Type Here to Get Search Results !

Translate

ADVERTISEMENT

Multivitamin tablets in telugu, మల్టీ విటమిన్స్ గురించి పూర్తి సమాచారం తెలుగులో, ఉపయోగాలు, దుష్పరిణామాలు, ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలి పూర్తి సమాచారం

  MULTIVITAMINS TELUGU

Vitamin Tablets కి మన దగ్గర ఉన్నంత ప్రాచుర్యం వీటి మార్కెట్ అంతా ఇంతా కాదు. రోజుకో మల్టీవిటమిన్ టాబ్లెట్ తిన్నా తినకపోయినా వేసుకుంటే చాలు ఒంట్లో అన్ని లోపాలు ఇట్టే సర్దుకుంటాయి అన్న ధోరణి ఇవాళ బాగా బలపడిపోయింది. మరి ఈ నమ్మకం ఎంతవరకు నిజం, Vitamin Tablets నిజంగానే మనకు మేలు చేస్తాయా విటమిన్ టాబ్లెట్స్ తోనే మనకు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయా అనేది తెలుసుకుందాం. 

Multivitamin tablets in telugu, మల్టీ విటమిన్స్ గురించి పూర్తి సమాచారం తెలుగులో, ఉపయోగాలు, దుష్పరిణామాలు, ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలి పూర్తి సమాచారం
MULTIVITAMINS

ఒంట్లో ఒకటే నీరసంగా ఉంటుంది, శక్తి చాలటం లేదు. బలానికి ఏమైనా టాబ్లెట్స్ ఇవ్వండి, టానిక్స్ రాసివ్వండి అని డాక్టర్స్ ని బ్రతిమిలాడే వాళ్ళు మన దగ్గర నిత్యం ఎంతో మంది ఇవాళ కనిపిస్తున్నారు. కాస్తో కూస్తో  అవగాహనా ఉన్నోళ్లు మందుల షాపుకు వెళ్లి రకరకాల విటమిన్ సప్లమెంట్లని కొనుగోలు చేసి సొంతంగా వాడేస్తున్నారు. ఐరన్ మాత్రలు మొదలుకొని B కాంప్లెక్స్ విటమిన్లు, క్యాల్షియం సప్లమెంట్లు వరకు అన్ని రకాల మల్టీవిటమిన్ మాత్రల్ని మనలో చాలా మంది ఇవాళ చాలా తరచుగా మింగుతున్నారు. మరి ఈ విటమిన్ మాత్రలతో నిజంగానే మనకు మేలు జరుగుతుందా మల్టీ విటమిన్ మాత్రల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. 

మన శరీరం అద్భుతమైన ఒక కెమికల్ ఫాక్టర్, సజీవమైన ఈ దేహంలో ప్రతి నిత్యం కొన్ని వందల వేల రసాయనిక చర్యలు జరుగుతుంటాయి. ఈ జీవక్రియలన్ని సాపీగా సవ్యంగా సాగిపోవడానికి పోషకాల రూపంలో జీవ ఇంధనం కావాలి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్రొవ్వులు, విటమిన్స్, ఖనిజాలు, లవణాలు ఇవన్నీ మన శరీరానికి అత్యవసరమైన పోషకాలే ఇందులో ఏ ఒక్కటి లోపించిన దాని తాలూకు ప్రభావం మన ఒంట్లో తీవ్రంగానే కనిపిస్తుంది. ఆధునిక జీవనశైలిలో బద్దకపు జీవనం, శ్రమ లోపించడం, నిస్సారమైన తిండి తీరు మూలంగా ఇవ్వాళ మనలో చాలా మందికి విటమిన్ ల లోపాలు అనేవి ఒక పెద్ద సమస్యగా మారింది. డాక్టర్ దగ్గరకు వెళ్లి కూర్చుంటే ఏదో ఒక విటమిన్ లోపం బయట పడుతుంది. ఇవాళ మన దగ్గర చాలా మందిలో ముఖ్యంగా మహిళల్లో B విటమిన్ ల లోపాలు, ఐరన్, క్యాల్షియం, విటమిన్ D కొరత బాగా ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు డాక్టర్లు. 

