Type Here to Get Search Results !

Translate

ADVERTISEMENT

Malnutrition can be detected by the signs the body shows. మన శరీరంలో వచ్చే సంకేతాల ద్వారా శరీరంలో పోషకాల లోపాన్ని గుర్తించవచ్చు. ఆ సంకేతాలు ఏంటి? ఏం చేయాలి? పూర్తి సమాచారం.

Malnutrition | Health Tips Telugu  శరీరం చూపే సంకేతాల ద్వారా పోషకాహార లోపాన్ని గుర్తించవచ్చు. ఆ సంకేతాలు ఏమిటి?

Malnutrition(పోషకాహారలోపం)-can-be-detected-Health-Tips-Telugu

ఇంటెలిజెంట్ మెషిన్ ఏదైనా ఉంది అంటే అది మన బాడీనె. ఏదైనా తేడా చేసినప్పుడు ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండా మాత్రం ఒక్కసారిగా ఆగిపోదు. కానీ మనకు చిన్న చిన్న సిగ్నల్స్ ఇస్తుంది. దాంతో మన బాడీ లో ఎదో కరెక్ట్ చేసుకోవాలని మనకు తెలుస్తుంది. కానీ మనకు తెలియాల్సింది ఈ సిగ్నల్స్ కి మీనింగ్ ఏంటనేది. ఈ ఆర్టికల్ లో పూర్తిగా వాటి గురించి తెలుసుకుందాం. 

శరీరం లో వచ్చే 22 సిగ్నల్స్ మరియు సింటమ్స్ :

విటమిన్స్ మరియు మినరల్స్ మన డైలీ బాడీ ఫంక్షనింగ్ కి చాలా ముఖ్యమైనవి. కానీ ప్రజలు ఏమి ఆలోచించకుండా, అసలు వాళ్ళ బాడీ లో  ఏ న్యూట్రిఎంట్స్ అవసరమో తెలియకుండా మల్టి విటమిన్ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ మంచి విషమేమిటంటే ఎప్పుడైతే మీ బాడీలో ఏదైనా విటమిన్ లేదా మినరల్స్ తగ్గిపోతే అప్పుడు మీ బాడీ మీకు చాలా సిగ్నల్స్ ఇస్తుంది. వాటిని ఎలా నాచ్చురల్ గా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలుసుకుందాం. 

1. Cracking Sounds in Joints ( కీళ్లలో పగిలిన శబ్దాలు రావడం )

మీరు కూర్చునేటప్పుడు మీ మోకాళ్ల నుండి కట్ కట్ మని శబ్దం వస్తుందా.. లేదా మీ మిగిలిన జాయింట్స్ నుండి కట్ కట్ మని సౌండ్ వస్తుందా.. ఒకవేళ అవును అంటే ఇది కాల్షియం డెఫిషియెన్సీ కి ఒక సిగ్నల్. కాల్షియం మన బోన్స్ కి ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుసు. కాల్షియం లెవెల్స్ బాగా తగ్గిపోతే అర్దటైటిస్ కూడా రావచ్చు. దీని నుండి ఎలా బయటపడాలి, ముందుగా మీరు కాల్షియం టాబ్లెట్స్ పైన డబ్బు ఖర్చుపెట్టాల్సిన పనిలేదు. కానీ మిల్క్ మరియు మిల్క్ ప్రోడక్ట్స్ తో పాటు పీనట్ బటర్ ని మీ డైట్ లో చేర్చుకోండి. అంతే కాకుండా కాల్షియం లోపాన్ని తగ్గించుకోవడానికి అన్నింటికన్నా బెస్ట్ మార్గం ఒక చిటికెడు సున్నం పౌడర్ ని పెరుగులో మిక్స్ చేసుకొని మార్కింగ్ బ్రేక్ ఫాస్ట్ కి ముందుగా తినండి. దీన్ని 2-3 నెలలు తప్పకుండా తీసుకోండి. మీ జాయింట్స్క లో వచ్చే కట్ కట్ మనే సౌండ్ కంప్లీట్ గా ఆగిపోతుంది. కాల్షియం లోపాన్ని సరి చేయడానికి సున్నం చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. సున్నం లేదా చూనా మీకు పాన్ షాప్ లేదా ఏదైనా కిరానా షాప్స్ లో కూడా చాలా ఈజీగా దొరుకుతుంది. 

