Type Here to Get Search Results !

Headaches are good for us | తలనొప్పి మనకు మంచే చేస్తుంది.

Headache is good

Headache-is-good-health-tips-telugu

Headaches are good for us ప్రెజెంట్ ఈ తలనొప్పి మానవాళికి పెద్ద తలనొప్పిగా మారింది. ఫర్ ఎక్సమ్ ఫుల్ మీ చేతికి దెబ్బ తగిలితే చెయ్యి నొప్పి పడుతుంది. కాలికి దెబ్బ తగిలితే కాలు నొప్పి అలాగే స్టమక్ అప్సెట్ అయితే స్టమక్ పెయిన్. మరి తలకి ఏ దెబ్బ తగలకుండా Headache ఎందుకు వస్తుంది? 

స్ట్రెస్ వల్ల, ఓవర్ థింకింగ్ వల్ల మీల్స్ స్కిప్ చేయడం వల్ల, టైం కి నిద్ర పోకపోవడం వల్ల ఇలా తలనొప్పికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. కానీ మీరు కొంచెం క్లియర్ గా గమనించినట్లైతే headache అనేది చాలా మంచిది. మీ బాడీలో ఏదో తప్పు జరుగుతుందని headache ఒక హెచ్చరిక చేస్తుంది. ఎక్సమ్ ఫుల్ మీకు నచ్చని వ్యక్తి మీకు ఎదురు పడితే వెంటనే మీ తల తిరిగిపోతుంది. అప్పుడు తలనొప్పి నీకో వార్ణింగ్ ఇస్తుంది. కోపం మంచిది కాదు. స్ట్రెస్ కి లోనవ్వకు కూల్ గా ఉండు. అయినా వాడిని చూసి నువ్వెందుకు చేస్తున్నావు అని మీ బ్రెయిన్ తలనొప్పి ద్వారా ఒక రెడ్ సిగ్నల్ ఇస్తుంది. కాని ఇదంతా మనం అర్థం చేసుకోకుండా తలనొప్పిని ఒక శత్రువుగా చూసి, వెంటనే ఒక శారిడన్ వేసుకుంటాం. నాకు తెలిసి ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట. ఎందుకంటే శారిడన్ నీ తలనొప్పిని తగ్గించదు, నొప్పి లక్షణాన్ని నీకు తెలియకుండా చేస్తుంది. కానీ ఆ పెయిన్ మాత్రం అక్కడే ఉంటుంది. నీకు తలనొప్పికి మధ్య ఒక విధమైన మరుపుని ఆ టాబ్లెట్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల అసలు రోగం ఒక మూలకి నెట్టి వేయ పడుతుంది. కానీ అది ఒక మూల నుంచి మరో మూల కి కదిలిన ప్రతిసారి నీకు విపరీతమైన తలనొప్పి పుడుతుంది. దాంతో వెంటనే నువ్వు మల్లి శారిడన్ ని వేస్తావు తలనొప్పి మళ్లీ మాయమవుతుంది. 

ఒక రకంగా మనకి మంచి చేసే వార్ణింగ్ ని మనం తాత్కాలికంగా అణిచి వేస్తున్నాం. ఇలా చిన్న చిన్న రోగాలని అణిచివేయడం వల్ల ఒక రోజు ఒక పెద్ద రోగం బయట పడుతుంది. 

మీరు ఎప్పుడైనా గమనించారా? 

మనకి కోపం ఎప్పుడు మన కింద స్థాయికి వెళ్తుందని ఫర్ ఎక్సమ్ ఫుల్ ఒక కంపెనీ C.E.O  డైరెక్టర్పై పై అరుస్తాడు. కానీ డైరెక్టర్ తిరిగి C.E.O పై అరవలేడు. అరిస్తే వాడి జాబ్ పోతుందని వాడికి బాగా తెలుసు. సో అందుకే డైరెక్టర్ తన కోపాన్ని ఆపుకొని మేనేజర్ ని తిడతాడు. మేనేజర్ ఫోర్మన్ ని తిడతాడు. ఫోర్మన్ వాచ్మెన్ ని తిడతాడు. పాపం వాచ్మెన్ కి కింది స్థాయిలో ఎవరు లేరు కాబట్టి ఇంటికొచ్చి తన భార్యను తిడతాడు. భార్య ఏమో తన పిల్లల్ని తిడుతుంది. పిల్లాడు తన కుక్క పై అరుస్తాడు. ఇలా మనిషి తలనొప్పిని స్ట్రెస్ ని ఒకరి నుంచి మరొకరికి అంటు వ్యాధుల్లా అంటిస్తున్నాడు. ఇది అలా నిరంతరం సాగుతూనే ఉంటుంది. 

