10 amazing changes that happen in our life | మన జీవితంలో జరిగే 10 అద్భుతమైన చేంజెస్.

10 amazing changes that happen in our life మన జీవితంలో జరిగే 10 అద్భుతమైన చేంజెస్ ఏమిటో ఇప్పుడు నేను మీకు చెప్తాను.

మన జీవితంలో జరిగే 10 అద్భుతమైన చేంజెస్.

10-amazing-changes-that happen-in-our-life_health-tips-telugu

10 amazing changes that happen in our life ఈ రోజు నుంచి సరిగ్గా 21 రోజులు మనందరం కలిసి ఒక ఛాలంజ్ స్టార్ట్ చేద్దాం. అదేంటంటే రేపటి నుంచి ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకి లేవడం. అదే మన ఛాలెంజ్. అయితే ఇంకా ఎవరికైనా క్లారిటీ లేకపోతే ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. ఎందుకు లేవాలి అనే క్లారిటీ మనకు గట్టిగా వచ్చేస్తుంది. 

ఉదయాన్నే లేవడం వల్ల ఎన్నో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే మీకు ఇప్పుడు ఈ ఆర్టికల్ లో ఒక పది లైఫ్ ఛేంజింగ్ బెనిఫిట్స్ చెప్తాను. కేవలం ఉదయం లేస్తే ఇన్ని బెనిఫిట్స్ మనకు ఎలా వస్తాయి? ఇంత చిన్న అలవాటు, ఇంత పెద్ద మార్పు ఎలా తెస్తుంది? అని అనుకుంటే ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సింపుల్ డిసిప్లేన్స్ రోజు ప్రాక్టీస్ చేస్తే చాలు సక్సెస్ అనేది మన వెనకే వస్తుంది. నేను నార్మల్ గా ప్రతిరోజు షార్ప్ 5am కి లేవను. కానీ 6am లోపలే లేస్తాను. ఈ ఛాలంజ్ పర్సనల్ గా నాకు కూడా నా పాత అలవాటు ని వెనక్కి తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే మీకు కూడా ఐదింటికి లేవడం అనే ఒక మంచి అలవాటు అలవడుతుంది. అయితే ఐదింటికి లేస్తే జరిగే మరాకిల్స్ తెలుసుకునేముందు. అసలు ఐదింటికి ఎలా లేవాలి అనేది ముందు తెలుసుకుందాం.

  1. ఫస్ట్ పాయింట్ మనం తొందరగా నిద్రపోవాలి. అయితే మొదట్లో మీకు నిద్ర పట్టడం కష్టంగా అనిపించవచ్చు. అయినా సరే వదిలేయకండి. నిద్ర పోవడానికి ట్రై చేస్తూనే ఉండండి. 
  2. మీరు ఫోన్ లో అలారం పెట్టుకున్న లేకపోతే విడిగా గడియారంలో  అలారం పెట్టుకున్న అది వేరే గదిలో ఉంటె మీరు లేవడం మీకు ఇంకా ఈజీ అవుతుంది. ఉదయం లేచిన వెంటనే మీ మైండ్ నెక్స్ట్ ఏం చేయాలి? అనే ఆలోచన ఉండాలి. 
  3. నిద్రపోయే ముందే నిద్ర లేచిన వెంటనే ఏం చేయాలో ఆలోచించి నిద్రపోండి. అలాగే మరి ఎక్కువ పనులు కూడా పెట్టుకోకండి. ఒకటి లేదా రెండు అంతే లేచిన వెంటనే బ్రెష్ చేసుకోండి. తరువాత ఒక గ్లాస్ వాటర్ తాగండి. తిరిగి మళ్ళీ నిద్రపోకండి. 
  4. ఏ పని అయితే చెయ్యాలి అని ప్లాన్ చేసుకున్నారో, ఆ పని లేచిన వెంటనే స్టార్ట్ చేసేయండి. మొత్తానికి ఎలా ఉంటే తొందరగా లేవచ్చు అనే విషయాలు మనం తెలుసుకున్నాం. 

ఇప్పుడు మనం మాట్లాడుకోవలసిన ముఖ్యమైన పాయింట్ మార్నింగ్ తొందరగా లేస్తే ఏమి సాధించవచ్చు. 

