Type Here to Get Search Results !

Translate

ADVERTISEMENT

Top 16 habits damage our health రోజు చేసే 16 డేంజరస్ పనులు

Top 16 habits damage our health | Health Tips Telugu

మనం రోజు చేసే 16 ప్రమాదకరమైన పనుల గురించి తెలుసుకుందాం. ఇందులో కొన్ని పనులు మనకు ప్రాణాంతకం కూడా, అందుకని పూర్తిగా తెలుసుకుందాం, మనల్ని మమనం కాపాడుకుందాం. సిగరెట్ కాల్చడం, మందు త్రాగడం మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని మనందరికీ తెలుసు అయినా వాటిని ఎవరు మానరు. కాబట్టి వీటిగురించి చెప్పుకోవడం అనవసరం. కానీ ఇవి కాకుండా మనం రోజు చేసే పనుల్లో కొన్ని పనులు మన ఆరోగ్యాన్ని మరింత పాడు చేస్తాయి. కానీ వీటి గురించి చాలా మందికి తెలియక వీటిని రోజు చేస్తూ ఉంటారు. వీటిని సరి చేసుకొని ఆరోగ్యాంగా ఉండడానికి ప్రయత్నించండి. 

Top 16 habits damage our health | Health Tips Telugu
16 Habits damage our health | Health Tips Telugu

1) అర్ధరాత్రి బాత్రూంలకు వెళ్లడం

చాలామందికి మధ్యరాత్రి టాయిలెట్ కి వెళ్లడం అలవాటుగా ఉంటుంది. టాయిలెట్ లకు వెళ్లడం ప్రమాదకరం కాదు, కానీ అర్ధరాత్రి లేచేటప్పటికి మన బ్రెయిన్ అంత యాక్టీవ్ గా ఉండదు. హార్ట్ కూడా వీక్ గా ఉంటుంది. ఏదైనా ఒక విషయం సడెన్ గా మన కంటి ముందు జరిగితే భయంతో మన గుండె ఆగిపోయే అవకాశం కూడా ఉంది. అందుకే ఒకవేళ అర్ధరాత్రి టాయిలెట్ కి వెళ్ళవలసిన అవసరం వస్తే లేచి కాసేపు కూర్చున్న తర్వాత టాయిలెట్ కి వెళ్లడం మంచిది. అప్పటికి మన బ్రెయిన్ కొంత యాక్టీవ్ గా అవుతుంది. ఈ విషయాన్నీ బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇంకొకటి తెలుసుకోవలసిన విషయం ఏంటంటే మామూలుగా ఒక మనిషి 6-8 గంటల నిద్ర మధ్యలో టాయిలెట్ కి వెళ్లాల్సిన అవసరం రాదు. ఒకవేళ ఎవరికైనా నిద్ర సమయంలో 2 లేదా అంతకన్నా ఎక్కువసార్లు టాయిలెట్ కి వెళ్ళవలసిన అవసరం వస్తే వాళ్ళకి నాక్టూరియా అనే డిసీజ్ ఉండవచ్చని డాక్టర్స్ అంటున్నారు. 

2) రోడ్ మీద నడుస్తున్నప్పుడు ఫోన్ వాడుతుండటం

2015 లో నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ చెప్పిన ప్రకారం రోడ్ మీద నడుస్తున్నప్పుడు ఫోన్ వాడటం వలన యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు ఒక సంవత్సరంలో1100లకు పైగా యాక్సిడెంట్ లు నడుస్తూ రోడ్ మీద ఫోన్ వాడటం వలన జరుగుతున్నాయని రిపోర్ట్ చేసింది. అంతేకాదు డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడం కూడా ప్రమాదకరమే. మన బ్రెయిన్ అనేది మల్టి టాస్కింగ్ చేయలేదు. అంటే ఒకేసారి రెండు పనులు చేయలేదు. కానీ ఒక విషయం వదలి ఇంకొక విషయం గురించి ఆలోచించడం వంటివి త్వరగా చేయగలుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు మల్టి టాస్కింగ్ అని అనుకుంటుంటారు. అందుకే రోడ్ పైన నడిచేటప్పుడు నడవడం మీద మాత్రమే కాన్సంట్రేషన్ చేయడం మంచిది.

3) ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ ని వాడటం

ఏదైనా ఒక దెబ్బ తగిలినప్పుడు దాని నొప్పిని తగ్గించడానికి పెయిన్ కిల్లర్స్ ని వాడతారు. అయితే ఎముకలు విరిగినప్పుడు పెయిన్ కిల్లర్స్ ని వాడటం వలన ఎముకలు తిరిగి అతుక్కోవడం అనే ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఎక్కువ డోస్ ఉన్న పెయిన్ కిల్లర్స్ ని వాడితే విరిగిన ఎముక తిరిగి అతుక్కోకుండా కూడా జరగొచ్చు. పెయిన్ కిల్లర్స్ అనేవి నొప్పి వచ్చిన ప్రదేశంలో బ్రెయిన్ కి సమాచారం చేరవేసే నాడి కణాలను పని చేయనీయకుండా చేస్తుంది. దీని వలన బ్రెయిన్ కి శరీరం లో ఎముక విరిగింది అన్న విషయం తెలియదు. మన శరీరం లో సహజంగానే నయం అయ్యే విదంగా బ్రెయిన్ చేస్తుంది. అయితే పెయిన్ కిల్లర్ వాడినప్పుడు ఎముక విరిగింది అన్న విషయం తెలియకపోవడం వలన బ్రెయిన్ విరిగిన ఎముకను అతికించలేదు. అందుకే పెయిన్ కిల్లర్ వాడకాన్ని తగ్గించండి. 

4) ఎక్కువసేపు స్నానం చేయడం

మన శరీరం శుభ్రంగా ఉండడానికి స్నానం చేస్తాము. కానీ ఎక్కువసేపు స్నానం చేస్తే మన శరీరం పై ఉండే సన్నని చర్మపు పొర తొలగిపోయి శరీరం పొడిగా అయిపోతుంది. ఈ పొర శరీరం పై వచ్చే దురదలు, శరీరం పై మంటగా అనిపించడం ఇటువంటి లక్షణాల్ని తగ్గిస్తూ ఉంటుంది. కానీ ఈ పొర తొలగిపోతే శరీరం పై దురదలు, మంటలు పుట్టడంతో పాటు శరీరంపై అసౌకర్యంగా ఉంటుంది. అందుకే డెర్మటాలజిస్ట్ లు సూచించిన మేరకు 10 నిమిషాల పాటు స్నానం చేస్తే సరిపోతుంది. అంతకుమించి చేయడం వలన శరీరం పొడిగా అయిపోవచ్చు. 

5) తల వెంట్రుకలు ఊడిపోతున్నాయని బాధపడటం 

ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్ట్రెస్ వలన కూడా తలవెంట్రుకలు ఊడిపోతాయి. మన శరీరంలో స్ట్రెస్ వచ్చినప్పుడు ఎడ్రినలిన్ విడుదలవుతుంది. ఇది అధికమోతాదులో విడుదలవడం వలన మన హెయిర్ ఊడిపోవచ్చు. ఇప్పుడు మన హెయిర్ ఊడిపోతుంది అని టెన్షన్ పడితే ఇంకా ఎక్కువ ఊడిపోతుందని సైన్టిస్టులు చెప్తున్నారు. కానీ బయపడకండి మీ హెయిర్ ఒకవేళ స్ట్రెస్ వలన రాలిపోతే స్ట్రెస్ తగ్గిన 3-4 నెలల లోపే తిరిగి హెయిర్ పెరుగుతుంది. అందుకే తలవెంట్రుకలు ఊడిపోతున్నాయని టెన్షన్ పడకూడదు. అప్పుడు తిరిగి హెయిర్ పెరుగుతుంది. 