మనిషి తన కోపాన్ని, స్ట్రెస్ ని ఆపుకునే క్రమంలో ఒక రోగాన్ని పెంచి పోషిస్తున్నాడు. మరల ఆ రోగం బయటపడిన రోజు నీకు Headache(తలనొప్పి) రూపంలో హెచ్చరిక చేస్తుంది. కానీ దాన్ని నువ్వు ఒక టాబ్లెట్ తో అణిచివేసి ఒక మూలకి నెట్టివేస్తున్నావు. ఇప్పుడు చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారంటే ఇలా చిన్న చిన్న రోగాల్ని అణిచివేయడం వల్ల కాన్సర్ లాంటి పెద్ద పెద్ద రోగాలు పుడుతున్నాయి అని అంటున్నారు. 

ఒక సర్వేలో ఏం తెలిసిందంటే గ్రామాల్లో కంటే నగరాల్లోనే రోగాలు ఎక్కువగా వస్తున్నాయి అంట. దీనికి ఒకే ఒక్కటి ఏంటో తెలుసా పనిభారం! అవును పల్లెటూరులో పనిభారం ఫిజికల్ గా ఉంటుంది తప్ప మెంటల్ గా ఉండదు. ఈసారి మీకు తల నొప్పి వస్తే, దాన్ని మీరు శత్రువుగా కాకుండా ఒక మంచి ఫ్రెండ్ గా చూడండి. శరీరంలో ఏదో తప్పు జరుగుతుంది అని మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. మిమ్మల్ని మీరు అర్ధం చేసుకోండి. నిశితంగా కూర్చొని మీ బాడీ లోపలికి వెళ్ళండి. అప్పుడు మీ తలనొప్పి కి మూలం దొరుకుతుంది. 

ఒకవేళ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన అతను చేసే పని కూడా ఇదే. అంటే మీరు రోగం అని చెప్పగానే అతను మిమ్మల్ని ఒక మెత్తటి పరుపు పై పడుకో పెడతాడు. అలా ఎందుకు పడుకో మంటారా తెలుసా? మనిషి పడుకున్నప్పుడు అన్నీ మర్చిపోయి చాలా ఫ్రీగా ఫీల్ అవుతాడు. దాంతో ఉన్నది ఉన్నట్టుగా డాక్టర్ కి చెప్తాడు. తర్వాత డాక్టర్ ప్రశ్నల బాణాలు వదులుతూ మీ మూలల్లోకి వెళ్తాడు. ఏం వర్క్ చేస్తావ్? నీ వయసు ఎంత? ఏం తింటావు, ఎన్ని గంటలు పడుకుంటావు? అని ఇలా ప్రశ్నలు అడుగుతూ మీ మూలాల్లోకి వెళ్తాడు. అలా మూలల్లోకి వెళ్లి అసలు రోగాన్ని కనిపెడతాడు. అదేదో ఫస్ట్ నువ్వే మూలల్లోకి వెళ్ళు, డాక్టర్ వెళ్ళిన దానికి నీకు నువ్వుగా వెళ్ళిన దానికి చాలా తేడా ఉంటుంది. 

మీరు గమనిస్తే చివరికి డాక్టర్ కూడా మనం నోటి చేతనే రోగాన్ని చెప్పిస్తాడు. ఇది కొంచెం నవ్వుకోవలసిన విషయం. ఫ్లో అనే ఒక పుస్తకం ఉంది. ఇది మనిషి ఒత్తిడి గురించి చెప్పే పుస్తకం. మనకి నచ్చిన విషయాల గురించి మనం ఆలోచించినప్పుడు మనం ఎంత ఒత్తిడికి చదువుతామో ఈ పుస్తకం క్లియర్ గా చెబుతుంది. మీ స్ట్రెస్ ని మీరు గమనించండి. అది ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని మూలాన్ని పట్టుకోండి. అప్పుడు మీ ఒత్తిడి మాయమవుతుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad