Type Here to Get Search Results !

Translate

ADVERTISEMENT

How To Lose Weight Fast Home In Telugu బరువు తగ్గడం ఎలా?

How To Lose Weight Fast Home In Telugu.. బరువు తగ్గడం ఎలా?

how-to-lose-weight-fast-home-in-telugu

How To Lose Weight Fast Home In Telugu బరువు తగ్గడం విషయంలో చాలా మందికి చాలా రకాల అపోహలు ఉంటాయి. ఈ రోజుల్లో కొంత మంది బరువు ఎలా పెరగాలి అని ఆలోచిస్తుంటే, చాలా మంది బరువు ఎలా తగ్గాలి? అనే సమస్య ఎక్కువ మందిలో బాధిస్తున్న సమస్య. ప్రస్తుత రోజుల్లో ఉన్న లైఫ్ స్టైల్ మరియు తీసుకొనే ఆహారం, అలవాట్లు వలన ఎక్కువ మంది బరువు అధికంగా పెరిగిపోవడం జరుగుతుంది. అధికంగా బరువు పెరిగిపోవడం వలన సమాజంలో తీరడానికి గిల్టీ ఫీలింగ్ తో ఉంటున్నారు. చాలా మందిలో ఆత్మ విశ్వాసం కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. 

త్వరగా బరువు తగ్గడం ఎలా? ఎం చెయ్యాలి?

ప్రతి రోజు ఒక గ్లాస్ నీళ్లలో కొంచెం నిమ్మరసం మరియు  తేనె వేసి కలుపుకొని ఉదయం లేవగానే తీసుకోవాలి. మార్నింగ్ మొలకెత్తిన విత్తనాలు, రాత్రి నానబెట్టిన వాల్నుట్స్ మరియు బాధం లను బ్రేక్ ఫాస్ట్ లాగా తీసుకుంటే చాలా మంచిది. ప్రతీరోజు ఉదయం లేవగానే తప్పకుండ వ్యాయామం చేయడం ఒక పనిలాగా పెట్టుకోవాలి, చేయలేకపోతే ఒక గంట నడవాలి. ఒకేసారి నడవడం అలవాటు చేసుకోవడం కొంచెం కష్టం కాబట్టి మెల్లగా నడవడం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించాలి. బరువు తగ్గటానికి తక్కువ కాలరీలు ఉన్న ఆహారాన్నే తినాలి. ఎప్పుడు పడితే అప్పుడు తినకుండా ఆకలి వేసినప్పుడు మాత్రమె ఆహారాన్ని తినడం చాలా ఉత్తమం. ఈవినింగ్ ఫ్రూట్స్ మరియు మొలకెత్తిన విత్తనాలు స్నాక్స్ లాగా తీసుకోవాలి.

మొలకెత్తిన విత్తనాలు ఎలా తినాలి ?

మొలకెత్తిన విత్తనాలతో పాటు పాపాయ మరియు కర్బుజా ముక్కలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. మనం తినే ఆహారంలో పోషక పదార్ధాలు ఎక్కువగా ఉండే విదంగా, ఎక్కువ శక్తిని ఇచ్చె ఆహారాన్ని తీసుకోవాలి. మొలకెత్తిన విత్తనాలతో విటమిన్ C  సమృద్ధిగా ఉంటుంది. ఈ విటమిన్ C అనేది రోగనిరోదక శక్తిని పెంచడంలో సహయపడుతుంది.

మధ్యాహ్నం సమయంలో ఆహారంలో బ్రౌన్ రైస్ మరియు గోధుమలతో చేసిన పుల్కాలు తీసుకోవడంతో పాటు ఎక్కువ ఆకుకూరలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. 

డిన్నర్ తొందరగా తినడం మంచిది, కమలా పండ్లు, జామ పండ్లు, దానిమ్మ  ఆపిల్ వంటివి తీసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాస్ నీటిలో  నిమ్మ రసం మరియు కొబ్బరి నూనె కలిపి త్రాగాలి.

బ్లాక్ కాఫీ బరువు తగ్గిస్తుంది.

అధిక బరువు తగ్గాలనుకునేవారు బ్లాక్ కాఫీ త్రాగుతారు దానికి  గల కారణం బ్లాక్ కాఫీలో ఉన్న క్యాలరీస్ ప్రధాన కారణం. ఒక కప్పు బ్లాక్ కాఫీలో  0 నుంచి 2 కెలోరీలు మాత్రమే ఉంటాయి.  

బ్లాక్ కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ అనే పదార్థం ఉంటుంది. ఇది బరువు తగ్గడంతో కీలక పాత్ర వహిస్తుంది. ఇది క్రొవ్వు కణాలను ఏర్పడకుండా ఆపుతుంది. దాని వలన బరువు పెరగకుండా ఉంటారు.

క్రొవ్వులను కరిగించే సామర్థ్యం బ్లాక్ కాఫీకి ఉంది.