2. Bleeding from the gums బ్రష్ చేస్తున్నప్పుడు చిగుళ్ల నుండి రక్తం కారడం )

బ్రష్ చేస్తున్నప్పుడు మీ చిగుళ్ల నుండి రక్తం కారుతుందా, లేదా తింటున్నప్పుడు రక్తం వస్తుందా లేదా మీ నాలుకపై ఎక్కువగా నల్లగా కట్స్ అవుతూ ఉంటాయా దీన్ని బట్టి మీరు అర్ధం చేసుకోవాలి Vitamin C కావాలని మీ బాడీ గట్టిగ అరిచి చెప్తుంది. చిగుర్ల నుండి రక్తం కారడం చాలా కామన్ ప్రాబ్లమ్. కానీ చాలా మంది బాడీ ఇచ్చే ఈ సిగ్నల్స్ ని ఇగ్నోర్  చేస్తూ ఉంటారు. సెల్యూలార్ లెవెల్ లో కూడా మీ అర్చరీస్ నుండి రక్తం కారుతూ ఉండచ్చు. దీనిపై వెంటనే స్పందించాలి ఎందుకంటే ఒక్కసారి ఇగ్నోర్ చేస్తే ఇది వాస్కులర్ సిస్టం మొత్తానికి ప్రాబ్లమ్ కావచ్చు. 20 ఆరంజ్ లలో ఉండే Vitamin C కేవలం ఒక్క ఉసిరి కాయలో ఉండటం చేత ఉసిరికాయ Vitamin C లోపాన్ని దూరం చేస్తుంది. ఉసిరిని మీరు జ్యూస్, పౌడర్, పచ్చడి, కాండీ ఫామ్ లో మొత్తం సంవత్సరమంతా మీతో ఉంచుకోవచ్చు. ఇక Vitamin C అధికంగా ఉండేవి నిమ్మ, జామ, బత్తాయి మరియు సిమ్లా మిర్చి

3. గోర్లు విరిగిపోతుండటం, 4. గోళ్ల చుట్టూ స్కిన్ ఊడటం, 5. హెయిర్ డ్రై అండ్ రఫ్ గా ఉండటం, 6. ఫ్రీ మెచ్చుర్ హెయిర్ ఫాల్ అవటం. 

మీ గోర్లు అల్పంగా ఉండి త్వరగా విరిగిపోతున్నాయా లేదా మీకు కూడా గొర్ల చుట్టూ స్కిన్ ఊడుతుందా ఇంకా మీ హెయిర్ డ్రై అండ్ రఫ్ గా ఉంటుందా లేదా మీకు ఫ్రీ మెచ్చుర్ హెయిర్ ఫాల్ అవుతుందా ఒకవేళ ఇలా ఉంటె మీ బాడీలో బయోటిన్ తగ్గిందనడానికి ఇది క్లియర్ ఇండికేషన్. రెగ్యులర్ గా పచ్చి గుడ్లను తినడం ఒక కారణం అయి ఉండొచ్చు. బయోటిన్ కడుపులో గుడ్ బాక్టీరియా ద్వారా తయారుచేయబడుతుంది. ఎప్పుడైతే ఏదైనా ఇంబాలన్స్ డైజెస్టివ్ సిస్టంలో జరిగితే ఈ బాక్టీరియా బయోటిన్ ని తయారుచేయలేవు. దాంతో ఈ సింటమ్స్ మనకు కనిపిస్తాయి. బయోటిన్ లోపాన్ని తగ్గించుకోవడానికి గుడ్ ఫ్రెండ్లీ బాక్టీరియాని ఇంప్రూవ్ చేసుకోవడం మంచి ఆప్షన్. ఫ్రెష్ పెరుగుని మించిన ఫ్రొ బయాటిక్ ఇంకేమి ఉండకపోవచ్చు. పెరుగులో ఒక స్పూన్ బెల్లం పొడిని యాడ్ చేసుకొని ఉదయాన్నే కాళీ కడుపుతో తినేయండి. మరికొన్ని గుడ్ బాక్టీరియా సోర్సెస్ కలిగిన ఐటమ్స్ పచ్చడి, ఆపిల్ శడర్ వెనిగర్

Also Read :- Multivitamin tablets in telugu, మల్టీ విటమిన్స్ గురించి పూర్తి సమాచారం తెలుగులో, ఉపయోగాలు, దుష్పరిణామాలు, ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలి పూర్తి సమాచారం.