ప్రధానంగా మనం Vitamin B12 డెఫిసియెన్సీ , Vitamin D, Calcium, Iron ఇవన్నీబేసిగ్గా ఎక్కువమందిలో కనబడేవి. దీనికి డిఫెరెంట్ డిఫెరెంట్ కారణాలు ఉన్నాయి. క్రమేపి మనం చూసుకున్నట్లైతే జనరేషన్స్ చూసుకుంటే మన అగ్రికల్చర్ సొసైటీ నుంచి బయట హార్డ్ ర్క్ చేసే సొసైటీ నుంచి ఇన్ సైడ్ వర్కింగ్ కి అలవాటు పడిపోయాము. అంటే మన వర్కింగ్ కండిషన్స్ ఆలా ఉన్నాయి. చాలా మంది ప్రజలు మన ఇండోర్ వర్క్ చేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే ప్రధానంగా బయటకి వెళ్లే అవసరం తగ్గింది కాబట్టి Vitamin D లోపాలు అనేవి ఫస్ట్ ఒకటి స్టార్ట్ అయింది. రెండోవది పూర్వికులు చూసుకుంటే ముడిబియ్యం తినేవారు, ముడిబియ్యంలో ఉన్న పొట్టులో ఉండే B1విటమిన్, మల్టీవిటమిన్స్ మనకు చాలా ఉపయోగపడేవే కాకపోతే క్రమేపి రైస్ మిల్స్, ప్లోర్ మిల్స్ వచ్చేసాక మనకు పాలిష్ రైస్ అనేవి అలవాటు అయ్యాయి. పాలిష్ రైస్ లో ఆ మంచి గుణాలు పోయాయి, అంటే ఫైబర్ తో పాటు B Vitamins కూడా పోయాయి, ఫ్రూట్స్ వెజిటల్స్ తినడం తగ్గిపోయింది. ఎక్కడ పడితే అక్కడ పాస్ట్ ఫుడ్స్ తినడం అలవాటు అయిపోయింది. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. స్ట్రెస్ పెరిగింది మరియు మనం పనిచేసే టైం కూడా మారిపోయింది. దానికి తోడు మన పొరసిన్స్ నైట్ ఎక్కువైపోయి పగలేదో నైట్ ఏదో తెలియట్లేదు. ఇవన్నీ వచ్చి రాత్రి పాడుకుందామన్న మన కంప్యూటర్స్, లాప్టాప్స్, ఐపాడ్స్, టీవీలు ఇవన్నీ బ్లూ లైట్స్ ఇవి చూస్తే యాజ్ ఫర్ హ్యూమన్ బాడీ కి లైట్ కిందనే అనిపిస్తుంది, సూర్యరశ్మి లాగానే అనిపిస్తుంది. దానివల్ల హార్మోనల్ చేంజ్ అనేది జరుగుతుంది. దానివల్ల నిద్ర సరిగ్గా పట్టదు. నిద్ర సరిగ్గా పట్టకపోతే బాడీ కి రెస్ట్ ఉండదు. దీనివల్ల కూడా అబ్జాబ్సన్ ఇవన్నీ కూడా తేడా వచ్చి విటమిన్స్ వీటితోపాటు మినరల్స్ డెఫిషియెన్సీ కూడా కలుగుతుంది. 

ఒక పిరియడ్ అఫ్ టైంలో మనం చాలా థైరాయిడ్ డిజాస్టర్స్ చూసాం. ఎందుకంటే అయోడిన్ సరిగ్గా తీసుకునేవాళ్ళం కాదు. దాన్ని కనుక్కొని ఉప్పులో అయోడిన్ ని యాడ్ చేయడం మొదలెట్టారు. కొంతవరకు మనం తగ్గించుకోగలిగాము. కాకపోతే ఇవన్నీ చేసిన కూడా థైరాయిడ్ అనేది చాలా ఎక్కువగానే వస్తుంది. దీనికి ఇంకో కారణం ఏంటంటే థైరాయిడ్ కి కొన్ని మినరల్స్ కూడా అవసరం క్రోమియం, జింక్, సిలీనియం ఇవి కూడా తగిన మోతాదులో తీసుకోకపోతే దానివల్ల డెఫిసియెన్సీ వస్తుంది. 

