Top Ten Summer Health Care Tips - Health Tips Telugu
ప్రస్తుతం అందరికి తెలిసిందే. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. వేడి గాలి, ఎండ వలన మన ఆరోగ్యానికి విపరీతమైన హాని కలుగుతుంది. ఎండాకాలంలో మండుతున్న సూర్యుడు ఆగ్రహాన్ని తగ్గించలేము. కాబట్టి వేసవి తాపం నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని విషయాల్లో దృష్టి పెట్టాలి. వేసవి అనగానే అందరికి గుర్తుకు వచ్చేవి వడదెబ్బ, డీ హైడ్రేషన్ వీటి నుండి బయట పడాలంటే ఎలాంటి పానీయాలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ 10 టిప్స్ ద్వారా తెలుసుకుందాం.
ముందుగా వడదెబ్బ, డీ హైడ్రేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. విపరీతమైన ఎండ వేడి వద్ద శరీరంలో ఉండాల్సిన నీటి శాతం ఒక్కోసారి పడిపోతుంది. శరీరం లో ఉండాల్సిన నీటి పరిమాణంలో 5% శాతం, అంతకన్నా ఎక్కువగా నీరు తగ్గితే దాన్ని డీ హైడ్రేషన్ గా పరిగణిస్తారు. చమట రూపంలో బయటికి వెళ్ళిపోయి నీటిలో మన శరీరానికి అవసరమైన sodium, potassium, chloride, పాస్పరస్ లాంటి లవణాలు బయటకి వెళ్ళిపోతాయి. దీని వల్ల కళ్ళు తిరగడం, వికారం, చర్మం ఎర్రగా పొడి మారడం, శరీర ఉష్ణోగ్రత అతి ఎక్కువగా లేదా చల్లగా ఉండడం, విపరీతమైన నీరసంగా ఉండడం లాంటి లక్షణాలు కనబడతాయి. శరీరం అధిక ఉష్ణోగ్రతకు గురైనప్పుడు ఆ అధిక ఉష్ణోగ్రత వలన మన శరీరం లో శారీరక పరమైన, నాడీవ్యవస్థ పరమైన వ్యాధి లక్షణాలు కనిపిస్తే దాన్ని వడదెబ్బ గా పరిగణిస్తారు. ఈ పరిస్థితుల్లో మన శరీర ఉష్ణోగ్రత 43 degree centigrade కు చేరుతుంది. కాబట్టి వీటి నుండి బయట పడేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Tip 1):- వేసవి కాలంలో చాలా ముఖ్యమైన నియమం. మీరు నీళ్లు ఎంత తాగితే అంత మంచిదండి దాహం లేకపోయినా తరుచు కొద్ది కొద్దిగా నీరు త్రాగుతూ ఉండాలి. నార్మల్ రోజుల్లో కన్నా వేసవిలో 2,3 లీటర్ల నీటిని ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాయి.
Tip 2):- ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువగా ఉండే పదార్ధాలతో పాటు oil foods అంటే వేపుడ్లు, సమోసా, వడ, చిప్స్, బజ్జీలు ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నాన్వెజ్ ని కూడా ఎక్కువ తీసుకోకండి. ఎండాకాలం మన డైజేషన్ సిస్టం చాలా వీక్ గా ఉంటుంది. అందువల్ల త్వరగా జీర్ణం అయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోండి.
Tip 3):- వీలైనంత వరకు ఎండలో బయటకి వెళ్లకండి. ముఖ్యంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు బాగా అలసట కలిగించే పనులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు చేయకండి. ఒకవేళ తప్పని సరి చేయాల్సి వస్తే helmet, u, v, protection, sun glasses, గొడుగు లేదా cap వంటివి ధరించండి. వేసవిలో కాటన్ దుస్తులను ధరించండి. చమట వల్ల వచ్చే చమట, పొక్కులు, దురద అనేవి కాటన్ దుస్తులు ధరించడం వల్ల రావు. తగ్గుతాయి కూడా. అందులోనూ light colours, smooth and loose గా ఉండేటువంటి కాటన్ దుస్తులు ధరిస్తే మంచిది.
