Fenugreek Seeds (మెంతులు) health benefits | Health Tips Telugu
Fenugreek Seeds నిత్యం మనం వంటల్లో ఎన్నో రకాల దినుసుల్ని వాడుతూ ఉంటాము. కానీ పరిశోధకులు పరిశోధన చేసి వాటితో కలిగే మేలు గురించి చెప్పే వరకు వాటి విశిష్టత మనకు అర్ధం కాదు. రోజు మనం వంటల్లోకి వాడుకునే మెంతులు షుగర్ జబ్బుని అదుపులో ఉంచుతాయంటే ఆశ్చర్యపోతాం. ఒక్క మధుమేహమే కాదు, అధిక బరువు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు మెంతులు చక్కటి పరిస్కారం.
మెంతులు మేలిమి బంగారు వర్ణంలో మెరిసిపోయే ఈ వంటదినుసుల్ని మన ఆరోగ్యం పాలిట అమృత గుళికలనే చెప్పుకోవాలి. Fenugreek Seeds ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు సంజీవని ఔషధంలా పనిచేస్తాయి. మెంతులు మన శరీరంలో తగినంత వేడిని ఉత్పన్నం చేస్తాయి. వాత, కఫాన్ని తగ్గిస్తాయి. మంతులు మన జీర్ణ వ్యవస్థను శక్తివంతం చేస్తాయి. మలబద్దకం, అధిక కొలెస్ట్రాల్, షుగర్ వ్యాధి, అధిక బరువు సమస్యల్ని బాగా తగ్గిస్తాయి. మెంతులు మానవ శరీరంలోని విషాలను బయటకు పంపించి మన శరీరాన్ని ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉంచడంలో బాగా ఉపయోగపడతాయి. వేల సంవత్సరాలుగా వాడుకలో ఉన్న ఆయుర్వేదం, మెంతులు, మెంతికూరలు ప్రతిరోజు వాడమంటుంది.
Fenugreek Seeds (మెంతులు) వాటి యొక్క గుణాలు మరియు మెంతుల్ని ఎలా వాడాలి?
మనకి వంటింట్లో ఉండేటువంటి రకరకాల పదార్దాలు చాలా సమస్యలను తేలికగా పరిష్కరించడానికి ఉపయోగపడుతుంటాయి. అలంటి వాట్లలో మెంతులు, ఈ మెంతులు చేదు రుచితో ఉంటుంది. అలాగే ఇవి ఉష్ణ వీర్యాన్ని కలిగి ఉంటుంది. రుక్ష గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ మూడు గుణాల వల్ల దీనిలో కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి ఔషధగుణాలు ఉంటాయి. ఈ మెంతులను ఔషధం గా వాడుకోవడానికి వాటిని యాజిటీజ్ గా వాడుకోవచ్చు. లేదా వేయించి పొడి చేసి చూర్ణం లాగా వాడుకోవచ్చు. ఇంకా వీటిని నానబెట్టి కూడా వాడుకోవచ్చు. అలాగే కొన్ని కొన్ని సమస్యల్లో మెంతుల్ని ఒక కాషాయం లాగా కాసుకొని ఔషధం గా వాడుకోవచ్చు. ఉండేటువంటి సమస్యను బట్టి, బలాన్ని బట్టి డొసేజ్ మారుతూ ఉంటుంది. చూర్ణం అయితే 2 నుంచి 5 గ్రాముల పరిమాణంలో వాడుకోవాలి. కాషాయం గా వాడుకున్నప్పుడు ఒక 30 నుంచి 100 మిల్లి లీటర్ల వరకు అవసరాన్ని బట్టి ఔషధం గా వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ మెంతులలో ఉండేటువంటి గుణాల్లో విరేచనాలు అయినప్పుడు, కడుపు ఉబ్బరం గా ఉన్నప్పుడు ఈ మెంతులు వాడినట్లైతే వాటిని తగ్గించే గుణం ఉంటుంది. అలాగే తల్లిపాలను ఉత్పత్తి చేసే గుణం కూడా ఈ మెంతుల్లో బాగా ఉంటుంది. మధుమేహాన్ని తగ్గించే గుణం, బరువుని తగ్గించే గుణం, P.C.O.D లాంటి సమస్యను తగ్గించేటువంటి గుణం, ఇలా మంచి మంచి గుణాలు ఈ మెంతుల్లో ఉన్నాయి. సమస్యను బట్టి దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకొని కరెక్ట్ గా వాడుకున్నట్లైతే సమస్యను తేలిగ్గా పరిస్కారం చేసుకోవచ్చు.
షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు Fenugreek Seeds (మెంతులని) ఎలా తీసుకోవాలి.
మెట్ ఫార్మింగ్ ఈ ఔషధం మధుమేహుల పాలిట సంజీవని లాంటిది. మెంతుల్లోనే ఇంతటి కీలకమైన ఔషధ మూలాలు ఉన్నాయి. మెంతుల్లోని కౌమారిన్, ట్రైగోనెల్లిన్ అనే రసాయనాలు షుగర్ వ్యాధిని మంచిగా అదుపులో ఉంచుతాయి. మధుమేహం తో బాధపడుతున్నప్పుడు నిత్యం కొన్ని మెంతులను నీళ్లలో నానబెట్టుకొని తీసుకోవడం, లేదా రోజు 2చెంచాల మెంతిపొడిని నీటితో గాని, పాలతో గాని తీసుకోవడం వల్ల చెక్కెరవ్యాధి చక్కగా అదుపులో ఉంటుంది.
కొలెస్ట్రాల్ ఉన్నవాళ్లు Fenugreek Seeds (మెంతులని) ఎలా తీసుకోవాలి.
కొలెస్ట్రాల్ తో బాధపడేవారు రోజుకు 10 నుంచి 20 గ్రాముల మెంతులని నీళ్లతో లేదా వెన్నతీసిన మజ్జిగతో కలిపి తీసుకుంటే ప్రమాదకరమైన (L.D.L) కొలెస్ట్రాల్ అనేది తగ్గినట్లుగా అధ్యయనాల్లో తేలింది.
వివిధ రకాల సమస్యలకు Fenugreek Seeds (మెంతులు)
- తల్లిపాల వృద్దికోసం ప్రసవించిన తర్వాత మెంతులను వేయించి పొడిలాగా చేసుకోవాలి. సుమారుగా ఒక 100 గ్రాముల పరిమాణంలో మెంతులను పొడి చేసుకొని ఒక 100 గ్రాముల బెల్లాన్ని కూడా పొడి చేసి ఈ మెంతి పిండిని బెల్లాన్ని కలిపి ఒక లడ్డులాగా చేసుకోవాలి. లడ్డులాగా చేసుకొని ప్రసవించినటువంటి స్త్రీ కి రెండు పూటలా ఒక లడ్డు ఇస్తున్నట్లైతే తల్లిపాలు వృద్ధి చెందడానికి ఈ మెంతుల లడ్డు బాగా సహాయకంగా ఉంటుంది.
- అలాగే కడుపు ఉబ్బరంగా ఉన్న వాళ్లకు అంటే కడుపులో వాయువులు పేరుకున్నప్పుడు, అజీర్నంగా ఉన్నపుడు మెంతులు బాగా ఉపయోగకరంగా ఉంటాయి. ఎలాంటి సమస్య ఉన్నప్పుడు మెంతుల్ని కొద్దిగా పెరుగులో గాని మజ్జిగలో గాని నానబెట్టి ఆ మెంతులని తినాలి. అలా తిన్నప్పుడు కడుపులో ఉన్నటువంటి వాయువులు తగ్గి ఉబ్బరం తగ్గుతుంది. అజీర్ణం కూడా బాగా తగ్గుతుంది.
- ఒకవేళ లూజ్ మోషన్స్ అవుతున్నట్లైతే మెంతుల్ని నేతిలో వేయించాలి. నేతిలో వేయించి పొడి చేసి ఆ పొడిలో కొద్దిగా సైన్ దవ లవణాన్ని కూడా కలుపుకొని మజ్జిగలో కలుపుకొని తీసుకుంటే వీరేశనాలు తగ్గించుకోవచ్చు.
