రావచ్చు.
కాబట్టి దీన్ని మైగ్రేన్ విత్ ఆరా లేదా క్లాసికల్ మైగ్రేన్ అంటారు. కామన్ మైగ్రేన్ అని ఉంటుంది. అంటే మైగ్రేన్ వితౌట్ ఆరా అంటే వీళ్ళకి ఈ ఆరా అంటే ముందు మైగ్రేన్ వస్తుందేమో అనే లక్షణాలు ఏమి తెలికపోవచ్చు. ఎక్కువ శాతం మందికి ఇలా మైగ్రేన్ విత్ ఆరా, మైగ్రేన్ వితౌట్ ఆరా ఇలా విభజిస్తారు.
ఇవి కాకుండా కొంతమందికి ఇన్స్టోన్ మైగ్రేన్ అంటారు. అంటే ఆడవాళ్ళల్లో నెలసరి వచ్చే ముందు తర్వాత మొదటి రెండు రోజులు వీళ్ళకి బ్లీడింగ్ తో పాటు తలనొప్పి కూడా కావచ్చు. ఈ హార్మోనల్ చేంజెస్ మూలాన తలనొప్పి రావచ్చు.
ఇంకోటి హిమిప్లేజిక్ మైగ్రేన్. అంటే మైగ్రేన్ వచ్చిన వాళ్లలో కొంతమందికి ఒక చెయ్యి, కాలు, బలం తగ్గి మళ్లీ స్ఫోటినియస్ గా రికవర్ అవుతారు.
అలా వెస్టిగ్లార్ మైగ్రేన్ అంటే కొద్దిమందికి మైగ్రేన్ తలనొప్పి ఉండేవాళ్ళకి తల కూడా తిరుగుతూ ఉంటుంది. ఇంకా అక్లర్ మైగ్రేన్ అని. ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇలా బేసిగ్గా మైగ్రేన్ వచ్చే దాన్ని బట్టి మైగ్రేన్ రకం అని చెప్తారు.
మైగ్రేన్‌కు కొన్ని ప్రత్యేకమైన కారణాలు ప్రేరేపకాలుగా పనిచేస్తూ ఉంటాయి. మానసిక ఒత్తిడి, అధిక శ్రమ, ప్రకాశవంతమైన వెలుతురు, నెలసరిలో తేడాలు, గర్భనిరోధక మాత్రలు, మత్తు పానీయాలు, పొగ అలవాటు ఇవన్నీ మైగ్రేన్ ను ప్రేరేపించేవే. మైగ్రేన్ లో తలకు ఒక వైపు వెళ్లే నరాలు అకస్మాత్తుగా సంకోచ వ్యాకోచాలకు లోనుకావటంతో తలలో నొప్పి మొదలవుతూ ఉంటుంది.
మైగ్రేన్ లో మళ్ళీ Common అని, Classical అని రెండు రకాల తలనొప్పులు కనిపిస్తాయి.
1. Common మైగ్రేన్:
Common మైగ్రేన్ అనేది ఎక్కువగా మహిళల్లో వస్తూ ఉంటుంది. తలలో రెండు వైపులా బాధిస్తూ ఉంటుంది. కళ్ళల్లో సూదులతో గుచ్చుతున్నట్లు నొప్పి ఉంటుంది. ఎక్కువగా కంటి వెనుక భాగంలో ఈ నొప్పి ఉంటుంది.
2. Classical మైగ్రేన్:
Classical మైగ్రేన్ లో తలనొప్పి ఒక పక్క చెవి పైన మొదలై మొత్తం సగ భాగానికి పాకుతుంది. ఒకసారి కుడివైపు కలిగితే మరొకసారి ఎడమ పక్క కలగొచ్చు. ఈ తలనొప్పిని throbbing positive rounding తలనొప్పిగా వర్ణిస్తారు. ఎక్కువగా పర్సిటీవ్ తలనొప్పి కనిపిస్తూ ఉంటుంది. మన జనాభాలో సుమారు 10 శాతం మంది మైగ్రేన్ బాధితులు అని డాక్టర్లు చెబుతారు.