6) ఛార్జింగ్ లో ఉన్నప్పుడు మొబైల్ ని వాడటం

ఫోన్ ని ఛార్జింగ్ లో ఉన్నపుడు వాడటం వలన ఒకేసారి పవర్ ని బ్యాటరీ తీసుకోవడం, ఇంకా పవర్ ని ఫోన్ స్క్రీన్ కి ఇవ్వడం, ఇలా చేయడం వలన బ్యాటరీ వేడెక్కి పాడైపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఫోన్ పేలితే ప్రాణానికె ప్రమాదం వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. దాదాపు 80% ఫోన్స్ పేలిపోవడం అనేది ఛార్జింగ్ పెట్టె సమయంలోనే జరుగుతుంటాయి. అందుకే ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు వాడకపోవడం మంచిది. అయితే అందరిలో ఉన్న ప్రశ్న ఒక నైట్ అంత ఫోన్ ని ఛార్జింగ్ లో ఉంటె బ్యాటరీ పాడైపోతుందా? కానీ నిజానికి బ్యాటరీకి ఏమి కాదు. ఇప్పటి కాలంలో దాదాపు అన్ని బ్యాటరీలు కూడా ప్రొటక్షన్ లేయర్ తోనే వస్తున్నాయి. మన ఫోన్ ఛార్జ్ అయిపోయిన వెంటనే ఛార్జింగ్ ఆపేసె చిప్స్ మరియు సాఫ్ట్వేర్స్ ని వాడటం వలన ఫోన్ ని నైట్ మొత్తం ఛార్జింగ్ పెట్టిన ఏమి కాదు. 

7) మెరుపుల సమయంలో ఇంటర్నెట్ ని వాడటం 

నిజానికి మెరుపుల సమయంలో మొబైల్ లో ఇంటర్నెట్ ని వాడటం వలన ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇంటర్నెట్ అంటే టవర్లు నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇవి మెరుపులను ఎట్రాక్ట్ చేయవు. కాబట్టి మెరుపుల సమయంలో ఇంటర్నెట్ వాడితే మెరుపు మన మీద పడుతుందనేది నిజం కాదు. కానీ మెరుపుల సమయంలో ల్యాండ్ లైన్ వాడటం మాత్రం ప్రమాదం, ఎదుకంటే ఒకవేళ ఏదైనా ఒక మెరుపు టవర్ మీద పడితే హై  ఓల్టేజ్ ఎలక్ట్రిసిటీ మన ల్యాండ్ ఫోన్ కి వచ్చే అవకాశం ఉంది. అందువలన మెరుపుల సమయంలో ల్యాండ్ లైన్ వాడకపోవడమే మంచిది. 

8) పింపుల్స్ ని చేతితో స్క్వీజ్ చేయడం 

చాలా మంది మొహం మీద మొటిమ వస్తే దాన్ని చిక్కుతూ ఉంటారు. కానీ ఇది కళ్ళు  కనిపించకపోవడం, స్ట్రోక్ వంటి వాటికీ కూడా దారి తీయవచ్చు. ఎందుకంటే మొటిమలు చిక్కడం వలన ఇది ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. మన శరీరం లో మొహం పై అధికమోతాదులో రక్తనాళాలు, నాడి కణాలు ఉంటాయి. అక్కడ గనుక ఒకవేళ ఇన్ఫెక్షన్ అయితే రక్తనాళాలకు అడ్డుపడి రక్త సరఫరా బ్రెయిన్ కి అందకుండా చేస్తుంది. దీంతో శరీరం మొత్తంలో ప్రొబ్లెమ్స్ రావచ్చు. 

