Dark circles(కళ్ల కింద) Under eyes(నల్లటి వలయాలు) | Health Tips Telugu
Under eyes Dark circles ఎన్ని క్రీములు పూసినా, ఎన్ని లేపనాలు రాసినా కళ్ళ కింద నలుపు తగ్గడం లేదని వాపోతూ ఉంటారు, మనలో చాలా మంది. కళ్ళ కింద నలుపు రంగు వలయాలతో అందవిహీనంగా కనిపించే కళ్ళు, ముఖంలో కనిపించే అందాన్ని పోగొట్టి చూడ్డానికి మనం అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అందరికి అనిపించేలా చేస్తాయి. అసలు కళ్ళ కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి. ఎలా వస్తాయి. వీటిని ఎలా తగ్గించుకోవాలి. మన కళ్ళ కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి, ఈ వలయాలను తగ్గించుకునేందుకు మనం ఎం చేయాలో అనేది తెలుసుకుందాం.
కళ్ల కింద ఉన్నటువంటి నల్లటి వలయాలు తగ్గించుకోండి (Remove Dark circles under eyes)
మన కళ్ళు ఎన్నో ఊసులని చెప్తాయి. మన కళ్ళు ఎన్నెన్నో భావాలను పలికిస్తాయి. సైలెంట్ గానే మన కళ్ళు ఎన్నో విషయాలను తెలియజేస్తాయి. అయితే కీలకమైన మన కళ్ళ కింద ఏర్పడే నల్లటి వలయాలు మాత్రం మనలో తలెత్తిన ఆరోగ్యం గురించి హెచ్చరిస్తాయి.
మన కళ్ళ కింద అసలు నల్లటి వలయాలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- చాలినంత నిద్ర లేకపోవడం, వత్తిళ్లు, డిప్రెషన్ వల్లే కళ్లకింద నలుపు పెరుగుతుందని అనుకుంటారు. అందులో కొంతమేరకు నిజం ఉంది.
- కంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ లు ఉన్నప్పుడు.
- ఎటాపిక్ డెర్మటైటిస్, ఎలెర్జి ల వంటి చర్మ వ్యాధులతో బాధపడుతున్నప్పుడు,
- రక్త హీనత, విటమిన్ ల కొరత ఉన్నప్పుడు.
- ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, తరచూ డీ హైడ్రేషన్ కి లోనవుతున్నప్పుడు.
- వయసు పైబడుతున్నప్పుడు.
Dark circles under eyes కళ్లకింద నల్లటి విలయానికి కారణాలు
- జెనిటిక్ గా వంశపారంపర్యంగా ఈ నలుపు అనేది సంక్రమిస్తుంది. కాబట్టి ఏడిట్రీన్ ఒకానొక కారణం.
- పిగ్మెంట్రి డిమాట్రేకేషన్ లైన్స్ అంటే మనకు మెడలో ఒక హారం ఉందనుకోండి ఒకవైపు నల్లగా ఉంటుంది, ఇంకోవైపు తెల్లగా ఉంటుంది. అలాగే చెస్ట్ మీద ఒక లైన్ ఉంటుంది. ఇట్లా డిమాట్రేకేషన్ లైన్స్ ఉంటాయి.
- ఐ స్ట్రైన్ ఏదైనా సరే స్ట్రైన్ అయినప్పుడు కంటి కింద చర్మం కింది పొరలో ఉన్న మెలనోసైట్స్ స్టిములేట్ అవుతాయి. సరిగ్గా నిద్ర లేకపోవడం. ఇది కాక ఎంవోరాల్మెంట్ పొల్యూషన్ అంటే స్మోక్, డస్ట్, హీట్, కోల్డ్, కెమికల్స్ ఇవన్నీ వలన కంటి కింద నలుపు వస్తుంది.
- ముఖ్యంగా అటపిక్ ఎక్సిమాలో కూడా ఈ కంటి చుట్టూ నలుపు రావడానికి అవకాశం ఉంది.
- కాంటాక్ట్ ఎలెర్జి డెర్మటైటిస్, ఎయిర్ బార్లు (గాలి) ద్వారా గాని కాంటాక్ట్ వల్ల గాని కళ్ళ కింద నలుపు వచ్చే అవకాశం ఉంటుంది.
- కొంతమంది కంటిన్యూస్ గా రఫ్ చేస్తూ ఉంటారు, కళ్ళ కింద దురద ఉన్నప్పుడు. కాన్స్టెంట్ రుబ్బింగ్, ప్రెక్షన్ వల్ల కూడా కంటి చుట్టూ నలుపు వచ్చే అవకాశం ఉంటుంది.
కళ్లకింద నలుపు వలయాలు తగ్గాలంటే ఎం చేయాలి.
- కళ్ళను హైడ్రేట్ చేసుకోవాలి అంటే మాయిశ్చరైజింగ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా త్రాగాలి.
- మినిమమ్ 6-8 గంటలు నిద్ర పోవడం చాలా మంచిది.
- మంచి ఫుడ్, ఎక్సర్ సైజ్ చేయడం చాలా మంచిది.
- డైట్ మంచిగా పాలో అవ్వండి, స్మోకింగ్, ఆల్కహాల్ తగ్గించడం మంచిది.
