Type Here to Get Search Results !

Translate

ADVERTISEMENT

Flu Cold(రొంప) and Cough Natural Home Remedies In Telugu రొంప మరియు జలుబు ఇట్టే తగ్గించుకోవచ్చు

Cough and Flu cold(రొంప) natural home remedies తో తగ్గించడానికి  పాటించవలసిన ముఖ్యమైన విషయాలు:

Flu cold(రొంప) and cough natural home remedies తో తగ్గించడానికి పాటించవలసిన ముఖ్యమైన విషయాలతో రొంప మరియు జలుబు ఇట్టే తగ్గించుకోవచ్చు. రొంప, జ్వరం వంటివి యాంటిబయోటిక్ మందులతో నయం అవుతాయన్న అపోహ చాలా మందికి ఉంది. అది ఎంత మాత్రం నిజం కాదు. నిజానికి జలుబు, రొంప రెండు వైరల్ ఇన్ఫెక్షన్ లే. ఇవి చిన్న చిన్న ఇన్ఫెక్షన్ లే అయినా త్వరగా వదిలి పెట్టవు. కాబట్టి వీటికి టాబ్లెట్ల కంటే చిన్న చిన్న చిట్కాల ద్వారా త్వరగా ఉపశమనం కలిగిస్తాయి.

Flu-Cold(రొంప)-and-Cough-Natural-Home-Remedies-In-Telugu

జలుబు, ఫ్లూ రెండు వైరల్ ఇన్ఫెక్షన్ లే. గొంతు నొప్పి, ముక్కు కారడం, దగ్గు అలసట వంటివి రెండింటి లో కనిపించే సాధారణ లక్షణాలు. నిజానికి ఫ్లూ, సాధారణ జలుబు, జ్వరాలకు పెద్ద పెద్ద చికిత్సలు, వైద్యాలు ఏమి అవసరం ఉండదు. అలాగని మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలను నిర్లక్యం చేయకూడదు. వైరస్ కారణంగా వచ్చే సమస్య జలుబు. దీనికి రైనో వైరస్ వర్గానికి చెందిన ఎన్నో రకాల వైరస్ లు కారణం కూడా కావచ్చు. కాబట్టి వీటికి వ్యతిరేకంగా యాంటీబాడీలు తయారుచేసుకోవడం మన రోగనిరోధక వ్యవస్థ వీటిని గుర్తుంచుకొని పోరాడటం కష్టం. అందుకే మన అందరిని ఈ జలుబు వేధిస్తూనే ఉంటుంది. 

 • ప్రతి ఒక్కరికి సాధరణంగా ఈ జలుబు ఒక వారం పాటు బాధిస్తుంది. తర్వాత చాలా వరకు దానంతట అదే తగ్గిపోతుంది. 
 • అలాగే దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు తప్పనిసరిగా నోటికి చేతి రుమాలు, లేదా టిస్యూ పేపర్ అడ్డం పెట్టుకోవాలి. తరచుగా చేతులను పరిశుభ్రంగా కడుక్కోని శానిటైజర్ ని ఉపయోగించుకోవాలి.

జలుబు, ఫ్లూ లేదా కామన్ కోల్డ్ అనేది స్పెసిఫిక్ గా ఎప్పుడైతే సీజన్స్ చేంజ్ అవుతాయో అంటే ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే మార్పులు ఉంటుందో ఆ పర్టిక్యులర్ సీజన్ లో మనం చూస్తూ ఉంటాం. ఈ కామన్ కోల్డ్ అనేది యూజ్వల్ గా వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. ఈ కామన్ కోల్డ్ ఒకసారి వస్తే గనుక 5 రోజుల నుంచి వారం వరకు మనల్ని ఇబ్బంది పెడుతుంది. 

