Type Here to Get Search Results !

Translate

ADVERTISEMENT

ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, ఆకులు, కాషాయాలు, వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.

Plants with medicinal properties ఔషధ గుణాలు కలిగిన మొక్కలు 

Plants with medicinal properties మన చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు చాలానే ఉన్నాయి. ప్రస్తుత రోజుల్లో మనం వాటి గురించి సరిగ్గా పట్టించుకోవడం లేదు, కానీ ఈ మొక్కల్లో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి మన హెల్త్ కి ప్రకృతి నుంచి ఇచ్చిన వరం.

వాటి యోక్క పూర్తి గుణాలను మనం ఉపయోగించుకోవాలంటే వాటిని కాషాయంగా తాయారు చేసుకొని త్రాగడం వలన మొక్కలోని పూర్తి ఔషధ గుణాలను మనం ఉపయోగించుకోగలము.

కాషాయం తాయారు చేసుకునే విధానం : మొక్కలోని ఆకులను కానీ, బెరడుని కానీ నీళ్లలో మరిగించి వడగట్టుకొని త్రాగాలి. 

1. తిప్పతీగ

Health Tips Telugu ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, ఆకులు, కాషాయాలు, వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.
తిప్పతీగ

దీని ఆకు ఆకారాన్ని గమనించినట్లయితే ఏమి అర్ధమవుతుందంటే ఇది హృదయం ఆకారంలో ఉంటుంది. హృదయ సంబందిత రోగాలకు ఇది రామబాణం. దానికి తోడు మధుమేహ రోగానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా మానసిక వికారాలకు కూడా బాగా పని చేస్తుంది. అంతే కాకుండా రోదక, ప్రతిరోధక కణాలను ఉత్పత్తి చేయడానికి పనిచేస్తుంది. ఏడూ సప్తపత్ర కాషాయాల్లో ఇది మూడవది. గరిక, తులసి, తిప్పతీగ. తిప్పతీగ తీగ నుంచి వేర్లను పంపిస్తూ ఉంటుంది. ఎండిపోయిన కానీ ఈ వేర్లు మల్ల భూమికి తగిలి మరల క్రొత్తగా ఆకులూ పుట్టుకొస్తూ ఉంటాయి. అందుకే ఈ తీగను అమృతబల్లి అంటారు. అంటే మృతం లేనిది, చావు లేని తీగ. ఇది ఎండిపోయి పైన కట్టివేసిన ఇది భూమిని వెతుక్కుంటూ వెళ్లి ప్రాకుతూ తన ఉనికిని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఈ తీగను కానీ 4 ఆకులూ బాగా మరుగుతున్న నీళ్లలో 5-6 నిముషాలు ఉంచి వడపోసుకొని త్రాగితే అద్భుతంగా పనిచేస్తుంది. ఒక వారం ఈ కషాయాన్ని తప్పకుండా త్రాగాలి మంచి ఫలితం ఉంటుంది. 

2. కలబంద

Health Tips Telugu ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, ఆకులు, కాషాయాలు, వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.
కలబంద

ముఖ్యంగా మూడు మొక్కలు కలబంద, సదాపాకు, నిమ్మగడ్డి ఈ మూడు మొక్కలు మీ ఇంటి చుట్టూ ఉంటె, మీ ఇంటికి దోమలు రావు, పాములు రావు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కలబంద అతి ముఖ్యమైన మొక్క  ఎందుకంటే చర్మ రోగాల్ని మీ దేహం నుంచి దూరంగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కలబందను కొద్దిగా తీసుకొని గుజ్జుని నీళ్లలో వేసి 4 నిముషాలు మరిగించుకొని వడపోసుకొని త్రాగాలి. దేహంలో ఉన్న అన్ని రకాల చర్మ రోగాలు పోతాయి. అంతే కాకుండా మలబద్దకం పోతుంది. ఫైల్స్, హేమోరాయిడ్స్, దురద, కొందరికి చెవుల్లో దురద, ముక్కులో దురద, కండ్లలో దురద, మీ దేహం లో దురద ఎక్కడ ఉన్న దూరం కావాలంటే మీరు ఒక వారం కలబంద కాషాయం త్రాగాలి. కలబంద కాషాయం చర్మ కాన్సర్ కి కూడాను బాగా పనిచేస్తుంది. 

