-->
yrDJooVjUUVjPPmgydgdYJNMEAXQXw13gYAIRnOQ
Bookmark

Basil Seeds benefits సబ్జా గింజలు వాటి యొక్క పూర్తి విశిష్టత, అందరికి ఉపయోగపడె దివ్య ఔషధం లా పనిచేస్తుంది. ఎలా ఉపయోగించాలి?

Basil Seeds benefits సబ్జా గింజలు వాటియొక్క  విశిష్టత 

Basil-Seeds-benefits-health-tips-telugu

సబ్జా గింజలు ( Basil Seeds ) వీటిని సాధారణంగా చాలామంది తులసి సీడ్స్ , బేసిల్ సీడ్స్, సబ్జా గింజలు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. సబ్జా గింజలకు చాల విశిష్టత ఉంది. ఒక స్పూన్ సబ్జా గింజలను నీళ్లలో వేయగానే 15 నిమిషాల్లో జెల్ లాగా ఉబ్బిపోతాయి. 

ఉపయోగాలు ఎలా ఉపయోగించాలి.?

సబ్జాగింజల్ని( Basil Seeds ) ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టుకొని ఆ నీళ్ళని త్రాగితే జీవక్రియలు చురుగ్గా సాగుతాయి. మహిళలకు తప్పకుండా కావాల్సిన పొలిట్ తో పాటు, అందాన్ని ఇనుమడింపజేసే విటమిన్ E కూడా ఇందులో లభిస్తుంది. 

ఈ విత్తనాలకు కాస్త తడి తగిలిన అవి ఉబ్బిపోతాయి, దాంతో వీటి బరువు పదింతలు పెరిగిపోతుంది. అందుకే వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే త్వరగా కడుపు నిండిన భావన కలిగి మాటిమాటికి ఆకలి వేయదు. ఔషధ గుణాలు ఈ జిగురులా ఉండే ఈ సబ్జా గింజల్లో బోలెడు ఉన్నాయి. ఇవి మల, మూత్ర సమస్యలను మరియు శరీర ఉష్ణోగ్రతను తగ్గించి నివారిస్తుంది. శరీరం బయటి భాగాలను, లోపలి భాగాలను కూడా కాపాడటంలో సబ్జా గింజలు బాగా పనిచేస్తాయి. ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని బాగా నూరి నూనెలో కలిపి గాయాలపైన రాయడం వలన అవి త్వరగా తగ్గుతాయి. 

Basil-Seeds-benefits-health-tips-telugu-Headache
తలనొప్పి (Headache)

తలనొప్పి ( Migraine Headache )వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకొని అవి ఉబ్బిన తర్వాత త్రాగి చుడండి సమస్య తగ్గిపోవడమే కాకుండా మానసికంగా ప్రశాంతత కూడా మీ సొంతం అవుతుంది.  రక్తాన్ని( Blood )శుద్ధి చేయడం, శరీరంలోని మలినాలను తొలగించడంలోనూ దీని తర్వాతే ఏదైనా. 

Basil-Seeds-benefits-health-tips-telugu-Lungs
ఊపిరితిత్తులు (Lungs)

శ్వాస సంబంద వ్యాధులతో బాధపడేవారు కొన్ని గోరువెచ్చటి నీటిలో అల్లం( Ginger )రసం, తేనె( Honey ) , నానబెట్టిన సబ్జా గింజలు ఈ మూడు వేసి బాగా కలిపి త్రాగాలి, ఇలా చేయడం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు శ్వాస సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. 

ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీళ్లలో ఒక స్పూను సబ్జా గింజల్ని వేసుకొని త్రాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇవి చర్మ సమస్యలను అరికట్టడంలోను బాగా పని చేస్తాయి. ఈ సబ్జా గింజలను ఉపయోగించడం వలన వేషవి( Summer )లో దప్పిక ( దాహం ) అవదు, నోరు ఎండిపోదు, నాలుక పిడచకట్టుకుని పోదు, ఇటువంటి విశిష్టమైన గుణాలు ఉన్నాయి. వేసవికాలంలో సబ్జాగింజలను వాడటం చాల ఆరోగ్యకరం. 

ఎలా త్రాగవచ్చు?