- జెనెటికల్ గా కొద్ది మందిలో మైగ్రేన్ వచ్చే లక్షణం ఉంటుంది. ఈ మైగ్రేన్ వచ్చే లక్షణం వాళ్ళల్లో నరాల స్పందన కొద్దిగా తేలికగా స్పందిస్తూ ఉంటాయి. అంటే పెయిన్ థ్రెషోల్డ్ వీళ్ళకు చాలా తక్కువగా ఉంటుంది.
- బ్రెయిన్ లో న్యూరాన్స్, బయట ఎన్విరాల్మెంట్ ఫాక్టర్స్ మూలాన నొప్పి సులభంగా వాటికి తెలుస్తుంది. అది తెలవడం మూలాన ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్ కి అలా పాకటం మూలాన ఈ మైగ్రేన్ సింటమ్స్ వస్తేనే అదొక తీరి.
- మైగ్రేన్ కంటిన్యూస్ గా ఉండటం మూలాన Status migraine అంటారు. 72 గంటల కంటే నిరంతరంగా ఎక్కువ సేపు తలనొప్పి ఉంటుంది. ఆ స్టేటస్ మైగ్రేన్ లోకి వెళితే గనక వీళ్ళకి చికిత్స ఇస్తే దానికి వచ్చే ప్రతిస్పందన సమయం తీసుకుంటారు. అందుకే వీళ్ళకి వాంతులు లాంటివి ఎక్కువ అవుతుంది. ఒక్కోసారి వీళ్ళకి అడ్మిట్ చేసి ఫ్లూయిడ్స్ ఇచ్చి స్టెరాయిడ్స్ ఇచ్చి మిగతా నొప్పి క్లాస్ కూడా ఇచ్చి అట్లాగే ఇంజెక్షన్స్, ఫ్లూయిడ్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది.
- మైగ్రేన్ ఎక్కువసేపు ఉన్నవాళ్ళల్లో పక్షవాతం కూడా రావచ్చు. మైగ్రేన్ అయినా నరాల్లో స్పందన కొద్దిగా ఎక్కువగా ఉండటం మూలాన వస్తుంది. కాబట్టి వీళ్ళకి మూర్ఛ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మైగ్రేన్ గనుక ఎక్కువ సేపు వచ్చిన వాళ్ళలో మైగ్రేన్ ఉన్నవాళ్లలో మూడు డిస్టర్బ్‌లు కూడా ఉండొచ్చు. అంటే డిప్రెషన్ ఉండొచ్చు. ఆందోళన ఉండొచ్చు. అన్నీ కలిపి ఉండొచ్చు.
మైగ్రేన్ కి రెండు రకాలుగా చికిత్స ఉంటుంది.
- మొదటి రకం చికిత్సలో తక్షణం నొప్పిని నివారించే నొప్పి నివారిణి లైన డోలో, క్రోసిన్ వంటి మందులు ఇస్తూ ఉంటారు.
- రెండో రకం చికిత్సలో మైగ్రేన్ మళ్లీ మళ్లీ రాకుండా దీర్ఘకాలికంగా కాల్షియం ఛానల్ లాకర్స్, బీటా బ్లాకర్స్, యాంటీ హిస్టమీస్, యాంటీ ఏమిటిక్స్ వంటి మందులు వాడాల్సిందేగా సూచిస్తారు.
- మైగ్రేన్‌కు ఇటీవల కాలంలో బొటాక్స్ ని కూడా చికిత్సలో భాగంగా వాడుతున్నారు.
- తాజాగా జేక్యూటి ప్యాచ్ అనే కొత్తరకం పట్టి చికిత్స కూడా ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. మైగ్రేన్ వేధిస్తున్నప్పుడు ఈ పట్టికీ గల మీటర్ ని నొక్కితే చాలు, మందు చర్మం ద్వారా నేరుగా శరీరంలోకి చేరి మైగ్రేన్ బాధలను తగ్గిస్తుంది.
మైగ్రేన్ తలనొప్పని నిర్ధారణ అయిన తరువాత వీళ్ళు చాలా జాగ్రత్తగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి వస్తుంది.
ఫుడ్ లేట్ అయితే గనక సరిగ్గా టైం కి తినటం. తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవడం, కొంతమందికి స్టోర్డ్ ఫుడ్ తిన్న చాకోలెట్స్ తిన్న దాని వలన కూడా తల నొప్పి రావచ్చు.