కలబంద ప్రతియొక్క ఇంటిలో చిన్న కుండీలో కూడా పెంచుకోవచ్చు, మీరు కిచెన్ ప్రక్కన ఎక్కడైతే మీరు పాత్రలు తోముతు ఉంటారో ఎక్కడైతే ఈగలు రాకుండా ఉండాలంటే చాల అద్భుతంగా పనిచేస్తుంది. కొద్దిగా నీళ్లు ఉన్నా పెరుగేస్తుంది. ప్రతియొక్క ఇంటిలో ఉండాల్సిన మొక్క కలబంద. చర్మ సంబంధిత ఎలాంటి రోగాలున్న కూడా అద్భుతంగా పనిచేసే కాషాయం ఇది. దీనికి తోడు నువ్వుల నూనె చర్మానికి పూసుకుంటూ వస్తే తొందరగా ఈ చర్మ రోగాలన్నిటినుంచి విముక్తి  పొందవచ్చు. చర్మానికి ఒక దానికె కాకుండా పొట్టకు సంబందించిన రోగాలు కూడా చాలా అద్భుతంగా ఈ కాషాయం పనిచేస్తుంది. 

3. చండు పువ్వు (బంతి)

Health Tips Telugu ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, ఆకులు, కాషాయాలు, వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.
చండు పువ్వు (బంతి)

దీనిలో యాంటీ టెటనస్ అంటే ఏదైనా గాయం, కురుపు, ఇంక్లూడింగ్ డయాబెటిక్ గాంగ్రీన్ అంటే మధుమేహం నుంచి వస్తున్న కురుపులకు కూడాను ఈ ఆకు కాషాయం బాగా పనిచేస్తుంది. మన దేశంలో బంతి పువ్వు అద్భుతంగా పెరుగుతుంది. దీనికి మించి గాయాల్ని బాగుచేసుకునే గుణం ఇంకా ఏ ఆకులో లేదు, ఇంకా ఏదైనా ఉందంటే మన దేశంలో గడ్డి చామంతి అని పొలాల్లో చుట్టుపక్కల పెరుగుతూ ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్ లో ఇదొక వారం, అదొక వారం కాషాయాలు త్రాగుతూ ఉంటె మీకు డయాబెటిక్ గాంగ్రీన్ కూడా బాగు అవుతుంది. ఇదే రసాన్ని మీరు సిద్ధం చేసుకొని గాయానికి పిండుకుంటూ వస్తే తొందరగా తగ్గిపోతుంది గాయం మానిపోతుంది.

4.బీర 

Health Tips Telugu ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, ఆకులు, కాషాయాలు, వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.
బీరకాయ ఆకులు, బీరకాయ

బీరకాయ ఆకులు, బీరకాయ రెండు అతిముఖ్యంగా మనకి యకృత్ అంటే కాలేయం, ప్లీహం ఈ రెండు అంగాలను శుద్ధి చేస్తుంది. రక్తం శుద్ధి కావాలంటే, రక్తం మన దేహం లో సమతూలనంగా ఉంచుకోవడానికి ప్లిహాన్ని రోజు శుద్ధి చేస్తుంది. ఈ బీరకాయ ఆకుల కషాయాన్ని కానీ, బీరకాయ జ్యూస్ కానీ పరకడుపున మీరు ఒక వారం త్రాగితే మీ ప్లీహం శుద్ధం అవుతుంది. అంతే కాకుండా స్పీనోమెగాలి అంటే ప్లీహానికి సంబందించిన కాన్సర్ ని కూడా ఈ కాషాయం నుంచి మనం ఉపశమనం పొందవచ్చు, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 

బీరకాయ ఆకులు కానీ, దాని తుది తీగను చాలా బాగా చట్నీ చేసుకోవచ్చు. బీరకాయ చట్నీ చేసుకోవచ్చు, బీరకాయ పప్పు చేసుకోవచ్చు, బీరకాయ కూర అన్ని రకాల వంటల్లో ఉపయోగపడుతుంది. బీరకాయ చెక్కు ధీన్నీ కూడా చట్నీ చేసుకోవచ్చు, దీన్ని పారవేయకూడదు, దీనికి చాల అద్బుతమైన ఔషధగుణం ఉన్నది.

