FOOD PRESERVATIVES IN HEALTH TIPS TELUGU
Food preservatives ఉప్పు, నూనె పంచదార లాంటి వంట సరుకుల నుండి చిప్స్, చాకోలెట్స్, బిస్కట్స్ వంటి రెడిమేట్స్ పొడి ఐటమ్స్ వరకు అన్ని ప్రాసెస్ చేయబడి ప్యాకెడ్ ఫుడ్ గా ప్యాక్ చేయబడుతున్నాయి. ఇలా ప్యాక్ చేయబడిన ఫుడ్ నాణ్యత కోల్పోకుండా ఎక్కువకాలం నిలువ ఉండటానికి వాటి రంగు రుచి వాసనలను ఆకర్షణీయంగా మార్చడానికి కొన్ని రసాయనాలను కలుపుతారు. ఆ రసాయనాలనే "(Food Additives)" గా పిలుస్తారు. మనం తినేటువంటి ఆహారం(ఫుడ్) లో ఎటువంటి కెమికల్స్(రసాయనాలు)కెమికల్స్ ని కలపొచ్చు, ఎటువంటి కెమికల్స్ ని కలపకూడదు, (రసాయనాల)ను ఎంత పరిమాణం(మోతాదు) వరకు ఆహారంలో (ఫుడ్) లో కలపవచ్చు అనే నిర్ణయాన్ని "F.S.S.A.I" నిర్ణయిస్తుంది. F.S.S.A.I (Food Safety and Standards Authority of India) ఫుడ్ ఎడిటివ్స్ గా ఉపయోగించడానికి ఇప్పటివరకు పర్మిట్ చేసిన రసాయనాల సంఖ్య దాదాపు 11,000 వేలు. అయితే ఈ రసాయనాలు ఫుడ్స్ లో పరిమిత మోతాదులో వాడటం వల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదని F.S.S.A.I అలాగే వ్యాపార సంస్థలు కూడా చెప్తున్నాయి.
అయితే కొన్ని పరిశోధన సంస్థలు మాత్రం మనం ఉపయోగిస్తున్న ఫుడ్ ఎడిటివ్స్ లో కొన్ని చాలా ప్రమాదకరమైనవని ఇవి అనేక రకాల అనారోగ్య సమస్యలను కలిగిస్తాయని చెప్తున్నారు.
వీటిల్లో ప్రమాదకరం చెప్తున్న కొన్ని కెమికల్ ఫుడ్ ఎడిటివ్స్:
1. PROPYL GALLATE ప్రొఫైల్ గాలేట్
ఇది ఒక యాంటీఆక్సిడెంట్, ఇది నూనెలు నూనె పదార్దాలు చెడిపోకుండా నిలువ చేసేందుకు ఉపయోగిస్తారు.
- వంటనూనెల్లోనూ, చూయింగ్ గమ్ లోను, మాంసపు ఉత్పత్తుల్లోనూ, చికెన్ సూప్ బేస్ మొదలైన వాటిల్లో ఈ ఫ్రొఫైల్ గ్యాలెట్ ను వాడతారు.
- ఈ ఎడిటివ్ ఉన్న ఆహారంలో అధిక మొత్తంలో దీర్ఘకాలికంగా తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
2. POTASSIUM BROMATE పొటాషియం బ్రోమేట్
- దీన్ని బ్రెడ్, బన్ ల తయారీలో వాడతారు. C.S.E (సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరోల్మెంట్) చేసిన పరిశోధనలో ఈ పదార్థం అనేక అనారోగ్య సమస్యలతో పాటు కాన్సర్ ను కూడా కలిగిస్తుందని తేల్చింది.
- దాంతో F.S.S.A.I ఈ పదార్దాన్ని 2016 లో బాన్ చేసింది. మేజర్ బ్రేడ్ మేనిఫ్యాక్చర్స్ అందరు ఈ పొటాషియం బ్రొమెట్ ని ఉపయోగించబోమని చెప్పారు.
- అయితే మన లోకల్ షొప్స్ లో దొరికే F.S.S.A.I సెర్టిఫికేషన్ లేని బ్రేడ్ లోను బయట బండ్ల మీద ఉపయోగించే బన్నుల్లో ఈ పొటాషియం బ్రోమేట్ లేదని మనం గ్యారెంటీగా చెప్పలేము.
3. MSG: MONOSODIUM GLUTAMATE మోనో సోడియం గ్లుటామేట్
- మోనో సోడియం గ్లుటామేట్అనేది ఫుడ్ యొక్క ఫ్లేవర్ ని పెంచే పదార్థం. మోనో సోడియం గ్లుటామేట్ నే టేస్టింగ్ సాల్ట్ అని మన ఇంట్లో కూడా ఉపయోగిస్తుంటాం. దీన్ని అధిక మొత్తంలో వాడితే ఎలర్జీ లు, ఆస్తమ, తలపోటు, బ్రెయిన్ డామేజ్, డయాబెటిస్ మొదలైనవి సంభవిస్తాయని కొందరు పరిశోధకులు చెప్తున్నారు.