తినే క్వాంటిటీ నే ఐదు ఆరు సార్లకు డివైడ్ చేసుకొని కొద్ది కొద్దిగా హెల్త్య్ ఫుడ్ తింటే గనుక వీళ్ళకి తలనొప్పి వచ్చే అవకాశం తగ్గించుకోవచ్చు. అలాగే కొద్దిమందికి నిద్రలేకపోవడం కావచ్చు. అయితే వీళ్ళు ఏం చేయాలి.? కనీసం 6 నుంచి 8 గంటల వరకు ప్రశాంతంగా నిద్ర పోతే గనుక మల్లి బ్రెయిన్ యాక్టీవ్ అయ్యి మెరుగ్గా ఉండి వీళ్ళకి మైగ్రేన్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
అలాగే వాతావరణంలో మార్పులు బాగా ఎండగా ఉన్నా, లేకపోతే బాగా చల్లగా ఉండి Ac blowers కింద కూర్చున్న కొంతమందికి తలనొప్పి రావచ్చు. ఎండలోకి వెళ్ళినప్పుడు కల్లోజోళ్ళు పెట్టుకోవడం ఇలాంటివి. తల నొప్పి వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం, అంటే సింపుల్ గా పారాసిటమాల్ టాబ్లెట్ ఉంటుంది. లేకపోతే నీప్రాక్సిన్ సోడియం. ఇలాంటి పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే తల నొప్పి వచ్చినప్పుడు తగ్గించుకోవడానికి పనికి వస్తుంది.
అంతేకాకుండా కొద్దిమందిలో ఈ తలనొప్పులు రాకుండా నివారించుకోవటానికి కొన్ని మందులు ఉంటాయి. అంటే దీన్ని ప్రొపెలాక్టిక్ మెడికేషన్స్ అంటారు. అంటే ఒకరికి తలనొప్పి బాగా తరచుగా వచ్చి అంటే సుమారుగా నెలకి 4 సార్లు అట్లా వచ్చి లేకపోతే 12 గంటల వరకు అట్లా తగ్గకుండా కంటిన్యూస్ గా ఉన్న తలనొప్పి వచ్చి మాములుగా రెగ్యులర్ గా వీళ్ళకి పెయిన్ కిల్లర్స్ కి పెద్ద స్పందన అంత బాగా రాకపోయినా వీళ్ళకి ఈ ప్రొపెలాక్టిక్ మెడికేషన్స్ అని ఉంటుంది.
ఈ ప్రివెంటివ్ మెడికేషన్స్ తో రకరకాలుగా ఉంటుంది. ఉదాహరణకి ఇమిట్రిక్ పిల్ అని, బీటా బ్లాకర్స్ అని, ఆసైబిలియమ్ అని ఇలాంటి మందులు ఉంటాయి. ఈ మందులు వాడుకోవడం మూలన వీళ్ళకి తలనొప్పి రాకుండా చేయొచ్చు. రెగ్యులర్ గా వ్యాయామం చేసుకోవడం, ఫ్లూయిడ్స్ సరిపడా తాగటం. యోగ, ధ్యానం ఇలాంటివి చేస్తే గనుక మనకు తలనొప్పి వచ్చే ఛాన్స్ ని బాగా తగ్గించుకోవచ్చు.
మైగ్రేన్ ని నివారించుకోవటానికి జీవన శైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- నిత్యం ఎదురయ్యే ఒత్తిడులు, ఆందోళనలు తట్టుకునేందుకు యోగ, ధ్యానం, ప్రాణాయామాన్ని ఆచరించాలి.
- నిత్యం కాసేపైనా నడవాలి.
- పొగ, మద్యం వంటి అలవాటు ఉన్నట్లయితే వెంటనే వాటిని విడనాడాలి.
- పడని ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉండటమే మేలు.
- మైగ్రేన్ మందుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.
- డాక్టర్ చెప్పిన మోతాదులో మాత్రమే మందుల్ని వాడాలి.
- ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మైగ్రేన్ ముప్పును చాలా వరకు నివారించుకోవచ్చు.