5.సొరకాయ

Health Tips Telugu ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, ఆకులు, కాషాయాలు, వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.
సొరకాయ

హృదయం లో అడ్డంకులు (హార్ట్ బ్లాక్స్ ), స్టేట్స్ వేసుకోవాల్సిన పరిస్థితి, కొపనాయిడ్ సర్జరీ, ఇలా భయంకరమైన పరిస్థితి నుంచి బయటపడాలంటే మనకు కావాల్సిన అతిముఖ్యమైన కూరగాయ సొరకాయ. సొరకాయ జ్యూస్ ఒక వారం, బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఒకవారం, కేరదోసకాయ జ్యూస్ ఒకవారం త్రాగుతూ వస్తే మీరు ఈ ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అదేవిదంగా దీని ఆకులూ కూడా, తొడిమలు కూడాను మీకు కాషాయంగా పనిచేస్తాయి. సొరకాయ ఆకుల కషాయాన్ని వారానికి రెండుసార్లు త్రాగుతుంటే మీ హృదయంలో పేరుకున్న క్రొవ్వు, ట్రైగ్లీషరైట్స్ ఇవన్నింటిని తగ్గించడానికి అతి అద్భుతమైన కాషాయం, కూరగాయ ఈ సొరకాయ. 

6. అరటిబోద ( అరటి మొక్క )

Health Tips Telugu ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, ఆకులు, కాషాయాలు, వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.
 అరటి మొక్క 

ఈ మధ్య కాలంలో చాలా మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యాయి, ప్రోటీన్ ఎక్కువ కావాలని రోడ్లమీద దొరికే గుడ్లు, నాన్వెజ్ ఐటమ్స్ బాగా తినడం వలన చాలా మందికి క్రియాటిన్ ఎక్కువైపోయి డయాలసిస్ కి వెళ్తున్నారు. అలాంటి వాళ్లకి, కిడ్నీలో రాళ్లున్న వాళ్ళకి, మూత్ర సమస్యలు రాత్రి సమయంలో 3-4 సార్లు లేచి యూరిన్ కి వెళ్లడం, అంతే కాకుండా ముఖ్యంగా ప్రోటీన్ బయటికి రావడం, కళ్లకింద వాపు, దేహం వాపు ఇలాంటి సమస్యలున్న వాళ్లకు, మూత్రపిండ సమస్యలు ఉన్న వాళ్లకు అతి అద్భుతమైన కాషాయం అరటిబోద కాషాయం, అరటి బెరడును తీసేస్తే మధ్యలో తెల్లటి కాండం ఉంటుంది. దాన్ని తీసి కాషాయం చేసుకొని త్రాగితే చాలా బాగా పనిచేస్తుంది. 

అరటిబోద, రణపాల, కొత్తిమీర, ఈ మూడు ఆకుల కాషాయాలు వారం వారం మార్చి త్రాగడం వల్ల మీకు మూత్రపిండ సమస్యలన్నింటి నుంచి దూరం కావచ్చు. అరటి ఆకులో భోజనం చేసినా కూడా మీ మూత్రపిండం అప్పటికప్పుడే క్లీన్ అవుతూ వస్తుంది. అరటి ఆకు భోజనం చాలా అద్భుతమైనది. అంతేకాకుండా అరటి ఆకు, మామిడి ఆకు ఇవి వైరస్ లను కూడా దూరంగా ఉంచుతాయి. అరటి ఆకు కాషాయం వారం వారం త్రాగితె చాలా మంచిది, వైరస్ వలన వచ్చే రోగాలు మీ దేహంలో లేకుండా ఉంటాయి.