ఇండియన్ పద్దతిలో మన కుకింగ్ చూసుకుంటే మనం ఏదైనాగాని బాగా ఉడికించి, బాగా ప్రై చేసి తింటాం. దాని వల్ల మనకి దాంట్లో ఉన్న మినరల్స్ గాని, విటమిన్స్ గాని, ఐరన్ గాని అబ్జాప్సన్ అనేది లేకుండా పోతుంది. తీసుకున్న ఆహారం సక్కగా లేదు, తీసుకునే ఆహార పద్ధతి సక్కగా లేకపోవడం వలన మనకు విటమిన్ డెఫిషియెన్సీ అనేది ఈ కాలంలో మనం ఎక్కువ చూస్తున్నాం. 

విటమిన్స్, మల్టీవిటమిన్స్ మాత్రల పుట్టుక వెనక ఆశక్తికరమైన కదే ఉంది. 1911లో హోలాండ్ కి చెందిన కాస్మిర్ పంక్ అనే శాస్త్రవేత్త బేరి బేరి అనే వ్యాధికి తెల్లగా పాలిష్ చేసిన బియ్యమే కారణమని దీనికి బియ్యపు తౌడులో ఉండే ఒక కీలకమైన రసాయనం కారణం అని తేల్చి చెప్పాడు. దానికి ఆయన అప్పట్లో Vitamin B1 అని పేరు పెట్టాడు. తర్వాత కాలంలో ఒక డజన్ విటమిన్లు వెలుగులోకి వచ్చాయి. మనం తినే ఆహారం లో ఇలాంటి కీలకమైన రసాయనాలు చాలా ఉంటున్నాయని ఇవి లోపిస్తే జబ్బులు వస్తున్నాయని వీటిని తీసుకోవడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా చూసుకోవచ్చు అని శాస్త్ర రంగం గుర్తించిన తర్వాత ఆహారంలో ఉండే ఈ రసాయనాలనే మనం బయటనుంచి నేరుగా మాత్రల రూపంలోనూ ఇవ్వొచ్చన్న ఆలోచన విస్తృతంగా విస్తరించింది. 1930 నాటికీ విడి విడిగా చాలా రకాల విటమిన్ మాత్రలు అందుబాటులోకి వచ్చాయి. 