Tip 4):- మన శరీరం కోల్పోయిన లవణాలు అన్నింటిని రికవర్ చేసేటటువంటి ఒకే యొక్క పానీయం కొబ్బరి నీళ్ళు. అందుకే వీలైనంత ఎక్కువ మోతాదులో కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల ఎండాకాలంలో వడదెబ్బ బారిన పడకుండా ఉంటాం. దీంతో పాటు మజ్జిగ, ORS, fruit juice, glucose, నిమ్మరసం, బార్లీ నీళ్ళు, చల్లటి గంజి వంటివి ఎండాకాలంలో తరచు తీసుకోవాల్సినవి. సబ్జా గింజలు నానబెట్టి ఆ నీటిని తాగడం వలన వేడి తాలూకు ప్రభావం తగ్గుతుంది. బార్లీ నీళ్లు శరీర వేయడం తగ్గిస్తుంది. వడదెబ్బ నుండి కాపాడుతుంది.
Read Also:- కంటి కింద Dark Circles తగ్గించుకోండి.
Tip 5):- సమ్మర్ లో cool drinks కి దూరంగా ఉండటం చాలా మంచిది. శీతల పానీయాల్లో ని పంచదార, కృత్రిమ రంగులు preservatives అన్ని ఆమ్ల గుణాన్ని కలిగి ఉండడంతో మూత్రం తో పాటు మన శరీరానికి అవసరమైన లవణాలు పోతుంటాయి. కాబట్టి వీటికి వేసవిలో దూరంగా ఉండడం మంచిది. Tea, coffeeలను వీలైనంత వరకు తగ్గించండం మంచిది. వీటిని అతిగా తీసుకోవటం వలన నీటి శాతం తగ్గి డీ హైడ్రేషన్ ఎదురు అవ్వచ్చు. శరీరం కూడా తేమను కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. వీటికి బదులు green tea తాగడం అలవాటు చేసుకోండి. Smoking మరియు Alcohol కి చాలా వరకు దూరంగా ఉండండి.
Tip 6):- వేసవిలో కూరగాయలు, ఆకుకూరలు వీలైనంత ఎక్కువగా తీసుకోండి. పుచ్చ, కర్బూజ, కీరదోస, సిట్రస్ జాతి పళ్ళు, సొరకాయ, దోస వంటి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న జ్యూస్ ని వెజిటల్స్ ని తీసుకోండి. పంచదార లేని తాజా పళ్లరసాలు, సలాడ్స్, ఉత్తమము. తులసి, పుదీనా, కొత్తిమీర వంటి ఔషధ మొక్కలను సలాడ్ లతో వాడితే మంచిది. Vitamin A, Vitamin C ఉన్న పదార్థాల్ని ఎక్కువగా తీసుకోండి. భోజనంలో పెరుగు లేకపోతె మజ్జిగ కానీ ఉండేలా తప్పనిసరిగా చూసుకోండి. ఎండాకాలంలో పెరుగు కన్నా మజ్జిగ కే ఎక్కువ గా ప్రిఫరెన్స్ ఇవ్వండి. పచ్చి మామిడి జ్యూస్ ని తీసుకోవడం వల్ల ఎండదెబ్బ నుండి తప్పించుకోవచ్చు. పండిన మామిడి పండు జ్యూస్ వేడి చేస్తుంది. పచ్చి మామిడి జ్యూస్ చలవ చేస్తుంది. రెండు quite opposite అనమాట.
Tip 7):- ఎండాకాలంలో సన్స్రీన్ ని తప్పనిసరిగా వాడండి. ఇది మీ చర్మాన్ని UV A, UV B కిరణాల నుండి కాపాడుతుంది. ఇంట్లోనే ఉన్నట్లయితే spf15 బయటికి వెళ్ళేటప్పుడు spf50 ఉన్న sunscreen ని ఎంచుకోండి. ఎండ తీవ్రతను బట్టి 3 నుండి 4 గంటలకు ఒకసారి apply చేస్తూ ఉండాలి. ఎండ నుండి ఇంట్లోకి రాగానే కొంతమంది ఫేసువాష్ చేసేస్తారు. అలా కాకుండా కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాతనే ఫేసువాష్ చేయాలి. రోజ్ వాటర్ స్ప్రే ని అందుబాటులో ఉంచుకొని టైడ్ గా అనిపించిన ప్రతిసారి స్ప్రే చేసుకోండి రీప్రెస్ అవుతారు. మీ చర్మాన్ని ఎండ నుండి కాపాడడానికి హెర్బల్ ఆయుర్వేదిక్ సన్ స్రీన్ ని వాడండి. ఆర్గానిక్ పేస్ వాష్ లను ఉపయోగించండి.