Fenugreek Seeds మెంతులతో ఉపయోగం
బరువు తగ్గడానికి తర్వాత మధుమేహానికి, P.C.O.D సమస్య అంటే బహిష్టు నెల నెలా కరెక్టుగా రాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య ఈ మూడింటిలోనూ ఒకే రకంగా పనిచేస్తుంది. బరువు తగ్గించుకోవడం, P.C.O.D, మధుమేహం ఈ మూడు సమస్యల్లో ఏది ఉన్నా సరే మెంతులు ఒక మంచి ఔషధంగా ఉపయోగపడతాయి. ఈ సమస్య ఉన్నవాళ్లు మెంతుల్ని రాత్రిపూట కొద్దిగా మజ్జిగలో నానబెట్టి ఉదయాన్నే ఆ రెండు మూడు చెంచాల మెంతుల్ని బరువు మరి ఎక్కువగా ఉన్నవాళ్లు రెండుమూడు చెంచాలు తీసుకోవచ్చు. ఒకవేళ కాస్త తక్కువ బరువు ఉన్నవాళ్లు ఒక చెంచా నానబెట్టిన మెంతుల్ని పరగడుపునే తినేయాలి. అలా రెగ్యులర్ గా 2 నుంచి 3 నెలలు చేస్తూ ఉన్నట్లయితే మధుమేహం అదుపులో ఉండడానికి సహాయపడుతుంది. అలాగే నెల నెలా పీరియడ్స్ సరిగా రావడానికి, శరీరపు బరువు తగ్గడానికి కూడా మెంతులు సహాయకంగా ఉంటాయి.
అలాగే తలలో చుండ్రుని తగ్గించుకోవడానికి కూడా మెంతులు ఉపయోగపడతాయి. కొంతమందికి పొట్టులాగా రాలేటువంటిది ఉంటుంది. కొంతమందికి జిడ్డు జిడ్డుగా ఉండేటువంటిది ఉంటుంది. ఈ జిడ్డుగా ఉండి డాండ్రఫ్ ఉండే వాళ్లకు మెంతులు బాగా ఉపయోగపడతాయి. దానికోసం మెంతులని నానబెట్టి బాగా మెత్తటి పేస్ట్ లాగా రుబ్బి ఆ పేస్ట్ ని తలంతా కూడా ఒక లేపనం లాగ రాసి ఒక అరగంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి స్నానం చేయాలి. అలా చేసినట్లయితే జిడ్డుతో కూడినటువంటి ఈ చుండ్రు తగ్గడానికి మెంతులు సహాయపడతాయి.
మెంతులు వాతహారంగా పనిచేస్తాయి. నడుము నొప్పి, సయాటికా, కీళ్లనొప్పి, వాపులు, కండరాల నొప్పితో బాధపడుతున్నప్పుడు మెంతుల్ని వాడుకుంటే మంచి ఉపశమనంగా ఉంటుంది. మెంతులని నీళ్లతో కలిపి పై పూతగా లేక పట్టుగా వాడితే ఇన్ఫెక్షన్లు, చీముపొక్కులు, ఎముకలు విరగడం, కీళ్లవాపు మొదలైన సమస్యలు తగ్గుతాయి. మెంతులతో తయారుచేసిన తేనీళ్ళు తీసుకోవడం వల్ల శ్వాస సంబంధ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న మెంతుల్ని ఎదో ఒక రూపంలో నిత్యం తీసుకుంటే మన ఆరోగ్యం దివ్యంగా ఉంటుంది.
ఎఫెక్టీవ్ గా పనిచేయుటకు మెంతులను తీసుకునే బెస్ట్ మెథడ్
- ఒక ఆఫ్ కప్ Fenugreek Seeds ని ఏదైనా ఒక పాన్ లో వేసుకోవాలి.
- తర్వాత ఈ మంతులను ఆయిల్ వేయకుండా ప్రై చేసుకోవాలి.
- మెంతులలో ఉన్న పచ్చి వాసన పోయేంతవరకు ప్రై చేసుకోవాలి.
- పచ్చివాసన పోయి ప్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి వీటిని తీసుకోవాలి.
- మిక్సీలో వీటిని మంచి పౌడర్ అయ్యేలా చేసుకోవాలి.
- ఇలా చేసుకున్న పౌడర్ ని ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ లో ఈ పౌడర్ ని ఒక టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ముందు ఈ వాటర్ ని తీసుకోవాలి.
- ఇలా తీసుకోవడం వల్ల మీ బ్లడ్ లోకి డైరెక్టుగా ఈ వాటర్ అనేది వెల్లి మీ బ్లడ్ లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాయి. అలాగే డైజేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది.
- ఈ వాటర్ గోరు వెచ్చగా ఉండే విదంగా చూసుకోండి, చల్లని వాటర్ యూజ్ చేయవద్దు అలా అని వేడి వాటర్ ని యూజ్ చేయవద్దు. గోరువెచ్చగా ఉండేట్లు చూసుకొని డైరెక్ట్ గా తీసుకోవాలి.
- ఇది చాలా యూజ్ ఫుల్ గా ఉంటుంది. అలాగే ఈ మిశ్రమం మీ బాడీలో ఉన్న అధిక బరువు ని తగ్గిస్తుంది.