కామన్ కోల్డ్ యొక్క సింటమ్స్ 

 • ఈ కామన్ కోల్డ్ వచ్చిన వారికీ ముక్కు దిబ్బడ.
 • ముక్కు నుంచి నీళ్లు కారడం.
 • తలనొప్పి.
 • పేస్ అంత బరువుగా ఉండడం.
 • పదే పదే మొత్తం బాడీ లేజీ గా అనిపించడం.
 • బాడీ అంత వేడిగా ఉన్నట్టు అనిపించడం.
 • ముక్కు వెనకాలనుంచి ద్రవాలు కారడం గొంతుకోకి.
 • గొంతు ఇర్రిటేషన్.
 • దగ్గు.

కామన్ కోల్డ్ వచ్చినప్పుడు ఎం చేయాలి?

 • ఈ కామన్ కోల్డ్ వచ్చినప్పుడు కొంచెం వేడి వాటర్లో  ఒక ధబ్బనిమ్మకాయ పిండుకొని ఒక 1-2 స్పూన్స్ తేనె కలుపుకొని అది మార్నింగ్ అండ్ నైట్ చిప్ చేస్తూ ఉండటం. 
 • అదే మాదిరిగా ఈ మధ్య టైం లో టీస్ లేకపోతే గ్రీన్ టీ కంటిన్యూస్ గా చిప్ చేయడం మనకు ఎంతో కంఫర్ట్ గా ఉంటుంది. 
 • ఇలా చేయడం మూలాన మన ఈ కామన్ కోల్డ్ ఇన్ఫెక్షన్ మూలాన ముక్కులో కండరాలు ఏవైతే వాపు వస్తాయో అదే మాదిరిగా ముక్కులో ద్రవాలు ఏవైతే మందంగా తయారవుతాయో అవి మెల్లగా ఆ మందం తగ్గడం, ముక్కులో కండరాల సీజ్ లు తగ్గడం జరుగుతుంది. దీని ద్వారా మనకు ముక్కు నుంచి గాలి రావడం బాగవుతుంది. 
 • గోరు వెచ్చని నీళ్లలో ఉప్పుకలిపి పుక్కిలించి ఉమ్మి వేయడం ద్వారా జలుబు, ఫ్లూ సమయాల్లో ఉపశమనంగా ఉంటుంది. 
 • జలుబుని తగ్గించుకోవడానికి నీటిని త్రాగడమనేది చాలా సులువైన పద్ధతి. 
 • గోరు వెచ్చగా ఉండే నీరు గొంతు భాగంలో ఉండే ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది. వేడిగా ఉండే జావా, సూప్ లు లాంటి పదార్దాలు వంటివి త్రాగాలి. రోజు మొత్తం వేడిగా ఉండే పానీయాలు తరచుగా త్రాగడం వలన జలుబు నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. 
 • అల్లం, వెల్లుల్లి లాంటివి ఉపయోగించడం వల్ల ముక్కు దిబ్బడను తగ్గించడంతో పాటు జలుబు చేసినప్పుడు ఉండే ఇబ్బందికి మంచి రిలీఫ్ గా ఉండేందుకు తోడ్పడతాయి.
 • రోజులో రెండు మూడు సార్లు విక్స్ లేదా వేడి నీళ్లలో పసుపు వేసుకొని ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గడంతో పాటు మంచి రిలీఫ్ వస్తుంది. 

ఈ గొంతులో నషా మనం కొంచెం గోరు వెచ్చని నీళ్ళల్లో 2-3 స్పూన్స్ సాల్ట్ వేసి పుక్కిలించి ఉయడం మూలాన రిలీఫ్ దొరుకుతుంది. సరే మనం 5 రోజులు అయిపోయింది, ఒక వారం అయిపోయింది, మన వైపు నుంచి అన్ని ప్రయత్నాలు చేసాము. చల్లటి వాటిని అస్సలు తీసుకోకుండా ఉంటున్నాము. అప్పటికి మనకి ఈ సింటమ్స్ గనుక ఇదే మాదిరిగా కంటిన్యూ అవుతుంటే లేకపోతే ఉన్నది ఇంకా ఎక్కువ అవుతుంటే వెంటనే దగ్గర ఉన్న డాక్టర్ దగ్గర చూపెట్టుకోవాలి.

రొంప మరియు జలుబు రాకుండా మనం ఎం చేయాలి?

 • వెథర్ చేంజ్ అవుతున్నప్పుడు మనకి ఈ కామన్ కోల్డ్ అనేది వస్తది. అంటే మన క్రాస్ వెంటిలేషన్ ఉన్న ఏరియాలో వర్క్ చేయడం. అంటే ఏసీలో కాకుండా క్లోజ్ ఇన్వెంట్మెంట్ కాకుండా చుట్టుపక్కల వెంటిలేషన్ ఉండేట్లు చూసుకొని పనిచేయడం. 
 • అదే మాదిరిగా మనం ప్రక్కని వాళ్ళకి చెప్పలేం కాబట్టి వాళ్ళు దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పడు ముక్కు మూసుకోండి, నోరు మూసుకోండి అని మనం చెప్పలేం కాబట్టి ఈ పర్టిక్యులర్ సీజన్ లో మనము మాస్క్ ధరించడం N95 మాస్క్ ఈ మాస్క్ ధరించడం మూలాన కూడా మనకి వారి ద్వారా ఇన్ఫెక్షన్ రాకుండా మనం చేసుకోవచ్చు. 
 • ఎప్పుడైతే మనకి ఎవరైతే దగ్గు, జలుబు ఉన్నవాళ్ళతో మనం కాంటాక్ట్ లోకి వస్తామో షేక్హ్యాండ్స్ ఇలాంటివి ఇచ్చినప్పుడు వెంటనే మనము చేతులు శుభ్రం గా కడుక్కోవడం చేయడం మంచిది.  
 • అదే మాదిరిగా పిల్లల నుంచి కూడా పేరెంట్స్ కి ఈ ఇన్ఫెక్షన్స్ కామన్ గా పాస్ అవుతుంటాయి. కాబట్టి మంచి హైజీన్ చేతులు కడుక్కోవడం ఇలాంటివి చేస్తూ ఉంటె మనకు ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం చూసుకోవచ్చు. 

Flu Cold and Cough
జ్వరం

జలుబు మరియు ఫ్లూ ల నుండి ఉపశమనం పొందడానికి ఎంత ప్రయత్నించినా విశ్రాంతి లేనిదే ఫలితం ఉండదు. రోజులో ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. డీప్ గా గాలి పీల్చుకోవడం లాంటి  ఎక్సర్ సైజ్ ల వల్ల కూడా కఫం బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాణాయామం ప్రధానంగా యోగాలో మేలు చేస్తుంది. గొంతు నొప్పి అనేది ఫ్లూ జ్వరం లో ఉంటె ఉండవచ్చు కానీ  జ్వరం మాత్రం 101 డిగ్రీల కంటే ఎక్కువగానే ఉంటుంది. చాలా మందిలో ఈ లక్షణాలు 2 నుంచి 3 రోజుల వరకు బాధించి అవే తగ్గిపోతు ఉంటాయి. కాబట్టి మొదటి 2రోజుల వరకు పెద్ద చికిత్సలేమి అక్కరలేదు. పారాసిటమాల్ టాబ్లెట్ వంటివి తీసుకుంటే సరిపోతుంది. అయితే 3రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గకుండా వేధిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 

ఇలాంటి మంచి హెల్త్ ఇన్ఫర్మేషన్స్ మరియు మంచి హెల్త్ టిప్స్ కోసం HEALTH TIPS TELUGU ని ప్రతిరోజు పాలో అవుతూ ఉండండి, మీ కోసం మంచి మంచి హెల్త్ టిప్స్, ఫిట్నెస్ టిప్స్, ఫిట్నెస్ టిప్స్, ఆయుర్వేదానికి సంబందించిన లేటెస్ట్ విషయాలను తెలియజేయడం జరుగుతుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటె లేదా ఏవైనా సలహాలు తెలపాలనుకుంటే ఈ పోస్ట్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ ద్వారా తెలపవచ్చు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

ADVERTISEMENT