Tip 8):- ఇల్లు చల్లగా ఉండేలా చూసుకోండి. కిటికీలు, తలుపులు పగటి టైం లో క్లోజ్ చేసి ఉంచండి. ఇల్లు చల్లగా ఉండడానికి డైలీ తడిగుడ్డతో క్లీన్ చేయండి. కిటికీల కి డోర్ లకి కర్టైన్ ప్లేసులో తడి బట్టలు వేయండి. ఇలా వేయడం వల్ల వేడి గాలి చల్లగా మారి లోపలికి వస్తుంది.
Tip 9):- సమ్మర్లో చమట తలలో కూడా పట్టి దుమ్ముతో కలిసి hair problems వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రోజు విడిచి రోజు చన్నీటితో తల స్నానం చేయండి. వేసవిలో రోజుకి రెండు పూట్ల స్నానం చేయడం వలన చమట వలన కలిగే ఇబ్బంది దూరమై మనసుకు హాయిగా ఉంటుంది. స్నానం చేసే నీటిలో కొద్ది చుక్కలు వెనిగర్ ని వేసి స్నానం చేస్తే చెమట వాసన ఉండదు. ఎండలో తిరుగుతున్నపుడు జుట్టును కాప్స్ తో గాని లేదా హ్యాండ్ టవల్ తో గాని క్లోజ్ కవర్ చేయాలి. లేదంటే ఎండ వేడికి వెంట్రుకలు చిట్ లు పోయి రంగు మారిపోయే ప్రమాదం ఉంది.
Tip 10):- వేసవిలో చల్లగా నీళ్లు బాగా తాగాలి అని అనిపిస్తుంది. అలాంటప్పుడు ఫ్రిడ్జ్ లో నీళ్ల కన్నా కుండలో నీళ్ళు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండాకాలంలో పొట్ట నిండుగా తినకూడదు. రోజులో కొద్ది కొద్దిగా తీసుకోవాలి. ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం ఉదయం పూట నీటిలో నానబెట్టి ఎండ వేళ ఇవ్వాలి. ఎండాకాలంలో ఎక్కువగా ఎక్సర్సైజ్ చెయ్యకండి. ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి డీ హైడ్రేషన్ బారిన పడవచ్చు. ఎండలో ప్రయాణించేటప్పుడు చల్లటి నీళ్లు, గ్లూకోజ్ తప్పనిసరిగా వెంట తీసుకు వెళ్ళండి.
ఇప్పటిదాకా వడదెబ్బ తగలకుండా ఉండటానికి తీసుకోవలసిన జాగ్రత్తలను చూసాం. ఒకవేళ వడ దెబ్బ తగిలినప్పుడు రోగిని విధంగా ట్రీట్ చేయాలో ఒక్కసారి తెలుసుకుందాం. వడ దెబ్బ తగిలినప్పుడు దాన్ని medical emergency పరిగణించాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తికి అత్యవసర చికిత్సను అందివ్వాలి. మొదట రోగి యొక్క శరీరాన్ని వెంటనే చల్ల పరచాలి. అందుకోసం శరీరానికి చల్లటి గాలి తగిలేలా జాగ్రత్త పడాలి. ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని తడిపిన గుడ్డతో కప్పి ఉంచాలి. జ్వరం వచ్చినప్పుడు మనం సాధారణంగా ఉపయోగించేటువంటి paracetamol లాంటి మందులు వడదెబ్బ వలన కలిగే జ్వరాన్ని తగ్గించవని గుర్తుంచుకోండి. శరీరం కోల్పోయిన లవణాలను, ద్రవాలను అందించడానికి ఎనర్జీ డ్రింక్స్, ORS లాంటివి ఇవ్వండి. అందుబాటులో ORS లేనప్పుడు homemade ORS ను తయారుచేసుకోండి. ఒక లీటర్ వాటర్ లో ఆరు టీ స్పూన్ ల షుగర్, ఆఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి తయారు చేయండి.
ఇవే Top ten summer health care tips మీకు మీ డైలీ లైఫ్ లో ఈ tips ఎంతగానో ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను. మీకు నా ఇన్ఫర్మేషన్ గనుక నచ్చినట్లయితే మీ friends and family member's కి share చేయండి. ఇలాంటి యూస్ ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా వెబ్సైట్ ని ఫాలో చేయండి.