అరటి ఆకూ, అరటిబోద ఒక ఎత్తు అయితే అరటి పండు పచ్చికాయగా ఉన్నపుడుకాని, అరటిపండు అయినప్పుడు కానీ, తోలుతో కలిపి కోసుకొని 10 నిముషాలు మరగబెట్టి ఆ కషాయాన్ని మీరు రోజు రాత్రిపూట త్రాగుతూ వస్తే బాగా నిద్రొస్తుంది. అంటే నిద్రలేమికి కూడా అరటి పండు కాషాయం చాల బాగా పనిచేస్తుంది. ఇంకా ముఖ్యంగా అరటిపండు మానసిక వికారాన్నీ, మానసిక వత్తుడుల్ని సిజోప్రీమియా అంటారు, అంటే ఒకసారి కోపంతో ఉండటం, ఒకసారి దుఃఖంతో ఉండటం, ఒకసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, మాట్లాడిందే మాట్లాడటం ఇలా మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్న రోగులకు అరటి బోధ, అరటి ఆకూ, అరటి పండు, అరటికాయ నుంచి మొత్తం చెట్టులో ఏ భాగం నుంచి తీసుకున్నాచాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే ప్రతి పెరట్లో ఒక అరటి చెట్టు ఉండే సాంప్రదాయం మన దేశంలో అనాదిగా వస్తుంది. ఇది అద్భుతమైనది. 

7.తమలపాకు

Health Tips Telugu ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, ఆకులు, కాషాయాలు, వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.
తమలపాకు

తమలపాకు, రావి ఆకు లాగానే హార్మోన్ ఇంబ్యాలన్స్ ని ముఖ్యంగా సరిదిద్దుతుంది. అంతేకాకుండా సెక్స్ సమస్యలు ఉన్న వాళ్లందరికీ, అంటే సెక్స్ పరంగా వీక్గా ఉన్నవాళ్లకు, మగవాళ్ళలో అంగస్తంభనం సరిగ్గా లేని వాళ్ళకి, వీర్య స్కలనం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లందరికీ చాలా బాగా పని చేస్తుంది.

తమలపాకు, రావి ఆకు, వేపాకు, ఈ ఆకులన్నీ హార్మోన్ సమతుల్యాన్ని సరిచేసే అతి ముఖ్యమైన కాషాయాలు, అంతే కాకుండా తమలపాకు అతి ముఖ్యంగా మన పచరణాలనికి చాలా మేలు చేస్తుంది. మీరు ఎక్కువ భోజనం చేశారనుకోండి, పెండ్లి ఇంటి భోజనం, పండగ సంబరాల్లో ఎక్కువ తినేశారు అనుకోండి, అలాంటప్పుడు తిన్న తర్వాత గాని, తినకముందు గాని, తమలపాకు కాషాయాన్ని త్రాగడం వలన మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఉదర సమస్యలు, గ్యాస్ బయటకి రాకుండా ఉండటం, ఇలాంటి సమస్యలన్నింటికి జీలకర్ర మరియు తమలపాకు కాషాయాలు బాగా పనిచేస్తాయి. ఒక వారం జీలకర్ర కషాయం, ఒక వారం తమలపాకు కాషాయం త్రాగుతూ ఉండండి. ఈ తమలపాకు తీగల కోనలు రక్త శుద్ధికి బాగా పనిచేస్తుంది. తమలపాకు మన హృదయానికి సంబందించిన యద వత్తిడి అంటే గుండె వేగంగా కొట్టుకోవడం, కొంతమందికి తమ గుండె చప్పుడు తమ చెవుల్లో వినిపించడం, అలాంటి వాళ్లకు తమలపాకు కషాయం చాలా బాగా పనిచేస్తుంది.

8.పారిజాతం 

Health Tips Telugu ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, ఆకులు, కాషాయాలు, వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.
పారిజాతం

కాన్సర్ ని దూరంగా ఉంచుకోవాలి, కాన్సర్ నుంచి బయటపడాలి అంటే మనకి కావాల్సిన మూడు కాషాయల్లో పారిజాతం అతి ముఖ్యమైనది. Nyctanthes అని దీన్ని ఇంగ్లిష్ లో అంటారు. అతి అద్భుతమైన మొక్క పారిజాతం. పారిజాతం, రావి ఆకు, జామ ఆకు ఈ మూడు ఆకులు కాన్సర్ రోగానికి అద్భుతమైన కాషాయాలు, పారిజాతం ఆకు చాలా విధాలుగా పనిచేస్తుంది. వీటి పుష్పమైన తీసుకోవచ్చు, ఆకు అయిన తీసుకోవచ్చు రెండు బాగా పనిచేస్తాయి. పుస్పాలు ఎక్కువ దొరకవు, మొత్తం సంవత్సరం కొద్దీ దొరికేవి ఆకులు మాత్రమే, పారిజాతం ఆకు కాషాయం రొమ్ము కాన్సర్, బ్రెయిన్ కాన్సర్, రక్త కాన్సర్, బోన్ కాన్సర్, ఇలా అన్ని రకాల కాన్సర్లకు పని చేస్తుంది. పారిజాత కాషాయం కోసం 7-8 ఆకులు తీసుకొని బాగా కడిగి నాలుగు నిమిషాలు మరగబెట్టుకొని వడబోసుకొని త్రాగడం వలన మంచి ఫలితం వస్తుంది. 

