Type Here to Get Search Results !

Ayurvedic వైద్యం (treatment) for weight loss- అధిక బరువు తగ్గడానికి ఆయుర్వేద చికిత్స

Ayurvedic వైద్యం (treatment) for weight loss | Health Tips Telugu ఆయుర్వేదంతో అధిక బరువు తగ్గించుకోండి.

weight-loss

Ayurvedic treatment for weight loss బరువు నేడు మన పాలిట గుదిబండలా మారుతుంది. దేహాన్ని మొత్తంగా వ్యాధుల కుంపటిలా మార్చేస్తు, చాపకింద నీరులా మన శరీరాన్ని చుట్టబెడుతుందిగుండె జబ్బులుహైబీపీ, కాన్సర్ షుగర్ వ్యాధి, విపత్తులు, ప్రమాదకరమైనటువంటి ఇలాంటి జబ్బులు ప్రత్యక్షంగానో, లేదా పరోక్షంగానో మన బరువుతో ముడిపడి ఉన్నవే అని డాక్టర్లు చెప్తారు. ఒక తీరు తెన్నూ లేని ఆహారపు అలవాట్లు, శరీరానికి సరైన శ్రమ లేకపోవడం, నిరంతరం వత్తిళ్లతో కూడిన జీవనం, బద్దకపు జీవనశైలి ఇవన్నీ నేడు మనకు అధిక బరువుని శాపంగా అంటగడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో బరువుని సింపుల్ గా వదిలించే ఆయుర్వేద మార్గాల గురించి ఈ ఆర్టికల్ లో తెలియజేయడం జరుగుతుంది. 

ఎంత పెద్ద చెట్టుకు అంత గాలి వేస్తుంది అనే సామెత మనకు తెలిసిందే. మన శరీరానికి కూడా అలంటి సామెతనే వర్తిస్తుంది. బరువు అనేది పెరుగుతూ పోతున్నకొద్దీ మన శరీరానికి వచ్చే సమస్యలు కూడా అలానే పెరుగుతూ పోతుంటాయి. స్థూలకాయం రావడం, అధిక బరువు పెరిగిపోవడం, అన్నవి ఈ రోజుల్లో మన ఆరోగ్యాన్నీ పాడుచేస్తున్నాయి. చాలా మంది పెరిగిన బరువుని ఎలాగైనా తగ్గించుకొవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఉపవాసాలు, డైటింగ్, ఆహారంలో మార్పులు. యోగాసనాలు, వ్యాయామాలు, ఎరోబిక్స్ ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా చాలా సందర్భాల్లో బరువు తగ్గడం అనేది ఒక అసాధ్యంగానే ఉంటుంది. కష్టపడి ఎదో ఒకలాగా 1kg బరువు తగ్గితే కొన్ని రోజులకే 5-6kg ల బరువు పెరిగిపోతూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన బరువు తగ్గని వారికీ ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేకమైన చికిత్సలు పరిస్కారాలు ఉన్నాయి. 

Over Weight అతిస్థవ్ల్యం

అతిస్థవ్ల్యం అంటే ఓవర్ వెయిట్, ఓవర్ వెయిట్ యొక్క స్టేజ్ దాటితే అతిస్థవ్ల్యం అంటాం. BMI ఇండెక్స్ అనేటువంటిది మనకు ఉండవలసినటువంటి విధి విధానాల్ని మనం శాస్త్రీయంగా నిర్దారించేది. BMI ఇండెక్స్ అనేటువంటిది Body weight, Hight యొక్క స్క్వైర్ ని భాగించడం ద్వారా వచ్చేటువంటి అంశమె BMI ఇండెక్స్. ఇది 21 వరకు ఉండొచ్చు. 18-21 నార్మల్ కింద చెప్తాము. 21 దాటి 25 వరకు ఉన్నట్లయితే ఓవర్ వెయిట్ అని, 25 దాటితే ఓవర్ వెయిట్ నుండి ఒబేస్ లోకి మారిపోతారు. ఈ BMI ఇండెక్స్ ద్వారా మనం గుర్తించాలి. 