- F.S.S.A.I దీన్ని ప్యాకెడ్ ఫుడ్స్ లో పరిమిత మోతాదులోనే వాడాలని ఉంటుంది. అయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో దీని వాడకానికి ఒక అడ్డు అదుపు ఏమి ఉండదు. టేస్ట్ కోసం ఫాస్ట్ ఫుడ్ లో చేతికి దొరికినంత వేసేస్తుంటారు. పాస్ట్ ఫుడ్ తినేటప్పుడు MSG(మోనో సోడియం గ్లుటామేట్) తో జాగ్రత్తగా ఉండండి.
4. DIACETYL (డై ఎసిటైల్)
- డై ఎసిటైల్ ని ఫ్లేవర్ కోసం వంట నూనెల్లో కలుపుతారు. పాప్ ఖాన్ లాంటి ఫుడ్ ప్రొడక్ట్స్ తయారీలోనూ, బీర్ ల తయారీలోనూ ఒక బటర్ లాంటి ఫ్లేవర్ కోసం దీన్ని ఉపయోగిస్తారు.
- ఇది కలిపిన నూనెలను మైక్రోవేవ్ చేసినప్పుడు లేదా అధిక ఉష్ణోగ్రత వద్ద మరిగించినప్పుడు విడుదలయ్యే వాపర్స్ చాలా ప్రమాదకరమైనవి. ఈ వాపర్స్ బ్రాంకియోలైటిస్, ఆబ్లితెరాన్స్ అనే ఊపిరితిత్తుల సమస్యను కలిగిస్తున్నాయి.
- CSC చేసిన పరిశోధనలో తేలింది. దీంతో F.S.S.A.I ఈ (డై ఎసిటైల్) వాడకాన్ని 2019లో బాన్ చేసింది. ఈ డై ఎసిటైల్ ఉన్న పదార్థాలు తిన్నప్పుడు పెద్ద సమస్యలు ఏవి రావు. కానీ దీనిని బాగా వేడి చేసినప్పుడు వచ్చే వాపర్స్ పీలిస్తే మాత్రం ప్రమాదం. కాబట్టి ఇది ఇంట్లో వంట చేసే వాళ్ళకి, కుక్స్ కి, ఆయిల్ ఫుడ్ ఫ్యాక్టరీస్ లో పని చేసేవాళ్ళకి ఇది చాలా ప్రమాదకరం.
5. HIGH FRUCTOSE CORN SYRUP హైప్రక్టోజ్ కార్న్ సిరప్
- ఇది పదార్థాలకు తీయదనం రప్పించడం కోసం కలుపుతారు. తీపి కోసం పంచదార వాడొచ్చు కదా అని అనుకోవచ్చు. ఇది పంచదార కంటే చాలా ఎక్కువ తియ్యదనాన్ని ఇస్తుంది.
- హైప్రక్టోజ్ కార్న్ సిరప్ యొక్క ధర మాత్రం నార్మల్ పంచదార తో పోలిస్తే చాలా తక్కువ. ఈ హైప్రక్టోజ్ కార్న్ సిరప్ ఉన్న పదార్ధాలు ఎక్కువ తినడం వల్ల డయాబెటిస్, పాటిలివెర్, కిడ్నీ ప్రొబ్లెమ్స్ వస్తాయని గుర్తించారు.
- మనం తాగె సాఫ్ట్ డ్రింక్స్ లోను, కాండీస్ లోను. ప్యాకెడ్ జ్యూస్ లోను, స్వీట్ బ్రేడ్ లోను, ఎనర్జీ బార్స్ లోను వీటన్నిటిలోనూ కూడా ఈ హైప్రక్టోజ్ కార్న్ సిరప్ ని యాడ్ చేస్తారు.
6. TRANS FAT ట్రాన్స్ ఫాట్
- ఇది ఒక రకమైన శాచ్చురేటెడ్ ఫాట్. వెజిటల్స్ ఆయిల్స్ ని హైడ్రోజినేషన్ చేయడం ద్వారా తయారుచేసే ట్రాన్స్ ఫాట్స్ చాలా ప్రమాదకరమైనవి.
- వీటిని క్రాకర్స్, బిస్కేట్స్, పాప్ కార్న్స్, పిజ్జా మొదలైన వాటిల్లో వాడతారు. ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని అమాంతం పెంచేసి హార్ట్ బ్లాక్స్, హార్ట్ ఫెయిల్యూర్ కి కారణం అవుతుంది.
- చిప్స్ లాంటి ఆయిలీ జంక్ ఫుడ్స్ కొనేటప్పుడు దాన్ని లేబుల్ మీద ట్రాన్స్ ఫాట్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి.
7. ASPARTAME ఆస్పార్టమ్
- ఇది పంచదార కంటే 200రెట్లు తియ్యదనాన్ని కలిగి ఉంటుంది. అంటే ఒక స్పూన్ ట్రాన్స్ ఫాట్ రెండు వందల(200) స్పూన్ ల పంచదార తో సమానం అనమాట.
