Type Here to Get Search Results !

Translate

ADVERTISEMENT

Diabetes Diet (Diabetic patients కోసం)| Health Tips Telugu మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఆహార నియమాలు పూర్తి సమాచారం.

Diabetes Diet (Diabetic patients కోసం) | Health Tips Telugu మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Diabetes-Diet-(Diabetic-patients-కోసం)-Health-tips-telugu

షుగర్ తో బాధపడుతున్నప్పుడు ఎం తినాలన్నా సంకోశమే. ఎక్కడ చెక్కెర పెరుగుతుందో అని స్వీట్స్, పళ్ళు , మిఠాయిలు మొత్తంగా మానేస్తుంటారు. అన్నం కూడా మానేసి ఒట్టి చపాతీలు తినడానికి, రాగి ముద్దలు తినడానికే మొగ్గు చూపుతూ ఉంటారు. నిజానికి షుగర్ జబ్బు ఉన్నంత మాత్రాన ఆహారంలో కఠినమైన పత్యాలు పాటించాల్సిన అవసరం లేదు. కడుపునిండుగా తింటూనే షుగర్ ని చక్కగా అదుపులో ఉంచుకునేందుకు రోజూ వారి ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

మధుమేహాన్ని(Diabetes) అదుపులో ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన ఆహార నియమాలు

షుగర్ జబ్బు పేరులోనే తీపి. ఒక్కసారి దీని బారిన పడితే ఇక జీవితమంతా చేదే. రక్తంలో చెక్కెర శాతాన్ని అదుపులో ఉంచుకునేందుకు నిత్యం మందులు మింగాలి. తినే ఆహారంలో తీపి లేకుండా త్వరగా అరిగిపోని ఆహారాలను చేర్చుకోవాలి. వీటికి తోడు శరీరానికి చాలినంత శ్రమని కల్పిస్తుండాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మధుమేహం మన అదుపులో ఉంటుంది. అయితే షుగర్ తో పాదపడుతున్నప్పడు ఎం తినాలో ఎం తినకూడదో అన్న అనుమానాలు చాలా మందిని వేధిస్తుంటాయి. ఆ సందేహాలతోనే ఆహారంలో సవాలక్ష పత్యాలను పాటించడం మొదలుపెడతారు. అన్నం మానేస్తారు. ఒట్టి చెపాతీలనే తీసుకుంటారు. స్వీట్లు, తీపిపదార్దాలకు చివరికి పండ్లకు కూడా దూరంగా ఉంటారు. నిజానికి షుగర్ జబ్బుకి పత్యాలు పాటించాల్సిన అవసరం లేదు అన్ని రకాల ఆహారాలను తీసుకుంటూనే ఆహారంలో కొన్నీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. 

Diabetes (మధుమేహం) షుగర్ వ్యాధి ఉన్నప్పుడు ఎం తినాలి? ఎం తినకూడదు?

Oil-food-health-tips-telugu
Oil food

  • ముఖ్యంగా మనం ఆహారంలో నూనె వస్తువులు, కొవ్వు పదార్దాలు పూర్తిగా తగ్గించాలి. 
  • అన్నము ఎక్కువగా తినడం తగ్గించాలి అంటే అన్నం మోతాదును తగ్గించాలి. 
  • తీపి వస్తువులు పూర్తిగా మానెయ్యాలి. 
  • టీ కాఫి ల్లో షుగర్ వాడటం, స్వీట్స్, తేనె వస్తువులు, జామ్స్ ఇలాంటివన్నీ పూర్తిగా తగ్గించాలి. 
మనకు రకరకాల ఆహార దినుసులు, ఆహారపదార్దాలు ఉన్నాయి. రైస్ ని మనం పూర్తిగా మానేయాల్సిన అవసరం కూడా  లేదు. రాగులు, సజ్జలు, జొన్నలు, గోధుమలు ఇవన్నీ ఉన్నాయి. జనరల్ గా ఇప్పుడు మనకు మార్కెట్లో అన్ని పాలిష్ చేసినవే దొరుకుతున్నాయి. పాలిష్ చేసినవి కాకుండా పొట్టుతో కూడినవి అంటే రైస్ తినొచ్చు, కానీ అది పాలిష్ చేసినవి కాకుండా మనకు బ్రౌన్ రైస్, పొట్టు తక్కువ తీసిన రైస్ తీసుకుంటే, రైస్ ఒక్కటే మనం వాడుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లెమ్ ఉండదు. కానీ ఒకవేళ మనం పాలిష్ చేసిన రైస్ తీసుకుంటున్నట్లైతే ఒకపూట రైస్ తీసుకొని రెండోపూట అంటే రాత్రి పూట డిన్నర్ లో మాత్రం కచ్చితంగా గోధుమలు గాని, జొన్నలతో చేసింది గాని మనం తీసుకోవడం మూలాన మనకు అన్ని రకాల పోషకాలు అనేవి అందుతాయి. 