1940వ దశకం నుంచి అన్ని కలిపి 1టే మాత్రగా రూపొందించిన మల్టీవిటమిన్ మాత్రలు మార్కెట్లను ముంచెత్తడం మొదలైంది. 1930 అరౌండ్ ఆ టైం లో సడెన్ గా కొత్త డిసీజెస్ ఇన్సూడెన్స్ పెరగడం మొదలైంది. Ex. ఫస్ట్ వాళ్ళు చూసింది ఏంటంటే Beri Beri అనే డిసీజ్, ఏమైంది అని చూసుకుంటే చాలా మందిలో సడెన్ గా కాళ్ళ తిమ్మిర్లు, మంటలు రావడం, హార్ట్ సరిగా పనిచేయకపోవడం ఇవన్నీజరగడం స్టార్ట్ అయ్యాయి. ఒక గ్రూప్ అఫ్ పీపుల్స్ లో ఎనెలైజ్ చేసుకుంటు బ్యాగ్రౌండ్ లోకి వెళ్తే వీళ్ళు కొంత కాలం నుంచి రైస్ పాలిష్ చేసి తీసుకుంటున్నారు అని అవగాహన తెలిసింది. పాలిష్ చేసి తీసుకోవడం వలన వచ్చే నష్టం ఏంటి అనేది వెనక్కెళ్ళి చూసుకుంటే మనం పాలిష్ చేసినప్పుడు రైస్ మీద ఉన్న ఫైబర్ ఫైబర్ తో పాటు ఉన్న Vitamin B1, మిగతా విటమిన్స్ కూడా వెళ్లిపోతున్నాయి. మనం తినేది విటమిన్స్ లేని పదార్థం తింటున్నాము. దానికి తోడు ఫుడ్స్ లో కూడా చేంజ్ వచ్చి మనకి పాస్ట్ ఫుడ్స్ తినడం కానీ కూరగాయలు, ఫ్రూట్స్ తగ్గడం వలన ఈ B1 డెఫిషియెన్సీ రావడం అర్థమైంది. ఈ B1 ఏంటి అని చూసుకుంటే బేసిగ్గా దాన్ని థైమిన్ అంటాం. ఈ డెఫిసియెన్సీ వచ్చిన వాళ్ళకి థైమిన్ రీప్లేస్ చేయగానే అన్ని సింటమ్స్ అంటే ఉన్న ఇబ్బందులు కాళ్ళు మంటలు, తిమ్మిర్లు, మతిమరుపు, హార్ట్ ఆయాసం ఇవన్నీ రివర్స్ అయిపోతాయి. ఇంకొకటి ఏంటి అంటే Vitamin D లాస్ట్ 20 years IT రెవెల్యూషన్ ఉంది. IT రెవల్యూషన్ లో మనకు ఏమైంది అందరు బయటకి వెళ్లి  చేసే పనులన్నీ ఇంట్లో కూర్చొని ఒక క్లిక్ అఫ్ బటన్ వల్ల చేస్తున్నాము. మనకు సూర్యరశ్మి అనేది అసలు తగలడం పోయింది. వీటివల్ల మనకు Vitamin D డెఫిషియెన్సీ అనేది చాలా ఎక్కువైపోయింది. vitamin D డెఫిసియెన్సీ అనగానే కాల్షియం, బోన్ పెయిన్స్ ఇవన్నీ రావడం మొదలైంది. ఇది డెఫిసియెన్సీ ఉన్నవాళ్లకు మనం రీప్లేస్ చేస్తే డెఫినెట్ గా చాలా బెటర్ గా తయారవుతారు.

అయోడిన్ లోపం కొన్ని సంవత్సరాల క్రితంగా మనకు అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ డిజార్డర్స్ అనేవి ఎక్కువ వచ్చాయి. అది కూడా కనుక్కొని మనం వాడే ఉప్పులో అయోడిన్ లేదని చెప్పి దానికి అయోడిన్ పోర్టిఫైడ్ సాల్ట్ అని అమ్మడం మొదలెట్టడం వల్ల ఈ థైరాయిడ్ డిసీజ్ కొంత వరకు తగ్గింది. ఆడవాళ్ళలో మోనోపాజ్ అవగానే కొంత బోన్ మెటబాలిజం డెఫనెట్ గా చేంజ్ వస్తది. ఎందుకంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ సిక్రిషన్ ఆగిపోవడం వల్ల క్యాల్షియం బోన్స్ లో నుంచి బయటకు లాగేసుకుంటూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఆస్టియోపొరోసిస్ అంటే బోన్ వీక్నెస్ అనేది స్టార్ట్ అవుద్ది దానికి మనం క్యాల్షియం విటమిన్ డి సప్లిమెంట్స్ ఇస్తే కొంతవరకు మనం దాన్ని ఆపగలిగే అవకాశం ఉంటుంది.  ప్రతి పోస్ట్ మోనోపాజ్ ఉమెన్స్ కి కాల్షియం విటమిన్ డి ఇవ్వడం వలన బెటర్ గా ఉంటుంది. దీనివల్ల ఒక్కోటి ఒక్కోటి మనం డిస్కవరీ చేసుకుంటూ వస్తూ రీప్లేస్ చేసుకుంటే దానికి ఫలితాలు ఉంటాయి. 

బలం కోసమని ఇవాళ మనం రకరకాల విటమినన్ మాత్రలను ఎక్కువగా ఎడాపెడా మింగేస్తున్నాం. మరి వీటితో నిజంగానే మేలు జరుగుతుందా అంటే కాదు అనేది సమాధానం. విటమిన్ మాత్రల ప్రయోజనాల గురించి చాలా పరిచోదనలు ప్రతికూలంగానే చెబుతున్నాయి.