9) తలనొప్పి వచ్చిన ప్రతిసారి అమృతాంజన్, జండూబామ్ వంటివి వాడటం

చాలా మంది తలనొప్పి వచ్చిన ప్రతీసారి అమృతాంజన్, జండూబామ్ లు వంటివి వాడుతుంటారు. ఎక్కువసార్లు వీటిని రాయడం వలన తర్వాత తలనొప్పి ఎప్పుడు వచ్చిన వీటిని రాయకపోతే తగ్గకుండా ఉండిపోతుంది. ప్రతిసారీ వీటిమీదనే ఆధారపడవలసి వస్తుంది. అందుకే అత్యవసర పరిస్థితుల్లో తప్ప వీటిని వాడటం వంటివి చేయకూడదు. దానికి బదులుగా తలకు హెయిర్ ఆయిల్ రాసుకోవడం మరియు రిలాక్స్ గా ఉండటానికి ప్రయత్నించడం వంటివి చేయడం మంచిది. 

10) ఎక్కువసేపు స్రీన్ లను చూస్తూ ఉండటం 

ఒకరోజులో 4 గంటలకంటే ఎక్కువసేపు మొబైల్స్, లాప్టాప్స్ లేదా TV స్రీన్ లు చూడటం వలన కంటి చూపు మందగించే ప్రమాదం ఉంది. దీనికి కారణం కళ్ళు పొడిగా అయిపోవడం, మరియు స్రీన్ నుంచి వచ్చే బ్లూ రేస్ వలన కళ్ళు ఎక్కువ స్ట్రైన్ కి గురి కావడం జరుగుతుంది. కళ్ళు పొడిగా అవడానికి కారణం మనం స్రీన్ ని చూసేటప్పుడు కళ్ళను బ్లింక్ చేయడం మర్చిపోతున్నాం. అందుకే స్రీన్ని చూసేటప్పుడు గుర్తుంచుకొని మరి కళ్ళను బ్లింక్ చేయండి. ఇంకా 15 నుండి 30 నిమిషాలకు ఒకసారి స్రీన్ నుండి కళ్ళను తిప్పి ఒక నిమిషం ఆగి తిరిగి స్రీన్ ను చూడటం వంటివి చేయాలి. దీని వలన స్రీన్ నుంచి వచ్చే ఐ ప్రాబ్లమ్స్ ని తగ్గించవచ్చు. 

11) వాలెట్ ని బ్యాక్ పాకెట్ లో పెట్టుకోవడం 

చాలా మంది మగవాళ్ళు తమ వాలెట్ ని బ్యాక్ పాకెట్ లో పెట్టుకుంటూ ఉంటారు. దాని వల్ల ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కానీ బ్యాక్ ప్యాకెట్ లో వాలెట్ ఉండగా కూర్చుంటే మాత్రం చాలా ప్రమాదం. ఎందుకంటే వెనక జేబులో పర్సు పెట్టుకొని కూర్చోవడం వలన ఒకవైపు ఎత్తుగా ఉండటం తో బాలన్స్ సరిపోదు. దీనితో వెన్నుముక మీద భారం పడి మెల్లమెల్లగా వెన్నుముక బెండ్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ ప్రపంచంలో 70-80% మందికి వచ్చే సయాటికా అనే ఒకరకమైన బ్యాక్ పెయిన్ కి వెనక జేబులోపర్సు పెట్టుకొని కూర్చోవడం కూడా ఒక కారణం. దీనివల్ల సయాటిక్ అనబడే ఒక నరం నలిగిపోవడం వలన బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్ వంటి ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సారి ఆఫిస్ లో వర్క్ చేస్తున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గాని, క్లాస్ లో కూర్చొని లెసన్స్ వినేటప్పుడు గాని వాలెట్ ని తీసి ముందుజేబులో పెట్టుకొని కూర్చోండి. 