- షుగర్ ఫ్రీ అని చెప్పే అన్ని తీయని పదార్థాలలోను ఈ ఆస్పార్టమ్ ని ఉపయోగిస్తారు. ఉదాహరణకి డైట్ సోడా, షుగర్ ఫ్రీ స్వీట్స్, షుగర్ ఫ్రీ ఐస్క్రీమ్, మొదలైన వాటిలో ఉపయోగిస్తారు.
- అయితే ఇది ప్రమాదకరమైన పదార్థం కాదని అనేక ఫుడ్ స్టాండర్డ్ ఏజెన్సీ లు చెప్తున్నా వీటిని వాడుతున్న వినియోగదారులు మాత్రం నరాలు, మెదడుకు సంబంధించిన అనేక సమస్యలు వస్తున్నాయి అని చెప్తున్నారు.
8. FOOD COLOURS ఫుడ్ కలర్స్
- ఇప్పుడు ఫుడ్ ని కలర్ఫుల్ గా చేయడం ఒక ట్రెండ్. కలరింగ్ కోసం ఫుడ్ కి చాలా రకాల కలర్స్ ని కలిపిన ఈ ఫుడ్ కలర్స్ లో ముఖ్యంగా ఎల్లో5, ఎల్లో6 మరియు రెడ్40 ఈ మూడు చాలా ప్రమాదకరమైనవి అని కాన్సర్ ని కూడా కలిగిస్తాయి అంటున్నారు నిపుణులు.
- కేక్స్, చాకోలెట్స్ లాంటి వాటిని ఎట్రాక్టీవ్ గా తయారు చేయడం కోసం వాడి ఫుడ్ కలర్స్ పిల్లల్లో ఎలర్జీలు, హైపర్ యాక్టీవిటీ, ఇరిటేషన్, డిఫ్రెషన్ మొదలైన మానసిక సమస్యలను కలిగిస్తాయి అని పరిశోధకులు చెప్తున్నారు.
9. FLAVOURING AGENTS ఫ్లేవరింగ్ ఏజెంట్స్
- మైసూర్ బొండాలు మైసూర్ ఎలా ఉండదో. అలాగే స్ట్రాబెరి కేక్ లో స్ట్రాబెరి-మ్యాంగో ఐస్క్రీమ్ లో మ్యాంగో మచ్చుకైనా ఉండదు.
- మనం ఒక ఐస్క్రీమ్ పార్లర్ లో మెరుగులు చూసినప్పుడు దాంట్లో ఎన్నో ప్లేవర్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఇవన్నీకూడా హానికరమైన కెమికల్స్(రసాయనాల) తోనే తయారవుతాయి.
- ఈ ఆర్టిఫిసియల్ ఫ్లేవర్స్ వల్ల ఆస్తమ, వాంతులు అవడం, కడుపునొప్పి రావడం, ఎలర్జీ. దద్దుర్లు మొదలైనవి సంభవిస్తాయి.
10. SALT సాల్ట్
- ఇది హానికరమైన రసాయనం ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. సాల్ట్ ఒక ప్రెజెర్వేటివ్ గాను, టేస్ట్ ఏంహాన్సర్ గాను అంటే టేస్ట్ ని పెంచేది గాను అడిక్టవ్ ఇంగ్రీడియెంట్ అంటే తినే కొద్దీ తినాలి అనిపించేలా చేసే పదార్థం గానే పనిచేస్తుంది.
- ఆల్మోస్ట్ అన్ని రకాల ఫ్రైడ్ స్నాక్స్, పికిల్స్, ఫాస్ట్ ఫుడ్స్ లో అధిక మొత్తంలో సాల్ట్ ను ఉపయోగిస్తుంటారు.
- W.H.O అంటే World Health Organization ప్రకారం రోజుకు మనం తినే సాల్ట్ 5 గ్రాములు మించకూడదు. పైన చెప్పిన ఫుడ్ తినేవాళ్ళు రోజుకి రెకమెండేడ్ డోస్ కంటే దాదాపు 10 రెట్లు వరకు ఎక్కువ సాల్ట్ తింటుంటారు.
- హై బీపీ, స్ట్రోకులతో పాటు అనేక రకాల జబ్బులకు ఈ సాల్ట్ ముఖ్య కారణం. ఇలాంటి ఫుడ్ ఎడిటివ్స్ వల్ల మనకి అనారోగ్య సమస్యలు రాకూడదంటే మనం వీలైనంతవరకు నాచురల్ ఫుడ్ ని తీసుకోవాలి.
- అది కుదరనప్పుడు ప్యాకెడ్ ఫుడ్ కొనేటప్పుడు F.S.S.A.I సెర్టిఫికేషన్ ఉన్న ఫుడ్ ని మాత్రమే పర్చస్ చేయాలి. అలాగే ఫుడ్ అడిటివ్స్ కలిపిన ప్రాసెస్డ్ ఫుడ్ ని పరిమితం మోతాదుల్లో వాడుకుంటే చాలా వరకు సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.