నిత్యం సమతుల ఆహారం తీసుకునేవారికి ఆకు కూరలు, పండ్లను బాగా తినేవారికి సాధారణంగా అన్ని రకాల విటమిన్లు దండిగానే అందుతాయి. నిస్సారమైన ఆహారం తీసుకునేవారికి సహజంగానే ఒంట్లో విటమిన్ ల కొరత ఏర్పడుతుంది. విటమిన్ ల కొరతను అధిగమించడానికి ఇవాళ మనలో చాలా మంది సహజ ఆహారాలకు బదులుగా సప్లిమెంట్లపైన ఎక్కువగా ఆధారపడుతున్నారు. తిన్నా తినకపోయినా పర్లేదు విటమిన్ మాత్రలు వేసుకుంటే సరిపోతుంది అని నమ్ముతున్నారు. ఈ నమ్మకంతోనే B కాంప్లెక్స్ విటమిన్ లను, Vitamin C, Vitamin D, Vitamin A వంటి సప్లిమెంట్లను ఎడాపెడా వాడేస్తున్నారు. కంటి చూపుకు Vitamin A మంచిదని, బలానికి B కాంప్లెక్స్ బాగా పనిచేస్తుందని, Vitamin C జలుబుని తగ్గిస్తుందని ఇలా రకరకాల నమ్మకాలతో ఇవాళ విటమిన్ మాత్రలను ఎడాపెడా మింగేస్తున్నారు. సప్లిమెంట్లతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని, క్యాన్సర్ల ముప్పు తగ్గుతుంది అన్న నమ్మకాలూ కూడా బాగా ప్రచారంలో ఉన్నాయి. మన దేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఏమిటంటే విటమిన్ మాత్రలతో మనకు వనగూరే ప్రయోజనాలు అంతంతమాత్రమే. వాటిని అతిగా తీసుకుంటే దుష్పలితాలు తప్పలేదు అని అనేక అధ్యయనాలు, పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. 

మనకి ప్రధానంగా B కాంప్లెక్స్ విటమిన్స్, Vitamin C, ఐరన్, పోలిక్ యాసిడ్ మొదలైనవి మనం మాట్లాడుకుంటాం. మల్టి విటమిన్స్ లో B కాంప్లెక్స్, B12, B1, B6 చాలా ముఖ్యమైనవి. ఇవి వాడటం వలన డెఫిషియెన్సీ ఉంటె డెఫిసియెన్సీ పోయి దాంతో వచ్చే సింటమ్స్ మనకు చాలా రిలీఫ్ ఉంటుంది. ముఖ్యంగా B కాంప్లెక్స్ విటమిన్స్. 

విటమిన్స్ ని మనం రెండు రకాలుగా డివైడ్ చేస్తాము.

Multivitamins-types-health-tips-telugu
Multivitamins Types

1. ఫాట్ సాలబుల్ విటమిన్స్:

ఫాట్ సాలబుల్ విటమిన్స్ అంటే ఈ విటమిన్లు ప్రతీ పదార్ధము ఒక ఫాట్ మాలిక్యూల్ తో అంటుకొని వెళ్తుంది. అవేంటంటే Vitamin A, Vitamin D, Vitamin E, Vitamin K ఇవన్నీ ఫాట్ సాలబుల్ విటమిన్స్. వీటిని చెక్ చేసుకొని జాగ్రత్తగా ఇవ్వాలి. ఎంతమాత్రం అధికంగా ఇచ్చినా అవి ఫాట్ సాలబుల్ విటమిన్స్ కాబట్టి ఇది బాడీలో మోతాదు పెరిగి దానివల్ల టాక్సిసిటీ రావడం వల్ల మనకు ఇబ్బందులు చాలా ఎక్కువ వస్తాయి. Ex: మనం అతిగా  Vitamin D తీసుకున్నామనుకోండి అది ఎక్కువ అవడం వలన కాల్షియం పెరిగిద్ది, కాల్షియం పెరిగి డైరెక్టుగా వెళ్లి కిడ్నీ ఫెల్యూర్ కి క్రాష్ చేస్తుంది. అందుకే చాలా డేంజర్. తీసుకుంటే చెక్ చేసుకొని తీసుకోవాలి, తగిన మోతాదులో ఉంటె ఆపాలి, ఎక్కువైతే ఆపి దానికి తగ్గట్టు ఎం చేయాలనేది చూసుకోవాలి గాని బ్లైండ్ గా తీసుకోవడమనేది ఫాట్ సాలబుల్ విటమిన్స్ చాలా రిస్క్. 