9.సాదాపాకు

Health Tips Telugu ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, ఆకులు, కాషాయాలు, వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.
సాదాపాకు

సాదాపాకు దీన్ని సంస్కృతంలో నాగడాలి అంటారు. చాల క్రిమి కీటకాలను మీ ఇంటి చుట్టు ప్రక్కల ప్రాంతాలనుంచి దూరం ఉంచాలంటే, పాములను కూడా దూరం ఉంచే గుణం ఉండేది ఈ సదాపాకులో దిన్ని మీరు బ్రెయిన్ ట్యూమర్ కి వాడవచ్చు, సంధి వాతాలకు వాడవచ్చు. కాలేయం ప్రాబ్లమ్స్ కి వాడవచ్చు. ఇది అతి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మొక్క. ప్లీహం, కాలేయం, పిత్తకోశంలో రాళ్ళూ, పిత్తకోశం కాన్సర్, కాలేయపు కాన్సర్, ఇలా అనేక రకాల అంగాలను శుభ్రం చేసే అద్భుతమైన గుణం ఉన్న మొక్క సదాపాకు. ఈ కాషాయం చాలా రుచిగా ఉంటుంది. బ్రెయిన్ ట్యూమర్ కి పని చేస్తుంది. సంధివాతం, కీళ్ళ నొప్పులు, ఉదర సంబంధమైన రోగాలను దూరం చేయడంలో అతి అద్భుతమైన మొక్క. సదాపాకు, నిమ్మగడ్డి, కలబంద ఈ మూడు మొక్కలు మీ ఇంటి చుట్టూ ఉంటె మీ ఇంట్లోకి దోమలు కూడా రావు, సదాపాకు అతి ముఖ్యమైన ఔషధ మొక్క. 

 10.రణపాల

Ranapala-health-tips-telugu
Ranapala

రణపాల ఇది అతి అత్యద్భుతమైన మొక్క ఎందుకంటే మన మూత్రపిండాల్లో ఏమైనా ఇబ్బందులు అయితే, రాళ్ళూ తయారైతే, ఈ రోజుల్లో కిడ్నీల్లో అంటూ చాల మంది బాధపడుతున్నారు. ప్రోటీన్ ఎక్కువ తినడం వల్ల  కిడ్నీ మీద ఎక్కువ వత్తిడి రావడం వలన క్రియాటిన్ ఎక్కువ అవడం వలన ప్రోటీన్ మూత్రం లో వెళ్లిపోవడం అల్బుమిన్ యూరియా అంటారు. ఇలాంటి రోగాలన్నింటికీ రామబాణంగా పనిచేస్తుంది. రణపాల, పునర్నవ, కొత్తిమీర, అరటిబోద ఈ నాలుగు ఆకుల కాషాయాలు కూడా బాగా పనిచేస్తాయి.

ఈ రణపాల ఆకు చాలా మందికి తెలియదు. ఈ ఆకు యొక్క ముఖ్య గుణం ఏమిటంటే ఈ ఆకును తీసి భూమిలో వేస్తె మరల చెట్టు వస్తుంది. ఈ కషాయంతో పాటు, పునర్నవ అనే ఇంకొక ఆకు కాషాయం ఉంది అది మూత్ర పిండాలకి పునర్జీవనాన్ని ఇస్తుంది. కిడ్నీకి సంబంధమైన కాన్సర్ సమేతం కూడాను బాగు చేస్తుంది.  