10 amazing changes that happen in our life మన జీవితంలో జరిగే 10 అద్భుతమైన చేంజెస్ ఏమిటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ పాయింట్స్ అన్ని గనుక మీరు చదివితే ఇంకా మార్నింగ్ తొందరగా లేవడం అనేది ఒక అడిక్షన్ గా మీరే మార్చేసుకుంటారు. 
10-amazing-changes-that happen-in-our-life
  1. చాలా మంది ఉదయం లేవడమే వెనకాల ఏదో ప్రమాదం జరుగుతున్నట్టు పరుగు తీస్తారు. హడావిడిగా అన్ని పనులు చేసుకుంటూ చాలా పనులు చేయడం, మర్చిపోతూ వెళ్ళిపోతారు. ఇలా ఉండటం వల్ల ఎంతోమంది జీవితంలో అతి ముఖ్యమైన రిలేషన్ ని కోల్పోతున్నారు. అది మనతో మనకి ఉండే రిలేషన్. మనలోని అసలైన పవర్ ఏంటో మనం తెలుసుకునే అవకాశాన్ని మనం ఎక్కడో కోల్పోతున్నాం. చాలా లో లెవెల్ మనతో మనం కనెక్ట్ అవుతున్నాం. ఎప్పుడైతే మనం ఉదయాన్నే లేచి మన పర్పస్ అలాగే మన రూల్స్ తో కనెక్ట్ అవుతామో అప్పుడు చాలా పవర్ఫుల్ లెవెల్ మనతో మనం కనెక్ట్ అవ్వగలం మన పర్పస్ మనం కనెక్ట్ అయినప్పుడే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళడం సాధ్యపడుతుంది. ఎప్పుడైతే మనం హడావిడిగా లేచి హడావిడిగా అలాగే ఉంటామో, మనం నిన్న బ్రతికిన సేమ్ లైఫ్ ని రోజు రిపీట్ బ్రతుకుతూనే ఉంటాం. అందుకే మార్నింగ్ లేవడం వల్ల మీతో మీరు హై లెవెల్ లో కనెక్ట్ అవ్వొచ్చు. 
  2. 5am కి లేవడం వల్ల మనం ఒక గొప్ప మనిషిగా ఎదగడానికి మనకి మనమే స్పేస్ ఇచ్చుకునే వాళ్ళం అవుతాం. చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఇన్ని పుస్తకాలు ఎలా చదువుతారు? అని. ఒక పుస్తకం చదవడానికి ఉదయం కన్నా మంచి సమయం ఉండదు. మంచి పుస్తకాలు లేదా మనకి ఉపయోగపడే వీడియో ఉదయం చూస్తే మన నాలెడ్జ్ పెంచుకోవడానికి మనమే ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది. మనకి మంచి నాలెడ్జ్ ఉంటె మన నిర్ణయాలు కూడా బాగుంటాయి. నాలెడ్జ్ ఎంత ఎక్కువ ఉంటె అంతే ఎక్కువ కాంఫిడెన్స్ మనకి ఉంటుంది. నాకు ఉదయాన్నే లేచాక మార్నింగ్ వాక్ వెళ్ళడం వలన చాలా రెఫ్రెషింగ్ గా ఉంటుంది. అలాగే వాక్ చేస్తూ ఆడియో బుక్స్ వినడం వల్ల మంచి పవర్ఫుల్ ఐడియాస్ వస్తాయి. అది నాకు కొత్త ఆర్టికల్స్ రాయడానికి ఉపయోగపడతాయి. 
  3. ఎర్లీ మార్నింగ్ లేవడంతో ముందు మనతో మనం బాగా కనెక్ట్ అవుతాం. కొత్తగా మన నాలెడ్జ్ ఎక్స్ పాండ్ చేస్తాం. మన జీవితంలో ముందుకు ప్రోగ్రెస్ అవుతాం. అయితే దీని వల్ల లైఫ్ లో ఎన్నో పీక్ మూమెంట్స్ ని మనం చూస్తాం అంటే మన వర్క్ ఏరియా, మన వర్కింగ్ స్టైల్ చూసి మనల్ని మెచ్చుకునేవారు పెరుగుతారు. ఇది వర్క్ అంటే మన బాడీ ఇంకా బాగా మన మాట వినడం మొదలు పెడుతుంది. మన ఫ్రెండ్స్ సర్కిల్ లో మన ప్రెజెంట్స్ ఇంకా పాజిటివ్ గా జనాలు ఫీల్ అవుతారు. జిమ్ లో ఎప్పటినుంచో మీరు చూడాలి అనుకుంటున్నా. ఆ ఎక్కువ శక్తి ని మీరు చూస్తారు. ఇలాంటి మూమెంట్స్ ని మీరు ఎక్కువగా ఎక్సపీరియెన్స్ చేస్తారు. ప్రతి మనిషి రోజు ఇలాంటి పీక్ మూమెంట్స్ ని చూడాలి. ఎందుకంటే ఇవి మన ఎనర్జీ ని డబుల్ చేస్తాయి. 
  4. మీకు నైతిక అధికారం ఉంటుంది. మనం మన అనుకునే వాళ్ల మీద పాజిటివ్ అధికారం చూపించడం మన ఫ్యామిలీ. మన మాట వినని వాళ్ళు ఎక్కువగా ఉంటె మనకు అసలు అక్కడ్నుంచి వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది. కానీ మన మాట వినాలి అని అధికారాన్ని బలవంతంగా తెచ్చుకోలేదు. మోరల్ అథారిటీ మనకి రావాలి అంటే మంచి ప్రిన్సిపుల్స్ ని ఫాలో అవ్వాలి. బాధ్యతగా ఉండాలి. నిజాయితీగా ఉండాలి. ఇలా ఉంటె మనకి చాలా గౌరవం వస్తుంది. 