7. White spots on the nails ( గోళ్లపై తెల్లటి మచ్చలు అవడం )

ఒక్కసారి మీ నెయిల్స్ ని చెక్ చేసుకోండి. గోళ్ళ పైన తెల్లని మచ్చలు ఉన్నాయా. ఒకవేళ ఉంటె మీ బాడీ జింక్ కావాలంటుంది. ఎవరైతే ఎక్కువగా కేక్స్, పేస్ట్రీస్ వంటి మైదా కలిగిన ఐటమ్స్ తింటారో వాళ్ళకి జింక్ డెఫిసియెన్సీ అనేది చాలా కామన్. జింక్ చెప్పుకోవడానికి ట్రేస్ మినరల్ కానీ మగవాళ్ళకి, ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మగవాళ్లలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి చేయడానికి జింక్ చాలా ఇంపార్టెంట్. అందుకే లో జింక్ అంటే లో టెస్టోస్టిరాన్. దీంతో గడ్డం పెరగడం నెమ్మదించడం, మజిల్ సరిగ్గా ఇంప్రూవ్ కాకపోవడం, బద్ధకం, సెక్సువల్ ఇమ్మెచ్చురిటీ వంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాగే ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఆడవాళ్ళలో జింక్ లోపం వల్ల పిల్లలపై ప్రభావం చూపించవచ్చు. అందుకే జింక్ లోపాన్ని కంప్లిట్ చేసుకోవడానికి కేక్స్, పేస్ట్రీస్ ని తగ్గించండి. అలాగే డ్రై ఫ్రూట్స్, స్ప్రౌట్స్ మరియు పప్పులను డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి. 

8. కాళ్ళ మాడిమలు పగలడం, 9. కళ్ళు ఎర్రగా అవడం, 10. లిప్స్ పైన అల్సర్స్ రావడం, 11. నోటి చివర్లలో పగలడం, 12. గోర్లలో హారిజాంటల్ లైన్స్ రావడం, 13, మెల్లకన్ను వస్తున్నట్లు ఉండటం 14. గోర్లు బ్రౌన్ కలర్ అయిపోవడం 15. ముక్కు, బుగ్గలు, నుదుటిపైన ఎర్రటి మచ్చలు రావడం. 

మీ కాళ్ళ మాడిమలు పగులుతున్నాయా లేదా మీ కళ్ళు బాగా ఎర్రగా అవుతున్నాయా లేదా లిప్స్ పైన అల్సర్స్ వస్తున్నాయా లేదా నోటి చివర్లలో పగుళ్లోస్తున్నాయా అయితే ఈ లక్షణాలు Vitamin B2 డెఫిషియెన్సీ వల్ల వస్తాయి. 

అలాగే మీ గోళ్లలో హారిజాంటల్ లైన్స్ ఉన్నాయా లేదా మీకు మెల్లకన్ను వస్తున్నట్టుగా ఉందా ఆడితే ఇవన్నీ Vitamin B1 డెఫిసియెన్సీ వల్ల వస్తాయి.

కొంతమందికి నెయిల్స్ బ్రౌన్ కలర్ అయిపోతాయి వాళ్లకు Vitamin B12 డెఫిసియెన్సీ ఉన్నట్లు. ఇంకా ముక్కు, బుగ్గలు, లేదా నుదుటి పై ఎర్రటి మచ్చలు ఉంటె మీరు Vitamin B6 ని అధిగమించాలి. B విటమిన్స్ యొక్క డెఫిసియెన్సీ చాలా కామన్. వీటివల్ల స్కిన్, హెయిర్, డైజెస్టివ్ సిస్టంకి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎవరిలో అయితే B విటమిన్స్ లోపం ఉంటుందో వాళ్లలో ఒళ్ళు నొప్పులు, ఆందోళన, డిఫ్రెషన్ కూడా రావచ్చు. B విటమిన్ డెఫిసియెన్సీ కి మేజర్ రీజన్ ఫుర్ ఫుడ్ చైసెస్. చాలా ఎక్కువగా పిజ్జా, బర్గర్స్, సమోసా, పకోడీ, డోనట్, పేస్ట్రీస్, చిప్స్, కురుకురేస్, బిస్కెట్స్, నంకిన్, వేపర్స్, చాకోలెట్స్ తినడం ఆపేయండి. మరి ఎం తినాలి, వీలైనంత వరకు హోమ్మేడ్ ఫుడ్ తినండి. మిగిలింది మీ బాడీ ఎడ్జెస్ట్ చేసుకుంటుంది. 

16. ముఖం పాలిపోయినట్టుగా మారడం, 17. గోర్లు పాలిపోతుండటం, 18. పెదాలు రంగు మారుతుండటం.

మీ ముఖం పాలిపోయినట్లుగా మారుతుందా లేదా మీ గోర్లు పాలిపోతున్నాయా లేదా మీ పెదాలు రంగు మారిపోతున్నాయా అయితే మీ బాడీలో తక్కువ ఐరన్ అండ్ తక్కువ హిమోగ్లోబిన్ ఉన్నాయని చెప్పడానికి ఇవే క్లాసిక్ సింటమ్స్. ఇరాన్ అండ్ హిమోగ్లోబిన్ ఇంటెర్లింకెడ్. ఎందుకంటే బాడీకి బ్లడ్ తయారుచేయడానికి ఐరన్ కావాలి. ఐరన్ డెఫిసియెన్సీ ని ఫుల్ పిల్ చేయడానికి మంచి మార్గం ఎలాంటి ఎక్ట్రాస్ లేకుండా సింపుల్ గా మీ వంటలకు ఐరన్ పాత్రలను ఉపయోగించడం స్టార్ట్ చేయండి. ఇంకా బీట్ రూట్, క్యారెట్, దానిమ్మ, మొక్కజొన్న, ఆపిల్ ఇవన్నీ ఇమోగ్లోబిన్ ని పెంచడానికి మంచి ఫుడ్ సోర్సెస్. హిమోగ్లోబిన్ లెవెల్స్ ని పెంచుకోడానికి బాడీకి మంచి మసాజ్, ఎక్సర్ సైజ్ కూడా చాలా ఎఫెక్టీవ్ గా ఉంటాయి. 