Also Read :- Malnutrition can be detected by the signs the body shows | Health Tips In Telugu శరీరం చూపే సంకేతాల ద్వారా పోషకాహార లోపాన్ని గుర్తించవచ్చు. ఆ సంకేతాలు ఏమిటి?

2. వాటర్ సాలబుల్  విటమిన్స్ : 

B కాంప్లెక్స్ Vitamin C ఇవి వాటర్ సాలబుల్ విటమిన్స్. ఒకవేళ B కాంప్లెక్స్ కి సింటమ్స్ ఉన్నాయనుకోండి, మనం రీప్లేస్ చేయడం వల్ల సింటమ్స్ రిలీప్ అవుద్ది. ఒకవేళ మనం ఎక్కువ ఇచ్చామనుకోండి ఆ పేసెంట్ కి ఎక్కువైందనుకోండి B కాంప్లెక్స్ విటమిన్స్ వాటర్ సాలబుల్ వల్ల ఎక్షెస్ బాడీ లో ఉంచుకోదు యూరిన్ ద్వారా బయటకు పంపిస్తుంది, దాని వల్ల ఏ ఇబ్బంది ఉండదు. అలాగే Vitamin C ఇది తీసుకోకపోతే ఇబ్బంది డెఫిసియెన్సీ, ఎక్కువ తీసుకోవడం వల్ల మహా అయితే యూరిన్ లో బయటకు వెళ్లడం తప్పితే ఆరోగ్య పరంగా ఏ ఇబ్బంది పెట్టదు.

బాలన్స్ డైట్, ఫుడ్స్ పైసవిన్స్, వెజిటబుల్స్ పైసవిన్స్ తీసుకుని ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫాట్ అనేది తగిన మోతాదులో తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది టైం మనకు ఏ రీప్లేస్మెంట్ అవసరం ఉండదు. కాకపోతే ఒక్కోసారి బీపీ ఉంది, షుగర్ ఉంది, హార్ట్ పాసెంట్స్ అనగానే మళ్ళి  రెస్త్రేక్షన్స్ స్టార్ట్ అవుతాయి. రెస్త్రేక్షన్స్ స్టార్ట్ అయినప్పుడు మనం అన్ని తినలేము. ఇట్లాంటి వల్ల మనం రీప్లేస్ చేయలేదు అనుకోండి మందులు ఆల్రెడీ వాడుతున్నారు, డిసీజ్ ఉంది, దాంతో పాటు డెఫిసిఎన్సీస్ వచ్చిందనుకోండి వాళ్లకు ఆ సింటమ్స్ తో పాటు వీటి వల్ల కూడా ఇబ్బంది పడుతుంటారు. అందుకని మల్టి విటమిన్ అనేది డయాబెటిక్ పాసెంట్స్ కి జనరల్ గా డాక్టర్స్ సజెస్ట్ చేస్తుంటారు. Ex: B12 వాడేస్తున్నాం అనుకోండి అది చాలా మట్టుకు ఎక్స్ డేట్ అయిపోద్ది, కొంతమందికి ఎక్స్ డేట్ అవదు. అది బాడీ లోనే ఉంటుంది. అట్లాంటప్పుడు చెక్ చేసి టెంపరరీగా ఆపేయడం బెటర్, అవసరం ఉన్న దానికంటే మోతాదులో ఏదెక్కువ ఉన్న మంచిది కాదు. అందుకనే మానిటరింగ్ అనేది చాలా ముఖ్యం. జనరల్ గా ఐరన్ డెఫిసియెన్సీ రక్త హీనత అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఫోలిక్ యాసిడ్, B12 డెఫిసియెన్సీ ఇలాంటి వాళ్లకు డైరెక్ట్ గా ఇచ్చే అవకాశం ఉంటుంది. పోలిక్ యాసిడ్ ఆడవాళ్ళలో ముఖ్యంగా యంగ్ పీపుల్స్ ప్రెగ్నెంసీకి వెళ్లే వాళ్ళ లో మనం 6 Months ముందునుంచే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఆ చిన్న టాబ్లెట్ మనం వాడకపోవడం వల్ల స్పైనబైపిడ అనే జెనెటిక్ డిసీజ్ అంటే స్పైనిస్ రెండుగా విడిపోయి పుడతారు పిల్లలు. ఈ సింపుల్ టాబ్లెట్ మనం 6 Months నుంచి ప్రెగ్నెంసి ముందు స్టార్ట్ చేసుకుంటే ఆ ఇన్సూడెంట్స్ అనేవి రాకుండా మనం కాపాడుకున్నవాళ్ళం అవుతాము. 