  5. మనం ఉదయాన్నే లేవడం అనేది ఒక చిన్న గుడ్ హ్యాబిట్ అయితే దాని వల్ల వచ్చే ఒక బి ప్రోడక్ట్ అనేది కాంఫిడెన్స్. మార్నింగ్ లేవడం వల్ల మన లైఫ్ లో ప్రోగ్రెస్ అవుతాం. లైఫ్ ముందుకు ప్రోగ్రెస్ అవుతుంటే మన డెసిషన్స్ మీద మన మాట మీద మనకే ఒక కాంఫిడెన్స్ వస్తుంది. నార్మల్ కాంఫిడెన్స్ అనేది అంత ఈజీ కాదు. రోజు రోజు మన డవలప్మెంట్ అలాగే ఒకదాని తరువాత ఒకటి మనం గెలుస్తూ అనుకున్నది చేస్తూ వెళ్తేనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీరు గనుక మనం అనుకున్నట్టు 21 రోజులు ఉదయాన్నే 5am కి లేవడం అలవాటు చేసుకుంటే మీలో హయ్యర్ లెవెల్ కాంఫిడెన్స్ మీరే చూస్తారు.
  6. కాన్ఫిడెన్స్ మన నిర్ణయాల పై ప్రభావం చూపిస్తుంది. సరైన నిర్ణయాలు మనకి క్లారిటీ పెంచుతాయి. దీనితో పని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అని సింప్లిఫికేషన్ చేయడం మనం మొదలుపెడతాం. స్లో గా అది మనకి ఎలాంటి పనైనా చేయగలమని మోటివేషన్ ఇస్తుంది. ఎప్పుడైతే మన గోల్స్ మనం సింప్లిఫై చేస్తామో ఇంకా గోల్స్ ని అచీవ్ చేయాలి అనే బలమైన మోటివేషన్ మనలో పెరుగుతుంది. 
  7. ఒకే ఒక్క స్టోన్ హ్యాబిట్ ఒక రిపేర్ ఎఫెక్ట్ గా పని చేసి మన జీవితాన్ని ఇంకొక స్థాయికి తీసుకువెళుతుంది. ఇలాగే ఉదయాన్నే లేవడం అనే అలవాటు మనలైఫ్ స్టాండర్డ్ ని స్లో స్లో గా పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. 
  8. సరైన నిద్ర ఉంటే మనిషి ప్రతి ఉదయం మళ్ళీ కొత్తగా పుట్టినట్టే బాధ, దిగులు, వర్క్ ప్రెజర్ వీటన్నిటిని తగ్గించే మహా ఆయుధం మంచి నిద్ర, నిద్ర ఎంతో ముఖ్యం అని శాస్త్రవేత్తలు రోజు చెప్తున్నారు. నార్మల్ గా అయితే ఒక 7 గంటలు నిద్ర ఉంటె చాలు మంచిది. అదే మీరు గనక హై పెర్ఫార్మర్ అయితే ఒక 8 గంటలు నిద్ర చాలా మంచిది. ఉదయాన్నే లేచి అనుకున్న పనులన్నీ పూర్తి చేసి చాలా ఎర్లీ గా నిద్రపోవడం చాలా చాలా ముఖ్యం. అయితే రాత్రులు హెవీ గా తినడం, అలాగే మన బ్రెయిన్ బాగా ఆక్టివ్ చేసే చెత్త న్యూస్ లు చూడడం వల్ల మన బ్రెయిన్ వాటి గురించే ఆలోచించి ఉన్న నిద్రని పాడు చేస్తుంది. అలాగే ఫోన్ ని దూరంగా పెట్టేసి హాయిగా నిద్ర పోండి.
  9. ఐదింటికి లేస్తే ఎవడైనా అకౌంట్ లో డబ్బులు వేస్తాడా అని అనుకోకండి. ఉదయాన్నే లేవడం మీ పనుల మీద మీరు కాన్సన్ట్రేట్ చెయ్యడం ఒక గోల్ తరువాత ఒకటి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళడం. ఇది ఒక అలవాటుగా మారితే మీకు తెలియకుండానే మీరు ఇంకా డబ్బులు సంపాదించే పనులు చేయడం మొదలు పెట్టేస్తారు. మన ఫ్యూచర్ మీద మనకి ఉండే రెస్పాన్సిబిలిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. డబ్బు సంపాదించడం చాలా మంచిది. కొంతమంది అనుకోవచ్చు. ఎంత సంపాదించి ఏమి లాభం అని. కానీ ఎంత సంపాదిస్తే అంత లాభం అని తెలుసుకోండి. మీకు పర్సనల్ గా డబ్బు సంపాదించడం అంత ఇష్టం లేకపోతే ప్రపంచంలో ఎంతో మంది డబ్బు అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం, వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం మీరు సంపాదిస్తూ ఉన్నారని అనుకుని సంపాదించడం మొదలు పెట్టండి. 
  10. కిటికీ దగ్గర కూర్చొని బయట చిన్నపిల్లలు ఆడుతుంటే వాళ్ళని చూస్తూ నేను ఆ సమయంలో అది చేయాల్సింది ఇలా చేయాల్సింది అని బాధపడే వారిని రోజు చూస్తాం. అలా మనం అసలు అవ్వకూడదు. అనుకున్నది చేశాను, అనుకున్నది సాధించాను అని ఫుల్ సాటిస్ఫైడ్ పర్సన్ గా మనం ఉండాలంటే ఉదయం లేవడం అనే చిన్న అలవాటు మనం చేసుకోవాలి. ఉదయాన్నే 5 ఇంటికి లేవడం అనేది ఏం చేస్తుందంటే ప్రతి పనిని ఏదో అర్జెన్సీ చేయడం మానేసి, ప్రతి పనిని అనుకున్న టైం కన్నా ముందే చేయడం మొదలుపెడతాం. ఇలా మనలో న్యూ పర్సన్ మనం తయారు చేసుకుంటాం. 