12) తుమ్ముని ఆపుకోవడం

ఒక్కోసారి ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నప్పుడుగాని, బాస్ ఎదురుగా ఉన్నప్పుడుగాని కొంతమంది తుమ్ము ఆపుకుంటారు. చాలా చిన్న విషయం గా అనిపించవచ్చు. కానీ దీని వల్ల చాలా ప్రమాధం ఉంది. తుమ్ము అనేది ఒక పవర్ ఫుల్ ఎక్స్ పల్సన్, ఈ సమయంలో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో గాలి బయటకు వస్తుంది. అటువంటప్పుడు మీరు ముక్కు, నోరు మూసేసి తుమ్ముని ఆపితే అది చెవుల్లోకి ప్రవహించి కర్ణభేరిని దెబ్బతీస్తుంది. దాంతో వినికిడి శక్తీ లోపిస్తుంది. ఇదొక్కటే కాదు ఆ ఫోర్స్ కారణం గా ముక్కులోని ఎముకలు దెబ్బతినడం, కళ్ళు, మెదడు లోని రక్తనాళాలు పగిలిపోవడం వంటివి కూడా జరుగుతుంటుంది. కాబట్టి తుమ్ము వస్తున్నప్పుడు స్వేచ్ఛగా తుమ్మేయండి తప్ప ఆపుకోవద్దు. 

13) పంచదార ఎక్కువగా తినడం

తీపి అంటే అందరికి ఇష్టమే అయితే మనం తినే స్వీట్స్, ఐస్ క్రీమ్స్, కూల్డ్రింక్స్ వీటిలో షుగర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చెక్కెర ఎక్కువగా తీసుకోవడం వలన వయస్సు పెరిగేకొద్దీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే శరీరంలో దాదాపు ప్రతి అవయవం మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది. కేవిటీస్, విపరీతమైన ఆకలి, బరువు పెరగడం, డయాబెటిస్, లివర్ పేల్యూర్, పాంక్రియాటిక్ కాన్సర్, హై బ్లడ్ ప్రెసర్, కిడ్నీలో రాళ్లు రావడం, గుండెపోటు, కీళ్ల వాతం, త్వరగా ముసలి తనం రావడం, ఇలా ఎన్నో సమస్యలకు ఈ ఎక్కువ మోతాదులో తీసుకునే పంచదార కారణమవుతుంది. మనం తీసుకునే పంచదార లిమిట్ లో ఉంటె మంచిది. కానీ హద్దు మీరితే దీన్ని మించిన విషం ఇంకొకటి ఉండదు. ఒక స్టడీ ప్రకారం సిగరెట్, మందు ఆరోగ్యానికి ఎంత హానికరమో ఈ పంచదార కూడా అంతే ప్రమాదకరం అని తేలింది. 

14) టైట్ జీన్స్ వేసుకోవడం

ఈ రోజుల్లో టైట్ జీన్స్ వేసుకోవడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఇటువంటి జీన్స్ వేసుకొని టైట్ గా బటన్స్ పెట్టుకోవడం వలన తిన్న ఆహారం సరిగ్గా అరగకపోవడం, జీర్ణాశయంలో యాసిడ్ రిప్లెక్స్ కారణంగా గుండెల్లో మంటగా అనిపించడం, ఎక్కువసార్లు టాయిలెట్ కి రావడం వంటి సమస్యలు ఏర్పడతాయి. అంతేకాదు కాళ్ళల్లోకి రక్తప్రవాహం సరిగ్గా జరగకపోవడం, అక్కడక్కడా రక్తం గడ్డకట్టుకుపోవడం కూడా జరుగుతుంది. టైట్ జీన్స్ వేసుకోవడం వలన మహిళల్లో గర్భాశయ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు మగవాళ్ళల్లో టెస్టికల్స్ మీద ప్రెసర్ పెరిగిపోవడంతో స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దీని ఎఫెక్ట్ ఇప్పుడు లేకపోయినా భవిషత్తులో ఇబ్బంది పడవలసి ఉంటుంది. 