ఇంకా కొన్ని తెలిసి తెలియని సిగ్నల్స్ ఏంటంటే నెయిల్స్ పైన వర్టికల్ లైన్స్, లాస్ అఫ్ ఐబ్రోస్, లేదా ఉబ్బిన కళ్ళు. ఈ ప్రాబ్లమ్స్ యొక్క రూట్ క్రాస్ థైరాయిడ్. థైరాయిడ్ గ్లాండ్ మీ బాడీ యొక్క మెటబాలిజం ని రెగ్యూలేట్ చేస్తుంది. ఇంకా మీ బాడీ ఏవిధంగా కాడ్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఉపయోగించుకుంటుందో రెగ్యూలేట్ చేస్తుంది. అందుకే థైరాయిడ్ గ్లాండ్ లో ప్రాబ్లమ్ వస్తే దీంతో చాలా డెఫిసియెన్సీస్ క్రియేట్ అవ్వచ్చు. ఎందుకంటే ఆడవారిలో హార్మోనల్ చేంజెస్ ఎక్కువగా ఉండటం చేత ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉండొచ్చు. థైరాయిడ్స్ ని సరిచేసుకోవడానికి చాలా చేయొచ్చు. స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే ఇంట్లోని ఫ్రెష్ ఫుడ్ ని తినండి. రెగ్యులర్ గా ఎక్సర్ సైజ్ చేయండి. 

19. అనివన్ నెయిల్స్ ఉండటం, 20. రాత్రిళ్ళు సరిగ్గా కనిపించకపోవడం.

మీకు అనివన్ నెయిల్స్ ఉన్నాయా లేదా మీకు రాత్రి సరిగ్గా కనిపించట్లేదా అయితే ఇది Vitamin A డెఫిసియెన్సీ. Vitamin A డెఫిసియెన్సీ అనేది లివర్ వల్ల రావచ్చు. అందుకే చాలా మంది ప్రతి రోజు కూరగాయలు తింటున్నప్పటికీ వాళ్ళకి Vitamin A డెఫిసియెన్సీ అవుతుంది. ఇలా ఎందుకంటే వాళ్ళ లివర్ Vitamin A ని అబ్జార్వ్ చేసుకునేంత బయిల్ జ్యూస్ ని ప్రొడ్యూస్ చేయలేకపోవచ్చు. Vitamin A ఫాట్ సాలబుల్, అందుకే నెయ్యి, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ని డైట్ లో చేర్చుకోవాలి. 

21. బాడిలో ఎక్కువగా క్రాంక్స్ రావడం.

మీకు ఎక్కువగా బాడీలో క్రాంక్స్ వస్తాయా ఒకవేళ అవును అంటే ఇది క్లియర్ గా Vitamin D డెఫిసియెన్సీ. బాదాం ఆయిల్ తో రెగ్యులర్ గా బాడీ మసాజ్ చేసుకోవాలి. అలాగే మీరు బాదం రాగర్ ఆయిల్ రాత్రిపూట గోరు వెచ్చని పాలల్లో కూడా కలుపుకొని త్రాగవచ్చు. 

22. నాలుక తెల్లగా అయిపోవడం.

మీ గార్దర్న్ స్టమక్ లో ఈస్ట్ ఓవర్ గ్రోత్ అవడం వలన మీ నాలుక తెల్లగా అయిపోతుంది. యాంటీబయోటిక్స్ ని ఉపయోగించకండి. కూరగాయలతో చేసిన సలాడ్స్, ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్ ని మీ డైట్ లో చేర్చుకోండి. 

బాసికల్లి బాడీ లోపల ఎం జరుగుతుందో దాని సిగ్నల్స్ బాడీ పైన చూడవచ్చు. ఇలాంటి చిన్న చిన్న లోపాల పైన ద్రుష్టి పెట్టకపోతే చాలా ప్రాబ్లమ్ అవచ్చు. అలాగే మరోపక్క మన బాడీ చాలా ఇంటెలిజెంట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని ఇది సొంతం గానే సరి చేసుకుంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. సింథటిక్ మాత్రలు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వీలైనంత వరకు హోంమేడ్ ఫుడ్ తినండి. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

ADVERTISEMENT