సబ్జా గింజలను ఒక గ్లాసు నీళ్లలో ఒక స్పూను వేసి నిమ్మరసం కలిపి త్రాగవచ్చు , లేదు అంటే నీళ్లకు బదులు కొబ్బరినీళ్లులో సబ్జాగింజలు కలిపి త్రాగవచ్చు. మజ్జిగ లో కూడా కలిపి త్రాగవచ్చు, పళ్ళ రసం లో కూడా ఒక స్పూను సబ్జాగింజలను కలుపుకొని త్రాగవచ్చు, పాలలో కూడా సబ్జాగింజలను వేసుకొని త్రాగవచ్చు, సబ్జాగింజలను అల్లం,తేనె, నిమ్మరసం ఈ మూడింటిని కలిపి త్రాగవచ్చు, అల్లం లో ఔషధగుణాలు ఉన్నాయి, తేనెలో ఔషధగుణాలు ఉన్నాయి, నిమ్మరసంలో ఔషధగుణాలు ఉన్నాయి, ఇవన్నీ కలిపి త్రాగడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నవాళ్లమవుతాము.

Blood-Cells-health-tips-telugu
రక్తకణాలు (Blood Cells)

సబ్జాగింజల్లో  కొన్ని పోషక పదార్దాలు ఉన్నాయి, వాటిలో ఒకటి అత్యధికంగా పీచు పదార్థం, ఫోలిక్ యాసిడ్( folic acid ), విటమిన్ E ఉంది. ఫోలిక్ యాసిడ్ ఉండటం వలన ఎముకల్లో మూలుగు నుంచి రక్తం లోని ఎర్ర రక్తకణాల వృద్ధికి దోహదపడతాయి. ఈ పీచు పదార్థం ఉండటం వలన జీర్ణ శక్తి బాగా పెరుగుతుంది, దానివలన మలబద్దకం లేకుండా ఉంటుంది. మలబద్దకం లేకుండా ఉంటె మొలలు ( Piles ), మూలశంకు అనేవి దూరంగా ఉంటాయి.

Digestive-System-జీర్ణవ్యవస్థ-health-tips-telugu
 Digestive System (జీర్ణవ్యవస్థ)

అజీర్తి ఉన్నవారికి, జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారికి సబ్జాగింజలు చాల బాగా ఉపయోగపడుతుంది. కొంతమందికి పొట్టలో నొప్పి, వికారం పేగుపూత గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నవారికి సబ్జాగింజలు తీసుకోవడం వలన సమస్య పూర్తిగా పరిష్కరించబడుతుంది. కొంతమందికి గొంతలో మంటగా ఉంటుంది, దగ్గు, ఆయాసం సైనసైటిస్, మైగ్రేన్ (తలనొప్పి ), వికారం వాంతి ఇవన్నీ సమస్యలకు కూడా సబ్జాగింజలు చక్కటి పరిస్కారం. 

skin-beauty-health-tips-telugu
చర్మ సౌందర్యం & కేశసౌందర్యం

సబ్జాగింజలు వాడటం వలన చర్మ సౌందర్యం, కేశసౌందర్యం కూడా కాపాడబడుతుంది. చర్మం వేషవికాలంలో కూడా నిగనిగలాడుతోంది, చర్మం మీద చిన్నచిన్న కురుపులు రాకుండా, వేషవిలో చర్మం పేలకుండా కాపాడుతుంది. ఈ సబ్జాగింజలు పిల్లలు, పెద్దలు, వృద్దులు అందరు కూడా వాడటం ద్వారా ఆరోగ్యాంగా ఉంటారు, రిలీఫ్ పొందుతారు. 

Tip :- అరటిపండు మెత్తగా చేసి , అరటిపండులో పెరుగు కలిపి దాంట్లో రెండు లేదా మూడు స్పూనుల సబ్జాగింజలు కలిపి దాన్ని తినడం వలన మలబద్దకం పరారవుతుంది. పిల్లలు, పెద్దలు రాత్రిపూట తినడం వలన ప్రొద్దున్నే మోషన్ ఫ్రీగా అవుతుంది. దింతో పాటు గోరువెచ్చని నీటిని రోజుకు 2-3 లీటర్లు త్రాగడమనేది చాల ముఖ్యం, వేషావికాలం లో నీళ్లు ఎక్కువగా త్రాగీతే చాల మంచిది.

1 comment

1 comment

  • GAMEING WORLD
    GAMEING WORLD
    July 29, 2021 at 10:32 AM
    good
    Reply