Dark circles under eyes treatment ట్రీట్మెంట్ ( చికిత్స)
కొన్ని కెమికల్ పిల్స్ ఇస్తారు. ఆర్జేనింగ్ కంటైనింగ్, విటమిన్ C కంటైనింగ్, గ్లైకాలిక్ కంటైనింగ్, ముఖ్యంగా ఇవే ఎక్కువగా వాడుతుంటారు. ఇంతేకాకుండా సింపుల్ గా కొన్ని ఆయింట్మెంట్స్ ఇస్తారు. క్రీమ్స్ గాని, ఆయింట్మెంట్స్ గాని, లోషన్స్ గాని ఇస్తారు. వీటిలో ఏముంటుందంటే జనరల్ గా ఒక మాయిశ్చరైజింగ్ క్రీమ్ అందులో ఉంటుంది. రెటినాయికాష్ క్రీమ్ వాడతారు. కోజిక్ యాసిడ్, ఆర్బిటిన్, Vitamin C, Vitamin E, Vitamin K అంతే కాకుండా ఈ మధ్యన టర్మరిక్ నుంచి తీసిన ఒకుర్కుమిన్ యాసిడ్, మిరియాలనుంచి తీసిన హైపరిన్, నలుపు తగ్గడానికి యాడ్ చేస్తారు. కొంతమంది ఇంకొంత అడ్వాన్స్ గా అల్ట్రాసోనిక్ ఎనేర్జి పెడుతుంటారు. ఎల్లో లేజర్స్, కొన్ని సందర్భాల్లో పిక్సెల్ లేజర్స్యూజ్ చేస్తారు. కానీ వీటివల్ల ఇన్సియల్ గా ఇంప్రూవ్ మెంట్ ఉంటుంది. కానీ తర్వాత మల్లి రీబౌండ్ ఫినామినా ఉండి మల్లి మిగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది.
కంటి కింద నల్లటి వలయాలని మాయం చేయడానికి మనలో చాలా మంది చాలా ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే క్రీముల్ని, లోషన్లని తరచూ పట్టిస్తూ ఉంటారు. అయితే వీటిలో హైడ్రో క్వినైన్, కోజిక్ యాసిడ్, ఆర్బిటిన్ వంటి పదార్దాలు ఉన్న క్రీములు కొంతవరకు ఫలితాన్ని ఇస్తాయి. కళ్లకింద నల్లటి వలయాలను తగ్గించుకోవడానికి తగినంత విశ్రాంతి చాలినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. మానసిక వత్తిళ్ళని తగ్గించుకోవాలి. గులాబీ రేకులని మెత్తగా నలిపి ఆ రసాన్ని తరచూ రాస్తుంటే కళ్లకింద నలుపు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. శ్రోబెర్రి పుచ్చకాయల గుజ్జుతో నిత్యం నల్లటి వలయాలపై పూస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. అనాస రసంలో ముంచిన దూదితో తరచూ నలుపుపై రుద్దడం వల్ల కూడా నల్లటి వలయాలు తగ్గిపోతాయి. బంగాళాదుంప, కీరదోషాల్ని చక్రాల్లా తరిగి రోజు కాసేపు కళ్లపై ఉంచుకోవడం వల్ల కూడా కంటి కింద నల్లటి వలయాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.
treatment of Dark circles under eyes-health-tips-telugu |
కుకుంబర్, పొటాటో రౌండ్ గా కట్ చేసేసి పెట్టుకోవడం వల్ల వీనిని ఫ్రిజ్లో పెట్టుకొని వాడుకోవడం వల్ల వాటి చల్లదనం వల్ల మంచిగా ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ డైట్ తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎం చేస్తాయంటే మన స్కిన్ లో ఫ్రీ రాడికల్స్ డెవెలప్ అయి డామేజ్ చేస్తుంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఆ ఫ్రీ రాడికల్స్ ని కంట్రోల్ చేసి స్కిన్ ని ఎక్కువగా డామేజ్ కాకుండా చూస్తాయి. కాబట్టి యాంటీఆక్సిడెంట్స్ లభించేవి క్యారెట్, కుకుంబర్, టమాటో, సిట్రస్ ఫ్రూట్స్, బెర్రీస్, బెర్బెర్రీస్, స్ట్రాబెర్రీస్, చెర్రీస్, నట్స్, గ్రీన్ లీప్ వెజిటబుల్స్ ఇవి డైట్ పరంగా కంటి వలయాలను తగ్గించడానికి చాలా మంచివి.
కళ్ళ కింద నలుపుని నల్లని వలయాలని మాయం చేయడానికి ఆధునిక వైద్యంలో చాలా చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సాధారణ ప్రక్రియలు మొదలుకొని లేజర్ చికిత్స, సర్జరీ వంటి అధునాతన చికిత్సలు వంటివి ఉన్నాయి. కంటికి సంబందించిన అలర్జీలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్య చికిత్స తీసుకోవాలి. ఎండ మూలంగా నల్లని వలయాలు వస్తున్నప్పుడు ఎండపొడ ఎక్కువగా తగలకుండా కళ్ళకు సన్ గ్లాస్, తలకు కాప్ పెట్టుకోవడం మేలు. గుంటకల్లు ఉన్నప్పుడు కంటి కింద చర్మం లోతుగా అనిపిస్తూ కంటి చుట్టూ ఒక నల్లని వలయం ఉన్నట్టుగా కనిపించడం మాములే. ఇలాంటప్పుడు కంటి కింద కొవ్వుల్ని నింపడం, డెర్మల్ పిల్లర్ ఇంజెక్షన్స్ తో మృదుకణజాలాన్ని నింపడం, అవసరమైతే బ్లేఫెరో ఫాస్టి, లేజర్ చికిత్సల సాయంతో కళ్లకింద నల్లటి వలయాలను ఇట్టె మాయం చేయొచ్చు.