Diabetes షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఈ ఫ్రూట్స్ తో జాగ్రత్త.!

Fruits-should-not-be-eaten
Fruits should not be eaten

  • అరటిపళ్ళు
  • సపోటా
  • సీతాఫలం
  • ద్రాక్ష 
వీటిని మాత్రం కొంచెం తగ్గించి తీసుకోవడం మంచిది. అది షుగర్ లెవెల్స్ చూసుకొని తీసుకోవాలి. షుగర్ అధికంగా ఉన్నవాళ్లు వీటి జోలికి వెళ్లకపోవడమే, వీటిని తినకపోవడమే మంచిది. 

కానీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా రోజు వాళ్ళ ఆహారంలో ఒక రకమైన పండు కచ్చితంగా తీసుకోవచ్చు. 

ఈ ఫ్రూట్స్ షుగర్ వ్యాధి(Diabetes) ఉన్నవాళ్లు  తినొచ్చు.!

Fruits-that-diabetics-should-eat-health-tips-telugu
Fruits that diabetics should eat

  • జామకాయ 
  • బొప్పాయి
  • దానిమ్మ 
  • పుచ్చకాయ 
ఇలాంటివి రెగ్యులర్ గా వాళ్ళ ఆహారంలో కచ్చితంగా యాడ్ చేసుకోవాలి. అయితే పండ్ల రసాలు అంత మంచివి కాదు. ఎందుకంటే ఫ్రూట్స్ ని రసం గా చేసి దాన్ని ఫిల్టర్ చేసి తీసుకున్నప్పుడు దానిలో ఉన్న పీచు మొత్తం పోతుంది. డయాబెటిక్ పేసెంట్ కి రావాల్సిన అన్ని పోషకాలు అనేవి రావు. అదే యాజిటీజ్ గా పండు రూపంలో తీసుకున్నట్లయితే పీచుతో పాటు అన్ని పోషకాలు విటమిన్స్, మినరల్స్ అన్ని కరెక్ట్ గా అందుతాయి. 
  • పాత బియ్యం 
  • పాత గోధుమలు
  • రాగులు
  • సజ్జలు
  • జొన్నలు 
  • పాలు, 
  • పాలతో చేసిన వంటకాలు, 
  • సజ్జలు,
  • బార్లీ, 
  • కొర్రలు, 
  • జొన్నలు, 
  • మొక్కజొన్న, 
  • మరమరాలు, 
  • గోధుమలు, 
  • సేమియా 
ఇలాంటి వాటిని తీసుకోవడం మంచిది. అందుకే వీటిని తరచుగా తీసుకోవచ్చు. 


ఫ్రూట్స్ :
  • నిమ్మ, 
  • దానిమ్మ, 
  • ఉసిరి, 
  • ద్రాక్ష, 
  • జమ, 
  • బొప్పాయి, 
  • యాపిల్ 
ఇటువంటి పండ్లు మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుతాయి. వీటిని తరచు తీసుకోవాలి. 

మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు అన్నాన్ని మనల్సిన పని లేదు. పాత బియ్యాన్ని వండుకోవడము మంచిదే, బియ్యాన్ని పాలిష్ పట్టించకుండా వండుకొని తినడం మంచిది.

ఆకుకూరలను, కాయగూరలను ఎక్కువగా తినాలి. ఆహారంలో పీచుపదార్దాలు తప్పకుండ ఉండేట్లుగా చూసుకోవాలి. నిర్ణిత సమయాల్లో భోజనం చేయాలి. విందులు, ఉపవాసాలు పనికిరావు. తియ్యని పిండిపదార్దాలు, వేపుడు వంటకాల్ని బాగా తగ్గించాలి. 

సేమ్ అమౌంట్ అఫ్ ఫుడ్ ని షుగర్ పేసెంట్ ఎప్పుడు కూడా తీసుకోవాలి. సేమ్ టైం లో తీసుకోవడం మూలాన షుగర్ ఎచ్చుతగ్గులు జరక్కుండా ఉంటుంది. క్రమంగా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. అలాగే కొంతమంది వేసుకునే మెడిసిన్ కూడా కొంతమంది ఆహారం తిన్న తర్వాత వేసుకుంటారు. కొంతమంది తినే ముందు వేసుకుంటారు. ఆలా కాకుండా డాక్టర్ ఏ టైం కి అయితే మెడిసిన్ వేసుకోమన్నారో అది కరెక్ట్ గా ప్రతిరోజు అదే టైం కి వేసుకోవడం అలవాటుగా చేసుకోవాలి. ఆలా చేయడం మూలాన షుగర్ ఎచ్చుతగ్గులు అనేది మనం అరికట్టగలుగుతాము. 

Diabetes Diet Plan షుగర్ పేసెంట్స్ కి రోజువారి డైట్ ప్లాన్

Diet-plan-for-Diabetes-health-tips-telugu
Diet plan for Diabetes

ఉదయం పీసరట్టు గాని, ఇడ్లి గాని, తర్వాత నూనెలేని ఆహారపదార్దాలను తీసుకోవడం చాలా మంచిది. తర్వాత మధ్యాహ్నం మాత్రం రోస్ క్వాంటిటీ తక్కువ, కర్రీస్ ఎక్కువ తీసుకోవాలి. నూనెలు తక్కువ ఉండే కర్రీస్ తీసుకోవడం మూలాన షుగర్ పెరగకుండా ఉంటుంది. తర్వాత వెన్న తీసిన మజ్జిగ, పెరుగు లాంటివి రెగ్యులర్ గా వాడవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ జంక్ ఫుడ్ లాంటివి తినకూడదు. ఇంట్లోనే ఉడికించిన శనగలు గాని, పెసర్లు, అలసందలు, రాగులు, ఓట్స్, పచ్చి కూరగాయ ముక్కలు లాంటివి తీసుకోవడం మూలాన వాళ్ళు చాలా హెల్త్య్ గా ఉంటారు. షుగర్ మూలాన వచ్చే కాంప్లికేషన్స్ కూడా రాకుండా ఉంటాయి. నైట్ టైం బ్రౌన్ రైస్ గాని, జొన్నఅన్నం గాని, లేకపోతే పుల్కాలు లాంటివి తీసుకోవడం మూలాన షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. 

మధుమేహ బాధితులు నిత్యం రాగిమాల్ట్ ని తీసుకోవడం చాలా మేలు. మొలకెత్తిన రాగులలో C Vitamin ఎక్కువగా ఉంటుంది. కాల్షియం అధికంగా ఉంటుంది. పీచుపదార్థం కూడా ఉంటుంది. ప్రతిరోజు మూడు పూటలా పూటకు 1-2 స్పూన్ ల పొడి చొప్పున గ్లాస్ పాలలో గాని మజ్జిగలో గాని కలుపుకొని క్రమం తప్పకుండా త్రాగాలి. జొన్న పేలాలు, జొన్నరొట్టెలు, వేడివేడి మొక్కజొన్న గింజలు, మధుమేహులకు చాలా మంచిదని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. వీటిని తరచు తీసుకోవాలి. ప్రతిరోజు పండిన తియ్యని తాజా బొప్పాయి పండుని భోజనం తర్వాత నేరుగా గాని, తేనెతో కలుపుకొని గాని తినాలి. షుగర్ జబ్బుని ఈ అలవాటు అనేది మంచిగా అదుపులో ఉంచుతుంది. 