11.జామ

guava-health-tips-telugu
Guava

పారిజాతం, జామ, రావి ఆకు ఈ మూడు ఆకులు చాలా అద్భుతంగా కాన్సర్ ని దూరం ఉంచడానికి పనిచేస్తాయి. వారం వారం ఈ మూడు ఆకుల కషాయాన్ని త్రాగుతూ ఉంటె కాన్సర్ నుంచి దూరంగా ఉండవచ్చు. జామాకు అతి ముఖ్యమైనది, కీళ్ల నోప్పులు సంధివాతం నొప్పులు, పంటి నొప్పి, తలనొప్పి, ఎలాంటి నొప్పులు ఉన్న మీకు జామ ఆకు కాషాయం చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత పారిజాతం ఆకు కాషాయం, కానుగ ఆకు కాషాయం ఈ మూడు ఆకులు నొప్పుల్ని మీ దేహం నుంచి దూరం చేస్తాయి. దాల్చిన చెక్క, లవంగం కూడా బాగా పని చేస్తాయి. 

జామ పండు ప్రతీరోజు తినడం చాలా మంచిది, మీకు ప్రపంచంలో ఎక్కడైనా విటమిన్'C' ఎక్కువగా ఉంది అంటే అది జామ పండులోనే, నిమ్మరసం కంటే జామ పండులోనే ఎఎక్కువగా విటమిన్ 'C' లభిస్తుంది. అతి ముక్యంగా వారంలో రెండు రోజులు మీ పిల్లలకు ఇస్తూ ఉంటె రోగనిరోధక శక్తి చాలా బాగా వస్తుంది. కాబట్టి అన్ని పండ్లకంటే సంపూర్ణ ఫలం ఏదైనా ఉంటె మనదేశంలో అది జామపండే అని చెప్పడానికి సంతోషంగా ఉంది.

12.గోరింటాకు

Health Tips Telugu ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, ఆకులు, కాషాయాలు, వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.
గోరింటాకు

ప్రస్తుతం చాలా మందికి, నగరవాసులకు, ఇంకా పల్లెల్లో పనిచేసే వాళ్లకు కూడాను దేహం వేడి అవుతుంది అని అంటూ ఉంటారు. అది ఏ కారణానికి మీ దేహం వేడి అయినా అతి అద్భుతంగా పని చేసే కాషాయం ఏదైనా ఉంది అంటే అది గోరింటాకు, దీని తర్వాతే మునగాకు, దీని తర్వాతే మెంతి ఆకు. మీ దేహం వేడి అవుతుంది అని మీకు అనిపించినప్పుడు మీరు ఈ గోరింటాకుని దంచి కొద్దిగా చింతపండు కలిపి చేతిమీద పెట్టుకున్నా కూడా మీ దేహం రాత్రికి రాత్రే చల్లగా అవుతుంది. ఒక 5-6 ఆకులు తీసుకొని కాషాయం చేసుకొని పరకడుపున త్రాగితే దేహం చల్లబడుతుంది.

చాలా మందికి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ కావడం, మంటగా మూత్రం రావడం, కళ్ళు మంట, ముక్కు మంట, కాళ్లు మంట అని చాలా మంది బాధ పడుతుంటారు. ఇలాంటి వాళ్ళు వారంలో ఒక రెండు మూడు రోజులు ఈ కాషాయం త్రాగుతూ వస్తూ ఉంటె ఒక ఆరు నెల్లలు మీకు పూర్తిగా ఈ మంట దేహం నుంచి దూరం అవుతుంది. చాలా అద్భుతమైన మొక్క గోరింటాకు. పిల్లలు, ఆడపిల్లలు పెళ్లిళ్లలో చాలా అద్భుతంగా చేతుల్ని అలంకరించుకోవడానికి కూడా వాడుతుంటారు. కానీ ఈ మధ్య గోరింటాకు పేరుతో అనేక భయంకరమైన రసాయనిక పదార్దాలతో తయారుచేసిన పేస్టులు మార్కెట్లలో దొరుకుతున్నాయి వాటిని వాడకండి. నిజమైన సహజమైన అలంకారిక మొక్క గోరింటాకు దీన్ని సహజంగా వాడుకోవడం మంచిది. 

