Type Here to Get Search Results !

Translate

ADVERTISEMENT

Vitamin B12 Deficiency Symptoms మరియు దీనికి గల కారణాలు, ఈ లోపాన్ని అధిగమించే మార్గాలు

Vitamin B12 Deficiency Symptoms, కారణాలు, మార్గాలు | Health Tips Telugu

Vitamin-B12-Deficiency-Symptoms-కారణాలు-మార్గాలు-Health-Tips-Telugu

పోషక ఆహరం అంటే పిండి పదార్దాలు,మాంసకృత్తులు, క్రొవ్వుల్ని సమపాళ్లలో తీసుకోవడమే అని అనుకుంటారు మనలో చాలా మంది. కానీ వీటితో పాటు విటమిన్ లు, ఖనిజలవణాలు వంటి సూక్మపోషకాలు కూడా మన శరీరానికి తగినంత ఎప్పటికప్పుడు అందుతూ ఉండాలి. సూక్ష్మ పోషకాలు సరిగ్గా అందకపోతే Vitamin B12 లోపాలు పెను శాపాలుగా మారతాయి. ఇవాళ మనలో చాలా మందిలో Vitamin B12 లోపము అనేది ఒక పెద్ద సమస్యగా కనిపిస్తుంది. నేపథ్యంలో Vitamin B12 లోపించడానికి కారణాలు, ఈ లోపాన్ని అధిగమించే మార్గాన్ని గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Vitamin B12 Deficiency Symptoms ( లక్షణాలు )

Vitamin B12 బి విటమిన్ గ్రూప్ లో ప్రధానమైనది ఇదే. మెదడు, నాడి వ్యవస్థ చక్కగా పనిచేయడానికి కారణమయ్యే విటమిన్ ఇది. అంతకంటే ముఖ్యంగా రక్తం తయారీలో కూడా Vitamin B12 ది అతి ముఖ్యమైన పాత్ర. అందుకే Vitamin B12 లోపం అనేది శరీరంలో మెదడుకు రక్తానికి సంబందించిన సమస్యలకు దారితీస్తుంది. మాంసాహారంలో మాత్రమే లభించే Vitamin B12 కొరత అనేది ఇవాళ పిల్లల నుండి పెద్దలదాకా అందరిలోనూ కనిపిస్తుంది. 

జ్ఞాపకశక్తి
జ్ఞాపకశక్తి

 • మన శరీరానికి తగినంత Vitamin B12 లభించనప్పుడు జ్ఞాపకశక్తి తగ్గుముఖం పడుతుంది. 
 • అల్జీమర్స్ వంటి మతిమరుపు సమస్యలు మొదలవుతాయి. 
 • కండరాలను నిర్వీర్యం చేసే మల్టిపుల్ క్లిరోసిస్, డిప్రెషన్, ఆందోళనలు వంటి మానసిక చికాకులు, హార్టిజం, గుండె జబ్బులు, క్యాన్సర్లు, సంతాన లోపాలు ఇలా చాలా సమస్యలు Vitamin B12 లోపం వల్ల కనిపించడం జరుగుంది.
 • Vitamin B12 అనేది చాలా ముఖ్యమైన విటమిన్. RBC సైజ్ గాని, నరాలలో గాని, నెర్వ్ గాని వీటన్నిటి మెటబాలిజం కి, గ్రోత్ కి Vitamin B12 అనేది కచ్చితమైన అవసరం ఉంది. 
 • వీటి డెఫిసిఎన్సీలో RBC కానాల సైజ్ పెరగడం, 
 • ఎనిమియా రావడం, 
 • చాలా ఏళ్ళ తరబడి Vitamin B12 Deficiency ఉంటె నరాలు ఎఫెక్ట్ అవడం జరుగుంది. 
 • సరైన సమయంలో సరైన రీప్లేస్మెంట్ చేయకపోతే నరాలు డామేజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. 
 • Vitamin B12 Deficiency symptoms మెయిన్ గా అనీమియా తోనే ప్రెజెంట్ అవుతాయి. కానీ అది గనుక 5 నుంచి 6 ఏళ్ళ తరబడి ఈ డెఫిషియెన్సీ కంటిన్యూ అయితే లేదా 7 నుంచి 8 ఏళ్ళ తరబడి కంటిన్యూ అయితే అప్పడు నరాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. అంటే కాళ్లు మొద్దుబారినట్లు అవడం, కాళ్లలో శక్తి లేకపోవడం, నరాల పరంగా కూడా సరైన ట్రీట్మెంట్ తో సరైన టైం లో ఇవ్వకపోతే ఒక వ్యాధిలాగా ఇది ప్రభలోచ్చు.
 • వెజిటేరియన్స్ లో చాలా కామన్ గా ప్రబలే డెఫిసియెన్సీ B12. ముఖ్యంగా వేగాన్స్ అంటారు. అంటే వాళ్ళు ఎగ్ కూడా తీసుకోరు. ఎలాంటి నాన్వెజ్ తీసుకోరు. వీళ్ళలో B12 Deficiency ఉండే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ. 
 • నాన్వెజ్ సరిగ్గా తీసుకున్నా కూడా కొంతమందిలో కొన్ని రకాల ప్రేగులో వ్యాధిలో B12 మనం నోటితో ఇస్తున్నా కూడా అంటే మనం తినే ఫుడ్ లో ఉన్నా కూడా బాడీ కి ఇలాంటి కండిషన్స్ లో ఎనిమియా అంటారు. ఈ కండిషన్స్ లో B12 ని బాడీ అబ్జార్వ్ చేసుకొనే స్థితిలో ఉండదు. అలంటి కండిషన్స్ లో కూడా  B12 డెఫిసియెన్సీ ఉంటుంది.

B12 విటమిన్ లోపాన్ని డాక్టర్లు నిశ్శబ్ద సునామిగా పేర్కొంటారు. మన శరీరంలో తగినంత B12 విటమిన్ లేనప్పుడు అనేక సమస్యలు చుట్టుముడతాయి. నీరసం, నిస్సత్తువ, బలహీనత, మాటలు త్వరగా రాకపోవడం, బరువు తగినంత లేకపోవడం, కదలికలు సరిగ్గా లేకపోవడం, వణుకు, అనియంత్రిత కదలికలు ఇలా అనేక కదలికలు కనిపిస్తుంటాయి. మన వొంట్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు Vitamin B12 లోపం ఉందేమోనని అనుమానించాలి. పిల్లల్లో బాగా అలసట కనిపించిన, రక్తహీనత కనిపించిన, మతి మెరుపు, జ్ఞాపకశక్తి లోపాలు కనిపించినా కూడా Vitamin B12 లోపం ఉందేమోనని ఒకసారి పరీక్షించాలి. ఎందుకంటే ప్రధానంగా రక్తానికి, మెదడు, నాడీవ్యవస్థల ఆరోగ్యానికి సంబంధించి Vitamin B12 పాత్ర అత్యంత ప్రధానమైనది. 

B12 Deficiency కి క్రానిక్ అంటే చాలా ఏళ్ళ నుంచి యాంటాసిడ్ అంటే యాసిడ్ సప్రెసివ్ మెడిసిన్ తీసుకునే వాళ్లలో కూడా B12 Deficiency చూస్తున్నాం. ఎందుకంటే కొంత అమౌంట్ అఫ్ యాసిడ్ కడుపులో అనేది ఇంపార్టెంట్. బేసిగ్గా మనం తినే ఫుడ్ లో ఫుడ్ డైజెస్ట్ అవడానికి యాసిడ్ అవసరం. యాసిడ్ సప్రెసెన్ అనేది కొన్ని రోజుల పాటు కొన్ని మాక్సిమం కొన్ని వరాల పాటు మాత్రమే తీసుకోవాలి. ఇట్లా నెలలు పాటు తీసుకుంటే రకరకాల విటమిన్ డెఫిషియెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్కహాలిక్స్ లో కూడా డెఫిసియెన్సీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే జీర్ణించుకునే శక్తి తక్కువగా ఉంటుంది. జీర్ణశాక అబ్జార్వ్ చేసుకునే దానికి అంత ఐడియల్ గా ఉండదు. ఆల్కహాలిక్స్ లో ఏమవుతుందంటే ప్రోటీన్ శాతం తగ్గడం వల్ల ఘట్ ఇదిమో అంటారు. అంటే ఇంటర్స్టెల్ వాల్ లో ఒకరకమైన వాపు మొదలవుతుంది. ఈ Vitamin B12, Vitamin B, ఇవన్నీ ఫుడ్ లో తీసుకున్న తర్వాత కూడా అవి సరిగ్గా జీర్ణమై బాడీకి అందవు. 