ఐరన్ డెఫినెట్ గా మనం చూసుకొని అవసరం ఉంటేనే వాడాలి, లేదంటే అది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఐరన్ ఎక్కువవడం వల్ల లివర్ లో ఇమినోక్రొమటోసిస్ అనే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా ఏంటంటే మనం బ్యాలెన్స్ డైట్ తీసుకునే ప్రయత్నం చేయాలి. ఈ మందులు ఇచ్చేవి కూడా బాలన్స్ గా ఇవ్వాలి. డాక్టర్ సలహాతోనే ఎప్పడికప్పుడు చెక్ చేసుకుంటూ ఇస్తే దీనివల్ల లాభాలే ఉంటాయి తప్ప నష్టాలు ఉండవు. 

Vitamin Tablets ఎవరికీ అవసరం, ఎవరికీ అవసరం లేదు. 


Multivitamin Tablets
Multivitamin Tablets

పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కొద్దోగొప్పో మోతాదులో అందరికి విటమిన్లు అవసరం అనే విషయం పై అవగాహన ఉండాలి. 6 ఏళ్లలోపు పిల్లలకు Vitamin A, Vitamin C చాలా అవసరం. పసి వయసులో విటమిన్ ల కొరత ఏర్పడితే కంటిచూపు తగ్గడం, స్కమ్మింగ్, రిక్కెట్స్ వంటి సమస్యల ముప్పు ఉంటుంది. వీటిని నివారించుకునేందుకు పిల్లలకు Vitamin A, Vitamin C సప్లమెంట్లను వాడొచ్చు. పెద్దవారిలో విటమిన్ ల కొరత మూలంగా ఎదొరొప్లిరోసిస్ కాన్సర్, ఎముకలు గుల్లబారడం వంటి సమస్యలు ఎదురవచ్చు. వీటిని ఎదుర్కొనేందుకు డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్లను వాడొచ్చు. తల్లి బిడ్డల ఆరోగ్యానికి ఐరన్, ఫోలిక్ యాసిడ్ అత్యవసరం కాబట్టి గర్భిణీ దశలో ఫోలిక్ యాసిడ్ ఐరన్ మాత్రల వాడకం తప్పనిసరి. శాకాహారుల్లో B12 సప్లిమెంట్లను వాడాలి. కీమోథెరపీ, డయాలసిస్, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికీ పోషకాల కొరత ఉంటుంది. కాబట్టి వీరందరూ తప్పనిసరిగా వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్లను వాడుకోవాలి.