షుగర్ పేసెంట్స్ మొదటగా చేయాల్సింది ఏంటంటే ఒకవేళ అధిక బరువు ఉన్నట్లయితే వాళ్ళు కచ్చితంగా ముందు ఓవర్ వెయిట్ తగ్గాలి. బరువు తగ్గటం వలన షుగర్ అనేది కచ్చితంగా కంట్రోల్ లో ఉంటుంది. షుగర్ పేసెంట్స్ స్వీట్స్, లివర్, వేటమాంసము, కూల్డ్రింక్స్, అరటిపళ్ళు, సపోటా, సీతాఫలం, మామిడిపండు, ద్రాక్ష మరియు పాలిష్ చేసిన ఫుడ్ కి, జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. 

ఏదైనా ఆహారం తిన్న వెంటనే షుగర్ లెవెల్స్ రేజ్ అయ్యే దాని బట్టి గ్లైజెనిక్ ఇండెక్స్ అనేది కొలవడం జరుగుతుంది. రైస్ లో ఎక్కువ గ్లైజెనిక్ ఇండెక్స్ ఉంటుంది. స్వీట్స్ లో హై గ్లైజెనిక్ ఇండెక్స్ ఉంటుంది. కానీ వెజిటల్స్ లో తక్కువ గ్లైజెనిక్ ఇండెక్స్ ఉంటుంది. ఏదైతే హై గ్లైజెనిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ షుగర్ పేసెంట్స్ తక్కువ తీసుకోవాలి. తక్కువ గ్లైజెనిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం మూలాన షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ లో ఉంటాయి. తర్వాత క్యాలరీస్ విషయం లో చేసే పనిని బట్టి క్యాలరీస్ తీసుకోవాలి. షుగర్ పాసెంట్స్ ఎక్కువ పని చేయకుండా కూర్చొని ఉండే పని చేసేవారు అయితే వాళ్ళు తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారం తీసుకోవాలి. ఆ క్యాలరీస్ చేసే పని కన్నా ఎక్కువ పెరిగితే షుగర్ లెవెల్స్ కచ్చితంగా పెరిగిపోతాయి.

మెంతులని మధుమేహులకు ఒక వరంగా చెప్పుకోవచ్చు. మెంతి పొడి బ్లడ్ షుగర్, బ్లడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. రోజుకి 26 గ్రాముల మెంతులు 13 గ్రాములు మధ్యాహ్నం భోజనానికి ముందు మల్లి 13 గ్రాములు రాత్రి భోజనానికి ముందు నీళ్లతో గాని, మజ్జిగతో గాని తీసుకోవాలి. మెంతుల పొడి తీసుకున్న 15 నుండి 20 నిమిషాల అనంతరం భోజనం చేయాలి. ఇది చెక్కెర వ్యాధికి వాడే మందుల పరిమాణాన్ని తగ్గిస్తుంది. అలాగే శరీర బరువు పెరగకుండా చూసుకోవాలి. ప్రతి రోజు కనీశం 30 నిమిషాల సేపు అయినా వ్యాయామం చేయాలి. నడవడం, జాగింగ్, సైకిలింగ్, బ్యాడ్మింటన్, ఈతకొట్టడం మంచిది. వీలైతే ధనురాసనం, పచ్చిమత్తాసనం, సర్వాంగాసనం వంటి ఆసనాలని సాధన చేయడం మరి మంచిది. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటె షుగర్ జబ్బు చక్కగా అదుపులో ఉంటుంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

ADVERTISEMENT