13.మునగ

Health Tips Telugu ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, ఆకులు, కాషాయాలు, వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.
మునగ

అత్యద్భుతమైన ఔషధ మొక్క, తర్వాత కూరగాయ, ఆకుకూర, అంటే అన్ని అంశాలను రంగరించుకున్న మొక్క ఏదైనా ఉందంటే అది మునగ. ఆకు కూరగా పనిచేస్తుంది, కూరగాయగా పనిచేస్తుంది. అద్భుతమైన ఔషధగుణం ఉన్న మొక్కగాను పనిచేస్తుంది. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఈ మొక్కను, కాండాన్ని ఎక్కడ నాటిన నీళ్లు సరిగ్గా లేకపోయినా కానీ ఆకులు వచ్చేస్తాయి. బంజార భూముల్ని సారవంతం చేసుకోవాలంటే అతి ముఖ్యంగా పనిచేసే మొక్క ఈ మునగ మొక్క. నీళ్లు లేకున్నా ఒక నాలుగు వర్సాలు వస్తే ఈ మొక్క పెరగడం మొదలుపెడుతుంది. ఎలాంటి మొక్క కూడా పెరగని భూముల్లో ఈ మునగ మొక్కను తీసుకెళ్లి మొదలు పెడితే మూడు నెలల్లో మిగిలిన మొక్కలు వచ్చి పెరగడానికి కావాల్సిన వాతావరణాన్ని సృష్టించే అద్భుతమైన మొక్క మునగ మొక్క. 

దీని ఆకులు, దీని కాండము, దీని ఫలము కూరగాయగా వాడతారు. అన్ని రకాల పౌష్ఠిక అంశాలకు గని లాంటిది ఈ మునగ. దేహాన్ని చల్లబర్చుకోవడానికి, ఎముకల క్యాన్సర్ కి, ఎముకలు విరిగిపోతున్నాయని సంధి వాతం అలాంటి దానికి మునగ ఆకు కాషాయం చాలా బాగా పని చేస్తుంది. అనేక రకాలైన చర్మ రోగాలకు కూడాను పని చేస్తుంది. అంతే కాకుండా మునగ పువ్వులు వీర్యకణాల సంఖ్యను పెంచడానికి మునగ ఆకు, మునగ పువ్వు అద్భుతంగా పని చేస్తుంది. 

14.మేక ముట్టని ఆకు ( Justicia Adhatoda )

Health Tips Telugu ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, ఆకులు, కాషాయాలు, వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.
మేక ముట్టని ఆకు

ఇది సాధారణంగా అందరికి దొరకదు దీన్ని మెకముట్టని ఆకు అంటారు. ఇది శ్వాశకోశ సంబంధ రోగాలు, ఆస్తమాకు, సిగరెట్స్ త్రాగేవారికి, లంగ్స్ ఇబ్బంది ఉన్నవాళ్ళకి, నిశ్శక్తి, నిర్వీర్యం ఉన్నవాళ్లు, క్షయ, లంగ్ కాన్సర్ ఇలాంటి వాళ్లకు చాలా అద్భుతంగా పని చేస్తుంది. ఈ మేక ముట్టని ఆకుని కాషాయం చేసుకొని వాడితే మీకు శ్వాశకోశ సంబంధమైన రోగాలు అన్ని బాగు అవుతాయి. అద్భుతమైన ఔషధగుణం ఉన్న మొక్క ఇది.

15.నిమ్మగడ్డి

Health Tips Telugu ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, ఆకులు, కాషాయాలు, వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.
నిమ్మగడ్డి

నిమ్మగడ్డి చాలా అద్భుతమైన వాసన వస్తుంది. దీన్నీ కాషాయం చేసుకొని త్రాగడం వలన కాన్సర్ ని మీకు దూరంగా ఉంచడానికి వీలు అవుతుంది. కాన్సర్ వచ్చిన తర్వాత అంతగా ఉపయోగపడదు, కాన్సర్ రాకముందు వారానికి రెండు రోజులు నిమ్మగడ్డి కాషాయం త్రాగితే కాన్సర్ కారకాల్ని దూరంగా ఉంచడానికి బాగా పనిచేస్తుంది. అంతే కాకుండా దోమల్ని, క్రిముల్ని, కీటకాల్ని దూరంగా ఉంచాలంటే ఈ లెమన్ గ్రాస్, సదాపాకు, కలబంద ఈ మొక్కల్ని దట్టంగా పెంచుకుంటే చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ లెమన్ గ్రాస్ ని మీ పొలాల్లో చుట్టూ వేసుకుంటే పందులు రాకుండా దూరంగా ఉంటాయి. నిమ్మగడ్డి కాషాయం మనసు ఉల్లాసానికి, మానసిక వికారాలను దూరం చేసుకోవడానికి అరటిబోధతో పాటు దీన్ని కూడా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