బ్లాక్ కాఫీ అధిక బరువు ని తగ్గించడానికి మంచి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. అయితే, మీరు ఏమనుకున్నా కూడా ఆహారం అనేది ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీరు బరువు తగ్గాలంటే మంచి ఆహారం మరియు విటమిన్స్, మినరల్స్ ఉన్న పానీయాలను తప్పకుండా, తప్పనిసరిగా తీసుకోవాలి మరియు వాటిలో బ్లాక్ కాఫీ ఒకటి.

బ్లాక్ కాఫీలో ముఖ్యంగా  క్లోరోజెనిక్ యాసిడ్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది, ఇది మన శరీరంలో ని గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించి జీవక్రియ ని మెరుగు పరుస్తుంది. క్రొవ్వు ఆమ్లాల విచ్ఛిన్నతను పెంచుతుంది. కెఫిన్ అనే పదార్థం కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించి తాత్కాలికంగా శక్తి యొక్క సామర్ధ్యాన్ని పెంచుతుంది. జీవక్రియను రేటుని 3-11% శాతం పెంచుతుంది.

Also Read :-  Ayurvedic వైద్యం (treatment) for weight loss

బ్లాక్ కాఫీని బరువు తగ్గడం కోసం ఎలా తయారు చేసుకోవాలి?

మీరు మీ బ్లాక్ కాఫీలో కెలోరీలు ఉండే పదార్ధాలు కలిపి తాగితే ఎటువంటి ప్రయోజనాలన్నీ పొందలేరు. ఎందుకంటే మీ కాఫీలో కొవ్వులు, కేలరీలు మరియు కొలెస్ట్రాల్స్  ఉంటాయి. దీనితో పాటు, బరువు తగ్గడానికి సరైనటువంటి రొటీన్ డైట్  పాటించడం తప్పనిసరి. 

మీరు స్వంతంగా కాఫీ బీన్స్ ని గ్రైండ్ చేయండి. మీరు బ్లాక్ కాఫీ యొక్క నిజమైన రుచిని కోరుకుంటే మీరు స్వంతంగా గ్రైండ్ చేయడం. 1 టేబుల్ స్పూన్ కాఫీ పొడిని తీసుకొని 240 ml నీటిలో మరిగించండి. దానిని ఒక కప్పులో తీసుకొని త్రాగాలి.

How to lose weight fast Home 10 Health Tips Telugu

బరువు తగ్గడం అనేది మీరు తీసుకునే సరైన ఆహారం మరియు వ్యాయామంపై ఆధారపడి ఉంటుంది.

1. బ్రేక్ ఫాస్ట్ తినడం మర్చిపోకండి (మానేయకండి)

బ్రేక్ ఫాస్ట్ తినడం మానేయడం వల్ల బరువు తగ్గుతామనుకోవడం పొరపాటు, బరువు తగ్గరు. మీరు మీకు అవసరమైన ముఖ్యమైన పోషకాలను కోల్పోవచ్చు ఇంకా మీరు బ్రేక్ ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఆకలితో ఉంటారు కాబట్టి రోజంతా ఎక్కువ ఆహారం తినే అవకాశం ఉంది.

2. భోజనం చేయడం మానేయకండి

ప్రతీ రోజు  రెగ్యులర్ గా తినే సమయాల్లో భోజనం తినడం వలన కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి వీలైతె ఆహారంలో మార్పులు చేసుకోవచ్చు కానీ ఆహార టైమింగ్స్ లో మార్పు అవసరం లేదు. సరైన సమయంలో భోజనం చేయకపోవడం వలన కొవ్వు పదార్దాలు ఎక్కువగా ఉండే చిరు తిండి పై ఆకర్షితులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

3. నీరు ఎక్కువగా త్రాగాలి

నీళ్లు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక గ్లాసు నీటిలో 0 కేలరీలు ఉంటాయి. 10 గ్లాసుల నీళ్లు తాగినా, ఎంత వాటర్ త్రాగిన బరువు పెరగరు తగ్గుతారు తప్ప. ఆహారం తినడానికి 25నిముషాలు ముందు నీళ్లు తాగడం వలన బరువు తగ్గే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మీరు తక్కువ కేలరీలు తీసుకుంటారు. అదనపు క్యాలరీలను వినియోగించుకునేందుకు నీరు దోహదం చేస్తుంది.

Tip:- "గోరు వెచ్చని నీటిలో కొంచెం నిమ్మ రసం, తేనె కలిపి త్రాగడం వలన బరువు తగ్గడంతో పాటు గ్యాస్ట్రో సమస్యలు ఏమైనా ఉంటె తగ్గిపోతాయి. మనం తీసుకునే ఆహారంలోని పోషకాలను, ఖనిజ లవణాలని మన శరీరం గ్రహించే శక్తి  మెరుగుపడుతుంది."

4. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి 

కూరగాయలు, పండ్లలో కేలరీలు, కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండటం వలన బరువు తగ్గడానికి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కూరగాయలు, పండ్లలో ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి.

5. యాక్టీవ్ గా ఉండండి

యాక్టీవ్ గా ఉండటం బరువు తగ్గడానికి, బరువు నుంచి దూరంగా ఉంచడానికి యాక్టీవ్ నెస్ చాలా అవసరం. అలాగే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలకు కూడా దోహదం చేస్తుంది, మన శరీరంలో ఎక్కువగా ఉన్న కేలరీలను బర్న్ చేయడంలో వ్యాయామం అనేది సహాయపడుతుంది.

6. ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారాన్ని తినండి

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్దాలు మీ బరువు తగ్గించేందుకు సహాయపడతాయి, కూరగాయలు, పండ్లు,బ్రౌన్ రైస్, ఓట్స్, బ్రెడ్ ,బఠానీలు, బీన్స్ మరియు మొక్కల నుండి తాయారు కబడే ఆహారంలో మాత్రమే ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది.

7. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి

జంక్ ఫుడ్: చాకోలెట్స్, బిస్కెట్లు, ఐస్ క్రీమ్స్,  కూల్డ్రింక్స్, వంటి జంక్ ఫుడ్‌ పదార్దాలను ఇంట్లో నిల్వ చేయవద్దు. అందుకు బదులుగా పండ్లు, కూరగాయాలు, ఉప్పు లేని బియ్యం, ఓట్ కేకులు, పాప్‌కార్న్ మరియు పండ్ల రసాలు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను ఎంచుకోవడం చాలా మంచిది.

8. మద్యం(ఆల్కహాల్) త్రాగడం తగ్గించండి

ఒక చిన్న చాక్లెట్ ముక్కలో ఉన్నన్ని కేలరీలు ఒక గ్లాస్ వైన్ లో ఉంటాయి. మద్యం ఎక్కువగా త్రాగడం మొదలెడితే అది మీకు సులభంగా బరువు పెరగడానికి దోహదం చేస్తుంది.

9. ప్రతి రోజు వ్యాయామం చేయాలి 

ప్రస్తుతం ఉన్న బిజీ రోజుల్లో ప్రజలు వ్యాయామానికి అంత ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వట్లేదు. దానికి తోడు మితిమీరిన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవడం వలన విపరీతమైన బరువు పెరిగిపోయి స్థూలకాయత్వం వస్తుంది. ఇంతవరకు వచ్చిన తర్వాత అప్పుడు వ్యాయామం చేయాలనీ, బరువు తగ్గాలని అనిపిస్తుంది. అందుకే అధిక బరువు పెరిగి స్థూలకాయం రాకముందే సరైన జాగ్రత్తలతో ప్రతీ రోజు వ్యాయామం చేయడం ఉత్తమం.

  • వ్యాయామాన్ని ప్రతి రోజూ చేస్తూ ఉంటె మనం  పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉండటానికి సహాయపడుతుంది. వ్యాయమం చేయడం వలన మన ఎముకలు దృడంగా తయారవుతాయి. శరీరంలో ఉన్న బరువుని తగ్గించి అవయవాలను సక్రమంగా సరైన సేఫ్ లో ఉంచటానికి వ్యాయమం అనేది మనకు చాలా అవసరం.
  • గుండె జబ్బులు, నిద్రలేమి మరియు స్తులకాయం వంటి సమస్యలు ఉన్నవారు ప్రతీరోజూ ఉదయం వ్యాయమం చేయడం వలన మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
  • ప్రతీ రోజు వ్యాయమం చేయడం వలన శారీరికపరమైన అందం, మానసికపరమైన ఒత్తిడి తగ్గడం తో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.

ఫస్ట్ రోజూ వ్యాయమం చేయడం వలన గుండె యొక్క సామర్త్యం పెరుగుతుంది. ఆ తర్వాత నుంచి మెదడు ఇంకా ఇతర అవయవాలకు రక్తసరఫరా పెరుగుతుంది. ఇలా జరగడం వలన రోజంతా యాక్టీవ్ గా, చురుకుగా ఉండటం జరుగుతుంది.

10. మంచి నిద్ర 

రోజుకి 7 నుంచి 8 గంటల మంచి నిద్ర అనేది ప్రతీ ఒక్కరికి చాలా అవసరం. నిద్రకు బరువు తగ్గడానికి సంబంధం ఏమిటి అని చాలా మందికి అనిపించవచ్చు. మనం గాఢ నిద్రలో ఉన్నపుడు గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. మన శరీరంలో ఎలాంటి మార్పులు రావాలన్న ఈ హార్మోన్ కీలక పాత్ర వహిస్తుంది. కాబట్టి నిద్ర సరిగ్గా లేకపోవడం కూడా మీ బరువు పెరగడానికి ఒక కారణం కావచ్చు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Bottom Post Ad

ADVERTISEMENT