Vitamin B12 కోసం ఆహారం

Vitamin-B12-food
Vitamin B12 food

Vitamin B12 కొరతను మనం ఆహార పరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తేలికగానే అధిగమించవచ్చు. పాలు, పెరుగు, వెన్న, చేపలు, గుడ్లు, మాంసం, ఇలా జంతు సంబంధిత ఆహారాలలో Vitamin B12 లభిస్తుంది. అందుకే తినే ఆహారంలో ఇవి ఉండేలా జాగ్రత్త పడటం ద్వారా Vitamin B12 లోపం రాకుండా చూసుకోవచ్చు. మాంసాహారులతో పోలిస్తే శాకాహారుల్లో Vitamin B12 లోపం ప్రధానంగా కనిపిస్తుంటుంది. కాబట్టి శాకాహారం తీసుకునేవారు పాలు, పాల ఉత్పత్తుల్ని ఎక్కువగా తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇక పిల్లల్లో Vitamin B12 లోపం ఉందా లేదా అనే విషయం తల్లిదండ్రులకు తెలిసే అవకాశం తక్కువ ఏడాదిలోపు పిల్లల్లో 0.5 మైక్రో గ్రాములు, ఏడాది నుండి 13 ఏళ్లలోపు పిల్లల్లో 0.9 నుండి 1.8 మైక్రో గ్రాముల దాక Vitamin B12 లెవెల్స్ ఉండాలి. రక్త పరీక్షా ద్వారా పిల్లల్లో Vitamin B12 లోపం ఉందని తెలిస్తే విటమిన్ సప్లిమెంట్లని తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించే ప్రయత్నం చేయవచ్చు. Vitamin B12 ప్రస్తుతం ఇంజక్షన్ ల రూపంలో కూడా లభిస్తుంది. 

ఒకవేళ నాన్వెజ్ తీసుకునే కమ్యూనిటీ అయితే కచ్చితంగా అది వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అదే వెజిటేరియన్స్ అయితే నాన్వెజ్ కి చేంజ్ చేయడం చాలా కష్టం. వాళ్ళు మాత్రం కచ్చితంగా సప్లిమెంట్లని తీసుకోవాలి. ఎంతకాలం తీసుకోవాలనేది సిట్యువేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ మెడిసిన్స్ టాబ్లెట్స్ రూపంలో ఇవ్వచ్చు. ఇంజెక్షన్స్ రూపంలో ఇవ్వచ్చు. ఎగ్ తీసుకునేవారు బాయిల్డ్ ఎగ్ లో కచ్చితంగా Vitamin B12ఉంటుంది. నాన్వెజ్ తీసుకోగలిగితే కంటిన్యూ చేయడం మంచిది. 

ఎదిగే వయస్సులోని పిల్లలకి వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి Vitamin B12 చాలా అవసరం. తగినంత Vitamin B12 అందకపోతే అది పిల్లల్లో ఎదుగుదల లోపాలను రక్తహీనత, మెదడు, నాడి సంబంధిత సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లలకు చిన్నవయస్సు నుంచి పాలు, పాల ఉత్పత్తుల్ని ఎక్కువగా అందించాలి. గుడ్లు, చేపలు, మాంసాహారాలను తరచుగా అందిస్తుంటే B12 లోపం తలెత్తకుండా నివారించవచ్చు. B12 లోపం మరీ తీవ్రంగా ఉన్నప్పుడు సప్లిమెంట్లు, ఇంజెక్షన్ల రూపంలో Vitamin B12 ని తీసుకోవడం ద్వారా B12 కొరతను తేలికగా అధిగమించవచ్చు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

ADVERTISEMENT