16.మిరప

Health Tips Telugu ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, ఆకులు, కాషాయాలు, వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.
మిరప

మిరపకాయ లేకుంటే మన తెలుగువాళ్ళకు స్పైసినే ఉండదు. అంటే అన్ని రుచులకు కారం కావాలి. చిన్న పిల్లలకు పొట్టలో నులిపురుగులు అంటారు, దానికి శ్రీ గంధం ఆకు కాషాయం, మిరప ఆకూ కాషాయం అతి ముఖ్యంగా ఉపయోగపడతాయి. సాదాపాకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఒక 5 మిరపకాయలు నీళ్లలో ఉడకబెట్టి వడపోసుకొని కొద్దిగా తాటిబెల్లం వేసుకొని త్రాగితే చాలా రుచిగా ఉంటుంది. ఉదర సంబంధ ప్రాబ్లమ్స్ బాగు అవుతాయి. చాలా మంది మిరపకాయలు తింటే గ్యాస్ అవుతుంది, మంట అవుతుంది అంటారు. ఎక్కువగా తింటే అలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి. కాషాయం త్రాగితే ఆ ఇబ్బందులు బాగు అవుతాయి. తేన్పులు రావడం తగ్గుతూ వస్తాయి. 

అంతే కాకుండా ఇంకొక అద్భుతమైన ఉపయోగం ఉంది. మీరు పాలను పెరుగు గా మార్చుకోవాలంటే ఈ మిరప తొడిమెలను ఒక 10 తీసుకొని వేడి చేసిన పాలలో వేస్తె ఆ పాలు పెరుగు అవుతుంది. కొబ్బరిపాలు కూడా కొబ్బరి పెరుగు అవుతుంది. వేరుశనగ పాలు కూడా వేరుశనగ పెరుగు అవుతుంది. నువ్వుల పాలతో నువ్వుల పెరుగు తయారుచేసుకోవచ్చు. 

17.తులసి

Health Tips Telugu ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, ఆకులు, కాషాయాలు, వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.
తులసి

తులసి లేని ఇల్లు స్మశానం అని మన పూర్వికులు చెప్పారు. అంటే తులసి ఉన్న చోట జీవం చైతన్యంతో ఉంటుంది. ప్రతి ఇంటి ముందు లేదా పెరట్లో ఉండాల్సిన అతి అద్భుతమైన మొక్క. దీని పేరు 'హోలీ బేసిల్' అంటారు. అంటే పవిత్రమైన మొక్కల్లో అతి పవిత్రమైనది తులసి మొక్క. దీని విత్తనాలు, ఆకులు, కాండాలు, వేర్లు, ఏ భాగమైన మనకు మంచి కాషాయంగా పనిచేస్తుంది. ఇది రోగనిరోధక శక్తికి అతి ముఖ్యమైనది. జ్వరాలను దూరంగా ఉంచడానికి, మానసిక రోగాలని దూరం చేయడానికి విలువైనది. ఎన్ని సార్లు వాడిన ఇబ్బందులు లేని కాషాయం ఈ తులసి కాషాయం. తులసి ప్రతి ఇంటిలో ఉండాల్సిన మొక్క, తులసి గాలి చాలు మనం ఆరోగ్యాంగా ఉండడానికి, తులసి అన్ని రకాల రోగాలకు పని చేస్తుంది. శరీరం వేడి అయితే చల్లగా అవడానికి పనిచేస్తుంది. చాలా మందికి జలుబు వచ్చినప్పుడు తులసి ఆకు కాషాయం చాలా బాగా పనిచేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోవడం కోసం Health Tips Telugu ని ఫాలో అవుతూ ఉండండి. మీ కోసం మంచి మంచి హెల్త్ టిప్స్ ని తెలియజేస్తూ ఉంటాము. ఏమైనా సలహాలు, సందేహాలు తెలియజేయాలనుకుంటే ఈ పోస్ట్ కింద కామెంట్ సెక్షన్  కామెంట్ పెట్టండి. Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

ADVERTISEMENT