ఇవి ఉదయాన్నే లేవడం వల్ల మన జీవితంలో జరిగే 10 అద్భుతాలు అయితే ఆర్టికల్ ని ముగించేముందు ఒకసారి ఈ 10 పాయింట్స్ ని మళ్ళీ రివ్యూ చేసేద్దాం..!

  1. ప్రతిరోజు ఉదయం ఐదింటికి లేచి మన మీద మనం కాన్సన్ట్రేట్ చెయ్యడం వల్ల మన ఫుల్ పవర్ ఏమిటో మనకి అర్థమవుతుంది. 
  2. ప్రతిరోజు ఉదయం ఐదింటికి లేచి ఏదైనా పనికి వచ్చే పుస్తకాలు చదవడం వల్ల మన నాలెడ్జి బాగా పెరుగుతుంది. 
  3. ఐదు ఇంటికి లేవడం, మంచి పుస్తకాలు చదవడం వల్ల ఇది లైఫ్ ఎన్నో పీక్ మూమెంట్స్ మీద చూస్తారు. మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు పెరుగుతారు. మీ పర్ఫార్మెన్స్ మీకే చాలా బాగా నచ్చుతుంది. అలాగే మీరు కలలు కన్నా జిమ్ బాడీ మీకు వచ్చేస్తుంది.
  4.  మీకు జనాలు ఎక్కువ గౌరవం ఇస్తారు. మీ ఫామిలీ మీ మాట వినేవారు పెరుగుతారు. 
  5. మీ మీద మీరు కాన్సన్ట్రేట్ చెయ్యడం వల్ల అలాగే నాలెడ్జి పెంచుకోవడం వల్ల మీరు అనుకున్న పని అనుకున్న సమయంలో కంప్లీట్ చేస్తూ వెళ్తారు. దీనివల్ల స్లో స్లో గా మీలో మంచి కాంఫిడెన్స్ వస్తుంది.
  6. మోటివేటెడ్ కాంఫిడెన్స్ పెరగడం వల్ల క్లారిటీ పెరుగుతుంది. క్లారిటీ పనులు కంప్లీట్ చేసుకుంటూ వెళ్లడంతో మీలో ఇంకా పనులు చేయాలి అనే బలమైన మోటివేషన్ పెరుగుతుంది. 
  7. ఐదింటికి లేవడం వల్ల మనం అచీవ్ చేయాలి అనుకున్న లైవ్ స్టాండ్స్ మనం అచీవ్ చేస్తాం. 
  8. మంచి నిద్ర, ఇది వర్క్ కంటే హ్యాపీ గా కావాల్సినంత హెల్త్య్ స్లీప్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. 
  9. అనుకున్న పని అనుకున్న సమయానికి చేయడం వల్ల మనలోని మేకింగ్ స్కిల్స్ పెరుగుతాయి. 
  10. ఐదింటికి లేచే అలవాటు మనల్ని ఇది వరకు కంటే ఇంకా ఒక కొత్త మనిషిగా మనల్ని మారుస్తుంది. 
ఈ ఆర్టికల్ లో మీకు నచ్చిన పాయింట్స్ ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. థాంక్యూ ఫర్ రీడింగ్ థిస్ ఆర్టికల్.!

Post a Comment