Over Weight వల్ల వచ్చే వివిధ రకాల ప్రాబ్లెమ్స్ 

heavy-Weight-health-tips-telugu
Heavy  Weight problem

 • గ్యాస్ట్రో ఇంట్రస్ట్రోయినల్ ప్రాబ్లెమ్స్ 
 • కార్డియా ప్రాబ్లెమ్స్ 
 • మస్కిలో స్కెలిటన్ ప్రాబ్లెమ్స్ 
 • స్కిన్ ప్రాబ్లెమ్స్ 
పిల్లలకి రావడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే 

Over Weight  కి ప్రధాన కారణాలు

Junk-food-health-tips-telugu
Junk food

 • అధికంగా జంక్ ఫుడ్ తీసుకోవడం
 • చాకోలెట్స్ అధికంగా తీసుకోవడం
 • తగిన సమయానికి భోజనం చేయకపోవడం 
 • ఏదైనా ఆహారం తింటున్నప్పుడు అధికంగా తీసుకోవడం 
 • హై క్యాలరీ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం
 • స్వీట్స్ ఎక్కువగా తీసుకోవడం 

ఒబెస్ వల్ల ఏమొస్తుంది. మీ బరువుకు మించి 58% ఉన్నట్లయితే మీకు షుగర్ వ్యాధి వస్తుంది. 21% మంది ప్రజలకి కార్డియాక్ ప్రాబ్లెమ్స్ రావడానికి ఆస్కారం ఉంది. 3-5% ప్రజలకు స్కిన్ కి సంబందించిన ప్రాబ్లెమ్స్ రావడానికి ఆస్కారం ఉంది. లంగ్స్ ప్రాబ్లెమ్స్, మస్కిలో స్కిల్టెన్ ప్రాబ్లెమ్స్ రావడానికి అవకాశం ఉంది. 

 • బరువు తగ్గాలనుకున్నప్పుడు మనందరికీ ముందుగా తేనె, నిమ్మరసమే గుర్తుకొస్తాయి. గోరువెచ్చటి నీళ్లలో కొద్దిగా తేనె కొంచెం నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారని నమ్ముతారు మనలో చాలా మంది. ఇందులో నిజం ఉన్నా లేకపోయినా తేనె, నిమ్మరసంతో మన ఆరోగ్యానికి మేలే జరుగుతుంది అనటంలో సందేహం లేదు. 
 • అధిక బరువుని వదిలించుకునేందుకు పళ్ళు, పళ్ళ రసాలను నిత్యం తీసుకోవడం మేలు చేస్తుంది. అలాగే ఆకుకూరలు, కాయగూరలు
 • ముఖ్యంగా చెప్పాలంటే బరువుని తగ్గించేటువంటి గుణం క్యాబేజి కి ఉంది. క్యాబేజీని నిత్యం సలాడ్స్ రూపంలో తీసుకుంటూ ఉంటె క్రమంగా బరువు తగ్గే అవకాశం ఉంది. 
 • అలాగే దాల్చినచెక్క, జీలకర్ర, మిరియాలు, అవాలు వంటి దినుచులకు ఒంట్లో కొవ్వుని కరిగించే గుణం ఉంది. రోజు వారి వంటల్లో వీటిని ఒక భాగంగా చేసుకోవడం ద్వారా అధిక బరువుని క్రమంగా వదిలించుకోవచ్చు. 
 • మనం వంటల్లో ఉపయోగించే వెల్లుల్లి లో అలిసిన్ అనే రసాయనం ఉంటుంది, ఈ రసాయనానికి బరువుని తగ్గించేటువంటి గుణం ఉంది. ప్రతి రోజు వెల్లుల్లిని ఆహారంగా ఎదో ఒక రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకుంటే అధికంగా పెరిగే బరువు నుంచి త్వరగానే బయట పడవచ్చు. 
 • పచ్చి మిర్చి లోని కాప్సిన్ అనే రసాయనానికి ఒంట్లో క్యాలరీలను కరిగించే గుణం ఉంది. పచ్చి మిర్చి ని తీసుకోవడం వల్ల మన ఒంట్లో మెటబాలిజం రేటు పెరుగుతుంది. 

దీనికి మనం ఎం చేయాలి?