15) యూరిన్ ఆపుకోవడం

చాలా మంది క్లాస్ లో ఉన్నప్పుడు కానీ, లేదా జర్నీలో ఉన్నప్పుడు కానీ యూరిన్ వస్తే ఆపుకుంటారు. ఇలా ఆపుకున్నప్పుడు ఆపుకుంటే పర్లేదు కానీ రెగ్యులర్ గా యూరిన్ ని ఆపుకున్న లేదా ఎక్కువసేపు ఆపుకున్న చాలా ప్రమాదం ఉంది. బ్లాడర్ ఫుల్ అవుతున్న సమయంలో బ్రెయిన్ మనకు సిగ్నల్ పంపుతుంది. కానీ చాలా మంది సమయం కుదరక కొంతమంది బద్దకంతో ఆపుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వలన యూరిన్ లో బాక్టీరియా కారణంగా బ్లాడర్ కి ఇన్ఫెక్షన్ సోకుతుంది. అక్కడినుండి ఆ ఇన్ఫెక్షన్ కిడ్నీలకు పాకడం కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. ఒక్కోసారి ఈ బాక్టీరియా తిరిగి రక్తంలో కలిసిపోతుంది. ఇలా యూరిన్ ని తరచుగా ఎక్కువసార్లు ఆపుకోవడం వలన బ్లాడర్ కండరాలు వీక్ అవుతాయి. దీంతో యూరినరి రిటెన్షన్ అనే సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలా చేస్తే యూరిన్ తో పాటు ఒక్కోసారి బ్లడ్ కూడా వచ్చే అవకాశం ఉంది. యూరిన్ ని ఎక్కువసేపు ఆపుకోవడం వలన బ్లాడర్ పగిలిపోయిన సంఘటనలు చరిత్రలో ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 

16) బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం

ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, ఎదో ఒకరోజు మిస్ అయితే పర్లేదు, కానీ  ప్రతీరోజు బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే మాత్రం చాలా ఇబ్బందులకు గురి అవ్వాల్సి ఉంటుంది. చాలా మంది టైం సరిపోక లేక సన్నబడదామని బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేస్తారు. ఉదయం 9 లోపు బ్రేక్ ఫాస్ట్ చేయని వాళ్ళల్లో హార్ట్ ఎట్టాక్ వచ్చే అవకాశం 27% ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. ఇక బ్రేక్ ఫాస్ట్ చేయని పిల్లలకు దేని మీద కాన్సంట్రేషన్ చేయలేకపోవడం, మాథ్స్ లో వెనకపడటం, రోజు అంతా వీక్ గా ఉండటం వంటి సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా మహిళలు ఉదయం పూట పనులన్నీ పూర్తి అయ్యేవరకు టిఫిన్ చేయకుండా ఉంటారు. దీని వలన  ఋతుస్రావంలో ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉదయం కొద్దిగా బ్రేక్ ఫాస్ట్ చేసి తర్వాత మిగిలిన పనులు చేసుకోవాలి. అంతేకాదు ఉదయం టిఫిన్ చేయని వాళ్లలో మైగ్రేన్ తలనొప్పి రావడం, జుట్టు ఊడిపోవడం, డయాబెటిస్ అలాగే బ్లడ్ లో షుగర్ లెవల్స్ పడిపోవడం వంటివి కూడా జరుగుతాయి. కాబట్టి ఉదయం 9 లోపు టిఫిన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ పైన చెప్పిన అలవాట్లన్నీ చాలా చిన్నగా అనిపించవచ్చు, ఇప్పుడే వాటి ప్రభావం చూపించకపోవచ్చు కానీ భవిష్యత్తులో వీటి ఎఫెక్ట్ మన మీద తప్పకుండా ఉంటుంది. కాబట్టి మీలో ఎవరికైనా పైన చెప్పిన అలవాట్లు ఉంటె వెంటనే మానేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఆత్మీయులకు, స్నేహితులకు ఉపయోగపడొచ్చు. దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ ని వాట్సాప్, ఫేస్బుక్ లలో అందరికి షేర్ చేయండి.

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. Very useful information, I know 3 points in this article.. thank you for giving best information....

    ReplyDelete

Top Post Ad

Bottom Post Ad

ADVERTISEMENT