మనం ఓవర్ ది కౌంటర్ తీసుకొని మనం మల్టీ విటమిన్ వేసుకుంటున్నాం, కాల్షియం వేసుకుంటున్నాం, ఐరన్ వేసుకుంటున్నాం, జింక్ వేసుకుంటున్నాం, సిలీనియం వేసుకుంటున్నాం. మనం తినాల్సిన అవసరం లేదు అనుకుంటే అది పెద్ద అపోహ ఎందుకంటే మన బాడీకి మినరల్స్ కావాలి, విటమిన్స్ కావాలి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, పాట్ కావాలి. ఇవన్నీ బ్యాలెన్స్ గా తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉండొచ్చు. మల్టీవిటమిన్  తీసుకుంటాను, కాల్షియం తీసుకుంటాను, ఇంకా  ఏమి అవసరం లేదు అనుకుంటే పొరపాటు. అది చాలా తప్పు. మాక్రోస్ ఉండాలి, మాక్రో ఎలిమెంట్స్ ఉండాలి. రెండు కలగలిసినప్పుడే మన హెల్త్ అనేది బెటర్ గా ఉంటుంది. మనం సొంతంగా అన్ని తీసుకుంటే ముఖ్యంగా కిడ్నీ, లివర్ అనేది చాలా ఇబ్బంది కరంగా తయారవుద్ది. అవి డామేజ్ అయితే మన క్వాలిటీ అఫ్ లైఫ్ పాడైపోద్ది. దానివల్ల మనం చాలా ఇబ్బందికి గురి అవుతుంటాం. జాగ్రత్తగా డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోండి దానివల్ల మీ బాడీకి ఉపయోగం ఉంటుంది. 

నేచ్చురల్ గా మనకు విటమిన్స్ ఎలా అందుతాయి.

natural food
నేచ్చురల్ ఆహారం 

నిత్యం మంచి సమతుల ఆహరం తీసుకుంటే చాలు మనకు కావాల్సిన విటమిన్లు అన్ని సమృద్ధిగా లభిస్తాయి. ఒక్క B12 మాత్రం మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తుల్లోనే ఉంటుంది. కాబట్టి శాకాహారులు మాత్రం Vitamin B12 మాత్రలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. Vitamin C కోసం తాజా పండ్లను, ముఖ్యంగా నిమ్మజాతి పండ్లను తీసుకోవాలి. రోజుకు 40గ్రాములు Vitamin C మనకు కావాలి. ఈ మొత్తం ఒక్క నారింజ పండు తింటే వచ్చేస్తుంది. రోజు ఉదయాన్నే కాసేపు ఎండలో నిలబడటం ద్వారా సాలినంత Vitamin D ని మన శరీరమే తయారుచేసుకుంటుంది. ఆకు కూరలు, గింజధాన్యాలు, తృణధాన్యాల్ని ఆహారంలో ఒక భాగం చేసుకోవడం ద్వారా Vitamin A,E,K మొదలైనవన్నీ లభిస్తాయి. తిన్న ఆహారంలోని పోషకాలను గ్రహించలేని క్రాన్స్ వంటి ప్రేగు వ్యాధితో బాధపడుతున్నప్పుడు పోషకాహార కొరత ఉన్నపుడు డాక్టర్లు అవసరమని సిపార్సు చేస్తే తప్పిచ్చి విటమిన్ లను ఎడాపెడా వాడకపోవడమే మేలు. 

ఒంట్లో పోషకాల కొరత తీవ్రంగా ఉంటె ఆహారం ద్వారా కూడా పోషక లోపాల్ని అధిగమించలేనప్పుడు మాత్రమే అది కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే సూచించిన సప్లమెంట్లను వాడుకోవాలి. మేలు జరుగుతుందని విటమిన్ సప్లమెంట్లను ఎడాపెడా వాడితే వాటితో అనర్దాలు తలెత్తే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు సమతుల ఆహారం తీసుకుంటే చాలు మనకు కావాల్సిన విటమిన్లు, ఖనిజలవణాలు అన్ని సమృద్ధిగా అందుతాయి. 

మరింత సమాచారం కోసం Health Tips Telugu ని రోజు ఫాలో అవుతూ ఉండండి. మీకు మంచి మంచి హెల్త్ టిప్స్, ఫిట్నెస్ టిప్స్, ఆయుర్వేద టిప్స్ తెలియజేయడం జరుగుతుంది. ఇవి మన హెల్త్ కి చాలా ముఖ్యమైనవి. ఏదైనా సలహాలు, సూచనలు, సందేహాలు తెలపాలనుకుంటే ఈ పోస్ట్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

ADVERTISEMENT