 • టైమ్ ప్రకారం భోజనం చేయండి. 
 • పిజ్జా, బర్గర్స్ ని తినడం ఆపండి. 
 • వీలైనంత వరకు స్టోర్డ్ ఫుడ్ ని పక్కన పెట్టండి. 
 • స్వీట్స్ ని చాలా వరకు తక్కువగా  తీసుకోండి. 
 • పెరుగుని కొంచెం తగ్గించండి. 
 • రోజు 1 గంట మీరు కంపల్సరీగా వ్యాయామాన్ని చేయండి. 
 • ఇవి చాలా సున్నితమైనటువంటి విషయాలు. సూర్య నమస్కారాలు 30 నుండి 40 నిముషాలు చేయడం ద్వారా ఈ అతిస్థవ్ల్యం కి దూరంగా ఉండవచ్చు. 
వీటి ద్వారా మనకు కంట్రోల్ కాకపోయినట్లైతే అప్పుడు మీకు వైద్య పర్యవేక్షణ అవసరం. 

ఆయుర్వేద వైద్యం 

 • నావక గుగులు 
 • కాంచనార గుగులు
 • స్టౌల్యహర కషాయము 
 • లవణ తైలాన్ని అభ్యంగనము 
 • రస సిందూరము 
 • పూర్ణవ మండురము 
 • ఆరోగ్య వర్దిని 
 • శిలాజిత్తు అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి మినరల్ కాంపౌండ్ ఈ అతిస్థవ్ల్యం ఒబేసిటీ లోపల మంచి ఔషధం. చాలా ఎకనామిక్ గా కూడా దొరుకుతుంది. దీన్లో రోజు గోమూత్రంలో శుద్దిచేయబడ్డటువంటి శిలాజిత్తును మనము త్రిపలచూర్ణం చేత ఒక 40 రోజులు దీన్ని రెగ్యులర్ గా తీసుకొని డైట్ ని పాటించినట్లయితే మీరు 3 నెలల్లో 5 నుండి 8 kg లు తగ్గుతారు. 

మనలో చాలా మందికి ఉదయం లేవగానే టీ త్రాగే అలవాటు ఉంటుంది. ఇలాంటప్పుడు మాములు టీ కి బదులుగా అల్లం టీ ని తీసుకోండి. అల్లం టీని త్రాగడం వల్ల ఒంట్లో ఉన్న వేడిని పెంచే గుణం ఉంది. దీనిని త్రాగడం వలన సహజంగానే మన ఒంట్లో ఉన్న క్యాలరీలు ఖర్చు అవుతాయి. బరువు తగ్గే అవకాశము పెరుగుతుంది. అధిక బరువు తో  సతమతమయ్యే వాళ్ళు రోజు వారి ఆహారంలో ఉలవలని ఒక భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఉలవలు ఒంట్లో వేడిని పుట్టించి బరువుని తగ్గిస్తాయి. 

బరువు తగ్గాలనుకొని అన్నము మానేయాల్సిన పని లేదు. బ్రౌన్ రైస్ ని అన్నానికి బదులుగా  వాడుకోవచ్చు. మాములు అన్నం తో పోలిస్తే బ్రౌన్ రైస్ లో పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయి. పళ్ళ రసాల లోకి కాస్తంత అలోవెరా జెల్ ని కలిపి తీసుకోవడం వల్ల ఒంటి బరువుని సునాయాసంగా తగ్గించుకోవచ్చు. జీలకర్ర, ధనియాలు, సోంపు ఈ మూడింటిని అర టీ స్పూన్ చొప్పున తీసుకొని ఒక గ్లాస్ నీళ్లలో బాగా మరిగించి కషాయంగా చేసుకొని నిత్యం గోరువెచ్చగా త్రాగుతుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఉప్పు, పులుపు, కారం, చేదు,తీపి, ఒగరు, ఈ షడ్రుచులకు సమంగా ప్రాధాన్యం ఇవ్వాలి. రుచి పేరుతో కొన్నింటికే పరిమితమైతే జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బరువు తగ్గనప్పుడు డాక్టర్ సలహా మేరకు ఆయుర్వేద ఔషధాలను కొంతకాలం పాటు వాడాల్సి ఉంటుంది. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad